చిత్తులేఖతో చిందులా!


Thu,January 3, 2013 11:46 PM

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే నడిచారు. చాలా చూసి, చాలా నేర్చుకొని, కన్నీరు కార్చి ఒక నిర్ణయానికి వచ్చారు. కొలువులు లేక మొన్నటిదాక అన్నల్ల కలిసిన తెలంగాణ యువకులారా! ఇప్పటికి తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఫ్యాక్టరీలలో మీరు వేల సంఖ్యలో చెప్రాసి కొలువులు, మీమీ ప్రజావూపతినిధులకు కూడా చెప్రాసి కొలువులు ఇవ్వాలనీ, అదీ గౌరవం తగ్గకుండా మా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలోనే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు తెలుగుదేశం అనుకూలమే అని ప్రకటిస్తే మీ కార్యాలయంలోనే చెప్రాసి కొలువు చేస్తానని సవాల్ విసిరిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును చెప్రాసి కొలువులో ఎప్పుడు చేరుతారోనని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదురుచూస్తున్నదని ఇందుమూలముగా ప్రకటిస్తూ ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు తనయుడు, రాజకీయ వారసుడు సీమాంధ్ర నడుమంవూతపు సిరి’ కంపెనీ సీఈఓ నారా లోకేశ్ ట్విటర్‌లో పెట్టాడు. అఖిలపక్షంలో అభివూపాయం చెప్పమన్నప్పుడు షిండే ముందు సీల్డ్ కవర్ ఇప్పిన టీడీపీ నేతలు..తమ పార్టీ 2008లోనే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అందచేసిన లేఖ వెనక్కి తీసుకోలేదనీ, తెలంగాణ అంశాన్ని సెటిల్ చేయమనీ చెప్పిన ఓ మాట కాక ఇంకేమి లేదని తెలిసి పలు సందేహలు వెలుబుచ్చినా, ట్విటర్‌లో లోకేశ్ సందేశం కొత్త సందేహలకు తెరలేపింది. దానికే తెలంగాణ ఎమ్మెల్యేలను చెప్రాసి కొలువుల్లో ఎప్పుడు చేరుతారని మెసేజ్ పంపే లోకేశ్‌లు రేపు అధికారంలోకి వస్తే ఎంత అహంకారంతో ఉంటారో రూపు కట్టిన సరికొత్త దాఖలా ఇది.

అవును మరి, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలను సీమాంధ్ర పార్టీల దగ్గర దఖల్ చేసిన తెలంగాణ ప్రజావూపతినిధులు, నాయకులు ఉన్నంత కాలం లోకేశ్ ఇంతకంటే లోకోత్తరంగా ట్విటర్‌లో సందేశాలు చాలానే పంపుతారు కదా! ఎప్పుడు కార్పొరేట్‌కు రెడ్ కార్పెట్ వేసే చంద్రబాబుకు, నియోరిచ్ అహంకారానికి ప్రతీక అయిన లోకేశ్‌కు ఏసీ రూంలో కొలువుండే సీఈఓ దర్పమే కావాలి. కాని కొలువుల వేటలో అలిసిపోయిన తెలంగాణ బిడ్డకు చెప్రాసి కొలువు చాలా పెద్దదన్న సంగతి వాళ్ళకేం తెలుసు!
మా చిన్నతనంలో మా పెద్దన్న వూడుగు వెంక ఎప్పుడూ వెల్మినేడు బడిలో ఉపాధ్యా య దినోత్సవంలో చెప్రాసి పాత్రనే ఎన్నుకునేవాడు. ఎందుకన్నా ప్రతి సంవత్సరం నువ్వు ఇదే పాత్ర ఎన్నుకుంటున్నవని అడిగితే కొలువులు దొరకని తరతరాల వారసత్వంలో చెప్రాసి కొలువు వచ్చినా చాలురా!అని నెత్తికి రుమాలు చుట్టి, బడిగంట కొట్టి మమ్మల్ని ఆకట్టుకునే వాడు.

అయినా వెనుకబడిన నల్లగొండ, మెదక్, రంగాడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వేల ఫ్యాక్టరీల్లో కోట్ల సబ్సిడీ పొంది మా తెలంగాణ బిడ్డలకు ఇచ్చింది చెప్రాసి కొలువులు గాక ఇంకేమున్నయ్? లోకేశ్ అమ్మ భువనేశ్వరి యజమానురాలిగా ఉన్న హెరి ఫ్యాక్టరీలో తెలంగాణ వాళ్ళను చెప్రాసీలు గాక ఇంకేమన్న పెద్ద కొలువుల్లో పెట్టుకున్నారా? చెప్రాసీలు సెక్యూరిటీ గార్డులు, తోటమాలీలుగా పెట్టుకున్నందుకే ‘తెలంగాణ వాళ్ళకు ఇప్పటికే చాలా అండ కల్పించామన్న సీమాంధ్ర పెట్టుబడిదారుల అహంకారం. ఇందులో నుంచి వచ్చిందే కదా లోకేశ్ మెసేజ్ సారాంశం!
అవును ... లోకేశ్ ఇంతపెద్ద వెటకారంగా మెసేజ్ పెడితే ‘అదును చూసి హరీశ్‌రావుపై సవాల్ విసిరిన మొనగాడు లోకేశ్’ అని మెచ్చుకుంటున్న సీమాంధ్ర చానళ్ళు లోకేశ్ మెసేజ్‌కు హరీశ్, కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎట్లా స్పందించింది పెద్ద ప్రాముఖ్యం కాకపోయినా, మిగతా తెలంగాణవాదులు ఎందుకు పెద్దగా రియాక్ట్ కావడం లేదన్నది కూడా చర్చించవలసిందే.

కేసీఆర్ ఎప్పుడో మాటల సందర్భంలోనో ఉపన్యాసంలోనో ఒక కులం, వర్గంకు ఇబ్బంది కలిగించే మాట అన్నాడని రోడ్లెక్కి ధర్నాలు చేసి ఇంటిని ముట్టడిస్తామనే వాళ్ళు కోదండరామ్ గీతాడ్డితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని నిలదీసి, తప్పు దొర్లితే క్షమించమని అడిగినా వెంటపడి ఆందోళన చేసిన వాళ్ళు ఏమయ్యారు.

ఎవరి మీద ఎవరికి ఏ అభివూపాయాపూైనా ఉండనీయండి రాజకీయాల్లో ఓనమాలు రాని ఒక అహంకారి చెప్రాసి కొలువు మా పార్టీ ఆఫీసులో నీ కోసం ఖాళీగా ఉండి ఎదురు చూస్తుందని ప్రపంచానికి తెలియజేస్తే అది తెలంగాణ అంశంతో, ఆత్మగౌరవంతో ముడిపడిన సమస్య కానట్లు, వాళ్ళు వాళ్ళే తేల్చుకునే వీధి పంచాయతీ అన్నట్లు ప్రవర్తించడం ఎట్ల సబబో ఆలోచిద్దాం, చర్చిద్దాం. తెలంగాణ ఉద్యమ శిబిరంలో ఎవరికి అవమానం జరిగినా అది అందరికి జరిగినట్లుగానే భావించాలి కదా! ఎవరిమీద అణచివేత కొనసాగినా, రాజ్యం విరుచుకు పడినా అందరం సహానుభూతితో స్పందించి, నిలువరించాలి కదా! ఉజ్వల శిఖలై ఎవరు రాలిపోయినా, మన సహజాత సహోదరులనే దుఃఖించి, అంతిమయావూతలో దిక్కులు పిక్కటిల్లేలా అమర్ రహే అని నినదించాలి కదా! ఇది టీఆర్‌ఎస్‌తో సహా అందరికి వర్తించేది నిజమే.ఆత్మవిమర్శ చేసుకుందాం కానీ, అహంకారి పేట్రేగినప్పుడు ఐక్యత లేకపోతే చెప్రాసి, చెప్పుల భాషతో మనను వెంటాడుతూనే ఉంటుంది.
ఇది ఇప్పుడు అందరం కలిసి నడవాల్సిన నడవడిక.

అలవర్చుకోవలసిన నడవడిక. సీల్డ్ కవర్ బాగోతం రచ్చ అవుతుండగనే వరంగల్ జిల్లా దుబ్యాలలో, రాఘవడ్డిపేటలో పాదయాత్ర చేస్తున్నప్పుడు జై తెలంగాణ బోనం ఎత్తుకొని, మొఖమంతా చిట్లించి తెలంగాణ బోనం దించి, జై తెలుగుదేశం బోనం ఎత్తుకున్నది- ఏమరపాటుగానో, తొందరపాటుగానో, పాలుపోకనో చంద్రబాబు నాయుడు చేసిండని చెప్పే ప్రబుద్దులు ఉండవచ్చును! మా తెరువుకు వస్తే ఉరికించి కొడతం మా నాయకుడు, మా ఇష్టం అనే దూమ్ తడాఖా గ్యాంగ్ ఉండవచ్చును. ఒక్కటైతే నిజం. చంద్రబాబు తన పాదయాత్ర సజావుగా సాగడం కోసం, తెలంగాణాలో అడుగడుగున అడ్డుపడుతున్న ఉద్యమకారుల నిరసనను తప్పించుకోవడం కోసం తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అన్న వైఖరి నుంచి ఒక దశలో ‘మేమూ సానుకూలమే’ అన్న సౌకర్యమైన వైఖరి తీసుకున్నాడు చంద్రబాబు. తెలంగాణలో మహబూబ్‌నగర్, రంగాడ్డి, కరీంనగర్ దాటి వరంగల్ వచ్చే సరికే ఎంతో మార్పు వచ్చింది.

పోయిన ఏడాది లక్ష్మక్కపేటకు వచ్చేటప్పుడు వెంటేసుకొచ్చిన పచ్చచొక్కా రాయలసీమ రౌడీ గ్యాంగ్ సాగించిన వీధి పోరాటాలు, పిడిగుద్దులు పణికర మల్లయ్య అరెస్టు చాలు. జై తెలంగాణ బోనం దించి జై తెలుగుదేశం బోనం ఎత్తుకున్నావంటే మనసా, వాచా, కర్మణ చంద్రబాబు ఆంధ్రాబాబే కాని, తెలంగాణ, సీమాంవూధను సమానంగా గౌరవించే ‘మర్యాద బాబు’ కూడా కాదని తేలిపోయింది. అయినా తెలంగాణ బోనం కింద దించిన చంద్రబాబు మీద ఎవ్వరూ దుమ్మెత్తి పొయ్యరు? దుమారం రేపరు, నిరసన చెప్పరు. ఇంత బరిబాతల మన సక్కదనం బయట పడితే తెలంగాణ వ్యతిరేకశక్తులు ఎట్ల భయపడతాయి? ఎవడు తమ నోరును, చేతులను అదుపు లో పెట్టుకుంటడు? టి.జి లగడపాటి, కావూరి ఏం తోస్తే అది అనడానికి ఇదే కారణం కాదా?

ఢిల్లీ అత్యాచార బాధితురాలి మృతికి చలించి పోయినట్లు మారుమూల తెలంగాణ పల్లె కూడా దుఃఖించి ప్లకార్డులతో స్పందన తెలియజేసినట్లు ఆయన తన చంద్రయాన్ డైరీలో రాసుకున్నారు. ఆడబిడ్డను కోల్పోయిన దుఃఖం కాకుండా అడ్డగోలు క్లబ్ డ్యాన్సుల, అశ్లీలతలో కన్నుగానక దొర్లుతున్న కోస్తా కల్ట్ కాదు కదా నా తెలంగాణ పల్లె ? ఢిల్లీలో తల్లడిల్లింది ఒక్క అమానత్ మాత్రమే కాదు, ఇప్పుడు మన చేయి పట్టుకొని నడుస్తున్న ప్రతి ఆడబిడ్డ అన్న సంగతి హైదరాబాద్ చుట్టూ ఫామ్‌హౌజ్‌లు, క్లబ్బులకు, పబ్బులకు భూపందేరం చేసిన చంద్రబాబు కంటే తెలంగాణ అన్నదమ్ములకే ఎక్కువ ఎరుక.
చంద్రబాబు పాదయావూతలో, అట్టడుగు వర్గాల్లో ఎవరి మొఖంలో వెలుగు కనపడినా వాళ్ళు బీసీలు అయితే, తన బీసీ పాలసీ, ఎస్సీలయితే తమ వర్గీకరణ పాలసీ, ముస్లింలు అయితే వాళ్ళ కళ్ళలో రోష్నీకి తమ ముస్లిం మైనారిటీ పాలసీ, లంబాడా లు కనపడితే తమ గిరిజన పాలసీ వలన ఈ కడ, కాంతి కనపడుతుందని డిక్లేర్ చేస్తారు. వర్గీకరణ గురించి, బీసీలకు చట్టసభ ల్లో రిజర్వేషన్ల గురించి చాలా స్పష్టత వచ్చిందని చెప్పే బాబుకు ఇవి చెప్పడానికి ఏ ఇబ్బంది కలుగదట.

కానీ తెలంగాణ గురించి స్పష్టమైన ప్రకటన ఇవ్వమంటే ఇబ్బందులు ఉంటాయట. 2008లో ఇచ్చిన ఉత్తరానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని అన్నందుకే లోకేశ్ ట్విటర్‌లో చెప్రాసి కొలువు ప్రకటనకు తెర లేపిండు. కొత్త సంవత్సరంలో సీమాంధ్ర కిరణ్ సర్కార్ దగ్గర ఎన్ని చెప్రాసి కొలువులు తెలంగాణకు ఇప్పిస్తరో లోకేశ్ చెప్పగలడా? చెప్రాసి కొలువుల్లో కూడా 610 జీవోను తుంగలో తొక్కేటోల్లు మాట్లాడుతున్న చెప్రాసి భాషకు చెక్ పెట్టాల్సిన బాధ్యత ఉద్యమ చెప్రాసిలదే. చెప్రాసికి గౌరవం పెంచి, శ్రమకు గౌరవం పెంచి, ఉద్యమంలో గొడ్డు చాకిరీకి గౌరవం పెంచి లోకేశ్‌లకు బుద్ది చెప్పాల్సిన బాధ్యత అందరిది.

-డాక్టర్ చెరుకు సుధాకర్ టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles