నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం


Fri,December 21, 2012 11:43 PM

Congదుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికాలోని న్యూటౌన్ సాండీహుక్ ఎలిమెంటరీ స్కూల్‌ల్లో విచక్షణారహితంగా మూడు అధునాతన తుపాకులతో ముక్కుపచ్చలారని ఇరవైమంది పిల్లల్ని ఉపాధ్యాయులు, ఇతరుల్ని ఆరుగుర్ని కాల్చిచంపిన ఉన్మాది ఉదంతంపై దేశాధ్యక్షుడు ఏం మాట్లాడుతారోనని ఎదురు చూస్తున్న లైవ్ టెలీకాస్ట్ అది.

గుండె ఎంత భారమనిపించినా, నిబ్బరంగా మాట్లాడాలని విశ్వ వూపయత్నం చేస్తున్నా, తన్నుకొచ్చిన కమ్ముకున్న భావోద్వేగ స్వరంలోంచి ఒబామా ‘అవును పాపం పుణ్యం తెలియని పిల్లలు, అందమైన పిల్లలు, అమ్మనాన్నలకు హత్తుకునే పిల్లలు, యవ్వనంలోకి అడుగిడాల్సిన పిల్లలు, డిగ్రీలు పూర్తిచేసి వివాహాలు చేసుకోవాల్సిన పిల్లలు, రేపు వాళ్ళు తల్లిదంవూడులై వాళ్ల పిల్లలకు వారసులుగా ఇవ్వాల్సిన పిల్లలు-ఇట్లా పిట్టల్లా రాలిన వైనానికి అందరం బాధ్యులమే. అందరం ఇప్పుడు దుఃఖితులమే.

రాజకీయలకు అతీతంగా తుపాకి సంస్కృతి విచ్చలవిడితనానికి చెక్ పెట్టవలసిన అవసరం ఉన్నది రండి! మనం చేయి చేయి కలిపితే కాని విస్కాన్‌చిన్‌లోని దేవాలయంలో అరోరాలోని సినిమా థియేటర్ లో, చికాగో వీధి మలుపులో ఉన్మాదులు మర తుపాకులతో మట్టుపెట్టడం ఆగదని దుఃఖస్తూనే నాకు నన్ను ప్రేమించే 11 ఏళ్ళు, 14ఏళ్ళు పిల్లలున్నారు. వాళ్ళను మరిం త హత్తుకుం వాళ్ళను నేనెంత ప్రేమిస్తున్నానో వారికి తెలియదు. పిల్లలు కోల్పోయిన తల్లిదంవూడులకు ఎంతో మనోధైర్యం ఇచ్చి గుండెలకు హత్తుకుంటే గాని నాకు గర్భశోకంతో తల్లడిల్లుతున్న ఈ తల్లిదంవూడుల బాధ తెలియదని దుఃఖిస్తూనే ప్రసంగాన్ని కొనసాగించిండ్రు.

ఇట్లా సహజంగా స్పందించినందుకు బరాక్ ఒబామాకు రెండవసారి అధ్యక్షుడైన దానికంటే ఎక్కువ మద్దతు, రేటింగ్ పెరిగిందని లెక్కలు వేసుకునే ప్రబుద్ధులు ఉండవచ్చు. అమెరికాలోని కనెక్టికట్‌లోని ఒక పాఠశాలలో ఇరవైఏండ్ల ఆడమ్‌లాంజ్ ఇంట్లో కన్నతల్లిని కడతేర్చి బయట 26 మందిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న అమెరికాలో సంఘటన గురించి బరాక్ ఒబామాతోపాటు యావత్ ప్రపంచం నివ్వెర పోవటంతోపాటు సహానుభూతితో దుఃఖపడింది. కలకాలం సృష్టించిన విపరీత మృత్యుకేళి ఇది అని నిట్టూర్చి వేదాంతంలోకి పోయినవాళ్ళు ఉండవచ్చు.
ఈ దుఃఖం ప్రపంచం ఏమూలలో పసిమొగ్గలు రాలిపోయినా, పసివాడి పోయినా అంతే ఉండాలని కోరుకునేవాళ్ళు ఉన్నారు.

అగ్రరాజ్యంలోని పిల్లలు, తల్లిదంవూడులకు మాత్రమే దుఃఖం, ఉద్వేగం ఉండదు. అది ఇరాన్‌లో, గౌటెమాలలో, ఆఫ్ఘనిస్తాన్‌లో ఎక్కడయినా, అగ్రరాజ్యం వదిలిన తుపాకీ ఘర్షణల గాజుపెంకులకు రక్తసిక్తమైన పాదాలతో ఇంకా ఇప్పటికే హహాకారాలు చేస్తున్న పసిమొగ్గల గురించి, ఒబామాతోపాటు అందరూ కన్నీళ్ళు పెడితే బాగుండునని అనుకునేవాళ్ళు ఉన్నారు. తల్లి స్తన్యం దూరమయి, పాలకోసం గుక్కపెట్టి ఇరాక్ బంకర్లలో చేతి కందుతున్న పాలడబ్బాలపైకే బాంబులు కురుస్తుంటే భయవిహ్వాలులై ఏడ్చిన ఇరాకీ పసిమొగ్గల దుఃఖం ఛాయా చిత్రపటం కాదు. ఇది ఎప్పటికీ యుద్ధవూపభువులను వెంటాడుతున్న దృశ్యం.

ఇప్పటికే, 20 మంది పిల్లల్ని పొగొట్టుకున్న అమెరికా తల్లిదంవూడుల దుఃఖంతో పాలు పంచుకుంటూనే బరాక్ ఒబామా కన్నీటి ఊటకు చలిస్తూనే తెలంగాణ గడ్డమీదికి, భారతదేశ అధినేతల, దగ్గరికి కాంగ్రెస్ నేతలు విచ్చేసిన ఆంధ్రవూపదేశ్ విస్తృతస్థాయి కాంగ్రెస్ సమావేశంలో చోటుచేసుకున్న తెలంగాణ అమరుల శ్రద్ధాంజలి సంఘటన దగ్గరకు వద్దాము. ఎప్పటిలాగే జాదూ ఆజాద్ విచ్చేసిన కాంగ్రెస్ సభ ఎల్బీస్టేడియంలో జరిగింది. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, నిరసన మధ్య కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయం సాధించాలని జాతీయ నాయకులు ఇక్కడి నాయకులకు ఉద్బోంధించారు.

ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళి సరైన ప్రచారానికి నోచుకుంటే విజయం గాంధీభవన్ తలుపుతట్టుతూ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీనుంచి అఖిల పక్షం బేటీలో కాంగ్రెస్ ఒక్కరినే పంపి తెలంగాణకు అనుకూలమని స్పష్టం చేయాలని తెలంగాణ మంత్రులు ఆజాద్‌ను ప్రాధేయపడడం ఆజాద్ కట్టె విరగకుండా, పాము చావకుండా, పొన్నం ప్రభాకర్ పట్టుబట్టి కూర్చొని తెలంగాణ కోసం బలిదానాల్లో చనిపోయిన అమరుల ప్రస్తావన తేకుండా నీలం తుఫాన్‌లో చనిపోయిన వాళ్ళ గురించి మౌనం పాటించడం తెలంగాణ ప్రజలకు అవమానపర్చడమేనని మొత్తుకున్నా పవర్‌కట్ చేసి మైకు గుంజుకున్నారు. మధ్యమార్గంగా నీలం తుఫాన్‌లో చనిపోయినవాళ్ళకు, తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న వాళ్ళను సమానం చేసి ఆజాద్ సమక్షంలో రెండు నిమిషాలు మొక్కుబడిగా మౌనం పాటించిండ్రు.

సోనియా అమ్మ తమ్మ పుట్టిన రోజు బహుమతిగా ఇస్తామన్న 2009 డిసెంబర్9 ప్రకటన అమలుకాక కొనసాగిన నాచ్చివేత, అణచివేత, సాచివేత మోసపూరిత వైఖరికి వేలాది తెలంగాణ బిడ్డలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు? జీవిత దుఃఖం ఒడిసిపట్టుకున్నా కంట్లో ఆగని కన్నీటి సమువూదమై పదిజిల్లాలను ముంచెత్తలేదు? ఎందరు తల్లు లు తండ్రులు ఓదార్చినా గుండె బలిపీఠాలబాట తొక్కి మంటల ముద్దాడి కొందరు, ఉరికొయ్యలకు వేలాడి కొందరు, పురుగుల మందు మృత్యుగుళికగా సేవించి కొందరు విద్యుత్తు తీగలకు వేలాడి కొందరు నేలరాలిపోతే ప్రధాని మన్మోహన్‌సింగ్ కండ్లలోంచి కన్నీవ్ళూందుకు రాలేదు.

యూపీఏ చైర్మన్- దేశవ్యాప్త కాంగ్రెస్ శ్రేణులతో ‘అమ్మా అనిపించుకునే సోనియాగాంధీ కండ్లల్లోంచి నీళ్ళెందుకు రాలేదు. నాకు ఇద్దరు పిల్లలున్నారని బరాక్ ఒబామా తన పిల్లల్ని హత్తుకొని ప్రేమను, సంఘీభావాన్ని పంచినట్లు సోనియాగాంధీ పార్లమెంట్ నిట్టాడుకు ఉరివేసుకున్న యాదిడ్డి కోసం దుఃఖంతో నఖశిఖ పర్యంతరం కాదు. ఒక్క సంస్కారంతో చివరి చూపుకయినా ఎందుకు రాలేదు. ఎందు కు రాలిపోయిన పిల్లలు ఈ భారతదేశపు పిల్లలు గాదా; కనెక్టికట్‌లో, విస్కాన్‌చిన్‌లో మర తుపాకులతో పిల్లల్ని మట్టుపెడితే తెలంగాణపై ఎటూతేల్చని మార్మిక తుపాకితో నిరాశను రేపి, వెయ్యిమంది చావుకు కారణమయ్యింది. వీళ్ళు కాదా? రాయిని తాకితే దుఃఖాల్లే దేశంలో ఇన్ని వందల మంది బలిదానాలకు ఒడికట్టి నా రాయిలా నిశ్చేష్టులవుతారే తప్ప బరాక్ ఒబామా లాగా స్పందించరా?

మీ పుట్టిన రోజు కేక్ కట్ చేస్తున్నప్పుడు గర్భశోకంతో గుండెలు ముక్కలయిన తెలంగాణ తల్లులకు స్వాంతన ఇచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రకటన బహుమానం గుర్తురాదా? చుట్టూ పేర్చిన పుట్టిన రోజు అందమైన కొవ్వొత్తులను ఆర్పుతున్నప్పుడు మంటల ముద్దాడి కరిగిన కొవ్వొత్తిలా మిగిలిన శ్రీకాంతచారిలు, వేణుగోపాల్‌డ్డిలు, యాదయ్యలు గుర్తుకు రారా?

టెన్ జన్‌పధ్ ఎదుట మీ పుట్టిన రోజు సందర్భంగా ‘మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే’ అని విష్ చేసి తెలంగాణ కోరిక కూడా చెవుల వేసిన తెలంగాణ ఎంపీలు ‘పాపిష్టి కాలంలో పాపిష్టి బహుమానం’ ఎవరికి అందక ఎంతమంది తెలంగాణ తల్లుల సాపెన ఆయె గదా’ అన్న గుస గునుగుడు ఎప్పుడో డిజిటల్‌సౌండ్‌లో వినపడవలసి ఉండెనే. ఎందుకో శ్వేధ సౌధం కన్నీటి సాగరమయి దుఃఖిస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు అలజడి రేపి శాంతమహాసముద్రం దాటి ఇండియా లోగిలిలో తెలంగాణ లోగోగా సాక్షాత్కరించడం అతిశయం కాదేమో!

వైయుక్తికమైన బాధలకు తల్లిడిల్లి దుఃఖించడం చాలా సాధారణమైనదే అయినా, బరాక్ ఒబామా ఒక అగ్రరాజ్యంలో పెట్రేగుతున్న గన్‌కల్చర్ పరిమార్చిన పసిమొగ్గల గురించి దుఃఖించినప్పుడు; ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, పార్లమెంట్ వ్యవస్థయిన భారతదేశంలో నాలుగు కోట్లమంది ఆకాంక్ష కోసం అమెరికా పిల్లలలాగే రేపు ఉన్నత చదువులు పూర్తి చేయాల్సిన వాళ్ళు పెళ్ళి చేసుకోవాల్సిన వాళ్ళు, పిల్లల కనవలసిన వాళ్ళు అన్నిటి కంటే ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదంవూడులకు అన్ని అయి ఆలనాపాలనా చూసుకోవాల్సిన ఈదేశ పౌరులు, తెలంగాణ బిడ్డలు వందలుగా రాలిపోతున్నా, రాజకీయ క్రీడతో వినోదం చూస్తున్న దేశపాలన అమ్మలకు అయ్యలకు సామ్యంఏముందో, వైరుధ్యం ఏముందో గుర్తు చేసుకోవడం అవసరమే మరి.

ఎఫ్‌డీఐల కోసం అమెరికా బాట పట్టే సోనియమ్మకు, మెజారిటీ కోసం నానా గడ్డికరిచే అధినాయకురాలుకు ఇప్పుడు కన్నీళ్లు రావడం అసాధ్యమనే ఏమో పుట్టిన రోజు కేకును కుక్కలకు విసిరి నిరసన తెలిపిండ్రు. ఆగ్రహించిన తెలంగాణ బిడ్డలు.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles