విగ్రహ ఆగ్రహం- తెలంగాణ


Mon,December 17, 2012 01:45 AM


పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన్టీఆర్ కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ మధ్యలో భార్య లక్ష్మీపార్వతి సవాళ్లుపతి సవాళ్లు వారంరోజులనుంచి నడుస్తున్నాయి. తెలుగుజాతి పేర ‘దక్షిణాది నుంచి ఢిల్లీ పీఠానికి సవాల్ విసిరిన మహోన్నత వ్యక్తి, కీర్తితేజం ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటు ఆవరణలో ఆవిష్కరించడానికి ఇప్పటికే ఆలస్యమైంద’ని ఒకరు, ప్రతిపాదన పంపిందే మా చంద్రబాబు అని మరొకరి వాదన.కొంతమంది గాడిదల పళ్లు తోముతుంటే, మరికొందరు గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారనీ.. ఇట్లా టీడీపీ, ఒకప్పటి టీడీపీ, కాంగ్రెస్‌తో ఉన్న టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్న టీడీపీ పరస్పర వాదనలకు దిగుతున్నాయి. రెండున్నర జిల్లాల కోస్తా నుంచి ఎదిగిన సామాజిక వర్గాలే దన్నుగా నిలిచిన ఎన్టీఆర్ వైతాళికుడైతే, మొదటి తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి మద్రాసులో1952 అక్టోబర్ 18న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి 1952 డిసెంబర్ 15న 59వ రోజున అమరుడైన పొట్టి శ్రీరాములును ఎవరు పట్టించుకున్నారు? స్వతంత్ర హైదరాబాద్ స్టేట్‌కు, ఆంధ్ర స్టేట్‌కు సంబంధం లేకపోయినా, నేతల కుత్సితాల కు బలైన పొట్టిశ్రీరాములును ప్రత్యేక రాష్ట్ర అమరుడిగా కాక 60ఏళ్ల తర్వాత కూడా సమైక్యవాద ఐకాన్‌గా చూపెట్టే కుట్ర ఎన్టీఆర్ తెలుగుజాతి ఐక్యత సాక్షిగా బలపడింది. బలిపీ పొట్టిశ్రీరాములు, దీక్ష సమయంలో రాజకీయం నడిపిన ఎన్జీ రంగాల పేర్లు రెండు విశ్వవిద్యాలయాలకు ఫిక్స్ అయిపోయాయి. తెలుగుజాతి ఒక్కటిగా ఢిల్లీ పీఠాన్ని నిలదీయాలని తెలంగాణ అస్తిత్వాన్ని బలిపీ ఎన్టీఆర్‌పేరు విమానక్షిశయాలు, పార్కులు, విద్యాలయాలకు ఫిక్స్ అయింది. కానీ అనేకమంది తెలంగాణ వైతాళికుల పేర్లే చరివూతకు ఎక్కలేదు. విగ్రహాలు అసలే ఆవిష్కరించబడలేదు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌లో ఏ కూడలికి తెలంగాణ వైతాళికుడి పేరు లేదేమిటని తెలుగు బాలయ్యలు ప్రశ్నించినట్టుగానే తెలంగాణ బాలయ్యలు అడగాల్సిన ప్రశ్న!

ఓ సినిమాలో జగన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఈ విగ్రహాల ప్రతిష్టాపన ఊరూరుకు కొనసాగించి కొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెడుతున్నావ్? నాయకుడంటే ప్రజల గుండెల్లో ఉండాలి. రాతి విగ్రహాల్లో కాదు’ అని ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం కోసం ఎందుకింత రాజకీయం చేస్తున్నారు? ఓదార్పు పేరుతో దారితప్పిన తన రాజకీయ జీవిత గమ్యాన్ని సరిచేసుకోవడానికి ఊరూరా రాజశేఖర్‌డ్డి విగ్రహాన్ని ప్రతిష్టించే జగన్‌కు ఆయన పార్టీకి తెలంగాణ కోసం అసువులు బాసిన వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించే ఔదార్యం ఉండదు. తెలుగు ప్రజల తీర్పే శిరోదార్యమనే తెలుగు దేశానికి, వైఎస్సార్‌సీపీకి తెలంగాణ జాతి మట్టిలో పుట్టిన జ్ఞాన కణికలు, చకిముకిరాళ్ళు, అగ్గిపూలకు శిరస్సు వంచి నమస్సుమాంజలులు ఘటించే తీరిక దొరకదు. మా నాయన విగ్రహా ఆవిష్కరణను రాజకీయం చేస్తారా అన్న బాలయ్యకు, జగన్‌కు వాళ్ళ తండ్రి భౌతికకాయం దగ్గరే రాజకీయం నడిపి అధికారం కోసం పావులు కదిపిన ఘనమైన చరిత్ర ఉందని ప్రజలు మరచిపోయారనుకుంటారు. మా వంశమే చరివూతను తిరుగరాయగలదని, మా వంశవృక్షం వంచి సారించిన వింటినారి బాణాలమనే అహంభావం-అభిజాత్యం- మేమే తెలుగుజాతి మణిపూసలమనే పేటెం ట్- ఇంత రణగొణ ధ్వని మధ్య పాపం సాధుజీవి, గాంధీని నమ్ముకొని జీవితమంతా విషాదాన్ని నింపుకుని ఆంధ్రా, నయవంచక నాయకుల కుట్రలకు బలియిన పొట్టి శ్రీరాములు 60 వ వర్ధంతి ఏ చప్పుడు లేకుండాపోయింది. తెలంగాణ ఉద్యమం రోడ్డెక్కగానే మళ్లీ కృత్రిమ సమైక్యవాదులు పొట్టి శ్రీరాములు బొమ్మ ముందరపెడతారు!


కాంగ్రెస్ టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఇతర సీమాంధ్ర లాబీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర ప్రాంత రాష్ట్రం కోసం పోరాడిన చరివూతనే ధ్వంసిస్తారు? ఆ అమరుడు తెలంగాణ జాతికి కూడా తమ ఆశయసాధనలో స్ఫూర్తిదాత అని చెప్పాల్సిన సమయం ఇది. ట్యాంక్‌బండ్ మీద తెలంగాణ వైతాళికుల విగ్రహాలు లేవని తెలంగాణ యువత ఉద్యమించినప్పుడు, ‘మిలియన్ మార్చ్’ గా సీమాంధ్ర నమూనా ఆధిపత్య విగ్రహాలను ధ్వంసం చేసి ఆగ్రహం వ్యక్తపరిచినప్పుడు రాజశేఖర్‌డ్డి కొడుకుకు, ఎన్టీ రామారావు కొడుకుకు ఇది తెలంగాణ ధర్మాక్షిగహం అని ఎందుకు అనిపించలేదు? పార్లమెంటులో ఎవరి విగ్రహాలు పెట్టాలి? ఎవరు చొరవ చూపించాలి? ఇంత వరకు ఎవవరికి ఈ గౌరవం దక్కింది? మొదలగు అంశాల్లోకి వెళ్ళితే అనేక విషయాలు చర్చకు వస్తాయి.పార్లమెంటు ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తైలవర్ణ చిత్రపట ఆవిష్కరణ కోసం ఎంతో ప్రయత్నిస్తే గానీ సాధ్యపడలేదు. మన అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని ఉద్యమిస్తే ‘అందులో రాజకీయ ప్రయోజనాలను’ఎత్తిచూపి పలుచనైపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంతవరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించలేకపోయిందో వివరణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు.ఎన్టీఆర్ విగ్రహం కోసం మేమంటే మేమే కృషి చేశామని జబ్బలు చరుస్తున్న నాయకుల్ని, వారి చంకలో చేరి నిరంతరం తెలంగాణ ఉద్యమ నాయకుల మీద అవాకులు చెవాకులు పేల్చే తెలుగుదేశం నాయకుల గుంపు ఎందుకు మా తెలంగాణ వైతాళికుల విగ్రహాల కోసం ముందలపడి కొట్లాడరని ప్రశ్నించదు. ప్రపంచ తెలుగు మహాసభల పేర తిరుపతిలో సమైక్యవాదాన్ని, ఆధిపత్య సంస్కృతిని చాటుకోవడానికి, నిలుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం హంగామా! ఇదంతా ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు అసువులు అర్పించిన డిసెంబర్ మాసంలోనే ఊపందుకోవడం యాధృచ్ఛికమైనా-తెలంగాణ జాతి మేల్కొల్పడానికి సందర్భానుసారమేనేమో!

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles