పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ


Fri,November 9, 2012 01:20 AM

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధులు, వేదికై ఆశీనుల్లోని ముఖాల్లో లక్ష మెగావాట్ల విద్యుత్ వెలుగు కనిపించింది. సభలో మేధోమథనానికి ముందే అంతర్మథనంతో అనేక అనుభవాలను నెమరేసుకున్న నాయకత్వం ఏమి చేయబోతున్నదో కొంతముందే స్పష్టపడింది. కనుక తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నోటి ఏ విధమైన నిర్ణయాలు, వ్యూహాలు, తెలంగాణ రాష్ట్ర సాధన గమ్యం ముద్దాడే రూట్‌మ్యాప్ వస్తుందని చాలామంది ఎదురుచూశారు. వాళ్లకు తాము కోరుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర సమితి పుష్కరకాల ఆనంద పునశ్చరణ అడుగు ఉన్నందుకే అందరి ముఖాల్లో అన్ని మెగావాట్ల వెలుగు ఉంది. కేసీఆర్‌తోపాటు ప్రధాన అతిథుల కాక నలభై మంది ప్రతినిధులు తెరాస పన్నెండు సంవత్సరాల్లో ఏం చేసింది. ఏం చేయాల్సి ఉండే, ఏం చేస్తే బాగుంటుందో నిర్మొహమాటంగా మాట్లాడారు. ఉద్యమ అధినాయకుడు, ఉద్యమపార్టీ ఎట్లా ఉండాలో కూడా కుండబద్దలుకొట్టినట్టు చెప్పే స్వేచ్ఛ, సమాధానాలు ఇచ్చే కేసీఆర్ ఓపిక, సమయస్ఫూర్తి ఆయన మాటల్లో ‘రేపటి నుంచి నర్సింహావతారమే’ గాక అనేక పార్శాలను, రూపాలను ప్రదర్శించడంతోనే ఈ సభలో తెరాస ను ఎలక్ట్రిఫై చేయగలిగినాయి. రెండు రోజులు సభల తర్వాత వెళుతున్న ప్రతినిధులు తెరాస వెంట నడిచిన లక్షల జనం వాళ్ళను ‘కరీంనగర్ శక్తి స్థలం’ నుంచి వెళుతున్న ప్రతినిధులారా! ఇక వెళ్లండి తెలంగాణ ప్రజాక్షేవూతానికి- ప్రతి ఒక్కరు ఉద్యమ నాయకులై కొనసాగండి- తెలంగాణ ప్రజల స్వీయ రాజకీయ అస్తిత్వ ఊపిరి అయి’ అని దీవించి కర్తవ్య బోధన చేసినట్టుగా ఉంది.
యాభై ఏండ్ల తెలంగాణ ఉద్యమ తండ్లాటలో తెలంగాణ రాష్ట్ర సమితికి ముందు అనేక సంస్థలు, సంఘాలు కృషి చేశాయి. అయితే 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ఆవిర్భావంతోనే తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. తీవ్రమైన రాజకీయ శూన్యతతో తెలుగు నేల నెర్రలు బారిన సమయంలో రాజకీయ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా తెలంగాణ సాధించగలమని, పదిజిల్లాలను కదిలిస్తూ టీఆర్‌ఎస్ కరీంనగర్‌లో లక్షలాది మంది సభతో మొదటి అడుగులు బలంగా వేసింది. జార్ఖండ్ రాష్ట్ర విముక్తి కోసం పోరాడిన శిబూసోరేన్, విదర్భ, హరతవూపదేశ్ నాయకులు కరీంనగర్‌లో వేదికమీద మాట్లాడారు. టీఆర్‌ఎస్ పుట్టుకనే హైదరాబాద్ నడిబొడ్డు, బుద్ధుడికి ఎదురు ఈవలిఒడ్డు ‘జలదృశ్యం’లో తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటిలో ప్రారంభమైంది.
1969 మహత్తర తెలంగాణ ఉద్యమ ఉత్థానపతన ప్రస్థానం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాం. ‘నేర్పరి’ గా తన గమనం ఉండడానికి ‘ఎన్ని వందల వేల గంటల మేధోమథనం’ ‘బ్రెయిన్ స్టార్మింగ్’ ఎక్సర్‌సైజులు చేసిందో అందరికి తెలుసు. స్థానిక ఎన్నికల్లో నిలబడి తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడే వందల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిచింది. రాజకీయ ప్రక్రియ, కొనసాగింపులో ‘లాంచింగ్ ప్యాడ్’ గా వేసిన మొదటి అడుగులో గొప్ప విజయం సాధించింది. అట్లా గెలిచిన విజయాన్ని ‘కన్సాలిడేట్’ చేసుకోవడంలో టీఆర్‌ఎస్ ఇంకా ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉండిందని కూడా కొందరు తమ అభివూపాయాన్ని వ్యక్తపరిచారు.
సిద్దిపేటలో కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ఉపఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసంలో మొదటి ముందడుగు. అట్లా మొదలై ఉప ఎన్నికల ప్రయోగం అనేక విజయాలను, అప్పుడప్పుడు ఎదురుదెబ్బలను కూడా టీఆర్‌ఎస్‌కు ప్రసాదించింది. లక్షల మెజారిటీతో గెలిచినా, బొటాబొటిగా గెలిచినా,తెలంగాణ ప్రజలను ‘వెలువరించాల్సిన రాజకీయ నిర్ణయం’ కోసం కార్యోన్ముఖులను చేయడమే ప్రధానంగా భావించింది టీఆర్‌ఎస్. రెండు సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌తో ఒకసారి, టీడీపీతో ఒకసారి పాల్గొన్నది. ఒక జాతీయపార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ ఎంత మోసపూరితంగా ఉన్నాయో తెలంగాణ ప్రాంత ప్రజలకు అనుభవంలోకి రావడానిఇక ఈ రెండు సాధారణ ఎన్నికలతో తేలిపోయింది. అది కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో పాల్గొనడం ద్వా రా సాధించిన అనుభవ ‘విజయం’. ఐదుగురు పార్లమెంటు సభ్యులను గెలుచుకొని, ఒకసారి ఇద్దరు కేంద్ర మంత్రులను చేసుకుని కూడా రాజీనామా చేసి దేశంలోనే రాజకీయ క్షేత్రంలో పెను ప్రకంపనలు సృష్టించింది.
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో, వరంగల్, కరీంనగర్, నల్లగొండలలో లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరించి దేవేగౌడను, అజిత్‌సింగ్‌ను, మాయావతిని, శరద్‌పవార్‌ను తెలంగాణకు మద్దతుగా మాట్లాడించింది టీఆర్‌ఎస్, కేసీఆర్. జరిగిన ప్రతిసభ తెలంగాణవాదుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగింది. దాని ప్రభావమే ఈ మధ్య దీర్ఘకాల మౌనముద్ర తర్వాత ‘కొత్తగా ఈరోజే మార్కెట్లోకి వచ్చిన’ టీఆర్‌ఎస్ సభల విజయంలో కనిపించింది. ఊపిరి ఉన్నంత కాలం రాష్ట్ర సాధన, అనంతర పునర్‌నిర్మాణంలో అంతర్భాగం కావాలన్న టీఆర్‌ఎస్ శ్రేణులకు, టీఆర్‌ఎస్ ఊపిరియే కాంగ్రెస్‌లో కలవబోతుందన్న వార్త తెలిసి ఎంతో తల్లడిల్లారు. ఇప్పుడు ఇక ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా ‘ట్గాట్ కాంగ్రెస్’ గా పార్టీ ముందుకు పోతుందని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో అందరి ముఖాల్లో కచ్చితంగా వేల మెగావాట్ల విద్యుత్ కాంతి కనపడుతుంది.
2009 నవంబర్ 29 మొదలుపెట్టిన కేసీఆర్ నిరాహారదీక్ష ‘తెలంగాణ ప్రజా క్షేత్రాన్ని’ ఎంత ఉద్దీప్తం చేసిందో అందరికి తెలుసు.

ఒక్కసారి ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమ చైతన్యం టీఆర్‌ఎస్‌ను ఆకాశమంత ఎత్తున నిలిపింది. డిసెంబర్ 9న పార్లమెంట్ వేదికగా వెలువడిన తెలంగాణ ప్రకటనతో చరివూతలో మొదటిసారి టీఆర్‌ఎస్, కేసీఆర్ చిరస్థాయిగా మిగిలారు. డిసెంబర్ 9 ప్రకటనను తుంగలో తొక్కిన సీమాంధ్ర లాబీకి కేరాఫ్‌గా మారిన రెండు కళ్ల చంద్రబాబును రాజకీయంగా మళ్లీ నిలదొక్కుకోని స్థితికి తెచ్చింది టీఆర్‌ఎస్. చంద్రబాబుకు తోడు సీమాంధ్ర లాబీకి మద్దతుగా ప్లకార్డుపట్టుకున్న జగన్‌ను మానుకోట రాకుండా ప్రతిఘటించి, గాయపడి జయకేతనం ఎగురవేసింది. వేలాదిమంది టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు జైళ్లపాలు, కేసుల పాలైనా.. దృఢమైన విద్యార్థి సంఘంగా తెలంగాణలో బలపడింది.
డిసెంబర్ 9 ప్రకటనను వెనక్కి తీసుకోవడానికి కారణమైన సీమాంధ్ర లాబీని కాదని పార్టీలకతీతంగా ఏకం కావాలని తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీ, న్యూమోక్షికసీలను ఒక్క దగ్గర చేర్చడంలో పెద్దన్న పాత్ర వహించింది టీఆర్‌ఎస్సే. ఇన్నిచేసినా జేఏసీని విచ్ఛిన్నం చేయడాని కి, ఉద్యమ శిబిరాన్ని నిర్వీర్యం చేయడానికి టీడీపీ, కాంగ్రెస్ ఏజెంట్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ‘ఏదీ కేసీఆర్ తెస్తనన్న తెలంగాణ ఎటుపోయిందని పాలోనితో గొంతు కలిపి వెక్కిరించారు నాయకులు, ఇప్పుడు మౌనం వీడి కార్యక్షేవూతంలో దూకుతున్న టీఆర్‌ఎస్ వడి చూసి జడవవలసిన రోజులు ముందున్నాయి.
డ్రామా కంపెనీలను కూడా తలదన్ని రోజుకో వేశం తో ఢిల్లీ టు హైదరాబాద్ షటిల్ ప్రయాణం చేస్తున్న తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపటి నుంచి ఇదే డ్రామా కొనసాగిస్తారా? ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహకరిస్తారా? తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగుతూ, ముఖ్యమంత్రి నివాసానికి, టెన్ జన్‌పథ్‌కు లింకు కలుపుతూ తెలంగాణ ప్రజల్ని వెలివేయడం, చంద్రదండు, జగన్ దండుకు చెక్‌పెడుతూ పాదయావూతలు, బస్ యాత్రతో తెలంగాణ చుట్టి రావడం అత్యవసర కార్యక్షికమంగా సభ తీర్మానించింది.అలివిగాని, ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలతో సాగుతున్న చంద్రయానం, దూసుకొస్తున్న షర్మిల బాణం తెలంగాణకు పట్టిన గ్రహణం అని చాటుతూ, తెలంగాణ ప్రజలకు ఆచరణ సాధ్యం చేస్తుందని, నీళ్లు, నిధులు, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల్లో తెలంగాణ రాష్ట్ర సాధనతో గణనీయమైన పెరుగుదల ఉంటుందని ఉదాహరణలతో సభ తేట తెల్లం చేసింది.
ఏది చేయాలన్నా టీఆర్‌ఎస్ కు బలమైన నిర్మాణం ఉండాలి. భూమిని భుజాలపై ఎత్తిపట్టి తలకెత్తుకుంటునన్న హెర్క్యూపూస్ తను కాలుమోపడానికి గజం స్థలం చూపెడితే చాలు-భూమిని పైకెత్తుతానని అన్నాడు. ఏపార్టీకైన హెర్క్యూలస్ కావాలన్న కాళ్ళకింది పునాది చాలు భూమిని తలకెత్తుకోవడానికి. భూమి అంటే పార్టీకి నిర్మాణం అని అర్థం. ఎంత కష్టమైన పని అయిన పూర్తిచేసి గమ్యం చేరాలంటే బలమైన నిర్మాణం కావాలి. పుష్కరకాలం తర్వాత స్థానిక ఎన్నికలేవు లాంచింగ్ ప్యాడ్ గా వాడుకొని విజయం సాధించిన టీఆర్‌ఎస్ 2014 కు ముందే స్థానిక ఎన్నికలను ఎదురుకోబోతున్నది. మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప ఇది ఆగదు. స్థానికమైన, మధ్యంతరమైన తెలంగాణ ప్రజల కసిని, ఈసడింపును ఇవ్వాళ అదునైన సమయం పదునుగా వ్యక్తపరచాలని చూస్తున్నారు. విస్తృత ప్రజారాశుల్ని ఏకం చేసి తొలినాటి స్థానిక ఎన్నికల విజయాన్ని సాధించాలని పుష్కరసభలు నిర్ణయించాయి.
తెలంగాణ రాజకీయ పార్టీలను, శక్తులను ఏకం చేస్తూనే తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పార్టీగా టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయా లి. ఉద్యమశక్తిగా, రాజకీయ శక్తిగా, బహుముఖంగా పురోగమించి తెలంగాణ గమ్యా న్ని ముద్దాడాలి.రాష్ట్ర సాధన అనంతర పునర్నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలని కరీంనగర్ పుష్కరకాల టీఆర్‌ఎస్ సభలు నిర్ణయించడమే చారివూతక ఘట్టం.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles