నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..


Sat,November 3, 2012 12:04 AM

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలానే ఉన్నాయి. నవంబర్ 1, ప్రారంభదినమే తెలంగాణకు లక్ష మెగావాట్ల చీక ట్లు కొని తెచ్చిన విద్రోహాల చీకటి ‘బ్లాక్ డే’ అందుకే తెలంగాణ అంతా నల్లని వస్త్రాన్ని కప్పుకొని ప్రపంచానికి తన నిరసన తెలియజేసింది. విశాలాంధ్ర పేర పరుచుకున్న నల్లని దట్టమైన చారనే జెండాలుగా ఎగురవేసి, మానవహారంగా ఏర్పడి, ఊరేగింపుగా నడిచి అన్ని రూపాల్లో నవంబర్ 1 తెలంగాణకు ఏమిటో తెలియజేసిండ్రు. ‘న’ అక్షరంతో ఉన్న ‘నీలం’ తుపాన్ నల్లని సముద్రం నుంచి తీరాన్ని తాకి, తుపాన్‌గా ఎగిసి తెలంగాణ మొగులు మీద నల్లని మబ్బుల్ని, ముసురును నింపింది. ముసురుకు ఇప్పటికే మంచం పట్టిన ప్రజల్ని, విద్యార్థుల్ని తట్టిలేపుతూ నకిరేకల్‌లో కూడా మానవహారం, నల్లజెండా ఆవిష్కరణ జరిగింది. పోయిన ఏడాది నవంబర్ ఒకటిన పదివేలమందితో మహోధృతంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇన్ని వేలమందితో ర్యాలీ నిర్వహించామని చెప్పడం కోసం ప్రస్తావించడం లేదు. విషయమేమిటంటే అక్టోబర్ 2న గాంధీజయంతి నాడు ఢిల్లీలో కేసీఆర్, కోదండరామ్, స్వామిగౌడ్, విద్యాసాగర్‌రావు తదితరులు గాంధీటోపీతో తమ స్వరాష్ర్ట ఆకాంక్ష ‘గాంధీగిరి’తోనేనని వ్యక్తీకరించిండ్రు. మరునాడు అక్టోబర్ 3న జాతీయ రహదారి తొమ్మిదిపై ప్రైవేట్ బస్సులతో ండుగా బయలుదేరి వస్తున్నప్పుడు సీమాంధ్ర సర్కార్ దండయావూతతో సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు బస్సులు బంద్ చేసిన సమయంలో కోదాడలో మొదపూైన నిరసన దాడి నకిరేకల్‌కు వచ్చేసరికి ఉధృతరూపం తీసుకొన్నది. తెలంగాణ ధర్మాక్షిగహం అక్టోబర్ 2న ఎగురవేసిన పావు ‘రాల్లో’ ఉంది. అక్టోబర్ 3న గురి చూసి బస్సులపై ఎగరేసిన ‘రాళ్ళ’లో ఉందని చాటి చెప్పిన రోజు. ఆ రోజు చోటు చేసుకున్న సంఘటనలే ‘డిజిటల్ సౌండ్’లో, ‘స్లోమోషన్’లో సీమాంధ్ర లాబీ తిరిగి తిరిగి చూసుకొని కుట్రపూరితంగా సీఐపై హత్యా ప్రయత్నం కేసును మాపై మెాపి, అనేక సెక్షన్లతో 82 మందిని జైలుకు పంపింది. నా బిడ్డ పెళ్ళికార్డులు నా బండిలోనే ఉన్నాయి, ఆ రోజే అరెస్టయితే అక్టోబర్,19 రాత్రి విడుదలయ్యాను. 22న పెళ్ళి జరిగిన వారం రోజులు కాగానే నిశ్శబ్దాన్ని బద్దలుచేస్తూ, నకిరేకల్‌లో జరిగిన మొదటి పెద్ద ప్రదర్శన నవంబర్ ఒకటి. నవంబర్2 నల్లగొండలో అక్టోబర్,3 సంఘటనలో అరెస్టయిన ఉద్యమకారులు నెలరోజులు అనేక అడ్డంకులను అధిగమించి బెయిల్‌పై విడుదలయిన రోజు. తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర విడుదలయిన ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు చెయ్యి ముంద ుకు వంచి అమరుల త్యాగాల సాక్షిగా మునుపుకంటే రెట్టింపు నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతామని ప్రతిజ్ఞ చేసిన రోజు. నకిరేకల్ చేరుకోగానే ఈ యేడాది లెక్కనే వర్షం, ముసురు, చీకట్లోనే పెద్ద ర్యాలీ తో నడుస్తున్నాము. పోలీస్‌స్టేషన్ దాటేప్పుడు ‘అస్టు లు, అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని’ హోరెత్తుతున్న నినాదాలు, ఎగుస్తున్న పిడికిల్లు, పోలీసులు అన్నీ వీడియో తీస్తూనే ఉన్నారు. అక్టోబర్ 3కు నవంబర్ 2కు పెద్ద తేడాలేదు అదే హోరు, జోరు. వాకీటాకీలు మొత్తుకుంటూనే ఉన్నాయి.

నవంబర్ మూడున పోలీసులు మంచి ‘మూడ్’లో ఉన్నారు. ఢిల్లీ నుంచి నడిచిన సీమాంధ్ర ఒత్తిడి, తెలంగాణలో తమను తాము తమ ప్రజలతో పెనవేసుకొని నడువలేని దళారీ రాజకీయ నాయకుల మెతకదనం, చట్టాన్ని ఎన్నడూ గౌరవించడం అలవాటులేని సీమాం ధ్ర ఉన్నత పోలీస్ అధికారగణం ‘ట్గాట్ చెరుకు సుధాకర్’ స్కెచ్‌తో మొదలయ్యింది. మధ్యాహ్నమే కాగితా లు రెడీ అయిపోయినయ్. సాయంవూతానికి ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ గులాటీ, కలెక్టర్ ముక్తేశ్వపూరావు సంతకాలు చకా చకా ముగుసుకొని అక్టోబర్ 3 రాత్రి దేశ చరివూతలోనే మొదటిసారి, ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పనిచేస్తున్న నేతను, పద్దెనిమిదిమంది శాసనసభ్యులు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యున్ని అర్ధరాత్రి తీవ్ర పెనుగులాట మధ్య ఏ విధమైన కారణాలు చెప్పకుండా, కుటుంబ సభ్యుల్ని నెట్టివేసి ఎత్తుకొనిపోయి వరంగల్ జైలుకు తరలించి, పీడియాక్ట్ కింద అరెస్టు చేసినామని ప్రకటించారు. పది రోజుల తరువాత అసలు తాము పెట్టిన చట్టానికి కూడా ‘చట్టబద్ధత’లేని చట్టుబండల పని తాము చేసినామని నాలుక కరచుకొని మరో నల్లచట్టం ‘నాసా’తో వరంగల్‌కు రావడం అట్లా కూడా చెరుకు సుధాకర్ నాసా ఖైదీ నెంబర్ వన్ కావడం, తెలంగాణ సమాజమంతా ఏకమయి, ప్రజా సంఘాలు, కవులు, రచయితలు, డాక్టర్లు ఏకమయి, ఉద్యమించడం తెలంగాణ రాష్ట్ర సమితితో గొంతు కలిపి ఇతర శాసన సభ్యులు అసెంబ్లీలో నిలదీయడం పార్లమెంట్‌లో కేసీఆర్, విజయశాంతి, మధుయాస్కీ, మందా జగన్నాథం, రాజయ్య, రాజగోపాల్‌డ్డి తదితరులు స్పందించి ఆందోళన చేశారు. 37 రోజులకు కిరణ్‌సర్కార్ నల్లచట్టాల అత్యుత్సాహానికి చెంపపెట్టుగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో నేను విడుదల అవడం అందరికి తెలిసిన విషయమే.

ఒక్క యేడాదిలో ఎన్నో మార్పులు వచ్చినయ్. డిసెంబర్, 9 కేసీఆర్ నిరాహార దీక్ష నేపథ్యంలో పార్లమెంట్ ప్రకటనకు కట్టుబడి ఉంటామని చెప్పాల్సిన కాంగ్రెస్ ఎన్ని పిల్లిమొగ్గలు వెయ్యాల్నో అన్ని వేసింది. ఎన్ని నాటకాలకు తెర లేపాల్నో అన్నీ చేసింది. పాల బుగ్గల పసివాళ్ళకు ముద్దులు ఇచ్చి ఫోజులు ఇచ్చే ప్రధాని, తెలంగాణ జేఏసీ నల్లబుగ్గలు ఎగిరేస్తే ఉలిక్కిపడి ఆంక్షలుపెట్టే రోజులు వచ్చినయ్. తెల్లని కాగితంపై నల్లని అక్షరాలు రాసే జర్నలిస్టులకు, తెలంగాణ ఛానళ్లకు ‘బ్లాకు లిస్టు’ సిద్ధమయి అనుమతించని రోజులు వచ్చినయి. మీ సభ లేవో మీరు పెట్టుకోండని అనుమతి ఇచ్చిన సర్కార్ పాత రోజులు పోయి సభకు అనుమతి ఇచ్చి టియర్‌గ్యాస్ వదిలి, ఉక్కిరిబిక్కిరి చేసి ఉసురు తీసే రోజులు వచ్చినయ్. ప్రభుత్వ అతిథిగృహాల్లో ఉద్యమ నాయకులకు విడిది ఏర్పాటు చేసి, ఉచిత మర్యాదలతో ‘ఆ ఒక్కటి తప్ప’ అని తెలంగాణను మినహాయించి ఏమైనా అడగండన్న లౌక్యంపోయి తెలంగాణ ఐ.కా.స ఛైైర్మన్ కోదండరామ్‌నే గృహనిర్బంధానికి గురిచేసే మొరటు రోజులు వచ్చినయ్. తెలంగాణ గురించి ఉద్యమిస్తున్నందుకు, మాట్లాడుతున్నందుకు కవులు, మేధావులు, కాశీం. ఆకుల భూమయ్య తదితరుల మీద కేసులు, విమలక్క జైలుకు పోయిరావడాలు, విద్యాలయాల, క్యాంపస్ చుట్టూ ఇంకా చిక్కనవుతున్న ఇనుపకంచె, విద్యార్థి నాయకులపై పెరుగుతున్న కేసుల లిస్టు ఇదీ ఈ ఏడాదిలో పోయిన నవంబర్ 3 నుంచి కొనసాగిన సంఘటనల లిస్టు.

నిజానికి చెరుకు సుధాకర్‌పై నాసా మోపడంతో ప్రభుత్వం విజయం సాధించినట్లా? ‘నాసా’ పేరుతో తెలంగాణ ఉద్యమకారుల్ని మరింత కవ్వించి, నాసా ఉచ్చులోకి చాలామందిని లాగుదామని ప్రయత్నించి ఏ విధమైన కవ్వింపులేకపోగా కనబరచిన ఉద్యమ ఐక్యతకు, పరిణతికి చేష్టలుడిగి కిరణ్ సర్కార్ వైఫల్యం చెందినట్లా? ఇంతకు ఏడాదిలో జరిగిన సంఘటనలన్నింటిని క్రోడీకరించుకొని ప్రభుత్వం, పాలకులు ఏ ‘రాజకీయ క్రీడ’కు తెరలేపబోతున్నారు? అనేకమైన విజయాలు, కొత్త సవాళ్లు, బలహీనతల మధ్య తెలంగాణ ఉద్యమం, ఉద్యమ అస్తిత్వ పార్టీలు, సంఘాలు వెంటాడుతున్న ‘నల్లని’ క్రీనీడను వదిలి మధ్యాహ్న మార్తాండుడిని ఎప్పుడు ముద్దాడుతారు? ‘దోపిడీపై పీడనపై విముక్తిలోనే నాకు ముక్తి, ప్రాప్తి ’ అన్న కాళోజీ మాటలు అక్రమ నాసాతో అరెస్టయిన చెరుకు సుధాకర్‌కు, వందలాదిమంది తెలంగాణ ఉద్యమకారులకు వర్తించవా? నాసా చట్టం తెలంగాణ గడ్డపై తెలంగాణ ఉద్యమకారునిపై అమలైనరోజు నుంచి లెక్కవేసిన ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్న తెలంగాణ ఉద్యమం, సకల దోపిడీలు పోవాలని యాభై ఏండ్లుగా పడిన తండ్లాటలో అలసిపోయిన తెలంగాణ పల్లెకు ఇంకా చాలా సందేశం తీసుకుపోవలసి ఉందేమో. నిర్బంధం అలవాటయిన పాలకులు తెలంగాణ ఇవ్వడానికి ఎన్నిరోజులు ఆలస్యం చేస్తారో ఏమో గాని, వచ్చే తెలంగాణలో నిర్బంధపు చీకట్లుండొద్దని కోరుకుంటే మాత్రం నల్లచట్టాలను నిర్బంధాలని ఎజెండా గా ఇప్పుడే చర్చించాల్సిన అవసరము న్నది. అక్టోబర్‌లోనే హక్కులనేత బాలగోపాల్‌ను పోగొట్టుకున్న ఆప్తకాలంలో ఇది ఆప్తవాక్యమేనేమో!పొడిపొడిగా అధిష్ఠానాన్ని తూలనాడడం, వచ్చే పిలుపుల కోసం ఎదురు చూస్తూ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు ఇంకెవ్వరిని నమ్మిస్తారు? 369 మంది తెలంగా ణ బిడ్డలను బలిగొన్న కాసు బ్రహ్మానందడ్డి, ఇందిరాగాంధీలను, వెయ్యిమంది బలిదానాలకు కారణమయి న సోనియా, మన్మోహన్‌ను తెలంగాణ శాశ్వత శత్రువులుగా, ద్రోహులుగా, హంతకులుగా ప్రకటించకుండా ‘మంవూదస్వరం’తో తెలంగాణ పాట పాడితే తోడేలు గొర్రెల మందల చేరిన చందమే గాని మరేమిగాదు. ఢిల్లీలో కేసీఆర్ నిజాయితీ,నిబద్ధతతో దోబూచులాడిన కాంగ్రెస్ సైగ చేయనిదే కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఒకసారి అసలు కేసీఆర్ నన్ను కలవనే లేదని, ఇప్పుడేమో తెలంగాణ సంగతి దేవుడు చూసుకుంటాడని అనడు గాక అనడు.తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతీకగా ఎదగకుండా, ఎదుగు బొదుగు లేకుండా నేలబారుగా ఇట్లాగే ఉద్యమం నడిపితే జైళులో ఉన్నా, బయట ఉన్నా ఒక్కటే గదా అని అనిపించడం అతివాదం, అతి అనుభూతివాదమని నేను భావించడంలేదు. నల్ల చట్టాలైన పీడీ యాక్ట్, నాసాను నిలదీసి కోర్టులో గెలిచినప్పుడు, జైలు గోడలు బద్దలయిన ఆనందం తెలంగాణ ఉద్యమ ఉధృతిలో, ఐక్యతలో చూడాలని ఆశపడుతున్నాను.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles