విద్రోహపు చీకటి


Thu,November 1, 2012 12:02 AM

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామీలు కురిపించి ఒప్పందాలను తుంగ లో తొక్కిన తెలంగాణలో ఎవడూ వొప్పని సంపారం గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 గురించి ఏమీ చెప్పుకోలేం. అందుకే నవంబర్ ఒకటి తెలంగాణకు విద్రోహ దినం కంటే మించి చాలా చెప్పుకోవలసి ఉంటది.

మా తెలుగుతల్లికి మల్లెపూదండ పాటకు శృతి కలుపుతూ సుందరంబాడిని యాది చేసుకుంటూ పులకించడానికి కాళ్లకింద పల్లేరుకాయలా గుచ్చుకుంటున్న వంద జిల్లేడు కొమ్మల మధ్య ఎక్కుపెట్టిన పాలకుల తుపాకుల బయోనెట్ల మధ్య ఎట్లా సాధ్యమైది? నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు నల్లకలువలై నిరసన జెండాలుగా తెలంగాణ అంతటా వికసించడం గాక ఈ విద్రోహ దినాన ఏం చెయ్య వస్తది? బునాదిలేని తెలు గు ప్రజల ఐక్యతను అనాది నుంచి విడదీయరాని ఆత్మీయ పేగు బంధమని ఎంత ఊదరగొట్టినా, తుమ్మి తే ఊడిపోయే ఈ ముక్కుని ఒక్కడు కాదు తెలంగాణ ఎల్ల జనం అంటున్నా, ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నాం. కనుక తెలంగాణ రాష్ట్రం రావాలని ఉన్నా, అంతవరకు అధికారికంగా భాగం పంచుకొని పాల్గొనకపోవడం భావ్యం కాదని సీమాంధ్ర సర్కారుతో అంటకాగుతున్న దళారీ, బానిస మంత్రులు తీరుబాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

నాకొక్కనికి కేంద్ర మంత్రి పదవి సోనియమ్మ ఇచ్చింది. కనుక ఇప్పటిదాకా తెలంగాణ ప్రజాభివూపాయ ‘సర్వే’ తప్పని, అమ్మ ఎప్పుడు ఇచ్చినా సంతోషమేనని సర్వే సత్యనారాయణ అంటున్నాడు.ఈ ఒక్కరోజు పాల్గొనకుండా ఉంటేనే ప్రజలు మమ్మల్ని వీధుల్లో తిరగనిస్తారు. వదిలేయండి రేపటి నుంచి ఈ రోజు పనుల సంతకాలు కూడా పెడుతామని కొంద రు కొత్త నాటకం అడుతున్నారు. ఎట్లయితేనేమి నవంబర్ 1 పాలక పార్టీకి బహు నాటక ప్రదర్శనా దినం. ప్రతిపక్ష పార్టీలకు గోడమీది వాటంగా వాచాలత ప్రదర్శించే దినం. తెలంగాణవాదులకు అడుగడుగు న తమ స్వరాష్ట్ర ఆకాంక్షతో పాటు సీమాంధ్ర సర్కారు కబ్జా దురాగతాలు చాటే నిరసన దినం.

రెండుకండ్ల సిద్ధాం తం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు దండ యాత్రగా ‘వస్తు న్నా మీ కోసం’ యాత్రలో అడుగులో అడుగువేసి నడుస్తారు. కానీ ఈనవంబర్ 1 రోజు‘అయ్యా! చంద్ర బాబునాయుడు మీ తాతలు, నాయనలు, మీరు, మేము అంతా తెలుగువాళ్లమే అని మాటలు చెప్పి తెలంగాణను కలుపుకొని, అనేక రకాలుగా అన్యాయం చేసిన దినం కనుక. నువ్వు ఈరోజు ఏ మొఖం పెట్టుకొని తెలంగాణ విషయం తేల్చకుండా పాదయాత్ర చేస్తావు? నీతోపాటు మేమెట్లా అడుగులో అడుగు వేయగలం? అని నిలదీయరు. ఏ నియోజకవర్గంలో కూడా అధికారిక రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనం’ అని అనరు. అందుకే నవంబర్ 1ని కేవలం తెలంగాణ విద్రోహదినంగా పాటించడమే కాదు ఇంతమందిని నిలదీయవలసిన రోజు.

‘విశాలాంవూధ’లో ప్రజారాజ్యం వస్తుందని తెలిసో, తెలియకో నమ్మినాము. కానీ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూసినాక ఈ ‘విశాలాంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవం’ పెను ‘విషాద దినోత్సవమని’ సీపీఐ ఆఫీసు మీద నారాయణ గారు, ఇతరులు నల్ల జెండాలు ఎగురవేయాలి. ఏదో ఒక ప్రభుత్వ ఆఫీసు మీద నల్ల జెండా ఎగురవేసి, పోలీసు వలయం ఛేదించుకుని ఈ పని చేశామని తృప్తి పడడం కంటే, అశేష తెలంగాణ ఉద్యమాభినులంతా తమ ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేసి గుండెపై నిలబెట్టుకోవాలి.
తోడెలు గొర్రెల మందలో జొరబడినట్లు, ఫక్తు సీమాంధ్ర నాయకుల ఆదేశాలు పాటిస్తూ ఎన్టీరామారావు, రాజశేఖర్‌డ్డి రాజ్యం రావాలని నినదిస్తున్న నాయకులు మీ చంద్రబాబు, మీ జగన్ సీమాంవూధకు వ్యతిరేకం కాదని, మేము మా నాయకుల దగ్గర జై తెలంగాణ అంటూనే ఉన్నామని తెలంగాణ ఉద్యమ మందాలో ముందుండి కొత్త నాటకాలు వేస్తుంటారు. ఈ మధ్య చంద్రబాబు పాదయావూతలో, విజయమ్మ బహిరంగ సభలో ఇట్లాంటి కృతక ప్రయోగాలు చాలానే చేశారు. భువనగిరిలో అయితే ఏకంగా తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించే ప్రయత్నం చేసి, వేదిక మీద ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ పాట పాటించారు. ఇవన్ని ప్రయత్నాలు వాళ్ళు అమాయకంగా తెలిసో, తెలియకో చేస్తున్నవి కావు. తెలంగాణ ప్రజలు అంబేదగ ఉంటారని అంతా కలగాపులం చేసి కన్‌ఫ్యూజ్ చేస్తే తమ పబ్బం గడుపుకోవచ్చని అంచనాతోనే చేస్తున్నారు.

ఢిల్లీకి పోయి వచ్చే మంత్రులకు, సారయ్య, గీతాడ్డి, డీకే అరుణలకు ఏం చెయ్యాల్నో తెలియదా? ఉన్న కేసులు సరిపోవన్నట్టు మిలిటెంట్ ఎత్తుగడలతో వీరోచితంగా నల్లజెండాలు నాటి కొత్తకేసులకు అవకాశం కల్పించడం కంటే సీమాంధ్ర సర్కార్‌ను, వాళ్లకు అంటకాగుతున్న పాలక, ప్రతిపక్ష ద్రోహులను ఒత్తిడికి గురిచేసే ఎత్తుగడలకు ఎగబాకడమే సరైన వ్యూహం. ఆ వ్యూహం నవంబర్ ఒకటితో తీవ్ర రూపం దాల్చి భవిష్యత్తులో మరో ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్స వం జరపకుండా ముందుకు పోవాలి.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles