చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం


Sun,October 28, 2012 12:10 AM

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం ప్రాజెక్ట్ పరిశీలిస్తూ చంద్రబాబు తెలంగాణలో ప్రవేశించారు. రూట్ మ్యాప్‌లో భాగంగా యాధృచ్ఛికంగా రాజోలి నుంచి ప్రవేశించడం గతాన్ని తోడుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఈ రాజోలిబండ దగ్గరే కదా! తెలంగాణకు రావాల్సిన నీళ్ళను అడ్డగిస్తూ ఆర్‌డిఎస్ తూములను రాయలసీమ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కె.ఇపభాకర్ తదితరులు దౌర్జన్యంగా పగులగొట్టి నీళ్ళు మళ్లించుకుపోయారు. ఇదే రాజోలి దగ్గర తెలంగాణకు, పాలమూరుకు రావాల్సిన నీళ్ళను కిందకు వదలకుండా మూడు సంవత్సరాల కిందట రాయలసీమవాళ్ళు అందరు కూడబలుక్కుని ఎదుక్కిన నీరు ఇటు రాజోల్‌ని, అటు రాయలసీమను, కర్నూల్‌ను ముంచి జోగులాంబ గుడిని జలదిగ్బంధనం చేసింది. వరదల్లో మట్టికుప్పల తీరు మిగిలిన మరమగ్గాల మీద గుండెలు పగిలేలా నేతన్నలు రోదిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ర్ట సమితి, వివిధ స్వచ్ఛంద సంస్థలు సహా య చర్యలు అందించిండ్రు. అందుకే చంద్రబాబు పాదం మెాపిన తెలంగాణ గడ్డ మీద గడ్డి పరకలు సైతం ప్రశ్నల కొడవళ్ళయి నిలదీయడానికి వెళ్తే, కూడబలుక్కుని ప్రతిపక్షం, పాలకపక్షం పాలమూరు సరిహద్దులు దాటకుండా తెలంగాణ వాదుల్ని నిర్బంధించింది! ఎట్లయితేనే మి తెలుగు తమ్ముళ్లు పసుపుజెండాల తివాచి గట్టి అయ్యవారిని ఐజ దాటించి గద్వాల వైపు తీసుకెళ్లిండ్రు.

వందల ఏండ్ల చరిత్ర ఉన్న గద్వాల కోటకు ‘అరుంధతి’ సినిమాతో వెరైటీ డైలాగ్ అందించిన దిక్కుమాలిన విలన్ ‘వదల బొమ్మాళీ! వదల’ అన్న తీరుగ చంద్రబాబు నిరసనలను కాదని సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాలు నడుపుతూ ముందుకు వెళుతున్నాడు. చంద్రయా నం చంద్రక్షిగహణమై తెలంగాణ అస్తిత్వ రాజకీయాలను కబళించాలని ఉరకపూత్తుతున్నదని తెలంగాణ మొగులు దిక్కు చూస్తున్నవాళ్ళు అంటున్నారు. గద్వాల చేరుకున్న చంద్రబాబు ఏరోజున, ఏ సాపెన ఎటునుంచి తగిలిందో తెలియదు కాని వేదిక కూలి వెన్నుపూసకు దెబ్బతగిలి వైద్యం చేయించుకుంటున్నాడు. యాత్రను ఆపేది లేదన్న రోజుకుముం దే హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్ సందర్భంగా కాలం చెల్లిన టియర్ గ్యాస్ షెల్స్‌ను వేదికపై వొదిలిన పోలీసు దౌష్ట్యానికి బలై, అనారోగ్యంతో రాజిడ్డి చనిపోయిండు.1969లో తెలంగాణ ఇస్తనన్న ప్రకటనను మరుగునపరచిన మార్మిక తుపాకీతో వెయ్యి మందిని సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్ బలిగొంటున్నారు.

సీమాంధ్ర సర్కార్, కిరణ్ కుమార్‌డ్డి ర్యాలీకి అనుమతించి పాల్పడిన అణచివేతకు పరాకాష్ట టియర్ గ్యాస్ బుల్లెట్ల ప్రయోగం. దు:ఖంతో గర్భశోకాన్ని అనుభవిస్తున్న తెలంగాణ తల్లులకు ఇది చాలదన్నట్లు టియర్‌గ్యాస్ గుండెల మీదికి వదిలి ఉక్కిరిబిక్కిరి అవుతుంటే పైశాచిక ఆనందం అనుభవిస్తున్న ఈ సర్కార్ టియర్‌గ్యాస్ బుల్లెట్‌తో రాజిడ్డి మృతికి కారణమై ‘రాజకీయ హత్య’కు పాల్పడింది. గంగవరంలో, లక్ష్మీదేవిపేటలో ఎక్కడ దౌష్టం జరిగినా, ఆయన పాలనలో జరిగిన బషీర్‌బాగ్‌లను, వరుస ఎన్‌కౌంటర్లను మరచిపోయి ఖండించే బాబు రాజిడ్డి గురించి ఒక్క మాట ఎందుకు అనలేకపోయిండు. ఎవరితోటి అలాయ్ బలా య్ తీసుకోవాలే? ఎవనితోని మొఖం ముందలబెట్టి ముఖాబలా చెయ్యాల్నో అర్థం గాని సమయంలో దత్తన్న వేదిక మీద ఎర్రబెల్లి, గీతాడ్డి తెలంగాణ ముచ్చ ట్లు మాట్లాడుతారు? సచ్చే పోరలు సస్తనే ఉంటరు. జైళ్లకు పోయేటోల్లు పోతనే ఉంటరు. దొంగ కేసుల్ల ఇరాము లేకుంటే కోర్టు గడప తొక్కి సొక్కిపోయేటోల్లు ఉంటనే ఉంటరు. రామసక్కదనంగా ఫిడేలు వాయించినట్లు అక్కడ అన్నీ చేరి తొడే లు గొర్రెల మందల జేరినట్లు చేరి, గొంగడి, రుమాలు భుజాన వేసుకొని దత్తన్న దగ్గర ఫోటోలకు ఫోజులు ఇస్తనే ఉంటరు.

చంద్రబాబు చంద్రయానం ఇట్లా కొనసాగుతుంటే తెలంగాణ నోట్లో టన్నుల చెక్కెర పోసిండంట వాళ్ళ అయ్య రాజశేఖర్‌డ్డి. ఆయన కొడుకు జగన్‌మోహన్‌డ్డి వదిలిపెట్టిన బాణంగా ఆయన బిడ్డ షర్మిల దూసుకొస్తదట. ఇంకో నాలుగు రోజులకు ఎనుకో ముందో తెలంగాణకు షరమ్‌లేని మన నేతలు ఏండ్ల తరబడి నిద్రలో ఉండి లేచిన ఊర్మిల తీరు ఈ షర్మిలా ఇప్పుడే లేచి తెలంగాణ పల్లెను నిద్రలేపడానికి వస్తుంది రండెహో అంటున్నారు. నిన్నటిదాక తెలంగాణ కోసం దిట్టంగా ఉద్యమం చేసింది మేమే అని చెప్పి ‘జైలు నుంచి జగనన్న రానీయరాదుండ్రి తప్ప క అనుకూల ప్రకటన’ చేయిస్తమంటరు. ఎందుకురా! అయ్యా! ప్రణబ్ ముఖర్జీనీ రాష్ట్రపతి చేయడానికి జైలుగోడలు అడ్డం రాలే గాని, తెలంగాణకు అడ్డమొచ్చినయా అంటే సప్పుడు చెయ్యరు.

పరకాలలో ఈ పరకలు విజయాన్ని చేజిక్కించుకుంటే ఇప్పుడు షార్క్‌లై షాక్‌లు ఇచ్చెటోల్లె. అందుకే తెలంగాణ అందివచ్చిన కాడ ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లనే చెబుతున్నది. ఇవ్వాల్టి దాక ఏదో ఒక సానుకూల కదలిక తెలంగాణకై ఢిల్లీలో మొదలయితదని ఎదురు చూసినమ్ మనం. ఢిల్లీలో పెద్దలకు వొట్టిగనే కోపమొస్తదంటే ‘ఖామూష్’ అని నోటికి చేయి పెట్టుకు న్నాం. వాళ్ళు ఎంత రెచ్చగొట్టాల్నో అంత రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమ శిఖరాన్ని నిర్వీర్యం చేయాలని, విభజించాలని చూసిండ్రు. ఉద్యమ నేతగా కేసీఆర్‌కు ఎంత ప్రాముఖ్యం ఇవ్వాల్నో అంత ఇచ్చినట్లే చేసి అంతా వల్లెక్కం అనిపించాలనుకున్నారు. కేసీఆర్ ఢిల్లీ వదలగానే తెలంగాణ మంత్రులతో, ఎంపీలతో కొత్త కొత్త చిలుక పలుకులు పలికించిండ్రు. కొత్త కొత్త నాటకాలకు చరమగీతం పాడుతూ నవంబర్ 1 తెలంగాణ విద్రోహ దినాన్ని పాటిస్తూ నవంబర్, డిసెంబర్‌లో ఐక్యంగా ఉద్యమాన్ని ఉరకపూత్తించాలి. అక్టోబర్ 30 తరువాత ఢిల్లీలో చర్చలు కటీఫ్, ఉద్యమమే గీటురాయిగా తెలంగాణ ప్రతిపప్లూను గులాబీ జెండాతో మీటుతామని సన్నద్ధమవ్వాలె.


పన్నెండేళ్ళ ఉద్యమంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్న టీఆర్‌ఎస్ ఉద్యమనేత కేసీఆర్ సారథ్యంలో అన్నింటిని అధిగమించి, నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా రెపపలాడి తిరుగులేని రాజకీయశక్తిగా నిలదొక్కుకోవడానికి నవంబర్ 5, 6 తేదీల్లో టీఆర్‌ఎస్ రాష్ర్ట కమిటీ సమావేశాన్ని జరుపుకోబోతున్నది. బహుశా ప్రపంచ చరివూతలోనే ఇంత ఓపికగా జరగాల్సిన కార్యం కోసం చర్చలు ఎవ్వరు జరపలేదు. దాన్నే బలహీనతగా కాంగ్రెస్, తెలుగుదేశం, అనేకులు ఎన్ని కూసినా, ఇప్పు డు అందుకు జవాబుకు, సవాలుకు తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధమవుతున్నది. ఈ పుష్కర ప్రస్థానంలో అనేక ముష్కర దాడులను ఎదుర్కొన్న టీఆర్‌ఎస్‌పై దండయావూత వలే పాదయాత్ర మిషతో వస్తున్న చంద్రబాబుకు, వైఎస్ కుటుంబీకులకు తెలంగాణ క్షేత్రంలోనే ఉద్యమ కార్యాచరణతో జవాబు చెప్పే సమయం ఆసన్నమయ్యింది. ఇప్పుడు తెలంగాణలో ఆడాల్సిన రియల్ సిని మా అప్రతిహత తెలంగాణ ఉద్యమం, హీరోలు కేసీఆర్, ప్రజలు. ఈ సినిమాకు రావాల్సిన రాబడి, రివార్డ్, అవార్డ్ తెలంగాణ రాష్ర్టం.

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం, పెద్దన్నపాత్ర పోషించాల్సింది ఎన్నో కట్స్ ఎదురుకొన్న గట్స్ ఉన్న టీఆర్‌ఎస్ ఆ పాత్ర పోషించడానికే తెలంగాణ కవితా సంపుటి ‘మునుం’ ఆవిష్కరణలో మునుం పదాన్ని విశదీకరిస్తూ నాతో గొంతు కలిపి కేసీఆర్ అన్నట్లు ‘టిల్ ద మిషన్ అకాంప్లిష్డ్’ కోసం మొత్తం గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles