సౌ సాల్ సిల్‌సిలా


Wed,October 10, 2012 07:27 PM

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్
బార్ బార్ కోషిష్ చేసినా దొరకని
దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది.
తెలంగాణ బడే దిల్‌వాలా!
సౌ సాల్ సంఘర్ష్ సిల్‌సిలా!
ఇప్పుడు ఎవరు మోస్తారన్నది..
జల దృశ్యం! జన దృశ్యం!! కవి దృశ్యం!!!
అవును, ఆదిలాబాద్ అడవుల నుంచి
వాంకిడి వాకిట నుండి ఎదిగొచ్చిన
ఈ నూలు పోగుల చందమామ మల్లెపందిరి సిల్‌సిలాను
చెదిరిన తెలంగాణ గూడుకు పందిరి గుంజయి
ఎవడు నిలబెడతాడు?
చిన్నకొండూరో, వాంకిడో, పోచంపల్లో , సిరిసిల్లో
తెలంగాణ ప్రతి జనపదంలో
భద్రంగా తన పాదమువూదల్ని వదిలివెళ్లిన
ఈ ‘కొండ’ గుర్తుకు సిల్‌సిలా అయి
ప్రతి పల్లె శిరస్సు వంచి
బాపూజీ అని పిలిచే యోగ్యుడెవ్వరు! యోధుడెవ్వరు!

నిజం! ఒక వృద్ధ శిఖరం... ఆవలి గట్టుకు అవలీలగా
నిత్యం-జన కోలాహలం నడిచే బాట కోసం..
పర్వత పాదాల పాయదీసి
కొండను తవ్వి రహదారి విస్తరించి విశ్రమించింది..
కొండవీటి కథల్లో కాదు, మనం నడుస్తున్న కాలంలోనే
అవును మనం నడుస్తున్న కాలంలోనే -ఒక జీవిత కాలం
స్వరాజ్య కాంక్షకై క్విట్ ఇండియా
స్వరాష్ట్ర సాధనకై క్విట్ తెలంగాణగా ఎలుగెత్తింది
అవును మనం నడుస్తున్న కాలంలోనే
పుట్టిన భూమికి పెట్టని కోటలా దండుగా కాపుకాయాల్సిన
వాళ్లు- పదవుల కోసం వెంపర్లాడుతున్నప్పుడు
మంత్రులు, గవర్నర్లు- ఏ పదవులైతేనేమి
ఎడమ కాలుతో తన్ని-తనకు తానే బెంచ్ మార్క్
లక్ష్మణరేఖ గీసిన ధీశాలి వైశాలి పద్మశాలి
పదునైన పోరు కేళి..

ఆయన స్వరం! ఝంఝామారుత రణనినాదమై
ఢిల్లీ కోటను తాకింది
ఆయన స్వాంతన! తెలుగునేల ఇరువైపుల
మైత్రీవనం పూయించింది
ఆయన కొల్లాయి గట్టీ.. నకిలీ గాంధీలకు
గోడ కుర్చీ వేయించాడు
కాళోజీలు, జయశంకర్‌లు, జాదవ్‌లు..
అందరూ ఆయనతో కలిసి నడిచిన వాళ్లే..
మొన్న బ్రిటిష్ సర్కార్ గోబ్యాక్ అన్న గొంతుకే
గైర్ ముల్కీ గోబ్యాక్ అని నినదించింది.
మొన్న నిజాం సర్కార్‌కో హఠావో అన్న గొంతుకే
ఢిల్లీ సర్కార్ తెలంగాణ ఇచ్చే దాక తెగించి కొట్లాడమన్నది
పోరాటాల సిల్‌సిలాకు ఆఖరి పేజీలుండవు
పేజీ చివర పోరాటం కొనసాగించమని
మెరుస్తున్న దస్తఖత్ ఉంటది
దస్తఖత్‌ను ముద్దాడుతున్న లేలేత వసివాడని
పెదవులంటయ్
అవి కల సాకారమయ్యే దాకా
కొత్త దారుల్ని పలువరిస్తుంటయ్! వెలువరిస్తుంటయ్!!
కొన్నిదారులు అసెంబ్లీ, పార్లమెంట్ కాడ
కొన్ని దారులు నిన్నటి రేపటి మిలియన్ మార్చ్‌ల కాడ
ఏదారిలో ఉరుకులు పెట్టినా
మైలురాయిలా నువ్వుగా .. నీ జ్ఞాపకం..
బాపూ! నీది పూజల కందని వ్యక్తిత్వం
నీవు మట్టిలో కలిసిపోయన చోట
ఒక ఆకురాలు కాలంలో..
ఒక ఊపిరాడని ఉక్కపోత కాలంలో..
మట్టి వేళ్ల చల్లని సుగంధంలా.. నువ్వు నీ పరిమళం ..

-చెరుకు సుధాకర్

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles