జయశంకర్ జననం తెలంగాణకు వేడుక


Sat,October 6, 2012 03:43 PM

Jayashankar1‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీదాసాదా జననం లెక్కల్లోకి ఎక్కి.. మహా అయితే ఏడాదికోసారి, జన్మదిన శుభాకాంక్షలందుకొని పూలదండలతో, దండిగా జరిగే ఇంటి సంరంభానికి పరిమితమై.. బతికినన్నాళ్లు కొనసాగి ప్రకృతి ధర్మంలో భాగంగా మరణంతో పరిసమాప్తమైతుంది. ఏడు పదులు దాటిన కాలానికి ముందు ఎక్కడో వరంగల్ జిల్లాలో మురుమూల అక్కంపల్లి గ్రామంలో లక్ష్మికాంతారావు, మహాలక్ష్మి దంపతులకు బంగారం పనిచేసే కుటుంబంలో బంగారుపంటగా మన తెలంగాణ పెద్దకొడుకు జయశంకర్‌సార్ ఆగస్టు 6న జన్మించిండు. ఇంట్లో బంగారానికి పుటం పెడుతున్నప్పుడు ఎల్లిగారంతో అతికిస్తున్నప్పుడు తన తాతలు, తండ్రులు చూపించిన నైపు ణ్యం, ఏకాక్షిగత, తనకు చదువుల బడిలో అబ్బాలని బంగారు కలలతోనే జయశంకర్‌సార్ బడికి పోయిండు.దేశాన్ని పోటెత్తుతున్న స్వాతంవూతోద్యమ మహాహోరు, నిజాం నిరంకుశ పాలన ఇనుప కంచె ను దాటి వరద గోదావరిలా ఆయనను ముంచెత్తినదే క్షణం.. వందేమాతరం గీతం ఆలపించడం మొదలుపెట్టి, ధిక్కారంతో పుట్టెడు కష్టాలు కొని తెచ్చుకున్నడు. ఇప్పు డు చిక్కుల్లో, చీకట్లో ఉన్న ది నేనొకన్నే కాదు, ముక్కో టి తెలంగాణ బిడ్డలని గ్రహించి ఈదేశ విముక్తి తోపాటు నా తెలంగాణకు విముక్తి కావాలని మువ్వన్నెల జెండాకు ఎర్రజెండా కు హత్తుకుపోయి నాలుగు తరాలు తెలంగాణ మాట గా, పాటగా, పోరాట బాట గా నడిచి తనువు సాలించిండు. కనుకనే ఆయన మరణాన్ని, మరణం మిగిల్చిన విషాదాన్ని దిగమిం గి, ఆగస్టు ఆరు జయంతిని వేడుకగా, కర్తవ్య నిర్వహణ పునరంకిత దినంగా జరుపుకుంటున్నాం.

ఆయన బతికుండగా కలలుగన్న తెలంగాణ రాలేదు. ఆయన బతికుండగా ఆయన జయంతిని గురించి ఏనాడూ పట్టించుకోలేదు. తెలంగాణ సీమాంధ్ర పాలననుంచి విముక్తి అయితే, జయంతులు వర్ధం తులు జరుపుకోవచ్చని, మృత్యుశయ్యపై సైతం వస్తదన్న తెలంగాణ, ఇస్తమన్న తెలంగాణ ఎందాక వచ్చిందని కలువరించి, పలువరించి తుది శ్వాస విడిచారు ఆయన. సకల జనుల సమ్మెతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న అనేక పరిణామాల నేపథ్యంలో ఇక తెలంగాణ తొందరలోనే సాకారమవుతుందని జయశంకర్ సార్ కొద్ది కాలం బతికి ఉంటే.. తుదిశ్వాస తెలంగాణ రాష్ట్రంలోనే వదలాలన్న ఆయన జీవితకాల కోరిక నెరవేరేదని చాలా మంది బాధ పడ్డరు.ఇప్పుడు ఆయన జయంతి రోజున ‘పాలకులారా! ఢిల్లీ ఏలికలారా! ఇస్తమన్న తెలంగాణ ఇస్తరా! సస్తరా!!’ అని తెలంగాణ బిడ్డలు ఢంకా భజాయించి అడిగే రోజు వచ్చింది.

జయశంకర్‌సార్ అనేకసార్లు తెలంగాణ కోసం ఢిల్లీలో కేసీఆర్‌తో కలిసి నాలుగు వందల మంది పార్లమెంటు సభ్యుల ఆమోదం తీసుకుని, తెలంగాణ కోసం వేసిన కమిటీకి అధ్యక్షుడైన ప్రణబ్ ముఖర్జీని కలిసి అనేక విషయాలు విశదీకరించాడు. ట్రబుల్ షూటర్ దాదా కాలం కలిసివచ్చి రాష్ట్రపతి అయి జయశంకర్ సార్ -జయంతి రోజున పదవిలో వెలిగిపోతుండవచ్చు. అవును.నేడు జయశంకర్‌సార్ జయం తి అంటే.. పూల దండలతో వందలమంది అనేక పార్టీలు ఆయన చిత్ర పటాన్ని, విగ్రహాన్ని ముంచెత్తవచ్చు. తెలంగాణకోసం శాంతియుతంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న తెలంగాణ బిడ్డలు నిగ్రహం కోల్పోతే, ధర్మాక్షిగహాన్ని ప్రదర్శించడానికి అవసరమైతే సాయుధ పోరాట రూపమైనా తీసుకుంటారన్న ఆయన ఉద్యమ తీవ్రత స్వరానికి ఎవరు ఎంతమంది సరితూగగలరు. బంగారానికి పుటం పెట్టే తన తాత తండ్రులనుంచి నేర్చుకున్న దాన్ని ఉద్యమంలో పోరాట పటిమతో నాయకుల్ని , ఉద్యమకారుల్ని ఏకంచేసిన ఆ బంగారు మనిషికి ఈ జయంతి రోజున బంగాంరం లాంటి పొగడ్తల తో తులాబారం కాదు, గంధకం, భాస్వరం నిండిన అంగారక స్వ భావం కావాలని ఎంతోమంది ఆశపడుతున్నరు.

ఆయన జీవిత కాలంలోనే ఇక్కడే, ఈ గడ్డమీదే యూనియన్ సైన్యాలు ఊచకోతలూ, శవాల కుప్పలైన వేలాది తెలంగాణ బిడ్డలు, పేద ముస్లింలు, గాయం మానక ముందే తెలంగాణ బిడ్డల అస్తిత్వవేదన ఢిల్లీకి అర్థం కాక ముందే అనేకానేక ప్రయోగాలు, తరగని పోరాటాల గని తెలంగాణలో గినీపిగ్గుల వలె బలికావడాలు, ఆర్తనాదాలు, ఆహాకారాలు, ఆయనను ఎక్కడ నిమ్మలంగ ఉండనిచ్చినయ్ గనుక. పెద్ద మనుషుల ఒప్పందాల మధ్య, శాంతి కాముకుల స్వాంతనల మధ్య సేదదీరని తెలంగాణ దూపగొన్న తెలంగాణ ఒయాసిస్సులను మోకాల్లు కొట్టుకుపోతున్నా ఎంత దూరం దొర్లుకుంటు, పరుగెత్తుకుపోయిందో.. ఆయన వొడవని ముచ్చటనే చెబుతుంది.

‘నాన్ ముల్కీ గో బ్యాక్’ అన్న నినాదం వరంగల్‌లో మంద్రంగా వినబడి, హైదరాబాద్‌లో యుద్ధ దృశ్యమై దుర్మార్గ ఆంధ్రా సర్కార్ ను ఎదిరించినప్పుడు ఎత్తిన పిడికిలి 369 బిడ్డల రక్తసిక్త శరీరాలను హత్తుకున్న గాయం ఆయన జీవితం చివరిదాకా తొలిచివేసింది. నెత్తురు గడ్డకట్టిన మృత్యుశోకం మధ్య ఎవరిని నమ్మాలి. ఎవరితో పోరు కొనసాగించాలి. ఎట్లా తరాలు తరాలకు తన నేలకు జరిగిన అన్యాయాల్ని వినిపించాలె. ఎంతకని మొత్తుకోవాలె. ‘కబ్‌తక్ పుకా రూం మై..? జిందగీ బర్ పుకారూం మై..’ అదే జయశంకర్ జీవితం.

ఆయన చూస్తుండగానే తెలంగణను కుదిపేసిన నక్సల్బరీ వసంతకాల మేఘగర్జన ,తెలంగాణ పదిజిల్లాలను చుట్టిన గోదావరిలోయ పోరాటాల అప్రతిహత పురోగమనం, ఆయన చూస్తుండగానే మీసం మొలిచిన పిల్లలు తెలంగాణ పల్లెల్లో నెత్తుటి ముద్దలైన పల్లెమోదుగుల కన్నీటికథ, తెలంగాణ పద మే నిషేధాక్షరి అయిన చరిత్రనిండా ఎంత ఒంటరితనం ఉన్నా.. ప్రజలను వదలని ప్రయా ణం, పదిమందికి తెలంగాణ ముచ్చట చెప్పటం కోసం వందల మైళ్ల ప్రయాణం. నీళ్లు-నిధులు నియామకాలు తెలంగాణ అస్తిత్వ మూలాలు విస్తృత పరచబడి ఆవిష్కృతమైన ప్రత్యేక తెలంగాణ తాత్విక పునాదులు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్క మని షి నిరంతరం తెలంగాణకూ పరితపించిన తీరులు..

కాలం ఎప్పుడూ ఒక్కలాగ ఉండదు. కాల గమనంలో ప్రవాహాన్ని, చైతన్యాన్ని నమ్ముకున్నందుకు భువనగిరిలో, సూ ర్యాపేటలో, వరంగల్‌లో నిజామాబాద్‌లో చెలరేగిన మలిదశ ఉద్య మం కరీంనగర్‌లో ఏప్రిల్ 27, 2001లో మహాసమువూదమై నింగిని తాకినప్పుడు జయశంకర్ నడతలో అదే అలజడి. అదే హోరు. 2009 కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో అదే హోరు. హోరుతగ్గని జలపాతం కనుకనే ఆయన వర్ధంతి, జయంతి తెలంగాణ చరివూతగమనంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అలవాటు ప్రకారమే ఢిల్లీ ఏలికలు తెలంగాణను మళ్లీ మోసం చేస్తారని అనిపిస్తున్నది. చరివూతలో ద్రోహకాలానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, ద్రోహకాల ప్రతిఘటనకు రెట్టింపు ప్రాముఖ్యత ఉన్నది. సకల జనుల సమ్మెతోనే జయశంకర్ సారుకు సమున్నతంగా జోహార్లు అర్పించింది తెలంగాణ. నీవు లేవు సారూ.. నీవు నిలబెట్టిన చైతన్యమున్నది. నీవు నడిచిన నడక ఉన్నది. తెలంగాణ రాస్తాలో పదిలపరిచిన పాదమువూదలున్నయి.

ద్రోహాన్ని జయించడానికి నిగ్రహం అవసరమన్న లౌక్యం ఉన్నది. ద్రోహాన్ని అధిగమించి గమ్యం చేరుకోవడానికి కట్టలు తెగిన ధర్మాక్షిగహం అవసరమన్న యుధ్ధబోధ ఉన్నది. అందుకే మీదారిని అందుకొని బరిగీసి ముందుకు సాగే ప్రతిజ్ఞను మీ జయంతి రోజున చేస్తున్నం. మీ జయంతి రోజున తెలంగాణ బాటలో అమరులైన సాంబశివుడు మరి ఎంతోమంది బిడ్డల జయంతులు మా కర్తవ్యాన్ని మరింత నిర్దేశిస్తాయని వినవూమంగా చెప్పుకుంటున్నం.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles