ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర


Sat,October 6, 2012 03:43 PM

Medical-C talangana patrika telangana culture telangana politics telangana cinemaలాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి అర్థం ఉండదు. వైద్యులుగా ప్రజలకు మరింత నమ్మకం కలిగించడం, తాము ఉన్నతీకరించబడడమే డాక్టర్స్ డే’ సార్థకత.

మానవ వికాసంలో, సంపూర్ణత్వంలో విడదీయరాని భాగం ఆరోగ్యం. రోగం ఎందుకు వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి మనిషి అన్వేషణ మొదలుపెట్టి, అనేక కష్ట,నష్టాలను అధిగమించి గొప్ప పురోగతి సాధించాడు. ఇట్లా ఆధునిక యుగంలో ఆరోగ్య పరిరక్షణకు, రోగ నిర్ధారణకు వ్యవస్థీకృత ప్రజారోగ్య వ్యవస్థకు పునాదులు వేసింది. ఆ వ్యవస్థే డాక్టర్లను, స్పెషలిస్టులను, నర్సులను, ఆరోగ్య సిబ్బందిని నిర్మించాడు. డిసీజ్ (రోగం) నుంచి ఈజ్ అయిన మనిషి డాక్టర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవడాని కి ఒకరోజు అవసరమైంది. డాక్టర్లకు తెల్లకోటు పవివూతతతో పాటు, ఆకర్షణతో, ఆదాయంతో పాటు సమాజంలో భాగమై, దాని కోసం నిర్వర్తించాల్సిన బాధ్యత గుర్తు చేయడానికి ఆ రోజు అవసరమే. అట్లా ప్రపంచవ్యాప్తంగా, ఆయా దేశాల్లో ఆరోగ్య పరిరక్షణ ప్రాముఖ్యత, చారివూతక ఆధారంగా ఏదో ఒకరోజు డాక్టర్స్ డే జరుగుతుంది. అమెరికాలో మార్చి 30న, మన దేశంలో జూలై 1న ‘డాక్టర్స్ డే’ జరుపుతారు.

1882 జూలై 1న పాట్నాలో పుట్టిన బిదాన్ చంద్రరాయ్ (బి.సి. రాయ్) కలకత్తా వైద్య కళాశాలలో చదివారు.అంతతర్జాతీయ వైద్యవిద్యను అభ్యసించారు. మన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన ఈ దేశ ప్రజలకు వైద్యసేవలందించారు. వైద్యవిద్య సంస్థల్లో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టారు. నిరంతరం ప్రజారోగ్యం కోసం కృషి చేశారు. బెంగాల్‌కు ముఖ్యమంత్రి అయిన గొప్ప వ్యక్తి. పదవిలో ఉండగానే 1962 జూలై 1న మరణించారు. ఆయన చివరిశ్వాస వరకు పేదలకు వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను 1961లో భారతరత్న పురస్కారంతో గౌరవించింది. ఆ ప్రజా వైద్యుడిని స్మరించుకునేందుకు జూలై 1ని ఏటా ‘డాక్టర్స్ డే’గా ఐ.ఎం.ఎ. జరుపుకుంటున్నది.
ఈ సంవత్సరం డాక్టర్స్ డేకు ప్రత్యేకత ఏమిటంటే జూలై 1కి వారం రోజుల ముందే, మొదటిసారి యావత్ దేశంలోని వైద్యులంతా జూన్ 25న ‘మెడికల్ బంద్’ను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకువచ్చిన ‘ఆరోగ్య, మానవ వనరుల జాతీయ కమిషన్’ (ఎన్‌సీహెచ్‌ఆర్‌హెచ్) ప్రజావ్యతిరేకమైనది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనది.

వైద్య విధాన వ్యవస్థలను కూలదోసే నియంతృత్వ బిల్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భావించి ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇప్పటి దాకా మన దేశంలో వైద్యవిద్య విధానాలు, వైద్య కళాశాలలు, డాక్టర్ల సామాజిక వృత్తి బాధ్యతలను నిర్దేశించడానికి ‘మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (ఐఎంసీ) ఉన్నది. దీంతో పాటు డెంటల్ కౌన్సిల్, నర్సింగ్ కౌన్సిల్, ఫార్మ సీ కౌన్సిల్ ఉన్నాయి. నూతన బిల్లుతో ఇప్పుడున్న డాక్టర్లు, నర్సులు, డెంటిస్టులు, ఫార్మసిస్టుల అధికారిక బోర్డులు రద్దు చేసి, ఏకీకృత అధీకృత అధికారాలతో కొత్తబోర్డును కేంద్రం నెలకొల్పుతుంది. దీనిద్వారా దేశ వ్యాప్తంగా ఒకేరకమైన విధానాలతో ప్రజారోగ్య వ్యవస్థను, ప్రైవేట్, కార్పొరేట్ వైద్య వ్యవస్థలను బాగా నిర్వర్తించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పుకొస్తున్నారు. ఇది నిజం కాదని, అన్ని వ్యవస్థలను మింగి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కోసమేనని రాజ్యసభలో ఈ బిల్లుపై ప్రతిపక్షాలు విమర్శించాయి. అయినా ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తున్నందుకే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది.

కార్పొరేట్ వైద్య సంస్థలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇష్టమొచ్చినట్టు అనుమతులు ఇవ్వడానికే ఈ బిల్లు కోసం కేంద్రం తొందరపడుతున్నదని దేశంలోని వైద్యవ్యవస్థ ఏకోన్ముఖంగా దీన్ని వ్యతిరేకించింది. ఒకవైపు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మందుల కంపెనీలు ఇష్టారాజ్యంగా లైసెన్సులు తెచ్చుకొని, అవసరమైతే లంచాలు ఇచ్చి, తప్పుడు నివేదికలు ఇచ్చి, వేరే ఏ దేశాల్లో అనుమతించని, ముందులను మార్కెట్లోకి వదులుతున్నారని ఆందోళన వ్యక్తమైంది. ఇంత పెద్దవిషయంపై వైద్య ఆర్యోగ్య వ్యవస్థలు తమకు సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. హేతుబద్ధమైన ఔషధ పంపిణీ వ్యవస్థ ప్రజారోగ్యానికి కీలకమైనదని డాక్టర్స్‌డే సందర్భంగా వైద్యులు గుర్తించాలి.

డాక్టర్ బి.సి.రాయ్‌ని, డాక్టర్ ద్వారకనాథ్ కోట్నీస్‌ను, డాక్టర్ సత్యపాల్ తులిని అందించిన భారత వైద్య వ్యవస్థ ప్రైవేట్ వైద్య కళాశాల అనుమతుల కోసం కోట్ల రూపాయల లంచం తీసుకున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా- కేతన్ పరేఖ్ లాంటి వాళ్లను ఎట్లా ఇముడ్చుకుంటుందో ఆలోచించాలి. అవినీతి క్యాన్సర్ ప్రజారోగ్య వ్యవస్థను అన్ని వైపులా చుట్టుముట్టి భ్రష్టు పట్టించి నిర్వీర్యం చేయాలని చూస్తున్నది. ఈ సమయంలో డాక్టర్స్ డే సందర్భంగా ‘సమాజంలో ఉదాత్త మానవులు’గా పూజింపబడుతున్న తాము ఎంత ఉదాత్తంగా, ఉన్నతంగా ఉండాలో బెంచ్ మార్క్ విధిస్తుంది డాక్టర్స్ డే. కార్పొరేట్ వైద్య వ్యవస్థ ఇప్పటికే వైద్యుడు-రోగి సంబంధాన్ని మానవ సంబంధంగా కాకుండా, ఫక్తు పైసల సంబంధంగా మార్చుతుంది. దీంతోపాటు ఆధునిక వైద్య గ్యాడ్జెట్స్‌తో సున్నితమైన వైద్యకళను మొరటుగా యాంత్రికంగా మార్చుతున్నది.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజారోగ్య వ్యవస్థలో భారత్ ఒకటి. 72 శాతం మంది ఇప్పటికీ ప్రైవేట్ వైద్యంపైనే ఆధారడుతున్నారు. దేశంలో నేటికీ దళిత, ఆదివాసీ గూడాలకు వైద్యం చేరలేదు. తెలంగాణలో ఆదిలాబాద్ మొదలు మన్యం అంతా మంచం పట్టి, మలేరియా, మెదడువాపు, విష జ్వరాలతో వణికిపోతున్నాయి. ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రభుత్వ చర్యలను నిరసించాలి. లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి అర్థం ఉండదు. వైద్యులుగా ప్రజలకు మరింత నమ్మకం కలిగించడం, తాము ఉన్నతీకరించబడడమే ‘డాక్టర్స్ డే’ సార్థకత.

-డాక్టర్ చెరుకు సుధాకర్
(నేడు ‘డాక్టర్స్ డే’)

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles