అత్యున్నత పదవికి అర్హుడు కాదు


Sat,October 6, 2012 03:44 PM

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న జనంమీద కోపం వస్తుంది. రూల్స్ అతిక్షికమించిన వాళ్ళ జేబులోంచి లాక్కునే ట్రాఫిక్ పోలీసుల లంచగొండితనం మీద ఇంకా కోపం వస్తుంది. మధ్యతరగతి బుద్ధిజీవి రోజువారి జీవితంలో సమాజంలో చూస్తున్న ప్రతి అస్తవ్యస్థ స్థితిమీద పింటో కు కోపం వస్తుంది. దేనికి జవాబుదారీ కాని పాలకులను చూసి ముఖం కందిపోయి గుస్సాతో పింటో ఏదో ఒకటి చేస్తే కాని ఈ పరిస్థితి మారనట్లున్నదని నిర్ణయానికి రావడమే ఆ సినిమా సారాంశం. పింటో కంటే ఎక్కువ గుస్సా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ మీద వచ్చింది. కాంగ్రెస్ ప్రభు త్వం సహకారంతో ‘ఎపూరకోట’ బద్దలు కొట్టి నా, కిషన్ జీ లాంటి వాళ్లను ఎన్‌కౌంటర్ చేసినా, రైలు పట్టాలన్నిటిని కలకత్తా, హుగ్లీ కే పట్టుకుపోయినా..

మాతో సంప్రదించకుండానే దేశ ప్రథమ పౌరుడి అభ్యర్థిత్వా న్ని ఎట్లా ఖరారు చేస్తారని గుస్సాతో పాటు, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడానికి సిద్ధమన్నారు ఆమె. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను మరోసారి అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందన్నారు. పోటీకి కలాం విముఖత చూపడంతో ఎన్సీపీ నాయకులు పీఏ సంగ్మా పోటీలో నిలబడ్డారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ సంగ్మాను తప్పుకోవాలని సూచిస్తే సంగ్మా ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌కు నైతికంగా నిలబడే హక్కు ఉంటే ఢిల్లీ వేదికగా బహిరంగ చర్చకు రావాలని సంగ్మా సవాల్ విసిరారు.

రాష్ట్రపతి ఓటు బ్యాంక్ సంఖ్యరీత్యా ప్రణబ్ ముఖర్జీదే పైచేయి అని, అందుకే వారికి చెయ్యెత్తి మద్దతు తెలపడం కాక ఏం చేయలేమని కొందరు అంటున్నారు. ప్రణబ్ కంటే అర్హుడు మరెవరూ లేరని, ట్రబుల్ షూటర్ అనీ నింఘటువులోని కొత్త కొత్త పదాల మూర్తిమత్వం ఆయనదేనని కితాబులిస్తున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్నికకు ముందే వైరుధ్యాలకు తావిచ్చింది. ఎన్డీఏలోని కొన్ని పార్టీలు ప్రణబ్‌కు మద్దతు ప్రకటించాయి. ప్రధానవూపతిపక్షం దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు అభ్యర్థిని ముందే చూసుకోలేదు. దీంతో పింటో కు గుస్సా వచ్చినట్టుగా ఈ దేశ ప్రథమ పౌరుడి కనీస అర్హతల్లో దేనికి ప్రణబ్ సరితూగడని, ఆయనను అనేక కమిటీలకు అధ్యక్షుడిని నియమిస్తే సత్వరం రిపోర్టు ఇచ్చి దేన్ని పరిష్కరించిన దాఖలాలు లేవు. అలాంటి ప్రణబ్ దేశాధ్యక్షు డు ఎట్లా అవుతాడని వారికి గుస్సా రాలేదు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అయిన శివసేనకు ప్రణబ్ విపరీతంగా నచ్చాడట! వారి పులి చర్మం మీద థాకరేతో పాటు దాదాను కూర్చోబెట్టుకున్నారు. జనతాదళ్..

అదే బాటలో ఎస్పీ, బీఎస్పీ, సీపీఎంలు దాదా జిందాబాద్ అన్నాయి. ఇంత మందిలో సీపీఐ నారాయణకు మన పింటో బాయ్‌లాగే కోపం వచ్చింది. ఏమి దాదా.. ఆయన పేద ప్రజలకు మర్యా ద ఇవ్వని దాదా. పెట్టుబడిదారులకు పెద్దపీట వేసిన దాదా. సకల అష్టావంకరల ఈ సచివుడికి ఈ దేశ అధ్యక్షుడు అయ్యే అర్హత లేదని గుస్సాతో అవసరమైతే అధ్యక్ష ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఎన్నాళ్లకు ఈ దేశం లో ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఆక్రోశంతో, నిరాశతో రాష్ట్రపతి ఎన్నికల బహిష్కరణ గురించిన ఆలోచన వచ్చింది. సీపీఎంలో తెలంగాణ కావాలని వారి సొంత క్యాడర్ అంటే.., ఆ పార్టీ అంతర్గత సమావేశాల్లో విజ్ఞప్తి చేస్తే తొక్కిపెట్టిం ది. అట్లనే ప్రణబ్‌కు సీపీఎం మద్దతు నిరసించిన సీనియర్ నాయకున్ని బెంగాల్ లో సస్పెండ్ చేసింది. ఇంత రచ్చ జరుగుతుంటే పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ యధాలాపంగా ‘తొందరేం లేదు! అధ్యక్ష ఎన్నికలు కానివ్వండి’ అంటున్నారు. అవగానే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలో, విభజించాలో తేలిపోతుందంటున్నారు. ముందు దాదాకు గంపగుత్తగా అన్ని పార్టీలు ఓటు వేయాలని అభ్యర్థించిన్రు. ఎన్ని ఉప ఎన్నికలు పోయినయ్. ఎన్నిక కీలక బిల్లులు పోయినయ్. ఎన్ని క్లిష్ట పరిస్థితులు కేంద్రంలో పరిష్కారమైనయ్. అయినా పాడిందే పాట. ఇదీ కాంగ్రెస్ రచ్చ బాట.

తెలంగాణలో పార్టీలకు అతీతంగా ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామాకు సిద్ధపడి, స్పీకర్‌కు రాజీనామా పత్రాలు ఇచ్చారు. ఏ పార్టీ వాళ్లయితేనేమీ ఇప్పుడు నైతికంగా అధ్యక్ష ఓటింగ్‌లో తమ విలువ సంఖ్యను కోల్పోయినట్లే లెక్క కదా! ఒక్కసారి కాదు పలుమార్లు స్పీకర్ సరైన ఫార్మాట్‌లో రాజీనామా ఇచ్చి, ఆమోదించక కొందరు, అవకాశవాదంతో కొందరు ఉప ఎన్నికలకు పోయి గెలిచి తిరిగి వచ్చి కొందరు ఇప్పుడు దాదాకు ఓట్లు ఎట్లా వేస్తారు.

నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను పార్లమెంట్ వేదికగా ఎలుగెత్తి చాటితే, మొఖం చాటేసుకొని తిరిగే ఢిల్లీ పెద్దలు ప్రణబ్ దాదాను వెంటవేసుకొని జూలై 6న హైదరాబాద్‌కు ఎట్లా వస్తారు? తెలంగాణ కోసం ఒక కమిటీ వేసి, దానికి ఆయనను ఛైర్మన్ చేస్తే ఏదీ తేల్చకుండా, రిపోర్టు ఇవ్వకుండా వెయ్యిమంది బిడ్డ ల ఆత్మహత్యలకు కారణమైన ఆయన ఈ దేశ అధ్యక్షునిగా ఎట్లా పోటీ చేస్తారు? హైదరాబాద్ వీధుల వెంట తిరుగుతుంటే శ్రీకాంతాచారీ, వేణుగోపాల్‌డ్డి, సిరిపురం యాదయ్య మంటల జెండాలై ఎట్ల వచ్చిండ్రు మీరు హస్తిననుంచి! ఏ మొఖంతో వీళ్లను ఓట్లు అడుగుతరు. వాళ్లెట్లా వేస్తరని ప్రశ్నించరు. చిట్టి చిట్టి చెల్లెలు, గోరింటాకు పండిన చెల్లెలు -పావని, సరిత, సుధ వొయ్యిలదాచిన నెమ లి ఫించమ్ దీసినట్లు ‘జై తెలంగాణ నినాదం తీసి’ దాదా, తెలంగాణ గద్దారీ! గో బ్యాక్ అంటూ బిలబిలమని రోడ్ల మీదికి వచ్చి ప్రశ్నించరు. ఇవన్నీ ఇంగితమున్న వారికి వర్తించు సంగతులు.

ప్రతిభ గీటురాయి అని, అనుభవం అని, పార్టీ నిర్మాణం అని, రాజకీయ వ్యూహంలో భాగం అని దేశాధ్యక్ష ఎన్నిక ల్లో గెలిచిన వాళ్లను రబ్బర్‌స్టాంపుగా మార్చేసిన వాళ్లు ఇన్ని మాట్లాడితే, ఎవడికైనా ఎంత గుస్స రావాలె. అధ్యక్షుని ప్రసంగానికి విలువ ఉంటే 2005లో అప్పటి రాష్ట్రపతి కలాం తన ప్రసంగంలో చేసిన తెలంగాణ ప్రస్తావనకు విలువ ఉండాలి. డిసెంబర్ 9న చిదంబరం ప్రకటనుకు విలువ ఉండాలి. 2009 డిసెంబర్7 అఖిలపక్ష సమావేశానికి విలువ ఉండాలి. దేనికీ విలువ ఇవ్వనివాళ్లు ఇప్పుడు విలువల గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ ఓటు విలువ గురించి మాట్లాడుతారు. టీడీపీ వాళ్లు మేము మరోసారి మా అధ్యక్షుడు చంద్రబాబును ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇప్పిస్తామంటారు. ఇప్పుడు మీకు ఆ కష్టంలేదు. మిమ్మల్ని ముప్పుతిప్ప లు పెట్టిన ప్రణబ్‌కు ఓటు వేయకుండా మీ నిజాయితీని చాటండి.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రణబ్ దాదాకు ఓటు వేస్తే ఆయన రాగానే తెలంగాణకే మొదటి సంతకమని ఊదరకొడతారు. బరి తెగించిన వాళ్లు ఏమైనా చెబుతారు. దీదీ నుంచి సీపీఐ నారాయణ నుంచి చాలా నేర్చుకోవాలి. వీలైతే ఆదివాసీ, ఈశాన్య భారతం నుంచి వచ్చిన సంగ్మాకు అనుకూలంగా ఓటైనా వేయా లి. పింటోకు గుస్సా వచ్చిన తీరుగా మనం కూడా గుస్సా చూపెట్టడానికి ఈ అధ్యక్ష ఎన్నికను బహిష్కరించాలి. కొత్త అధ్యాయాన్ని తెరవాలి. ఎక్కడో ఉత్తర భారతంలో తనను బతికుండగానే చనిపోయినట్టు రిపోర్టు చేసిన అధికారుల తీరుకు నిరసనగా అతను దేశాధ్యక్షుడి పోటీకి నామినేషన్ వేశాడు. ఆ చైతన్యం కంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల చైతన్యం తక్కువ కాకూడదు.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు


35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles