ప్రజల రేపటి కల పరకాల


Sat,October 6, 2012 03:44 PM

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈసారి కూడా మిశ్రమ ఫలితమై నా, విజయాన్ని అందుకున్నది. తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పిన సమైక్య వాద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖను ఓడించింది. తెలంగాణ వాదాన్ని వినిపించడం కోసం, రాష్ట్ర ఏర్పాటుపై ఆయా పార్టీల ద్వంద్వ నీతి, నాన్చివేత ధోరణికి వ్యతిరేకంగా పోటీచేసి, వరుస గెలుపులను అందుకున్నది టీఆర్‌ఎస్. ఈసారి తన సొంత బలంతో, తెలం గాణ వాదుల మద్దతుతో నెగ్గిం ది. ‘జగన్ జైలుకు పోయా డు, రాజశేఖర్‌డ్డి స్వర్గాని కి పోయా డు. ఇగో మీ ఆడబిడ్డను, అమ్మను విజయమ్మను వచ్చా’ నని కన్నీటితో, సానుభూతి తోచెక్‌పెట్టిన రీతి నికూడా అధిగ మించి విజయం సాధించింది. పరకాల 18అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నిక ల్లో ఒక్కస్థానమైనా జాతీయ స్థాయిలో చర్చను,ఆసక్తిని కలిగించింది.

ఈ ఎన్నికల ఫలితం రెండు జాతీయ పార్టీలకు డిపాజిట్ రాకుండా చేసింది. రెండు ప్రాంతీయ పార్టీలైన వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని తేల్చేశాయి. అదే సమయంలో ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు బలమైన నిర్మాణంతో చెక్‌పెట్టకపోతే, ఎమరుపాటుతో ఉంటే దొంగదెబ్బతీసే అవకాశం ఉందని ఆ పార్టీలు అనుసరించిన రకరకాల పద్ధతులతో తేలిపోయింది. ఎంత కష్టకాలంలో నైనా ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ను రక్తమాంసాలిచ్చి గెలిపించుకుంటామని పరకాల ప్రజలు అన్నారు. కనుకనే ‘పరకాల రూపుకట్టిన రేపటి కల’ అనవలసి వచ్చింది.

పరకాలలో టీఆర్‌ఎస్ గెలుపు మెజారిటీ రీత్యా గొప్పది కాకపోవచ్చు. గుణపాఠం రీత్యా సీమాంధ్ర పార్టీల విస్తరణను నిలువరించిన తీరు చాలా ముఖ్యమైనది. నేను పరకాల వెళ్లినప్పుడు డాక్టర్లు, విద్యావంతులు అన్న మాట ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నది. పరకాలలో జగన్ ఒక్క సీటు గెలిస్తే వంద సీట్లకు దస్తీ వేసి కూచుంటడు. తెలంగాణ సమాజం ఇష్టపడని, నష్టపరిచే సామాజిక పునరేకీకరణ జరిగి అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది. అందుకే పరకాలలో మానుకోటలో ప్రజలపై, ఇక్కడి నేలతల్లి బిడ్డలపై జరిగిన తుపాకి కాల్పులు, హింసకు ఓట్ల రూపంలో పరకాల జవాబు ఇచ్చింది. కొత్త సమీకరణ తలగొప్పులు లేకుండా ఝండూబామ్ కంటే అద్భుతంగా పనిచేసింది ఈ ఫలితం. జగన్ పార్టీకి శాశ్వత చిరునామా సీమాంవూధనే కాని, తెలంగాణ కాదని చాటే అవకాశాన్ని ఇచ్చింది. పరకాల బిడ్డలు అంతపెద్ద అపవాదుకు తావివ్వలేదు.‘జగన్‌ను గెలిపించి, తెలంగాణ ముఖద్వారం బిడ్డల అమరదామం’ అని రుజువు చేశారు. సీమాం ధ్రులను అందలమెక్కించి మొయ్య డానికి పరకాల ప్రజలు సిద్ధంగా లేమన్నరు. అది నిజమైంది.

‘పాలమూరు గెలుపు వయా పరకాల టూ పార్లమెంటు’ అని ఊదరగొట్టిన బీజేపీ, నేలబారు ఫలితంతో డిపాజిట్‌కు కూడా దరిదాపులోకి రాకుండా ఒక మంచి పని జరిగింది. ప్రకాశ్ జవదేకర్, సుష్మాస్వరాజ్‌లు వరంగల్‌కు, పరకాలకు వచ్చి క్షేత్రస్థాయిలో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. అయినా..ఉద్యమాలు నిజాయితీగా చేయనిపార్టీకి ఏ ఫలితాలు వస్తాయో, అతిగా మాట్లాడి మిత్రపక్షాన్ని ఇబ్బందుల్లో పెడితే ఏమవుతుందో అదే పరకాలలో బీజేపీకి జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ అందరూ టీఆర్‌ఎస్ మీద ఎదురుదాడి చేసినవారే. ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదులు ఇచ్చిన వారే. ఇదే పరకాల మరో ప్రత్యేకత. పదిహేను వందల అరవై ఓట్ల మెజారిటీతో గెలిచినా, ఇదే గెలు పు మునుముందు నల్లేరు నడకకు దగ్గరవుతామని కూడా చెప్పలేము. విజయమ్మ లాంటి కన్నీటి వరద, బీజేపీ లాంటి మతతత్వ వరద, డబ్బులు పంచిపెట్టి విజయాన్ని కైవసం చేసుకునే దీర్ఘకాలిక అలవాటు ఉన్న కాంగ్రెస్ సరదా, రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబే ఒడ్డుకు చేరుస్తాడని తెలుగు తమ్ముళ్ల కళ్లముందు నిలబెట్టే మాయదారి పరద ఉండనే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా గ్రామస్థాయి నుంచి పటిష్టమైన నిర్మాణం, బలపడని ఉద్యమ నిర్మాణ వికేంవూదీకరణ, ఇతర పరిమితులను దాటని టీఆర్‌ఎస్‌కు సవాలుగానే మారుతాయి.

ఇరవైకి దగ్గరవుతున్న టీఆర్‌ఎస్ శాసనసభ్యులకు, ఇద్దరు పార్లమెంటు సభ్యు లు, ఒక ఎమ్మెల్సీకి చేతినిండా పని ఉన్నది. మా నాయకుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో మైండ్‌సెట్ మార్చుకుని మూడు నెల ల్లో తెలంగాణ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నుంచి ఎంత ఆశించినా, సోనియాగాంధీ మైండ్ బ్లాక్ అయ్యిం దో, బ్లాంక్ అయ్యిందో కొద్దిరోజుల్లో తేలనున్నది. నిజంగానే దిమ్మతిరిగే ఈ ఫలితాలకు కాంగ్రెస్ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. ‘ఒక వస్తువు నీటిలో మునిగిపోయినప్పుడు కోల్పోయిన భారం-అది తొలగించిన నీటిభారం తో సమానం’. నిజంగానే రెండు గెలిచి, రెండు ఓడి, నిండా మునిగి కాంగ్రెస్ సీమాంవూధలో ఏమి చేసినా, తెలంగాణలో ఏమీ చేయకపోతే భూస్థాపితం కావడం ఖాయమని తేల్చిచెప్పడం పరకాల ఫలితంతో మరింత ఊపందుకున్నది. కాబట్టే శంకర్‌రావు లాంటి వాళ్ల గొంతు మరింత పెరిగింది. టీడీపీలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ గొంతు పెరిగింది. ఇవన్నీ చూసి కాంగ్రెస్, టీడీపీల విధానాల మీద కసి పెంచుకున్న తెలంగాణవాదుల ఆగ్రహానికి పరకాల రేపటి కలను, ఒక వేదికను రూపు కట్టింది. అందుకే పరకాల నీకు పరిపరివిధాల దండం.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles