చేపమందు చేదైన వలస పాలన


Sat,October 6, 2012 03:44 PM

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్రమానుగత, తప్పుడు ప్రచారం విధానాలతో ‘చేదు మందు’ గా మారిపోయింది. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది తమ స్వీయానుభవాలలో ఉపశమనాన్ని పొందినామన్న మాటకు విలువ లేకుండాపోయింది. కోర్టుల్లో సవాళ్ళతో చిక్కిపోయి అవమానపడిన చేపమందు ఏ ఔషధ విలువలు లేవని ‘చేప ప్రసాదం’ గా రూపాంతరం చెందింది. జమానా బదల్‌గయా చేపమందంటే ఎవరు నమ్ముతారని చేపమందు చిక్కిపోలేదు. ఏ జమానాలోనయినా హైదరాబాద్ నమూనాగా ఒక సాధారణ గౌడ కుటుంబం చార్‌సౌ సాల్ చార్మినార్ లెక్క కొనసాగించిన ‘ఉచిత ఉబ్బస ఉపశమన చేపమందు’ కొందరికి ఎప్పటికీ మింగుడు పడని మందు అయ్యింది. ఈ సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో తాము చేయదలచుకున్న ఉచిత సేవా పంపిణీకి, ఏండ్ల నుంచి కేటాయించిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాదని ఏదైనా స్థలం కేటాయించండని ప్రభుత్వ కార్యాలయాల ఎక్కే గడప దిగే గడపతో బత్తిన వాళ్ళకే ‘ఉబ్బసం’ ఉబికి వచ్చేంత పని అయ్యింది. ప్రభుత్వం, అధికారులు కూడబలుక్కున్న వైఫల్యం చివరి నిముషంలో కేటాయించిన కాటేదాన్ స్పోర్ట్స్ మైదానంలో ఒకరిని కాటికి పంపించి ఇవ్వాల ప్రజల దృష్టిలో దోషిగా బోనులో నిలబడింది.సుప్రసిద్ధ భారత సంతతి అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఆస్తమాను నివారించడానికి రసాయన స్టెరాయిడ్స్‌తోపాటు, అదే ఔషధ లక్షణాలను కలిగిన ‘ఫైటోస్టిరాయిడ్స్’ చెట్ల నుంచి కూడా గ్రహించవచ్చని గతంలో శాస్త్రీయంగా ప్రకటించారు. జన విజ్ఞాన వేదిక, ఒక సెక్షన్ మీడియా బత్తిన సోదరులు ప్రజల్ని మోసం చేస్తున్నారని, అసలు చేపతో మింగడమే సగం జబ్బులకు కారణమని కొత్త వాదన తీసుకొచ్చిండ్రు. కోర్టు చేపమందును రసాయనిక విశ్లేషణ నిమిత్తం పంపించింది. అందులో ఏవిధమైన ఔషధ గుణాలు ఉన్నట్టు కనబడకపోయినా నష్టదాయకం కాని పదార్థం’గా నిర్ధారించారు. అది మొదలు ఇవే సంస్థలు, అదే మీడియా ‘అంత మాత్రానికి ప్రభుత్వం ఎందుకింత ప్రాధాన్యం సౌకర్యాలు కలిగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన ఫలితమే ఈ అంటిముట్టనట్టు వ్యవహరించడానికి కారణం. మనలో చాలా మంది ‘శాస్త్రీయం’ కాకపోయినా అనే దిశలో చర్చ కొనసాగిస్తున్నారు. అనేక ఔషధ సంస్థలే ‘శాస్త్రీయం’ కాని పరిశోధనకు, విశ్లేషణకు నిలబడని అధునాతన మందుల్ని కుప్పలు తెప్పలుగా మార్కెట్‌లోకి తీసుకురావడం, కోట్లు దండుకోవడం, న్యాయపరమైన చిక్కులు వస్తే మూసివేయడం కొత్త విషయమేమీ కాదు. ఔషధభాషలో మాట్లాడాలంటే చాలా మందులు ‘ప్లాసెబో’ (ఔషధ విలువలు లేని చక్కెర గుళికలు)లు మాత్రమే. ఇంకా చాలా మందులు ‘డబుల్ బ్లైండ్ పద్ధతిలో నిర్ధారించినవి మాత్రమే.

అంతర్జాతీయ, జాతీయ ఔషధ చట్టాల్లో నకిలీ మందులకు, నాసిరకం మందులకు, ప్రమాదకరపు రసాయన మందులకు అడ్డుకట్ట వేయడానికి అనేక సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు చేపమందు ఇందులో ఏ సెక్షన్‌కు సరితూగే అంశం కాదు. అది అనుభవం మీద, అంకితభావంతో, ఉచితంగా మాత్రమే కొనసాగించాలన్న సాధువు ఉపదేశానుసారం అనువంశికంగా, నిరాటంకంగా, ఆదేశికంగా కొనసాగుతున్న ఆచారం. లాభాపేక్షతో మహా రుషుల సంస్థానాల పేర, రకరకాల పేర్లతో ముట్టుకుంటే చేతికి వెంట్రుకలు మొలుస్తాయని ఒకడు, మహా మొండి నొప్పినయినా నిముషాల్లో మాయం చేసి ‘సందిసుధల’ ని ఒకడు, స్లిమ్ టీ’ అని ఒకడు, వండర్ మాత్రలని ఒక్కడు వేలకోట్ల వ్యాపారం చేస్తుంటే ఒక్కనాడు నోరువిప్పని ఈ అజ్ఞాత జ్ఞాన సంస్థలు ఒక్కసారి మేల్కొని ఒక సాధారణ అంకితభావం కలిగిన కుటుంబం అందించిన ఉచిత చేపమందు మీద వివిధ భాషల్లో విస్తృత ప్రచారం చేయడం వెనుక తెలియని అజ్ఞానంతో పాటు తొందరపాటు కూడా ఉందని అనుకుంటే సరిపోదు. సరిపోయేంత ‘ఆధిపత్య భావజాలంతోపాటు, ఎవడేమనుకుంటే నాకేంటి అన్న తెంపరితనం కూడా ఉన్నది.అందుకే వాళ్ళు చేపమందు మీద దాడి చేశారు. పంపిణీ స్థలం మార్చే దాకా వదిలిపెట్టలేదు. ఔషధ మొక్కలకు కేటాయించిన ఎక్కడో నగర పొలిమేరల్లోని భూమిని వెనక్కు లాక్కునేంతవరకు ఊరుకోలేదు. ఒక్క ఉసురు రాలి లక్షలాదిమంది ప్రజలు సౌకర్యాలు లేక అల్లాడే వరకు ఊరుకోలేదు.సందర్భం కాబట్టి చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ లాంటి ఆధునిక వైద్యవ్యవస్థ పరిఢవిల్లే దేశంలో ఆస్తమాను, అలెర్జినీ తగ్గించే సోడియం క్రోమోగ్లైకేట్ (మ్కాట్ బ్రాండ్ ఫింటాల్) వాడకం అసాధారణంగా పెరగడానికి ఆ కంపెనీ ఇచ్చి న బహుమతులకు, కార్లకు ఆశపడిన వైద్యుల విపరీత ధోరణియే కారణమని ఆయా వైద్యులకు శ్రీ ముఖం పంపింది. ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఘనత వహించిన ఈ విజ్ఞాన వేదికలే ఆయా డాక్టర్లతో ఈ చేప ప్రసాదంలో స్వైన్ ఫ్లూ, ఎయిడ్స్ వస్తాయని ఊదరగొట్టాయి. నిజానికి అధునాతన ఎయిర్‌జోన్ ఇన్‌హేలర్లు వచ్చినాక ఉబ్బస నియంవూతణ బాగా మెరుగైంది. పెరుగుతున్న నూతన వైద్య విధానంతో ఉబ్బసం నియంవూతణ ఎంత మెరుగైతే అంతకంటే ఎక్కువ వాతావరణ కాలుష్యం దెబ్బ తీస్తున్నది.

దిక్కుతోచని జనం, ముఖ్యంగా పేదలు భక్తితో, నమ్మకంతో సేవిస్తే ఏదైనా గుణాత్మకంగా పనిచేస్తుందని నమ్మేవాళ్ళు లక్షల్లో చేప ప్రసాదం కోసం క్యూ కట్టిండ్రు. నమ్మకాన్ని అమ్మకానికి పెట్టి పైసలు చేసుకునే ప్రభుత్వం, పైసలు సమకూర్చే ప్రభుత్వం నయాపైసా ఖర్చు అడగకుండా ఒక దీర్ఘకాలిక వ్యాధికి ఉడుతాభక్తిగా ఏదో మందు పంపిణీ చేస్తామంటే ‘హుడుత్ హుడుత్ నాకేమిటి సంబంధమని దూరం దూరం జరిగి ఒకరిని మృత్యువుకు దగ్గర చేసింది. ఇదే ఇప్పుడు శరాఘూతంలా బాధిస్తున్నది అందరు బుద్ధిజీవుల్ని ఇంత జరిగినా, ఈ ‘మృగశిర’ కార్తెకు మృగం ఆవహించినట్టు ఏదో తప్పు జరిగిపోయింది. వచ్చే సంవత్సరానికి అన్ని ఏర్పాట్లు నగరం నడ్డిబొడ్డుననే ప్రభుత్వం ఆజమాయిషీతో చేస్తామని మాత్రం అనడం లేదు.
హైదరాబాద్ వారసత్వ చేపమందును ‘చేదు మందు’ చేసిన విజ్ఞాన వేదికలు మర్యాదకయినా తాము చూపిన అత్యుత్సాహం ఇక్క డి తెలంగాణబిడ్డల మనసులను గాయపరచిందని విచారం వ్యక్తం చేయడం లేదు. మీడియా గోరఖ్ పటేల్ మృతి ఘో రానికి పరోక్షంగా తమ ఓవర్‌యాక్షన్ కూడా కారణమేనని బాధపడ్డ దాఖలా లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీబీఐ, ఉపఎన్నికల ఉబ్బసంతో ఊపరాడక ఉన్నందున ఇప్పుడు ‘కాటేదాన్ విషాదం’ కొద్దిమందిదే.
విజ్ఞాన వేదికలను ఇప్పుడు సూటిగా అడుగుతా. ఈ చేపమందు ఇచ్చేది చంద్రబాబు నాయుడు, జగన్ చుట్టమో అయితే, ఉండేది గుంటూరో, కడపో అయితే ఇట్లనే వెంటపడుతారా? నగరం నడ్డిబొడ్డున అప్పనంగా వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న సీమాంధ్ర పెద్దమనుషుల మధ్య రెండు రోజులు ‘మా తెలంగాణ నుమాయిష్ మైదాన్’ ఇయ్యంవూడని బతిమిలాడిన బత్తిన హరినాథ్‌గౌడ్ చిన్న మనిషి. గోరఖ్‌ప చావు చిన్న చావు. చచ్చింది చిన్న చేపపిల్ల- అవును మరి. సొర చేపలు జొరబడ్డ హైదరాబాద్ సమువూదంలో పరకపిల్ల లెట్ల బతుకుతయ్. గల్లీ చిన్నది- గరీబోల్ల కథ పెద్దదేకాదు గరీబోల్ల దూద్‌బౌలీ గల్లీదాటిన బత్తిన సోదరుల చిన్న చేపపిల్ల ఉబ్బసం మందు’ కథ కూడా పెద్దదే - వివక్ష కంటే ఎక్కువ విషాదాన్ని మిగిల్చింది ఇప్పుడు చేపమందు.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు


35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles