పోరు కల- పరకాల


Sat,October 6, 2012 03:45 PM

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకున్నారని ఆడిపోసుకున్నా రు. ఈ పుష్కర కాలంలో ఎవన్ని అన్నా టీఆర్‌ఎస్ ముందుకు పోతూనే ఉన్నది. రాష్ట్రసాధనకై సాగిపోతూ ఉద్యమిస్తూనే ఉన్నది.ఆడుకున్నామన్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అద్భుతాలు సృష్టించింది. ఈ ఉద్యమ క్రమంలో అనేక కష్టాలు పడ్డది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల గురించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్, టీడీపీ పార్టీల సంగతి అటుంచితే.., జేఏసీలో భాగస్వామిగా ఉండి పాలమూరులో పోటీ చేసిన బీజేపీ నీతి గురించి మాట్లాడుకోవాలి. ఓట్ల కోసం అన్ని విలువలను వదిలి, కులం,మతం కార్డులను ప్రయోగించి, విష ప్రచారానికి దిగింది. సవాలక్ష అడ్డదారులు తొక్కి పాలమూరులో గెలవగానే.., బీజేపీ నేత కిషన్‌రెడ్డి ‘టీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింద’ని చెప్పుకుంటున్నాడు. ఆ పార్టీ జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ అయి తే ఎటు నుంచి చూసినా రెండంటే రెండు సీట్లున్న టీఆర్‌ఎస్ తెలంగాణ ఎట్లా తెస్తుందని అంటున్నారు. ఈ మాటలు ఎలా ఉ న్నా సారాంశంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల రీతిలోనే బీజేపీ కూడా ఉన్నదని మరో సారి తమకు తామే ప్రకటించుకున్నారు. తెలంగాణ సాధన పట్ల బీజేపీకి ఎంత చిత్త శుద్ధి ఉన్నదో చాటుకున్నారు.

పరకాల ఉప ఎన్నిక తెలంగాణ కోసం రాలేదు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న 17 అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా ప్రజల ప్రయోజనార్థం రాలేదు. కాంగ్రెస్ అధికార కుమ్ములాటలు, జగన్ రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ మీద కుట్రపూరితంగా కక్షసాధింపు చర్యలు చేపట్టిన క్రమంలో నామీద కుట్ర కేసులు పెట్టి వరంగల్ జైళ్లో పెట్టినప్పుడు ఈ ఉప ఎన్నికలకు నాంది పడింది. అయితే.. పరాకాలతోనే తెలంగాణ ఉద్య మం అయిపోదు. ఆగిపోదు. పరకాల ఉప ఎన్నిక తెలంగాణ ఉద్యమంలో గీటురాయికాదు, మైలురాయీకాదు. కానీ పరకాల ఎన్నికల సందర్భం గా.., మానుకోటలో సమైక్యవాదుల అండతో.. తెలంగాణ బిడ్డలపై తుపాకీ పట్టి కాల్పులు జరిపిన గాయం ఇంకా మానలేదు. అప్పుడు చేసిన ద్రోహం ఇంకా సలుపుతున్నది. తెలంగాణ వ్యతిరేకులపై ముప్పిరిగొన్న ముప్పేట దాడిగా మారిన తెలంగాణ చైతన్యం కళ్లముందు తొణికిసలాడతున్నది.

అలాగే మానుకోట కొనసాగింపుగా.. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె తెలంగాణ పోరాట చైతన్యాన్ని చాటాయి. తెలంగాణ పోరాటానికి గడువులు, తారీకులు లాంటివేమీలేవు. 2014 లో ఎన్నికలకు పోయి తెలంగాణ తెచ్చుకుంటామని టీఆర్‌ఎస్ ఎన్నడూ చెప్పలేదు. 2009లో చేసిన తెలంగాణ ఇస్తామన్న ప్రకటనను అమలు చేయమని అడుగుతున్నాము. ఇందుకు కలిసిరాని పార్టీలను, శక్తులను ఏకాకుల్ని చేస్తున్నాము.

నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి పరకాల దాకా విస్తరించిన వర్తమాన తెలంగాణ పోరాటాలకు అంటు, ముట్టు కాని, ఆరి, కీర్తీ కాని, ఆత్మపాణం కాని పార్టీలకు తెలంగాణలో చోటులేదని చెప్పదలుచుకున్నాం. ఇలాంటివారే తెలంగాణ పోరాటంపై కొత్త కొత్త వాదనలకు దిగుతారు. ముఖ్యంగా బీజేపీ ఇంత కాలం దాచిన విషతత్వం, మత తత్వం, కుల తత్వం ఒక్కసారిగా విరజిమ్ముతున్నది. ఎవరేమి చెప్పినా.. బీజేపీ లాంటి పార్టీలకు పరకాల ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెబుతారు.
పరకాల నుంచే బీజేపీ (ఆ రోజుల్లో జనసంఘ్)పేరు మీద వెనుకట గెలిచిన జంగాడ్డి ఇప్పుడు వాళ్లకు అవుట్ డేటెడ్ అయినాడు. ఫ్రెష్‌గా ఎట్రాక్టివ్‌గా ఉండాలని కాకతీయలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ విజయ్‌చందర్‌డ్డిని అభ్యర్థిగా పెట్టింది బీజేపీ. టీఆర్‌ఎస్ బీసీని పెడితే అగ్రవార్ణాన్ని, లేదంటే వైఎస్ అన్నారు. టీఆర్‌ఎస్ టికెట్ అప్పటికే జెడ్‌పీటీసీగా పనిచేసిన ములుగూరి భిక్షపతికి ఇవ్వడంతో కంగుతిన్న బీజేపీ పాలమూరు రీతిలోనే ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు,మైనారీటీలు ఉండే పరకాలలో ఏదో కొత్త ప్రయోగం చేయబోయింది.ఒక ఎమ్మెల్యే సీటుకోసం పాలమూరులో ఇండియా, పాకిస్థాన్‌లను సృష్టించి, టీఆర్‌ఎస్‌ను రజాకార్లతో పోల్చి, ఎంత యాగి చెయ్యాలో అంతచేసి గెలిచారు. ఇంకొక్క సీటు కోసం పరకాలలో ఏ పాచికలు వాడతారో అందరికీ అర్థమవుతున్నదే.

పాలమూర్ టూ పార్లమెంట్- వయా పరకాల కాబట్టీ పరకాలలో గెలిపించమంటున్నారు కాషాయబాసులు. స్పెషలిస్ట్ డాక్టర్‌ను పరకాలలో నిలబెట్టిండ్రు కనుక తెలంగాణ కోసం బీజేపీది ఎంబీబీఎస్ వైద్యం. టీఆర్‌ఎస్‌ది కాంపౌండర్ వైద్యంఅని సెలవిచ్చిండ్రు. నిజమే.. మాకు డూప్లికేట్ కాగితం మీది డిగ్రీ అక్కరలేదు. అనుభవమే గీటురాయిగా ఉండి, ఎదిగే క్వాలిఫైడ్ డాక్టర్ కావాలె. ఆదుకునే దేవుడు ఆర్‌ఎంపీనే కావాలి. పరకాలలో మరొక్క సీటుతో వందసీట్లకు కాషాయ ఎసరు పెడదామన్న వేషాలకు సన్నివేశాలకు పరకాల చరమాంకం పాడబోతున్నది.గతంలో ఏ ఉప ఎన్నికల్లో అయినా తెలంగాణ కోసం రాజీనామా చేసిన వాళ్లను గెలిపించాలని కోరాము. దీనికోసం డాక్టర్లతో సమావేశమై ఒప్పించి తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచేట్లు చేసిన చరిత్ర ఉన్నది. ఆస్ఫూర్తితోనే నేడు కూడా వరంగల్‌కు చెందిన డాక్టర్లు ఒక్కరు కూడా పరకాలలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ అయినందున అతనికి మద్దతు ప్రకటించడం లేదు. అతని ర్యాలీలో పాల్గొనలేదు.

ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ , టీడీపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థులను కులాల వారిగా, గణాల వారిగా కాకుండా తెలంగాణ ఉద్యమ పునర్ మూల్యాంకనంతోనే గణించడం ఒక గొప్ప పరిణామం. మహిమ కలిగిన మానుకోట రాళ్లను ఉద్యమకారులు ఒకవైపు పూజిస్తుంటే.., తుపాకీ గుళ్ల వర్షం కురిపించిన కొండ మురళికి, కొండసురేఖకు ఎట్ల ఓట్లేస్తమంటుండ్రు. ఇడుపులపాయ చిక్కుముడిని సిగల ధరించడానికి సురేఖకున్నంత పెద్దమనుసు మాకు లేదంటున్నరు! ఇప్పటికే సమైక్యాంధ్ర ప్రాంతీయ పార్టీ చంద్రబాబును మోసిమోసి, ఈ కొత్త గుదిబండను ఏడ మోద్దుము ఎవడినీ మోసేది లేదు. తెలంగాణ ముచ్చట కంటే ఇదే చాలా ముఖ్యం. పరకాలలో తప్పుచేస్తే పురిట్లనే తెలంగాణ పార్టీని సంపుకున్నట్లు. పరకాల రాజకీయ పరిణితి నుంచి చాలా నేర్చుకోవాలి. తెలంగాణ అస్తిత్వ పార్టీగా మనల్ని మనమే బలోపేతం చేసుకోవాలి. చంద్రగిరి కొండల్లో రాలిన బిడ్డలు, మొగిలిచెర్లలో తెగ నరకబడిన రేపటి స్వప్నాల సాక్షిగా ప్రతిన బూనాలి. పరకాల ఫలితంతో విజయాన్ని సొంతం చేసుకోవడమే కాక, అది చేకూర్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఆ పనిలో పరకాల పొద్దు మద్దతు తీసుకుందాం.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles