అస్తిత్వాల సింగిడి వీరన్న


Sat,October 6, 2012 03:45 PM

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-వర్గ’జమిలిపోరాటాల్లో ఏడు రం గుల సింగిడి అస్తిత్వాలను నింపాడు వీరన్న. కొత్త జవసత్వాలు కూర్చి ‘మే సెవంటీన్త్-కామ్రేడ్స్’ గా నిలబెట్టి 1998 డిసెంబర్ 25న సీపీయూఎస్‌ఐ (డిబీఎస్‌వీ) గా ప్రకటించి చరిత్ర సృష్టించాడు వీరన్న. ఒక సాదాసీదా పీడీఎస్‌యూ విద్యార్థి, గాయకుడై, నాయకుడై సిద్ధాంత కర్తయి రక్తమాంసాలనద్ది, నిజంగానే వీరన్న మిత్రులు పాడుకుంటున్నట్టుగా ‘ఇండియా విప్లవ రైలు బండి’ పట్టాలు ఎక్కక ముందే అమరుడయ్యాడు. ఉస్మానియా అరుణతార ఆర్ట్స్ కాలేజీ, సైన్స్ క్యాంపస్‌ను ఏకం చేసిన జీనియస్- జియోఫిజిక్స్ సైంటిస్ట్ ఆయన. 1999 మే 16న కరీంనగర్ జిల్లా గట్ల నర్సింగాపూర్ పొదల్లో చంద్రబాబు పోలీసుల రాజకీయ హత్యతో మాంసపు ముద్దగా దర్శనమిచ్చిండు. ఇండియా విప్లవ రైలు బండి పట్టాలపై పరుగెత్తాలని తట్టలతో బొగ్గును రైలింజన్లకు గుప్పుతున్న వందల మందికి తోడు అయ్యిండు. ఆయన ఏ ఆదివాసీలు, దళితులు, స్త్రీలు, మైనారిటీలు, అణచివేయబడిన ప్రాంతాల వాళ్ళు ... కులాల వాళ్ళు అని పోరాడాడో వారి మధ్యనే ఒరిగిపోయాడు. ఇవ్వాళ.. అందరూ ఆయన 13 వ వర్ధంతిని జరుపుకున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన స్ఫూర్తిగా, భవిష్యత్తు ఉద్యమాలు కొనసాగాలని ఆయన మిత్రులు హైదరాబాద్‌లో ‘వీరన్న మిత్రులు’ గా వీరన్న సభ జరుపుకుంటున్నారు.

తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనే ఉద్యమంలో భాగస్వామ్యమైన వడ్లకమ్మరి మారోజు రామలింగం, గౌండ్ల కులస్తురాలయిన సూరమ్మను కులాంతర వివాహం చేసుకొని ఉద్యమ వాతావరణంలో కు టుంబాన్ని పెంచినందుకు సహజంగానే వాళ్ళ పిల్లగాడు మారోజు వీరన్న వామపక్ష భావాలతో పెరిగిండు. కళ్ళ ముందల భీమిడ్డి నర్సింహాడ్డి సాయుధ పోరాట ముచ్చట్లు చెప్పతుంటే పులకించి, చైతన్యవంతమై, వీరన్న చిన్నతనంలోనే గాంధీ పుట్టిన దేశమా ఇది? నెహ్రూ కోరిన సంఘమా ఇది? సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా? ఇది అని గొంతెత్తి పాడే వాడు. గాంధీకి తోడు బ్రిటిష్ పాలకులపై తిరగబడి బాంబులు కురిపించిన భగత్‌సింగ్ ఎందుకు ఉరి తీయబడినట్టు? నెహ్రూ సామ్యవాదాన్నే కోరితే సామ్యవాదం కోసమే సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్టుల్ని పటేల్ సైన్యం ఎందుకు ఊచకోత కోసినట్లు? సామ్యవాదం ఇందిరాగాంధీ సోషలిజమే అయితే నియంతృత్వాలు ఎందుకున్నట్టు? 369 మంది తెలంగాణ బిడ్డల్ని ఎందు కు కాలిచంపినట్లు ఇంకా నల్లగొండలో తెలంగాణలో భూములు భూస్వాముల కబ్జాలోనే ఎందుకున్నట్లు? రామరాజ్యంలో ‘వాలి’ని దొంగచాటుగా చంపిన రాము డు ‘రాముడమ్మ రాముడు! ఎంత చక్కని దేవుడు’ అని ఎందుకు కీర్తించబడుతున్నట్లు.. ఇట్లా వందల ప్రశ్నలతో నిగ్గు తేల్చుకున్న వీరన్న కొత్త ప్రశ్నలు, కొత్త జవాబుల వైపు ప్రయాణం కట్టిండు. ఆ ప్రయాణం పాలకులకు కంటగింపు అయింది. నిండా నలభైఏళ్లు పూర్తికాక ముం దే ఇనుపగజ్జెల రాజ్యం వీరన్నను గద్దలా తన్నుకుపోయింది.

చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణ పదం ఉచ్చరించడానికి వీల్లేదని అనడానికి ముందే..మలిదశ తెలంగాణ ఉద్యమంలో మైలురాయిలా సూర్యాపేటలో ‘తెలంగాణ మహాసభ’ జరగడానికి వీరన్న వెన్నుదన్నులే కారణం. ఇప్పుడు నాలుగున్నరకోట్ల తెలంగాణ బిడ్డలు ముక్తకం ‘జై తెలంగాణ’ అని నినదించడానికి వీరన్న ఒక గొంతుకను నాడే సమకూర్చిండు. కాబట్టే ఈ 13వ వర్ధంతిని అందరు ‘కర్తవ్య నిర్దేశ దినం’ గా భావించాలి.

ఉమ్మడి ‘జనశక్తి’ పార్టీలో దళిత మైనారిటీ ప్రజాస్వామిక వేదిక (డఫోడం)తో ప్రారంభమైన ‘మేమంత మం దిమో..మా కంతవాటా’ కోసం మాదిగ దండోరాను, మాల గుతపదెబ్బను, మగ్గం, మోకు, గొల్ల కుర్మ డోలు దెబ్బను,చాకిరేవు, ఎరుకలి కుర్రుదెబ్బను విడివిడిగా నిలబెట్టి దళిత మహాజనసభగా నిలబెట్టాడు. ఇప్పటికి ఆయా కులాల, వృత్తుల సంఘాలు ఆ ప్రజల ఆకాంక్షల కు అనుగుణంగా పరిమితులతోనైనా పాలకులతో కొ ట్లాడి హక్కులు సాధించుకోవడానికి, రాయితీలు తీసుకోవడానికి శాశ్వత తొవ్వ ఏర్పాటుచేసిన దార్శనికుడు మారోజు వీరన్న. కనుకనే ఇవ్వాళ ఆయనతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాలి.

ఈ దేశ మూల వాసుల్లో ఆదివాసీలతో పాటు మైనారిటీలకు అంతే హక్కు ఉందని ఆత్మవిశ్వాసం నింపిన వాడు వీరన్న. ఇప్పటికీ మైనారిటీని గౌరవించడం తెలు గు నేల మీద రావడానికి ఆయన వేసిన పునాదే కారణం. ఆయనకు ముందు శివసాగర్, ఉసా, బీఎస్ రాములు, కంచె ఐలయ్య ఇంకా చాలా మంది కృషి ఉంది. కనుకనే ఆయనను మే నెలంతా గుర్తు చేసుకోవాలి.అన్నింటికంటే ముఖ్యంగా, తెలంగాణలో విద్యాలయాలు అందిం చిన ఉద్యమ జ్వాలతో...వీరన్న వారసత్వం కొనసాగాలంటే, బలిదానాల బాట కాదు. పోరుబాట పట్టాలి. తెలంగాణ సాధించడానికి బరిగీసి నిలువడమే సముచితమని స మున్నత కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నందుకు ఇప్పుడు ఈ కష్ట సమయంలో ఎక్కువ గుర్తు చేసుకోవాలి.

జార్జి, జంపాల, వీరన్నల వారసత్వమంటే రాజ్యం మెడలు వంచి రాజీలేని పోరాటంతో లక్ష్యం సాధించడం. కాని మనమే మెడలు వంచి, ఉరికొయ్యలకు వేలా డటం కాదు. తెలంగాణ విద్యాలయాలు మేధో నిలయా లే కాదు. ఉద్యమ యుద్ధ క్షేత్రాలని చాటడంతోపాటు వేల అస్తిత్వ పోరాటాల సింగిడి వీరన్న వారసత్వంగా, అదివాసీలకు, మైనారిటీలకు, స్త్రీలకు, సకల సబ్బండ కులాలకు అండగా నిలువడమని చాటాలి. ఆయన ఆశయ సాధనకు సాగిపోవాలి.

-డాక్టర్ చెరుకు సుధాకర్

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Featured Articles