తెలంగాణ సాపెన


Sat,October 6, 2012 03:49 PM

తెలంగాణ మొత్తం ఇయ్యాళ తుక్క తుక్క ఉడుకుతుంది. ఆసరయితడనుకున్న కొడుకు అంటుపెట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ కాలిపోతుండు. పానాల్దీసుకున్న బిడ్డల జూసి ఏడ్చి ఏడ్చి గుడ్లల్ల నీళ్లెండిపోయినయి. సాపించి సాపించి తల్లుల గొంతులు బొంగురు పోయినయి. కాపురం బట్టినోళ్లు అడ్డగోలుగా మాట్లాడుతుంటె గళ్ల బట్టుకొని కచ్చీర్కాడికి గుంజెటోడు. పంచాతి పెట్టెటోడు కనబడ్తలేడు. సావొద్దు బిడ్డా మనుండి తెలంగాణ సాధించాలె అని ధైర్యం నూరి పొయ్యలేక పోతున్నం. కాష్టాల గడ్డకుపోతే రాష్ట్రం రాదు. అందర్కి తెల్సిన ఈ ముచ్చట ఒక్క సుతికోటి చెప్పడం కుదుర్తలేదాయె! ఎవ్వని సార్థం అందాయె! పాలకులు తమ స్వార్థం తోటి తెలంగాణను పజీత పజీత చేస్తుండ్రు. కంట్లె పెట్టుకుంటుండ్రు. కాల్సుకు తింటుండ్రు. పగోడైనా సరే సస్తె సూశొస్తం. కాని ఆళ్లు శాసనసభలసంతాప తీర్మానం జెయ్యడాని క్కూడా తీరొక్క ఏషమేశిండ్రు. ఆఖరికి తెలంగాణ పేరు లేకుండనే కత కత అనిపించిండ్రు. ఇక కలిసుండడం కల్ల. తెలంగాణ తల్లి ‘గొంతు’ నొక్కుత్నున వాళ్ల చెరనుంచి విముక్తి కావాలి.

ఎనుకటి సంది తెలంగాణది దండి గుండెనె. సమ్మక్క సారక్క సర్వాయి పాపన్న, తుర్రెబాజ్ ఖాన్, రాంజీ గోండు, బందగీ, షోయెబుల్లాఖాన్, కొమురం భీం లు కొసదాకా కొట్లాడిండ్రు. దొడ్డి కొమురయ్య మొదలు సాయుధ రైతాంగ పోరాటంలో, 1953 ముల్కీ ఉద్యమంలో, 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో, అటెన్క నక్సలైట్ ఉద్యమంలో ఎప్పుడైనా తూటాలకు ఎదురు నిల్చి కొట్లాడిండ్రు. పానాల్పోయినా ఎత్తిన కత్తిదించలే! ఎన్ను సూపలే!! మరిప్పుడిట్లెందుకయింది. అయితుంది. బత్కు మీద భరోస భస్మమెందుకయ్యింది? అప్పుడు దుష్మన్ కండ్లకు కనబడెటోడు. ఇప్పటంత కువ్వారం ఉండేడిది కాదు. అప్పుడు ఏదో తెలియని ‘శక్తి’ తనది కాని దాన్ని కాజేయాలనే ఆలోచనల్ని కట్టడి చేసింది. దానికి నైతికత, పాపభీతి, స్వాతంత్య్ర సమర స్ఫూర్తి ఇట్లా ఏ పేరైనా పెట్టొచ్చు. తర్వాత్తర్వాత స్ఫూర్తి తరిగి దోచుకోవడం పెరిగింది.

పెద్దమనుషుల ఒప్పందాన్ని ‘తుంగలో తొక్కిండ్రు. ఉప ముఖ్యమంత్రి ఆరో వేలని మజాక్ చేసిండ్రు. తెలంగాణ ఉద్యోగాలు, బడ్జెట్‌లను దోసుకుంవూడని లలిత్ కమిటీ, భార్గవ కమిటీలు తేల్చి చెప్పినయి. ఇవన్నీ కాంగ్రెస్ జమానల్నే వచ్చినయి. పచ్చిమోసం జేసిండ్రు. పలారము పలారము అని తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వాల్లోల్లకు పంచి పెట్టిండ్రు. ఇదేందని అడిగినందుకు 69ల 369 మందిని సంపి బొందపెట్టిండ్రు. నిధులు తెలంగాణయి ప్రాజెక్టులు ఆంధ్రల పారినయి. రీజినల్ కమిటి ఉండె గాబట్టి కొంత వొళ్లు దగ్గర బెట్టుకొని దోసుకుండ్రు. తప్పుచేస్తే నిలదీస్తరని అంత బరితెగించలే! ఈశ్వరీబాయి, సదాలక్ష్మి, కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా వెంకట రంగాడ్డిలు అసెంబ్లీ వేదికగానే అన్యాయాల్ని ఎదిరించిండ్రు. కనీసం వీళ్లకు మాట్లాడేతందుకు ఛాన్సన్న దొరికింది. మరి ఇయ్యాల అంతా తారుమారయ్యింది. దీని కంతటికీ కారణం ‘తెలుగుదేశం’ దానితో ఐడింటిఫై అయ్యే ‘కమ్మ’ సామాజిక వర్గం.

ఇదే విషయాన్ని కవులు ఈ ‘మునుం’ పుష్కర కవితా సంకలనంలో ఇడమర్చి చెప్పిండ్రు. ఒక కులపోల్లని తప్పుపట్టడం అందర్కీ ఈజీగా మింగుడు పడదు. కానీ తప్పడం లేదు. ‘మునుం’ సంకలనాన్ని మొదటి కమ్మ నుంచి చివరి కమ్మ వరకు కమ్మ’ సామాజిక వర్గానికి అన్వయిస్తూ చదువుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన అడ్డంకి వాళ్లే అని తెలుస్తది. ఎందుకంటే ఆంధ్ర - రాయలసీమల ఉన్న ఈ సామాజిక వర్గం పార్టీలకతీతంగా వచ్చిన తెలంగాణను అడ్డుకుంది. రాయలసీమల చంద్రబాబు, పయ్యావుల కేశవ్, ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి ఆంధ్రల దేవినేని ఉమామహేశ్వరరావు, నన్నపనేని, లగడపాటి, రాయపాటి, కావూరి తదితరులందరూ రాత్రికి రాత్రే కుట్ర చేసి రాజీనామా నాటకాలాడిండ్రు. ఈళ్లకు తోడు ‘మేధావి’ రూపంలో నాగభైరవ జయవూపకాశ్ నారాయణ తన ‘సత్తా’ మేరకు హైదరాబాద్‌లోనే ఆంధ్రవూపదేశ్ రాజధాని ఉంది, అట్లాంటప్పుడు దాన్ని తెలంగాణను ఎట్లా ఏర్పాటు చేస్తరు అని ఢిల్లీ ఆంగ్ల పత్రికలల్ల యిసం గక్కిండు. ఓయూలో లాఠీచార్జి జరిగితే ఖండించకుండా ‘లా అండ్ ఆర్డర్’ రక్షించాలని అసెంబ్లీలోనే లొల్లి పెట్టిండ్రు. అందుకే అందరి మనసుల్లో ఉన్న ఆలోచనల్ని ‘మల్లేశ్’ ఆచరణల పెట్టిండ్రు. ‘హీరో’ అయ్యిండ్రు.

‘కమ్మనిస్టులు కత్తు కలిపిన గొంతు/బలవంతుడు బలహీనుని/ వీపుమీద ఎక్కితొక్కిన సవారీ/ గుంటూరు పల్లెలు, కమ్మ పాలెలు/ కవాతులు కట్టి కొల్లగొట్టిన బతుకు/ ఏకు మేకైన సందర్భం’ అల్లం నారాయణ తన యాది-మనాదిలో కలవరించిండు. అట్లనే ‘కమ్మగూడెం వచ్చి అమ్మగూడెం ఆగమయిందని’ కయాలు’ కవితలో ఎం. వెంకట్ చెప్పిండ్రు. ‘మాది మాగ్గావాల’ంటూ పప్పుల రాజిడ్డి ‘బంగారం పండె ర్యాగల్లు అగ్గువకే దొబ్బితిరి/ కార్ఖానాలు మీయె- కాలేజీలు మీయె / సిన్మాల పేరు జెప్పి ఎకురాలకెకురాలు దొబ్బితిరి/ పత్రికలుమియ్యే పలుకుబడి మీదె/ మా జాగల్ని దోచుకొని మమ్మల్ని జీతం బెట్టుకుంటిరి’ అని నిలదీసిండు. ఇక్కడి ప్రజల ఉమ్మడి శత్రువుగా ‘కమ్మ’ సామాజిక వర్గాన్ని ఐడింటిఫై చేసే దశలో తెలంగాణ సమాజముంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచే తెలంగాణ వనరుల దోపిడీ వేగమయింది. లెక్క పత్రము లేకుండా మూల మూలాల కొల్లగొట్టిండ్రు. .....‘తెలుగు వారి ఆత్మగౌరవం’ ముసుగులో విస్తరించిండ్రు. తమ ఇష్టా రాజ్యంగా ఎన్టీఆర్ సామాజిక వర్గం తెలంగాణలోని అంగుళం అంగుళం దోసుకుండ్రు. తెలంగాణను ఒట్టిపోయిన ఆవును జేసిండ్రు. కువ్వారంతోటి ఈళ్లు చేసినంత నష్టం, దోపిడీ, మోసం, దగా అంతా ఇంతా కాదు. నీళ్లు, నేల గాలి, నిప్పు(కంటు) అన్నీ అమురుకుండ్రు. అవును, గాలిని కూడా కమ్ముకుండ్రు. పట్నంల ఉన్నా, పటం చెరువు పోయినా ముక్కుకు బట్టలేకుండా బతుకలేకుండా జేసిండ్రు. కంటికి మంటికి ఏకధారగ సోకం బెట్టి ఏడుస్తున్న తెలంగాణ ఇయ్యాళ మొత్తం పెట్రోల్ వానల తడిసుంది. ఎవ్వడు పుల్ల గీకినా ఆగని మంటలు చెలరేగుతయి. ఎన్ని మిలిట్రీ ఫైరింజన్లొచ్చినా ఆర్పుడు అయ్యే పనికాదు.

తెలుగుదేశం ఆవిర్భావానికి, నిలదొక్కుకోవడానికి‘కమ్మనిస్టు’ లేసిన పునాదే ప్రధాన కారణం. ఆ పునాది పైనే నిర్మించబడ్డ తెలుగుదేశానికి తెలంగాణలో కూడా ఆక్సెప్టెన్సీ వచ్చింది. నిజానికి కమ్యూనిస్టులు ‘కమ్మనిజా’నికి లొంగకుండా ఉండి ఉంటే తెలుగుదేశానికి పుట్టగతులుండేవి కావు. వాళ్లే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేవారు. సీపీఐ, సీపీఎం, తెలుగుదేశం కొంతమేరకు కాంగ్రెస్ ఇట్లా ‘కమ్మోళ్లు’ ఏ పార్టీలో ఉన్నా వాళ్ల మాటే నడిచేది. వాళ్ల పనులయ్యేవి. ‘ఉద్యమాల ఊహల ఎత్తుగడల అలల మీద/ అన్ని రంగుల జెండాల రెపపలమీద /దూకింది ఇక్కడే/ రాయితీల రతనాల మీద/ దండుబాటల కిటుపక్క మీరే అటుపక్కమీరే’ అని ఈ పరిస్థితినే కవులు ఆనాడే రాసిండ్రు.

వేములపల్లి శ్రీకృష్ణ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటూ తెలంగాణని విస్మరించిండు. బహుశా కాకతీయులు కూడా కమ్మవారే అని నమ్మి ఒక్క ‘రువూదమ్మ’ భుజశక్తిని కీర్తించిండు. ఈయన 1972ల అసెంబ్లీలో పతిపక్షనాయుడు. తర్వాత పువ్వాడ నాగేశ్వరరావు హవా సాగింది. ఇక సీపీఎం అయితే కమ్మోల్ల జాగీరేనాయె! మొన్న ఖమ్మం మీటింగ్ సందర్భంగా వీరయ్య సీపీఎం కార్యదర్శి అయితడని పుకారు రాంగనే దాన్ని పార్టీల చర్చించక ముందే ఆయన కాడు అని తమ్మినేని వీరభద్రం తేల్చిండు. ఇది ఆపార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం.

నిజానికి ప్రపంచీకరణకు తెలుగుదేశానికి అవినాభావ సంబంధముంది. తనకు తాను ముఖ్యమంవూతిగా కాకుండా సీఇవోగా పిలిపించుకోవాలని తాపవూతయ పడ్డ చంద్రబాబు సామాజిక వర్గమే ప్రపంచీకరణ వల్ల లాభపడింది....కాంట్రాక్ట్,సినిమా రంగాలతోపాటుగా రియల్ ఏస్టేట్ రంగంలోకి ప్రవేశించింది. వైద్యాన్ని వ్యాపారంగా మార్చిండ్రు. కాలేజీలు పెట్టిండ్రు. సదువునమ్ముకుండ్రు. లారీ ట్రాన్స్‌ఫోర్ట్, ట్రావెల్స్ ఇట్లా వివిధ వ్యాపార రంగాల్లో విస్తరించిన వర్గమే 1990లో గ్లోబలైజేషన్ మూలంగా లాభపడ్డరు. పేదలు, బీసీల బతుకు ప్రపంచీకరణ వల్ల నాశనం పదారుగంతలైంది. పల్లె కన్నీరు పెట్టింది......

ఈ పన్నెండేండ్ల ‘మునుం’ కవిత్వంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, తెలంగాణ ప్రజల ఉమ్మడి శత్రువు ‘కమ్మోళ్లు’ అనేది రుజువయింది. ఇక్కడి చెరువులు, అవుకాఫ్ భూములు పోయి లాంకో హిల్స్ వచ్చినయి. మాదాపూర్, కొండాపూర్‌ల కొండలు, గుట్టలు మాయమై ‘జయభేరి’ లు మోగినయి. సెంటు భూమిలేనోళ్లు సగం జంజారాహిల్స్‌ని ఆక్రమించుకుండ్రు. ప్రభుత్వమెవ్వరిదైనా రాజ్యం వీళ్లదే! అయితే ప్రత్యక్షంగా, లేదంటే పరోక్షంగా. అందుకే ప్రత్యేక తెలంగాణను ముందుండి అడ్డుకుంటున్న వీళ్లే ఇక్కడి ప్రజల ఉమ్మడి శత్రువు. కేవలం రాష్ట్రానికే కాదు. మొత్తం జాతికే వీరి తీరు అవమానకరం. జాతీయ రహదారుల నిర్మాణంలోనూ, పొగాకు ఎగుమతుల్లోనూ వీరి అడ్డదారుల్ని ప్రపంచబ్యాంక్ స్థాయిలో తప్పుపట్టిండ్రు. ‘కృషి’ చేసి బ్యాంకుల్ని దివాల తీయించిండ్రు. కాంట్రాక్టుల్లోనూ ప్రతిచోటా అడ్డదారులల్ల పోయిండ్రు. దేశానికి చెడ్డపేరు తెచ్చిండ్రు. ఇంతచేసి తామేదో దేశసేవ చేస్తున్నామనే ‘ముసుగు’ ఏసుకొని ముందుకొస్తుండ్రు.

ఒర్రి ఒర్రి వాడుపాయె ఒండుక తిని మనం బోతిమి అన్నట్టుంది సీమాంవూధుల సంగతి..... లూటిపోయిన శేనోతిగ ఉన్న కాడికి భూములన్ని ఐనోళ్లకు అయ్య జాగిరోతిగ రాసిచ్చిండ్రు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతోని బతకాలంటే కావాల్సింది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ సాధనకు, ఉద్యమవ్యాప్తికి, తెలంగాణ ఔన్నత్య దీప్తికి ఈ పుస్తకం కరదీపిక. ఈ కరదీపికలోని అక్షరాల్ని కరవాలాలుగా మలచాలి.
తెలంగాణ తెచ్చుకునేందుకు దాన్ని అడ్డుకుంటున్న వాళ్లని నిలదీయ్యాలి. ఇప్పటికే తెలంగాణ బిడ్డలు మా ఊళ్లెకు మీరు రావొద్దు అని కాంగ్రెస్, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఫెక్సీల ద్వారా పొలిమేర్లనే సాటింపేసిండ్రు. ఇగిప్పుడు జేఏసీ పూనుకొని తెలంగాణను వ్యతిరేకించే అన్ని పార్టీల జెండా దిమ్మెలు, ఆ పార్టీల నాయకుల విగ్రహాల్ని ఊర్లల్ల నుంచి తొలగించాలి. ఇది అంతా ఈజీగాదు. అయినప్పటికీ గ్రామస్థాయి జేఏసీలను ఏర్పాటు జేసుకొని స్వచ్చందంగా దిమ్మెలను తొలగించే ఉద్యమాన్ని చేపట్టాలి. తెలంగాణ ప్రజాసమూహానికి వ్యతిరేకమైన ప్రతీకల్ని కూల్చకుండా తెలంగాణ సాధ్యం కాదు. ఇదే విషయాన్ని ఇప్పటికీ తామూ తెలంగాణ వాదులమే అంటూ తెలుగుదేశానికి, కాంగ్రెసుకు ఓట్లేస్తున్న, ఓట్లేయిస్తున్న ప్రజలకు, నాయకులకు యివరించి చెప్పాలి. కార్యకర్తల బలం సూస్కొని విర్రవీగుతున్న తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీల మెడలు వంచితేగాని తెలంగాణ స్వప్నం సాకారం కాదు. అర్థమయ్యేటట్టు చెబితే ఆ పార్టీల కార్యకర్తలే జెండా దిమ్మెల్ని, పార్టీ ప్రతీకల్ని కూలదోస్తరు. కూల్చిన దిమ్మెలపైనే తెలంగాణ వినిర్మాణం సాధ్యమైతది. అందుకు ఈ పుస్తకం ఊతమిస్తది. ఈ ఉద్యమం పల్లె పల్లెకూ విస్తరించాలి. అప్పుడే అన్ని పార్టీలు, నాయకులు కదులుతరు. ఆత్మహత్యలాగుతయి. అది రాష్ట్రసాధన ఉద్యమానికి ఊపునిస్తుంది.

- సంగిశెట్టి శ్రీనివాస్, 949220321
(త్వరలో ఆవిష్కరించనున్న ‘మునుం’ కవితా సంకలనం ముందుమాట లోని కొంతభాగం)

35

SRINIVAS SANGISETTI

Published: Thu,April 7, 2016 12:02 AM

ఉర్దూ రచయితలు ముద్దాయిలా?

ఈరోజు ఉర్దూ భాషలో రాసిన వారికోసం తీసుకొచ్చిన నిబంధన రేపు దక్షిణాది భాషలైన తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు భాషలపై కూడా రుద్దొచ్చు. ఎంద

Published: Mon,November 9, 2015 11:23 PM

ఆత్మగౌరవాన్ని చాటిన్రు

భ్రమలు తొందరగా నే పటాపంచలయినై. మీ(మో)డీయా మాయ లో మోడీ(మూఢ)త్వాని కి పట్టంగట్టి పట్టుమని 16 నెలలు కూడా కాలే దు. మతోన్మాద అసహనానికి,

Published: Sat,July 25, 2015 12:03 AM

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి

Published: Wed,August 6, 2014 02:29 AM

తెలంగాణ మశాల్ జయశంకర్

ఆధునిక తెలంగాణచరిత్ర అన్ని మలుపుల్లో నూ దారి చూపిన దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్ సార్. హైదరాబాద్ రాష్ట్రానికి ఆంధ్రోళ్ళ దోపిడీ పీ

Published: Sun,June 15, 2014 01:19 AM

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు

Published: Tue,September 3, 2013 12:27 AM

ఆంధ్ర పెత్తనంపై తొలి ధిక్కారం

పోలీసు చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వా త ఈ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్రజా పోరాటం ‘ముల్కీ ఉద్య మం’.

Published: Wed,May 29, 2013 12:23 AM

తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దీన్

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా’ మోగించిన రుక్నుద్దిన్ కలం

Published: Wed,January 30, 2013 11:14 PM

ఆధిపత్యవాదుల ఆయుధం అబద్ధం

ఇక ‘ప్రత్యేక తెలంగాణ’కల సాకారమైతుందనుకున్న ప్రతిసారీ ‘ఆధిపత్య’ సీమాం ధ్ర దోపిడీదార్లు, వారి తాబేదార్లు అబద్ధాల్ని అతిగా ప్రచారం

Published: Thu,January 3, 2013 02:07 PM

బానిస రచయితలకు సాహిత్య బహిష్కరణ

కోతకొచ్చిన తెలంగాణ పంటకు తెగులు పట్టుకుంది. ‘ప్రపంచ తెలుగు’ సభల పేరిట తెలంగాణకు పట్టిన ఈతెగులును సమూలంగా నిర్మూలిం చనట్లయితే అది త

Published: Sat,October 6, 2012 03:48 PM

దళితోద్యమ వేగుచుక్క

భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు

Published: Sat,October 6, 2012 03:49 PM

ప్రతీకల్ని మార్చుకుందాం..

త్యాగానికి ప్రతీక శ్రీరాములు’ (ఈ నెల 24) పేరిట రాసిన వ్యాసానికి స్పందన ఇది. కరీంనగర్‌కు చెందిన పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్

Published: Sat,October 6, 2012 03:51 PM

తెలంగాణ భూమి పుత్రిక

తన చరివూతను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త

Published: Sat,October 6, 2012 03:50 PM

హస్తినలో కాదు హైదరాబాద్‌లోనే చర్చలు

ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరముంది. ఒక్క ఎంపీ కూడా లేని చిరంజీవితో మాట్లాడ్డానికి ఆంటోని లాంటి అధిష్ఠానం దూతలు ఆగమేఘాల

Published: Sat,October 6, 2012 03:49 PM

ఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుల్లో ముందు వరుసలో నిలిచి, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వాడు దొడ్డికొ