హస్తినలో కాదు హైదరాబాద్‌లోనే చర్చలు


Sat,October 6, 2012 03:50 PM

ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరముంది. ఒక్క ఎంపీ కూడా లేని చిరంజీవితో మాట్లాడ్డానికి ఆంటోని లాంటి అధిష్ఠానం దూతలు ఆగమేఘాల మీద హైదరాబాద్‌కు వచ్చి చర్చలు జరిపారు. మరి అదే పది మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు వాళ్లతో మాట్లాడ్డానికి కాంగ్రెస్ కచ్చితంగా హైదరాబాద్ వచ్చి తీరుతుంది. ఢిల్లీ దూతలు హైదరాబాద్‌కు వస్తేనే ఇక్కడ వాస్తవ పరిస్థితి అవగతమవుతుంది.

ఢిల్లీలోని కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు, నవ్వులాట, సీమాంధ్ర నాయకులతో గూడుపుఠాని యవ్వారం చూస్తుంటే తెలంగాణ ప్రకటన రాదని తేలిపోయింది. తెలంగాణ సున్నితమైన, సంక్లిష్టమైన అంశమని, ఇప్పటికిప్పుడే తేల్చలేం అని గులాంనబీ ఆజాద్ వంకరగా అంటుండు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వం తరఫున 9 డిసెంబర్, 2009న ప్రకటించిన కేంద్ర హోంమంత్రి చిదంబరం ఇవ్వాళ మాట మార్చి విషపు ముసిముసి నవ్వులతో ఇది జటిలమైన సమస్య అని చెబుతుండు. రాజీనామాలతోటి వచ్చిన నష్టమేమి లేదని రెచ్చగొడుతుండు. మరోవైపు ప్రణబ్‌ముఖర్జీ రాజీనామాలు చేసిన మీతో ఇక మాటలేందని తెలంగాణ ఎంపీలను ఎద్దేవ చేస్తుండు. అదే సమయం లో లగడపాటిని దొడ్డిదారిన పిలిచి కూసుండబెట్టి మాట్లాడిండు.

కాంగ్రెస్ కోర్‌కమిటీలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరమే పార్లమెంటులో 10 డిసెంబర్, 2009న మానవహక్కుల దినోత్సవం నాడు ప్రజాభీష్టం మేరకు తెలంగాణ ఏర్పా టు ప్రకటన వెలువడిందనే విషయం అంద రికీ తెలుసు. అయినా తెలంగాణ పట్ల చులకన భావంతో గేలి చేసినట్టు మాట్లాడుతుం డ్రు. ఢిల్లీకి ఇక రాము. రాం.. రాం..అని ప్రకటించిన పార్లమెంటు సభ్యులు మళ్లీ అక్కడే మకాం వేయడం, ప్రభుత్వంతో చర్చలకు, బుజ్జగింపులకు అందుబాటులో ఉండడం శోచనీయం. నిజానికి ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరముంది. ఒక్క ఎంపీ కూడా లేని చిరంజీవితో మాట్లాడ్డానికి ఆంటోని లాంటి అధిష్ఠానం దూతలు ఆగమేఘాల మీద హైదరాబాద్‌కు వచ్చి చర్చలు జరిపారు.

మరి అదే పది మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు వాళ్ల తో మాట్లాడ్డానికి కాంగ్రెస్ కచ్చితంగా హైదరాబాద్ వచ్చి తీరుతుంది. ఢిల్లీ దూతలు హైదరాబాద్‌కు వస్తేనే ఇక్కడ వాస్తవ పరిస్థితి అవగతమవుతుంది. అందుకే ఢిల్లీలో ఉన్న నేతలందరూ వెంటనే హైదరాబాద్‌కు రావడమే గాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజీనామా చేసినవాందరూ సమైక్యంగా తమ తమ నియోజకవర్గాల్లో ఉద్యమాన్ని ఉధృతం చెయ్యాలి. తెలంగాణ ఉద్యమ సెగ హైదరాబాద్‌లోని సీమాంవూధులకు తాకే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన సమయమిది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివాసముంటూ తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్న సీమాంధ్ర నాయకుల ఇండ్ల ముందర వంటావార్పు కార్యక్షికమాన్ని అక్కడి స్థానిక ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌డ్డిని కలుపుకొని చేయాలి. తెలంగాణలో దోచుకున్న డబ్బుల్తో సీమాంవూధలో కృత్రిమ అలజడి సృష్టించాలని చూస్తున్న పెట్టుబడిదారుల వ్యాపార లావాదేవీలను స్తంభించేలా కార్యాచరణ ఉండా లి. ప్రైవేటు బస్సుల రవాణాను, రైలు ప్రయాణాన్ని ఆపితీరాలి. రాజీనామా చేసిన నాయకులందరూ ప్రతిరోజూ ప్రజలతో ఉండడమే గాకుండా వారికి దిశానిర్దేశం చేసేలా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోరాటాల్ని రూపొందించుకోవాలి.

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఒకవైపు ఎండనకా, వాననకా రోజూ రోడ్లమీదే ఉండి కొట్లాడుతుంటే సీమాంధ్ర మేధావులు ఉద్యమం మీద ఉన్మాదులుగా విషం గక్కుతూ తెలంగాణపై తప్పుడు ప్రచారానికి దిగుతుండ్రు. అందులో భాగంగానే ఢిల్లీలో మీటింగ్ పెట్టిండ్రు. పరకాల ప్రభాకర్ లాంటి కుహనా మేధావు లు, కొంత మంది పెయిడ్ ఉద్యమకారులు ఢిల్లీలో ‘తెలంగాణ ఒక అన్యాయమైన డిమాండ్’ అని సదస్సు నిర్వహించిండ్రు. దీనికి తెలంగాణ గురించి తలాతోక తెలువని కులదీప్ నయ్యర్‌ని పిలిచిండ్రు. మీటింగ్ పెట్టిన ‘‘మేథావులు’’ ముందుగా ఆయనకు శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా ఎనిమిదో చాప్టర్ రాసి మీడియాను, రాజకీయ నాయకుల్ని ఎట్లా మేనేజ్ చెయ్యాలని సూచించిందో కూడా చెప్పి ఉండాల్సింది.

ఎమ్జన్సీలో ఆయన అనుభవించిన బాధలకన్నా ఎక్కువగా నేడు ఒక్కో విద్యార్థి వందలాది కేసులతో సతమతమవుతున్నది నయ్యర్‌గారికి తెలుసా? 600 మందికిపైగా బలిదానాలిచ్చారని విన్నాడా? ప్రధాని మన్మోహన్ మాజీ మీడి యా సలహాదారు సంజయ్‌బారు కూడా ఈ సమావేశంలో పాల్గొ ని తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడిండు. తెలంగాణ ఇవ్వాలో వద్దో మాజీ ఐఎఎస్ అధికారి, తండ్రి అయిన బారు పాండురంగ విఠల్ (బీపీఆర్ విఠల్)ను అడిగితే అర్థమయితది. విఠల్ గారు 1990 దశకం ఆరంభంలోనే శ్రీధర్‌డ్డి తదితరులతో కలిసి తెలంగాణ కోసం కృషి చేసిండు. హైదరాబాద్‌లో పెట్టి పెరిగి ఇక్కడి మట్టిపై ఎంతో మమకారముందని చెప్పే సంజయ్‌బారు గారు ఏనాడు అన్యాక్షికాంతమవుతున్న భూముల గురిం చి గానీ, కొల్లగొడుతున్న ఆస్తుల గురించి గానీ, కూలగొడుతున్న చారివూతక కట్టడాల గురించి గానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఇవ్వాళ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం శోచనీయం.

కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూడా ప్రభావితం చేయగల సత్తా ఉన్న సంజయ్‌బారు లాంటి వాళ్లు తెలంగాణలో ఏమి జరుగుతుందో ఎన్నడూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దశాబ్దాలుగా హైదరాబాద్‌కు దూరంగా ఉం డడం వల్ల ఇక్కడి దోపిడీ, విధ్వంసం ఆయన దృష్టికి వచ్చినట్టులేదు. లేదా చూడటానికి నిరాకరిస్తున్నాడో!
రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ప్రజావూపతినిధులను సాదరంగా అక్కున చేర్చుకుంటూనే అందుకు నిరాకరించిన వారిని నిలదీయాల్సిన అవసరముంది. 2004, 2009లో రెండుసార్లు తాము తెలంగాణ తెస్తామని చెప్పి వీళ్లంతా ఓట్లు అడిగా రు. అయినా ఏరు దాటినాక తెప్ప తగలేసినట్లు ఇవ్వాళ మాట మారుస్తుండ్రు. తెలంగాణ అడ్డుగా నిలుస్తున్న సీమాంధ్ర నాయకుల్ని ఏ విధంగా నిలదీస్తున్నామో అలాగే వీరిని కూడా నిలదీయాలి. రాజీనామా చేసిన నాయుకులు అందుకు నిరాకరించిన వారి ఇండ్ల ముందు నిరసనలకు దిగాలి. జూబ్లీహిల్స్‌లో మిలియ న్ మార్చ్ నిర్వహించాలి. సీమాంవూధులకు తొత్తులుగా మారిన దానం, ముఖేశ్‌లను నిలదీయాల్సిందే. బానిస బతుకొద్దు, ఆత్మగౌరవంతో బతుకుదాం అని వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పా లి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడి నాయకులు ఉమ్మడి ఉద్యమాన్ని రూపొందించుకుని పోరాటం చేసినట్లయితే రాష్ట్ర సాధన సుసాధ్యం.

-సంగిశెట్టి శ్రీనివాస్


35

SRINIVAS SANGISETTI

Published: Thu,April 7, 2016 12:02 AM

ఉర్దూ రచయితలు ముద్దాయిలా?

ఈరోజు ఉర్దూ భాషలో రాసిన వారికోసం తీసుకొచ్చిన నిబంధన రేపు దక్షిణాది భాషలైన తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు భాషలపై కూడా రుద్దొచ్చు. ఎంద

Published: Mon,November 9, 2015 11:23 PM

ఆత్మగౌరవాన్ని చాటిన్రు

భ్రమలు తొందరగా నే పటాపంచలయినై. మీ(మో)డీయా మాయ లో మోడీ(మూఢ)త్వాని కి పట్టంగట్టి పట్టుమని 16 నెలలు కూడా కాలే దు. మతోన్మాద అసహనానికి,

Published: Sat,July 25, 2015 12:03 AM

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి

Published: Wed,August 6, 2014 02:29 AM

తెలంగాణ మశాల్ జయశంకర్

ఆధునిక తెలంగాణచరిత్ర అన్ని మలుపుల్లో నూ దారి చూపిన దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్ సార్. హైదరాబాద్ రాష్ట్రానికి ఆంధ్రోళ్ళ దోపిడీ పీ

Published: Sun,June 15, 2014 01:19 AM

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు

Published: Tue,September 3, 2013 12:27 AM

ఆంధ్ర పెత్తనంపై తొలి ధిక్కారం

పోలీసు చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వా త ఈ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్రజా పోరాటం ‘ముల్కీ ఉద్య మం’.

Published: Wed,May 29, 2013 12:23 AM

తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దీన్

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా’ మోగించిన రుక్నుద్దిన్ కలం

Published: Wed,January 30, 2013 11:14 PM

ఆధిపత్యవాదుల ఆయుధం అబద్ధం

ఇక ‘ప్రత్యేక తెలంగాణ’కల సాకారమైతుందనుకున్న ప్రతిసారీ ‘ఆధిపత్య’ సీమాం ధ్ర దోపిడీదార్లు, వారి తాబేదార్లు అబద్ధాల్ని అతిగా ప్రచారం

Published: Thu,January 3, 2013 02:07 PM

బానిస రచయితలకు సాహిత్య బహిష్కరణ

కోతకొచ్చిన తెలంగాణ పంటకు తెగులు పట్టుకుంది. ‘ప్రపంచ తెలుగు’ సభల పేరిట తెలంగాణకు పట్టిన ఈతెగులును సమూలంగా నిర్మూలిం చనట్లయితే అది త

Published: Sat,October 6, 2012 03:48 PM

దళితోద్యమ వేగుచుక్క

భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు

Published: Sat,October 6, 2012 03:49 PM

తెలంగాణ సాపెన

తెలంగాణ మొత్తం ఇయ్యాళ తుక్క తుక్క ఉడుకుతుంది. ఆసరయితడనుకున్న కొడుకు అంటుపెట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ కాలిపోతుండు. పానాల్దీసుకున్న

Published: Sat,October 6, 2012 03:49 PM

ప్రతీకల్ని మార్చుకుందాం..

త్యాగానికి ప్రతీక శ్రీరాములు’ (ఈ నెల 24) పేరిట రాసిన వ్యాసానికి స్పందన ఇది. కరీంనగర్‌కు చెందిన పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్

Published: Sat,October 6, 2012 03:51 PM

తెలంగాణ భూమి పుత్రిక

తన చరివూతను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త

Published: Sat,October 6, 2012 03:49 PM

ఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుల్లో ముందు వరుసలో నిలిచి, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వాడు దొడ్డికొ