ప్రతీకల్ని మార్చుకుందాం..


Sat,October 6, 2012 03:49 PM

త్యాగానికి ప్రతీక శ్రీరాములు’ (ఈ నెల 24) పేరిట రాసిన వ్యాసానికి స్పందన ఇది. కరీంనగర్‌కు చెందిన పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల రామేశం ఈ వ్యాసం లో చేసిన వాదనలు పూర్తిగా అర్థసత్యాలు, అవాస్తవాలతో నిండి ఉన్నాయి. తాను తెలంగాణ వాదినే అని చెప్పుకుంటూ సీమాంవూధుల తప్పు డు వాదనలకు వత్తాసు పలికిండు.

‘ఈ ప్రాంతంలో ఆయన విగ్రహాలు నెలకొల్పుటకు ఎలాంటి రాజకీయాలు గానీ, ఆంధ్ర ప్రాంత ప్రజల ఒత్తిడిగాని లేదు’ అని రాసిండు. నిజమే ఈ అవసరం వారికి రాకుండానే మనవాళ్లే ఆపని చేసి పెట్టిండ్రు. మద్రాసు రాజధానిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కావాలని దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు కు ఆంధ్రవూపదేశ్ అవతరణతో ఎలాంటి సంబంధం లేదు. ఉంటే గింటే ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఉంటుం ది. అలాంటిది అసెంబ్లీ వేదికగా వైఎస్ రాజశేఖర్‌డ్డి ఆంధ్రవూపదేశ్ అవతరణ కు ప్రాణ త్యాగం చేసినా వ్యక్తిగా పొట్టి శ్రీరాములును కీర్తించిండు. ప్రతి నవంబర్ ఒకటి రోజున తెలంగాణకు ఏమాత్రం సంబంధంలేని వ్యక్తిని ఈ రాష్ట్ర సాధన కోసం ప్రాణాల్పరించిన వ్యక్తిగా ప్రభుత్వమే పుల్‌పేజీ అడ్వర్టయిజ్‌మెంట్లు ఇస్తోంది. అంటే ప్రభుత్వం చేసే మాయోపాయాలకు తెలంగాణ వాళ్లు పావులుగా మారుతుండ్రు. తమకే మాత్రం సంబంధం లేని వ్యక్తిని భుజాల మీద మోసే పరిస్థితులు కల్పిస్తుండ్రు. తెలంగాణ భూమి పుత్రులకు దక్కాల్సిన గౌరవాన్ని వారికి దక్కనీయకుండా సీమాంధ్ర ప్రభుత్వం, సమైక్యవాదులు స్వారీ చేస్తుండ్రు. పొట్టి శ్రీరాములు త్యాగంతోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిందనే అబద్ధాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేసిండ్రు. నిజానికి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం 1934లో ఏర్ప డ ఒరిస్సా రాష్ట్రం. వాస్తవాలు ఇలా ఉంటే సీమాంవూధులు ప్రచారంలో పెట్టే తప్పుడు వార్తలకు ఉప్పల రామేశం లాంటి వారు వత్తాసు పలుకుతుండ్రు. ‘సమైక్య ఆంధ్రవూపదేశ్‌కు పొట్టి శ్రీరాము లు జీవితానికి సంబంధం లేదన్నది నగ్న సత్యం’ అని చెప్పిన రామేశం ఎన్నడూ సీమాంధ్ర ప్రభుత్వపు అబద్ధపు ప్రచారాన్ని ఖండించలేదు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఆంధ్రవూపదేశ్ ఏర్పడిందని పెద్ద ఎత్తున జరుగుతున్న తప్పుడు రాతల్ని ఈసడించలేదు. పై పెచ్చు పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజున రెండు నిమిషాలు మౌనం పాటిస్తే తప్పేంటనే భావాన్ని వ్యక్తం చేసిండు. తెలంగాణకు సంబంధం లేని వ్యక్తిని మనమెందుకు మోయాలి. ప్రజలు రెండు ప్రాంతాలుగా విడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రెచ్చగొట్టే విధంగా ఉన్న ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టాల్సింది పోయి తెలంగాణ వాదుల్ని విమర్శించడం సరికాదు. నిజానికి తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని పొట్టి శ్రీరాములు విగ్రహాలు స్థాపించుకోవడంతో ఆమేరకు స్థానిక ఆర్యవైశ్య వైతాళికుల విగ్రహాలు నిలుపుకునే అవకాశం లేకుండా పోయింది. న్యాయం గా తెలంగాణ వైతాళికులకు దక్కాల్సిన స్థానాన్ని సీమాంవూధులతో నింపినందుకే మిలియన్ మార్చ్‌లో ట్యాంకుబండ్‌పై విగ్రహాలు కూలిన సంగతి తెలిసిందే. అట్లాంటి స్థితి తెలంగాణ అంతటా తలెత్తకుండా ఉండాలంటే స్థానిక వైతాళికుల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరముంది.

పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యులు తమ ప్రతీకగా ప్రచారం చేసుకోవడం ద్వారా నిజమైన తెలంగాణ ఆర్యవైశ్య వైతాళికులకు రావాల్సిన గుర్తింపు రాకుండాపోయింది. 1930వ దశకంలో తెలంగాణ ప్రజల్లో చైతన్య జ్యోతులు వెలిగించడానికి తాను సమిధైన వ్యక్తి కల్వకుంట్ల చంద్రసేన్ గుప్త . ఈయన హైదరాబాద్‌లో వైశ్యహాస్టల్ స్థాపనకు కృషి చేయడమే కాకుండా, 1938లో కేవలం అణాకే ఒక పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ‘అణా గ్రంథమాల’ను ఏర్పాటు చేసిండు. 30 పైగా పుస్తకాలు ప్రచురించిండు. ఈ పుస్తకాల్లో భాగంగా ‘సుభాష్ చంద్రబోస్’ జీవిత చరివూతను కూడా వెలువరించిండు. బోస్ పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రజల్ని ప్రభుత్వంపై తిరగడబడేలా కె.సి. గుప్త రెచ్చగొడుతున్నాడని నిజాం ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసింది. పుస్తకాలు అచ్చేసి జ్ఞానాన్ని నలుగురికి పంచినందుకు జైలు శిక్ష అనుభవించిన మహానీయుడు గుప్త. ఈయన గురించి పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా ఒక్క ముక్క రాయలేదు. అలాగే హైదరాబాద్ తో సహా ఏ జిల్లాలో కూడా ఆయన విగ్రహం ఆవిష్కరణకు నోచుకోలేదు. అంటే మనవాళ్లని, వైతాళికుల్ని మనకు దూరం చేసి, సీమాంధ్ర ప్రాంతం వారిని మనమీద రుద్దడం తెలుస్తూనే ఉంది.
ఒక న్యాయమైన డిమాండ్ కోసం నిరాహారదీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు పట్ల తెలంగాణ ప్రజలందరికీ గౌరవముం ది. అందుకే ఆయన చనిపోయిన తెల్లారి (డిసెంబర్16, 1952) హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో వక్తలందరూ ఆయనకు నివాళి అర్పించిండ్రు. ఆయన త్యాగం వృథా కారాదని కోరుకుండ్రు. దానికి కొనసాగింపుగా పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించిండు. దీని ద్వారా తెలంగాణ ప్రజలు పొట్టి శ్రీరాములుకు వ్యతిరేకం కాదనే విషయాన్ని ముందుగా గమనంలోకి తీసుకోవాలి. అయితే పొట్టి శ్రీరాములు పేరు చెప్పి తెలంగాణ వైతాళికుల్ని కప్పిపుచ్చి, సమైక్యవాద ప్రచారానికి తెరదీస్తే సహించేది లేదనే విషయాన్ని కూడ గుర్తించాలి.
తెలంగాణ భూమి పుత్రులను మరిపించి, సీమాంవూధుల్ని మెరిపించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని అందరూ గుర్తెరగాలి. ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఈ నేలలో పుట్టిన మహానీయుపూందరినో విస్మరించిండ్రు. తమ మూలాల్ని మరిచి పోయిండ్రు. తెలంగాణ వైతాళికులకు చరివూతలో స్థానం లేకుండా పోయింది. సమైక్య రాష్ట్రంలో కేవలం ఆంధ్రుల ‘ప్రతిభే’ గుర్తింపుకు నోచుకుంటుంది. అది మాత్రమే పాఠ్యపుస్తకాలుగా, చరివూతగా చలామణి అవుతుందనే గ్రహింపు లేనట్టయితే వారు ఏ ప్రాంతం వారయినా తెలంగాణకు ఒరిగేదేమి లేదు. ఆంధ్ర జన సంఘానికి అండదండలందించి దానికి ప్రాణం పోసిన సూర్యాపేట వర్తకులు, యామా అరవయ్య, అణా గ్రంథమాల నిర్మాత కె.సి. గుప్త, సుప్రసిద్ధ సాహితీవేత్త నీలా జంగయ్య, ఆంధ్రమహాసభ నేత బచ్చు వెంక గుప్త ఇట్లా కొన్ని వందలమంది తెలంగాణ పది జిల్లాల్లో తారస పడుతూ ఉంటారు. అయితే వీరిలో ఎవ్వరి గురించి కూడా పొట్టి శ్రీరాములు గురించి తెలిసినంతగా తెలియకపోవడమే విషాదం. ఈ విషాదం నుంచి బయట పడేందుకే నేడు తెలంగాణ దినాం కొట్లాడుతూనే ఉంది. అందుకే ఈ నేల పట్ల, ఇక్కడి మనుషుల పట్ల, ఇక్కడి వనరుల పట్ల, ఇక్కడి చరిత్ర పట్ల సోయి ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యమిస్తుండ్రు. మూలాల్లోకి వెళ్ళి తమ తమ ప్రతీకల్ని, వైతాళికుల్ని వెలుగులోకి తెస్తున్నరు. కొత్తగా ప్రతిష్టించుకుంటున్నరు. అందుకే ప్రతీకల్ని మార్చుకుందాం. తెలంగాణ ప్రతీకల్ని నిలుపుకుందాం. ఈ సోయి అందరికీ అబ్బాలని కోరుకుంటూ...

-సంగిశెట్టి శ్రీనివాస్

35

SRINIVAS SANGISETTI

Published: Thu,April 7, 2016 12:02 AM

ఉర్దూ రచయితలు ముద్దాయిలా?

ఈరోజు ఉర్దూ భాషలో రాసిన వారికోసం తీసుకొచ్చిన నిబంధన రేపు దక్షిణాది భాషలైన తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు భాషలపై కూడా రుద్దొచ్చు. ఎంద

Published: Mon,November 9, 2015 11:23 PM

ఆత్మగౌరవాన్ని చాటిన్రు

భ్రమలు తొందరగా నే పటాపంచలయినై. మీ(మో)డీయా మాయ లో మోడీ(మూఢ)త్వాని కి పట్టంగట్టి పట్టుమని 16 నెలలు కూడా కాలే దు. మతోన్మాద అసహనానికి,

Published: Sat,July 25, 2015 12:03 AM

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి

Published: Wed,August 6, 2014 02:29 AM

తెలంగాణ మశాల్ జయశంకర్

ఆధునిక తెలంగాణచరిత్ర అన్ని మలుపుల్లో నూ దారి చూపిన దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్ సార్. హైదరాబాద్ రాష్ట్రానికి ఆంధ్రోళ్ళ దోపిడీ పీ

Published: Sun,June 15, 2014 01:19 AM

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు

Published: Tue,September 3, 2013 12:27 AM

ఆంధ్ర పెత్తనంపై తొలి ధిక్కారం

పోలీసు చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వా త ఈ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్రజా పోరాటం ‘ముల్కీ ఉద్య మం’.

Published: Wed,May 29, 2013 12:23 AM

తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దీన్

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా’ మోగించిన రుక్నుద్దిన్ కలం

Published: Wed,January 30, 2013 11:14 PM

ఆధిపత్యవాదుల ఆయుధం అబద్ధం

ఇక ‘ప్రత్యేక తెలంగాణ’కల సాకారమైతుందనుకున్న ప్రతిసారీ ‘ఆధిపత్య’ సీమాం ధ్ర దోపిడీదార్లు, వారి తాబేదార్లు అబద్ధాల్ని అతిగా ప్రచారం

Published: Thu,January 3, 2013 02:07 PM

బానిస రచయితలకు సాహిత్య బహిష్కరణ

కోతకొచ్చిన తెలంగాణ పంటకు తెగులు పట్టుకుంది. ‘ప్రపంచ తెలుగు’ సభల పేరిట తెలంగాణకు పట్టిన ఈతెగులును సమూలంగా నిర్మూలిం చనట్లయితే అది త

Published: Sat,October 6, 2012 03:48 PM

దళితోద్యమ వేగుచుక్క

భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు

Published: Sat,October 6, 2012 03:49 PM

తెలంగాణ సాపెన

తెలంగాణ మొత్తం ఇయ్యాళ తుక్క తుక్క ఉడుకుతుంది. ఆసరయితడనుకున్న కొడుకు అంటుపెట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ కాలిపోతుండు. పానాల్దీసుకున్న

Published: Sat,October 6, 2012 03:51 PM

తెలంగాణ భూమి పుత్రిక

తన చరివూతను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త

Published: Sat,October 6, 2012 03:50 PM

హస్తినలో కాదు హైదరాబాద్‌లోనే చర్చలు

ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరముంది. ఒక్క ఎంపీ కూడా లేని చిరంజీవితో మాట్లాడ్డానికి ఆంటోని లాంటి అధిష్ఠానం దూతలు ఆగమేఘాల

Published: Sat,October 6, 2012 03:49 PM

ఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుల్లో ముందు వరుసలో నిలిచి, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వాడు దొడ్డికొ

Featured Articles