ఉర్దూ రచయితలు ముద్దాయిలా?


Thu,April 7, 2016 12:02 AM

ఈరోజు ఉర్దూ భాషలో రాసిన వారికోసం తీసుకొచ్చిన నిబంధన రేపు దక్షిణాది భాషలైన తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు భాషలపై కూడా రుద్దొచ్చు. ఎందుకంటే ఈ భాషలు మాట్లాడే ఏ ప్రాంతంలో కూడా బీజేపీ అధికారంలో లేదు. అందుకే ఈరోజు ఉర్దూ రచయితలకు అండగా నిలుద్దాం. గిరీష్ కర్నాడ్ లాంటివాళ్లు
దేశవ్యాప్తంగా ఉర్దూ రచయితల పక్షాన ఇప్పటికే నిలబడ్డారు. మనమూ వారితో కలిసి నడుద్దాం.

srinu
భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు, ప్రజాస్వామిక, లౌకిక విలువలకు కేంద్ర ప్రభుత్వం సమాధి కడుతున్నది. ఒకవైపు అంబేద్కర్ 125వ జయంతి ఘనంగా నిర్వహిస్తామని ప్రకటిస్తూనే మరోవైపు ఆయన జీవితాంతం ఆచరించిన ఆశయాల ను గంగలో కలుపుతున్నారు. ప్రత్యేకంగా ఒక మతం వారిని ప్రమాదకరమైన వ్యక్తులుగా, దేశ ద్రోహులుగా ముద్ర వేసేందుకు పన్నాగాలు పన్నుతున్నది. మా అంత సహనం, ఓపిక ప్రపంచంలో ఎవరికీ లేదంటూ కోతలు కోస్తూ అసహనాన్ని బాహాటంగా ప్రదర్శిస్తున్నా రు. భౌతిక దాడులకు దిగుతున్నారు. పన్సారే, ధబోల్కర్, కల్బుర్గిలను హతం చేసినారు. అఖ్లాక్‌లను ఖతం చేసినారు. మా మాట వినకపోయినా, మేం చెప్పినట్టు చేయకపోయినా మీరు శత్రువుతో ఉన్నట్టే, దేశద్రోహులే అన్నట్టు గా బీజేపీ వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యవాదుల హత్య, ఇష్టమున్న తిండి తిన్నందుకు మరణదండన, చైతన్యంతో తిరగబడ్డందుకు యూనివర్సిటీల్లో ఆత్మహత్యలు, అవినీతిపై నిలదీసినందుకు కన్నయ్యలపై దేశద్రోహ కేసులు. విద్యార్థుల కు రాజకీయాలతో పనేంటని ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలు చేసిన కేంద్ర మం త్రులే అసహనంగా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే మనం ప్రజాస్వామిక పాలనలో కాకుండా హిట్లర్ వారసుల ఏలుబడిలో ఉన్నామని అర్థమౌతున్నది. తాజాగా వీరి అసహనం ఉర్దూ భాష మీదికి మళ్లింది.

నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అనే సంస్థ కేంద్ర మానవ వనరుల శాఖ నేతృత్వంలో పనిచేస్తున్నది. ఈ శాఖ కూడా రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన స్మృతి ఇరానీ నేతృత్వంలోనే పనిచేస్తున్నది. ఈ భాషా మండలి ప్రధాన ఉద్దేశం ఉర్దూ భాషా ప్రచా రం. ఉర్దూ పరిశోధక పత్రికలకు ఆర్థిక సహాయం, ఉర్దూ సదస్సులు ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికం గా తోడ్పాటు, గ్రంథాలయాలకు పెద్ద మొత్తంలో పుస్తకాల కొనుగోలుకు చేయూత, పుస్తక ప్రచురణ కు గ్రాంట్స్ ఇవ్వడం ఈ సంస్థ పని. అయితే ఇటీవ ల ఈ సంస్థ తమ ఆర్థిక సహాయం పొందగోరే ఉర్దూ రచయితలు/ సంపాదకులు తాము ప్రచురించే పుస్తకం/ పత్రికలో ప్రభుత్వ విధానాలకు గానీ, దేశ ప్రయోజనాలకు గానీ వ్యతిరేకమైన విషయాలు లేవు. భిన్నవర్గాల మధ్యన గానీ, దేశాల మధ్యన గానీ సంబంధాలు దెబ్బతినే అంశాలేమీ లేవు. అలాగే ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహాయం స్వీకరించలేదు అని స్వీయ ప్రకటన చేయాలనే కొత్త నిబంధనను తీసుకొచ్చారు.

1996లో ఏర్పాటైన ఈ సంస్థ నుంచి ఇన్నాళ్లు ఎలాంటి స్వీయ ప్రకటన అవసరం లేకుండానే ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పుడు ఈ నిబంధన అమల్లోకి తీసుకురావడంలో ఉర్దూని ఖతం చేయడమే గాకుండా, ఆ భాషలో రాసేవారిని దేశద్రోహులుగా చిత్రించడం ప్రధాన ఉద్దేశం. బీజేపీ ప్రభుత్వం ఉర్దూని కేవలం ముస్లింల భాషగా పరిగణించడంతోనే ఈ సమస్య ప్రారంభమైంది. ఉర్దూ ప్రోత్సాహక కమిటీ తరపున్నే ఉర్దూ భాషను సమాధి చేసే చర్యలను ప్రభుత్వం చేపడుతున్నది. అంటే రక్షించి పోషించాల్సిన వాళ్లే కతం కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉర్దూ హైదరాబాదీ భాష, దక్కన్ భాష. కుతుబ్‌షాహీల కాలం నుంచి మతాల కతీతంగా ప్రజాదరణ పొందిన భాష. దేశవ్యాప్తంగా ఎందరో ముస్లిమేతరులు ఉర్దూలో రాసినారు.

ప్రేవ్‌ుచంద్, కిషన్‌చందర్ లాంటి వాళ్లు ఉర్దూలోనే తమ రచనలు వెలువరించారు. అలాగే తెలుగులో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, ప్రజాకవి దాశరథి, కాళోజీ నారాయణరావు లాంటి వాళ్లెందరో ఉర్దూ మాధ్యమంలోనే చదువుకున్నారు. రచనలు కూడా చేశారు. తెలుగులోనూ ప్రతిభ చూపిం చారు. హైదరాబాద్ రాజ్య ప్రధాని మహరాజా కిషన్ పర్‌షా, కాళోజీ రామేశ్వరరావు షాద్ తదితరులెందరో తెలంగాణ వాళ్లు ఉర్దూలో ప్రపం చం గర్వించే సాహిత్యాన్ని సృజించారు. మఖ్దూం మొహియుద్దీన్ తెలంగాణ అభ్యుదయ ఉర్దూ సాహిత్యాన్ని సినిమాల్లోకి సైతం తీసుకొచ్చారు. అలాంటి ఉర్దూని నేడు దేశద్రోహుల భాషగా ముద్రవేసే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తున్నది.

ఆర్థిక సహాయం కోసం కోరుకున్న ప్రతి పుస్తకానికీ ఉదారంగా గ్రాంటులు ఇస్తున్న పద్ధతేం లేదు. కౌన్సిల్ పరిశీలనకు వచ్చిన పుస్తకాలను పరిశీలించేందుకు కచ్చితంగా ఒక కమిటీ ఉంటుంది. వారు మాత్రమే ఏ పుస్తకానికి/ పత్రికకు ఆర్థిక సహాయం చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటారు. అట్లా వారు పరిశీలన చేసే సమయంలో నిబంధనలకు విరుద్ధమైన వ్యాఖ్యలుంటే (భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఉన్నా కూడా గౌరవించాలి) అవి రచయిత దృష్టికి తీసుకురావొచ్చు. రచయిత/సంపాదకునికి ఇష్టమైతే మార్చుకుంటాడు. లేదంటే గ్రాంటును వొదులుకుంటాడు. అది పద్ధతి. ఈ పద్ధతిని కాదని ముందే రచయితను ముద్దాయిగా పరిగణించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంటున్నరు. ఇది ఉర్దూ రచయితలను అవమానపరచడమే!

నేను పుట్టక ముందే నా పేరు దేశద్రోహుల జాబితాలో నమోదైంది అని కవి ఖాదర్ మొహియుద్దీన్ అన్నాడు. దానికి తగ్గట్టుగానే ఉర్దూ కవులు/రచయితలు తమ రచనలు అచ్చులోకి రాకముందే ప్రమాదకరమైన వ్యక్తులుగా/ దేశద్రోహులు గా చిత్రించబడుతున్నారు. నిజానికి దేశంలోని ప్రజలందరికీ వర్తించే చట్టాలు, న్యాయస్థానాలు కూడా ఉర్దూ రచయితలకూ వర్తిస్తాయి. వారి రచనల్లో దేశ వ్యతిరేకమైన విషయాలుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. అట్లా కాదని ముందే నేను ప్రమాదకరమైన వ్యక్తిని కాను, దేశద్రోహిని కాను అని ప్రభుత్వానికి డిక్లరేషన్ ఇవ్వడమంటే సృజనకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే! భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమే! లౌకి క, ప్రజాస్వామిక విలువలను ఉల్లంఘించడమే! భారత్ మాతాకి జై అనకుంటే తలలు నరికేస్తాం అనే సన్నాసులపై ఎలాంటి చర్యలు లేవుగానీ ఉర్దూ లో రాసే వారి కరాలకు సంకెళ్లు వేస్తున్నారు. కలాలలను కాలరాస్తున్నారు. ఉర్దూ భాషా ప్రోత్సాహక మండలే ఈ పాత్ర పోషిస్తుందంటే, తమ వేలితోనే తమ కన్ను పొడిపిస్తుందని అర్థం చేసుకోవాలె!

ఉర్దూ భాషా ప్రోత్సాహక మండలి లాంటిదే రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థ ఒకటుంది. దాదాపు ఈ సంస్థ కూడా మండలి లాగానే పుస్తకాల ప్రచురణకు, సదస్సుల నిర్వహణకు, యూనివర్సిటీల్లో బోధనకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటది. మరి సంస్కృతంలో రాసేవారికి ఎలాంటి డిక్లరేషన్ లేకుండా కేవలం ఉర్దూలో రచనలు చేసే వారినే అడగడమంటే వివక్ష, అణచివేత కాక మరేమిటి? నిజానికి సృజనకారుడికి తాను చెప్పదలుచుకుంది ఎలాంటి అడ్డంకులు, ఆంక్షలు లేకుండా చెప్పడానికి, రాయడానికి పూర్తిస్వేచ్ఛ ఉండాలి. ఇలాంటి స్వేచ్ఛకోసమే కల్బుర్గి తన పాణాన్ని పణంగా పెట్టాడు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించుకునేందుకు, కేంద్ర ప్రభత్వ మానవ వనరుల శాఖ ప్రతిపాదించిన డిక్లరేషన్ నిబంధనను ఉపసంహరించుకునే వరకూ అన్నిరకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమే మార్గం. ఈరోజు ఉర్దూ భాషలో రాసిన వారికోసం తీసుకొచ్చిన నిబంధన రేపు దక్షిణాది భాషలైన తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు భాషలపై కూడా రుద్దొచ్చు. ఎందుకంటే ఈ భాషలు మాట్లాడే ఏ ప్రాంతంలో కూడా బీజేపీ అధికారంలో లేదు. అందుకే ఈరోజు ఉర్దూ రచయితలకు అండగా నిలుద్దాం. గిరీష్ కర్నాడ్ లాంటివాళ్లు దేశ వ్యాప్తంగా ఉర్దూ రచయితల పక్షాన ఇప్పటికే నిలబడ్డారు. మనమూ వారితో కలిసి నడుద్దాం.

1098

SRINIVAS SANGISETTI

Published: Mon,November 9, 2015 11:23 PM

ఆత్మగౌరవాన్ని చాటిన్రు

భ్రమలు తొందరగా నే పటాపంచలయినై. మీ(మో)డీయా మాయ లో మోడీ(మూఢ)త్వాని కి పట్టంగట్టి పట్టుమని 16 నెలలు కూడా కాలే దు. మతోన్మాద అసహనానికి,

Published: Sat,July 25, 2015 12:03 AM

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి

Published: Wed,August 6, 2014 02:29 AM

తెలంగాణ మశాల్ జయశంకర్

ఆధునిక తెలంగాణచరిత్ర అన్ని మలుపుల్లో నూ దారి చూపిన దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్ సార్. హైదరాబాద్ రాష్ట్రానికి ఆంధ్రోళ్ళ దోపిడీ పీ

Published: Sun,June 15, 2014 01:19 AM

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు

Published: Tue,September 3, 2013 12:27 AM

ఆంధ్ర పెత్తనంపై తొలి ధిక్కారం

పోలీసు చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వా త ఈ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్రజా పోరాటం ‘ముల్కీ ఉద్య మం’.

Published: Wed,May 29, 2013 12:23 AM

తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దీన్

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా’ మోగించిన రుక్నుద్దిన్ కలం

Published: Wed,January 30, 2013 11:14 PM

ఆధిపత్యవాదుల ఆయుధం అబద్ధం

ఇక ‘ప్రత్యేక తెలంగాణ’కల సాకారమైతుందనుకున్న ప్రతిసారీ ‘ఆధిపత్య’ సీమాం ధ్ర దోపిడీదార్లు, వారి తాబేదార్లు అబద్ధాల్ని అతిగా ప్రచారం

Published: Thu,January 3, 2013 02:07 PM

బానిస రచయితలకు సాహిత్య బహిష్కరణ

కోతకొచ్చిన తెలంగాణ పంటకు తెగులు పట్టుకుంది. ‘ప్రపంచ తెలుగు’ సభల పేరిట తెలంగాణకు పట్టిన ఈతెగులును సమూలంగా నిర్మూలిం చనట్లయితే అది త

Published: Sat,October 6, 2012 03:48 PM

దళితోద్యమ వేగుచుక్క

భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు

Published: Sat,October 6, 2012 03:49 PM

తెలంగాణ సాపెన

తెలంగాణ మొత్తం ఇయ్యాళ తుక్క తుక్క ఉడుకుతుంది. ఆసరయితడనుకున్న కొడుకు అంటుపెట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ కాలిపోతుండు. పానాల్దీసుకున్న

Published: Sat,October 6, 2012 03:49 PM

ప్రతీకల్ని మార్చుకుందాం..

త్యాగానికి ప్రతీక శ్రీరాములు’ (ఈ నెల 24) పేరిట రాసిన వ్యాసానికి స్పందన ఇది. కరీంనగర్‌కు చెందిన పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్

Published: Sat,October 6, 2012 03:51 PM

తెలంగాణ భూమి పుత్రిక

తన చరివూతను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త

Published: Sat,October 6, 2012 03:50 PM

హస్తినలో కాదు హైదరాబాద్‌లోనే చర్చలు

ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరముంది. ఒక్క ఎంపీ కూడా లేని చిరంజీవితో మాట్లాడ్డానికి ఆంటోని లాంటి అధిష్ఠానం దూతలు ఆగమేఘాల

Published: Sat,October 6, 2012 03:49 PM

ఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుల్లో ముందు వరుసలో నిలిచి, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వాడు దొడ్డికొ

Featured Articles