ఆత్మగౌరవాన్ని చాటిన్రు


Mon,November 9, 2015 11:23 PM

భ్రమలు తొందరగా నే పటాపంచలయినై. మీ(మో)డీయా మాయ లో మోడీ(మూఢ)త్వాని కి పట్టంగట్టి పట్టుమని 16 నెలలు కూడా కాలే దు. మతోన్మాద అసహనానికి, అగ్రకులాధిప త్యం, అహంభావానికి బీహారీ బిడ్డలు అసెంబ్లీ ఎన్నికల్లో మూ తోడ్ జవాబు చెప్పిం డ్రు. బీహారీల వల్లనే ముంబాయిలో నేరాలు పెరిగాయని అక్కడి ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని తిప్పికొడు తూ ఈ ఎన్నికల్లో తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నరు. ఎరగా చూపిన లక్షల కోట్లను కాదని తమ గౌరవాన్ని చాటుకున్నరు. భవిష్యత్తుకు తొవ్వ సూపిండ్రు. నువ్ మాకు ఓటెయ్యకుంటే శత్రువుతో జట్టుకట్టినట్టే అంటూ, మహాకూటమి గెలిస్తే పాకిస్థాన్‌లో పండుగ జరుపుకుంటరు అని కాషాయ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో ప్రచారం చేసిండు. ఓటర్లను బెదిరించడమే గాకుండా మనోభావాలను గాయపర్చిం డు. ప్రచారా న్ని దిగజార్చి గెలుపే ధ్యేయంగా నరేంద్ర మోదీ బీహార్‌కు లక్షా 25వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిండు. పద వి హోదా మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిండు. బీహార్ బహుజన నాయకత్వాన్ని హేళన చేసిండు. అంతే గాదు.. విద్యార్థులందరికీ లాప్‌టాప్ లు, అమ్మాయిలకు స్కూటర్లు, దళితులకు టీవీలు, ప్రజలందరికీ చీరలు, ధోతులు ఫ్రీగా పంచుతామని బీజేపీ మ్యానిఫెస్టో లో ప్రకటించింది. పన్నాగాలు పన్నినా, ఎన్ని డబ్బు సంచులు కుమ్మరించినా, ఎన్ని తీర్ల బెదిరించినా బీహారీలు ఐక్యంగా నిలబడ్డరు. జాతీ య స్థాయిలో బహుజన ప్రత్యామ్నాయానికి బాట చూపిండ్రు.

బీహార్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యు), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి బీజేపీని సమర్థంగా ఎదుర్కొన్నది. ఐక్యంగా నిలబడింది. ఎంఐఎం వల్ల కొంత నష్టం జరుగుతుందని ఊహించినా పెద్ద నష్టం లేకుండానే కూటమి మెజారిటీ సాధించగలిగిం ది. ఈ ఎన్నికల్లో 60 యేండ్ల కాంగ్రెస్ అవినీతి పాలన అని ఎన్కటి పాట పాడటానికి బీజేపీకి అవకాశం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ చిన్న భాగస్వామి కావడంతో బీజేపీ దాడికి ఆయుధాలు కరువయ్యాయి. అయినా విజ్ఞులైన బీహారీలు అసహనంతో చెలరేగుతున్న మూకలకు సహనమే ఆఖరి సమాధానమని తీర్పిచ్చిండ్రు.

ప్రెస్ వాళ్లను ప్రాస్టిట్యూట్స్‌తో పోలుస్తూ ప్రెస్టిట్యూట్స్ అనీ, ఇద్దరు చిన్నారి దళితుల్ని సజీవదహనం చేస్తే మానవత్వం లేకుండా వారిని కుక్కలతో పోల్చిన కేంద్రమంత్రి వి.కె. సింగ్, రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు మోహ న్ భగవత్ చేసిన ఉన్మాద వ్యాఖ్యలకు ఈ తీర్పు చెం ప పెట్టు. ఈ ఎన్నికలకు ముందు జనాభా లెక్కలన్నీ బయటపెట్టి బీసీల వివరాలు తొక్కిపెట్టి బహుజనులు ఎక్కువగా ఉన్న బీహార్‌లో పబ్బం గడుపుకోవాలని చూసిన బీజేపీకి ఓట ర్లు మంచి గుణపాఠం చెప్పిండ్రు. తలపొగరు రాజకీయాలు తమదగ్గర నడువయని తేల్చి చెప్పిండ్రు. అంతేకాదు తినే తిండిపై నా, వేసుకునే బట్టలపై నా, మాట్లాడే మాటలపై కాషాయ దళాలు అమానవీయంగా దాడులు చేయడమే గాకుండా బహిరంగంగా సమర్థించుకోవడానికి ప్రయత్నించా యి.

అధికారం అహంకారాన్ని తలకెక్కించుకున్న హిందూత్వవాదులు పాఠ్యపుస్తకాలు మొదలు ఆర్థికరంగం వరకు అన్నీ కలుషిత పరిచేందు కు కమిటీలు ఏసుకుండ్రు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న సమాజాన్ని నిలువునా చీల్చడానికి సిద్ధమైం డ్రు. దభోల్కర్, పన్సారే, కల్బుర్గిల పాణాలు దీసిన ఈ శక్తులు ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ అధికారం అండ తో మట్టుబెట్టేందుకు వెనుకాడటం లేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి అప్రతిహతంగా సాగుతున్న దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు ఈ ఎన్నికల ఫలితాలు కచ్చితంగా అడ్డుగోడగా నిలుస్తాయి.

బీఫ్ తినాలన్నందుకు కశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేనే చితగ్గొట్టిన బీజేపీయులు, అదే బీఫ్ తింటా అన్నందు కు నీ పాణం తీస్తామని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామప్పను ఆ రాష్ర్ట బిజేపీ నాయకులు వేదికల మీది నుంచే బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. దాద్రి లో ఫ్రిజ్‌లో బీఫ్ ఉందన్న అనుమానంతో ఓ ముస్లిం పాణాన్ని తీసిండ్రు. తాము అధికారంలో ఉన్న మహారాష్ర్టల్లో అధికారికంగానే బీఫ్‌ని బ్యాన్ చేసిండ్రు. ఎక్కడా బీఫ్ తినకుండా కేంద్ర విద్యాశాఖ ఎన్ని అవరోధాలు సృష్టించగలదో అన్ని సృష్టిస్తున్నది. నిలబడే నిద్రబోతున్న ప్రభుత్వాన్ని జాగృతం చేసేందుకు బుద్ధిజీవులు, సైంటిస్టులు తమ అవార్డుల్ని వెనక్కి ఇచ్చేస్తుంటే అవి తమ ప్రతిభను గుర్తించి ఇస్తున్నారన్నంత సంబురంగా బీజేపీ నాయకులున్నరు.
బీహార్ ఫలితాలు జాతీయస్థాయిలో బీజేపీకి బహుజన ప్రత్యామ్నాయాన్ని చాటి చెప్పాయి. నిజానికి బహుజనులందరూ ఐక్యంగా ఉన్నట్లయితే కచ్చితంగా విజయం ముద్దాడుతుందని ఈ ఫలితాలు నిరూపించాయి. రాబోయే వరంగల్ ఉప ఎన్నికలతో పాటు ఇక జరిగే ఎన్నికలన్నీ బీజేపికి చుక్కలు చూపిస్తాయని బీహారీలు తొవ్వ సూపిండ్రు.

sangisetti


భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న సమాజాన్ని నిలువునా చీల్చడానికి సిద్ధమైం డ్రు. దభోల్కర్, పన్సారే, కల్బుర్గిల పాణాలు దీసిన ఈ శక్తులు ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ అధికారం అండ తో మట్టుబెట్టేందుకు వెనుకాడటం లేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి అప్రతిహతంగా సాగుతున్న దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు ఈ ఎన్నికల ఫలితాలు కచ్చితంగా అడ్డుగోడగా నిలుస్తాయి.

1289

SRINIVAS SANGISETTI

Published: Thu,April 7, 2016 12:02 AM

ఉర్దూ రచయితలు ముద్దాయిలా?

ఈరోజు ఉర్దూ భాషలో రాసిన వారికోసం తీసుకొచ్చిన నిబంధన రేపు దక్షిణాది భాషలైన తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు భాషలపై కూడా రుద్దొచ్చు. ఎంద

Published: Sat,July 25, 2015 12:03 AM

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి

Published: Wed,August 6, 2014 02:29 AM

తెలంగాణ మశాల్ జయశంకర్

ఆధునిక తెలంగాణచరిత్ర అన్ని మలుపుల్లో నూ దారి చూపిన దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్ సార్. హైదరాబాద్ రాష్ట్రానికి ఆంధ్రోళ్ళ దోపిడీ పీ

Published: Sun,June 15, 2014 01:19 AM

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు

Published: Tue,September 3, 2013 12:27 AM

ఆంధ్ర పెత్తనంపై తొలి ధిక్కారం

పోలీసు చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వా త ఈ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్రజా పోరాటం ‘ముల్కీ ఉద్య మం’.

Published: Wed,May 29, 2013 12:23 AM

తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దీన్

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా’ మోగించిన రుక్నుద్దిన్ కలం

Published: Wed,January 30, 2013 11:14 PM

ఆధిపత్యవాదుల ఆయుధం అబద్ధం

ఇక ‘ప్రత్యేక తెలంగాణ’కల సాకారమైతుందనుకున్న ప్రతిసారీ ‘ఆధిపత్య’ సీమాం ధ్ర దోపిడీదార్లు, వారి తాబేదార్లు అబద్ధాల్ని అతిగా ప్రచారం

Published: Thu,January 3, 2013 02:07 PM

బానిస రచయితలకు సాహిత్య బహిష్కరణ

కోతకొచ్చిన తెలంగాణ పంటకు తెగులు పట్టుకుంది. ‘ప్రపంచ తెలుగు’ సభల పేరిట తెలంగాణకు పట్టిన ఈతెగులును సమూలంగా నిర్మూలిం చనట్లయితే అది త

Published: Sat,October 6, 2012 03:48 PM

దళితోద్యమ వేగుచుక్క

భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు

Published: Sat,October 6, 2012 03:49 PM

తెలంగాణ సాపెన

తెలంగాణ మొత్తం ఇయ్యాళ తుక్క తుక్క ఉడుకుతుంది. ఆసరయితడనుకున్న కొడుకు అంటుపెట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ కాలిపోతుండు. పానాల్దీసుకున్న

Published: Sat,October 6, 2012 03:49 PM

ప్రతీకల్ని మార్చుకుందాం..

త్యాగానికి ప్రతీక శ్రీరాములు’ (ఈ నెల 24) పేరిట రాసిన వ్యాసానికి స్పందన ఇది. కరీంనగర్‌కు చెందిన పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్

Published: Sat,October 6, 2012 03:51 PM

తెలంగాణ భూమి పుత్రిక

తన చరివూతను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త

Published: Sat,October 6, 2012 03:50 PM

హస్తినలో కాదు హైదరాబాద్‌లోనే చర్చలు

ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరముంది. ఒక్క ఎంపీ కూడా లేని చిరంజీవితో మాట్లాడ్డానికి ఆంటోని లాంటి అధిష్ఠానం దూతలు ఆగమేఘాల

Published: Sat,October 6, 2012 03:49 PM

ఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుల్లో ముందు వరుసలో నిలిచి, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వాడు దొడ్డికొ

Featured Articles