తెలంగాణ మశాల్ జయశంకర్


Wed,August 6, 2014 02:29 AM

ఆధునిక తెలంగాణచరిత్ర అన్ని మలుపుల్లో నూ దారి చూపిన దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్ సార్. హైదరాబాద్ రాష్ట్రానికి ఆంధ్రోళ్ళ దోపిడీ పీడన మొదలైన నాటి నుంచి తాను చనిపోయే వర కూ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమానికి ఊపిరులూదిన మేధావి జయశంకర్. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, భాష, ఆచార వ్యవహారాలు, పండుగలు పబ్బాలు, ఆర్థిక అసమానత లు, నీళ్లు, నిధులు, నియామకాలు ఇలా ప్రతి అం శంపై పూర్తి సాధికారత ఉన్న జ్ఞాని, తెలంగాణ వైతాళికుడు. తెలంగాణ కల సాకారమైన సందర్భంలో ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన చూపిన దారి బంగారు తెలంగాణకు పునాది.
వొడువని ముచ్చట, తెలంగాణ రాష్ర్టం ఒక డిమాండ్ పదుల సంఖ్యలో టీవీ, పరిశోధకుల ఇంటర్వ్యూల్లో, సభలు, సమావేశాల్లో జయశంకర్‌సార్ చెప్పిన చారిత్రక విషయాలు ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకోవాలి. రాబోయే తరాలకు మునుపటి తరాలు చేసిన త్యాగాలు, అనుభవించిన బాధలన్నీ తెలియాలి. చరిత్రకారుడిగా జయశంకర్‌సార్ రచనల్ని, ప్రసంగాల్ని ప్రత్యేకంగా అచ్చేయాలి. తాను సాక్షిగా ఉన్న చరిత్రను చిత్రిక గట్టాలి. తాను స్వ ప్నించిన సామాజికతెలంగాణను సాధించు కోవాలి.

jayshankaraహైదరాబాద్‌పై పోలీసు చర్యకు పూర్వం కమ్యూనిస్టుల ప్రభావం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదం, హైదరాబాద్ లో సివిల్, మిలిటరీ పాలన, ఆంధ్రా నుంచి ఉద్యోగుల దిగుమతి, స్థానిక భాష, సంస్కృతి అవహేళన, వందేమాతర ఉద్యమం, ముల్కీ రూల్స్, ముల్కీ ఉద్యమం, ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటు, హైదరాబాద్‌పై కబ్జాకు ఆంధ్రా నాయకుల కుట్ర, నెహ్రూ పాత్ర, ఫజల్‌అలీ కమిషన్, బూర్గుల,కె.వి.రంగారెడ్డి, చెన్నారెడ్డి, జె.వి. నరసింగరావులపై కేంద్ర హోంమంత్రి పంత్ ఒత్తిడి, పెద్ద మనుషుల ఒప్పందం, వాగ్దానాల ఉల్లంఘన, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఏర్పాటు, నిధుల మళ్ళింపు, భార్గవ కమిటీ, లలిత్ కమిటీ, తెలంగాణ రీజినల్ కమిటీ,గిర్‌గ్లానీ కమిటీ మొదలు శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణ ప్రతి సందర్భంలోనూ జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారు.

నీలం సంజీవరెడ్డి మొదలు కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్ వరకూ అందరూ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఆయన పూసగుచ్చినట్లు చెప్పిం డు. అందరూ తెలంగాణ కాడిని ఎప్పుడో ఒకప్పుడు ఎత్తేసినప్పటికీ, ఉద్యమ నిప్పు ఆరిపోకుండా ఉండడానికి పుల్లల్ని ఏరుకొ చ్చి, ఊదుకుంటూ కొలిమిని రాజేసిన జాతి మశాల్ జయశంకర్ సార్. తెలంగాణ ఉద్యమం ప్రతి మలుపులోనూ ఉన్న జయశంకర్ సార్ జ్ఞాపక శక్తి అమోఘమైనది. ఎనుకటి ముచ్చట్లు, అవహేళనకు గురైన చరిత్ర ప్రతీది పూసగుచ్చినట్టు చెప్పడంలో ఆయ న దిట్ట.

తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర ప్రధానమైం ది. భావజాల వ్యాప్తి, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ ఈ మూడింటితోనే తెలంగాణ సాధన సాధ్యమని బలంగా నమ్మి ప్రచారం చేసిండు. భావజాలవ్యాప్తి కోసం 1996 నుంచి తెలంగాణ ఐక్యవేదిక స్థాపించి భూమి పుత్రులకు జరుగుతున్న అన్యాయాలను, ఆంధ్రా పాలకుల దోపిడీ, మోసాలను ఉపన్యాసాల ద్వారా ప్రచా రం చేసిండు. ఈ చైతన్యంతో సాహిత్యం, పాటలు, ధూమ్‌ధావ్‌ు లు, పుస్తకాలు ప్రతి తెలంగాణ పౌరుణ్ణి చైతన్యపరిచాయి. ఎవరు తెలంగాణ జెండా ఎత్తుకున్నా ప్రజలు వారికి మద్దతుగా నిలిచిండ్రు. అయితే ఇంద్రారెడ్డి లాంటి ఒకరిద్దరు మొదట తెలంగాణ బావుటాను ఎత్తుకున్నా చివరి వరకూ మోసింది మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి. టీఆర్‌ఎస్ స్థాపన తర్వాత ఎవరు ఎక్కడ ఏ వేదిక పేరిట తెలంగాణ ఉద్యమం చేసినా అది అంతిమంగా ఆ పార్టీకి మాత్రమే మేలు చేసింది.

తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ జనసభ, కేసీఆర్, దేవేందర్ గౌడ్ ఇలా ఎవ్వరు తెలంగాణ కోసం నిలబడ్డా వారికి అండగా సార్ నిలిచిండు. తెలంగాణ కోసం కాసు బ్రహ్మానందరెడ్డి మొదలు చంద్రబాబు వరకూ అందరినీ ఎదిరించి నిలబడ్డడు. నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్నడూ వదల్లే దు. సామాజిక న్యాయం తెలంగాణ రాష్ర్టం లో సాధ్యమని చెప్పిండు.

నిజాం వ్యతిరేక పోరాటం, సాయుధ సమరం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్య మం, నక్సలైట్ ఉద్యమం, కుల సంఘాల ఉద్యమాలు బడుగు బలహీన వర్గాల్లో తీసుకొచ్చిన చైతన్యమే తెలంగాణలో సామాజిక న్యాయం కలిగిస్తుందని జయశంకర్ సార్ నమ్మిండ్రు. ఈ వర్గాల నుంచి ఎదిగి వచ్చిన వారు సీఎం పదవి దక్కించుకున్నట్లయితే సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన భావించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆరు దశాబ్దాల పాటు తన రచన లు, ఉపన్యాసాలు, ఉద్యమాల ద్వారా నిరంతర కృషి చేసిండు. తాను కలలు కన్న తెలంగాణను చూడకుండానే కన్ను మూసిం డు. జయశంకర్ సార్ పేరిట కేంద్ర పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా స్టాంప్‌ని జారీ చేయించాలి. ఆయన పేరిట తెలంగాణ ప్రజలందరూ గర్వించేలా సాహిత్యం, చరిత్ర, సంస్కృతిపై పరిశోధనలు జరిపే విశిష్ట కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దీని ద్వారా మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రను, సంస్కృతిని వెలుగులోకి తేవాలి.

తెలంగాణ ప్రజలందరూ గౌరవించేలా, గుర్తించేలా జయశంకర్ సార్ జన్మదినాన్ని తెలంగాణ ఉపాధ్యాయ దినంగా ప్రకటించి పెద్ద ఎత్తున పండుగలాగా నిర్వహించాలి. ఆయన స్ఫూర్తిని భవిష్యత్తు తరాల వారికి అందించేలా సార్ జీవిత చరిత్రను రాయించాలి. పాఠ్యపుస్తకాల్లో ఆయన చరిత్రను పాఠ్యాంశం చేయాలి. బంగారు తెలంగాణ నిర్మించుకోవాలి. అదే జయశంకర్ సార్‌కు నిజమైన నివాళి.

973

SRINIVAS SANGISETTI

Published: Thu,April 7, 2016 12:02 AM

ఉర్దూ రచయితలు ముద్దాయిలా?

ఈరోజు ఉర్దూ భాషలో రాసిన వారికోసం తీసుకొచ్చిన నిబంధన రేపు దక్షిణాది భాషలైన తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు భాషలపై కూడా రుద్దొచ్చు. ఎంద

Published: Mon,November 9, 2015 11:23 PM

ఆత్మగౌరవాన్ని చాటిన్రు

భ్రమలు తొందరగా నే పటాపంచలయినై. మీ(మో)డీయా మాయ లో మోడీ(మూఢ)త్వాని కి పట్టంగట్టి పట్టుమని 16 నెలలు కూడా కాలే దు. మతోన్మాద అసహనానికి,

Published: Sat,July 25, 2015 12:03 AM

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి

Published: Sun,June 15, 2014 01:19 AM

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు

Published: Tue,September 3, 2013 12:27 AM

ఆంధ్ర పెత్తనంపై తొలి ధిక్కారం

పోలీసు చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వా త ఈ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్రజా పోరాటం ‘ముల్కీ ఉద్య మం’.

Published: Wed,May 29, 2013 12:23 AM

తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దీన్

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా’ మోగించిన రుక్నుద్దిన్ కలం

Published: Wed,January 30, 2013 11:14 PM

ఆధిపత్యవాదుల ఆయుధం అబద్ధం

ఇక ‘ప్రత్యేక తెలంగాణ’కల సాకారమైతుందనుకున్న ప్రతిసారీ ‘ఆధిపత్య’ సీమాం ధ్ర దోపిడీదార్లు, వారి తాబేదార్లు అబద్ధాల్ని అతిగా ప్రచారం

Published: Thu,January 3, 2013 02:07 PM

బానిస రచయితలకు సాహిత్య బహిష్కరణ

కోతకొచ్చిన తెలంగాణ పంటకు తెగులు పట్టుకుంది. ‘ప్రపంచ తెలుగు’ సభల పేరిట తెలంగాణకు పట్టిన ఈతెగులును సమూలంగా నిర్మూలిం చనట్లయితే అది త

Published: Sat,October 6, 2012 03:48 PM

దళితోద్యమ వేగుచుక్క

భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు

Published: Sat,October 6, 2012 03:49 PM

తెలంగాణ సాపెన

తెలంగాణ మొత్తం ఇయ్యాళ తుక్క తుక్క ఉడుకుతుంది. ఆసరయితడనుకున్న కొడుకు అంటుపెట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ కాలిపోతుండు. పానాల్దీసుకున్న

Published: Sat,October 6, 2012 03:49 PM

ప్రతీకల్ని మార్చుకుందాం..

త్యాగానికి ప్రతీక శ్రీరాములు’ (ఈ నెల 24) పేరిట రాసిన వ్యాసానికి స్పందన ఇది. కరీంనగర్‌కు చెందిన పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్

Published: Sat,October 6, 2012 03:51 PM

తెలంగాణ భూమి పుత్రిక

తన చరివూతను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త

Published: Sat,October 6, 2012 03:50 PM

హస్తినలో కాదు హైదరాబాద్‌లోనే చర్చలు

ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరముంది. ఒక్క ఎంపీ కూడా లేని చిరంజీవితో మాట్లాడ్డానికి ఆంటోని లాంటి అధిష్ఠానం దూతలు ఆగమేఘాల

Published: Sat,October 6, 2012 03:49 PM

ఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుల్లో ముందు వరుసలో నిలిచి, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వాడు దొడ్డికొ