ఆధిపత్యవాదుల ఆయుధం అబద్ధం


Wed,January 30, 2013 11:14 PM


ఇక ‘ప్రత్యేక తెలంగాణ’కల సాకారమైతుందనుకున్న ప్రతిసారీ ‘ఆధిపత్య’ సీమాం ధ్ర దోపిడీదార్లు, వారి తాబేదార్లు అబద్ధాల్ని అతిగా ప్రచారం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. చరివూతలో రికార్డయిన నిఖార్సయిన నిజాలను కూడా పచ్చి అబద్ధాలుగా తమకు అనుకూలమైన మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వారు చెప్పే విషయాల్ని కౌంటర్‌చెక్ చేసుకొని వాస్తవాల్ని ప్రజలకు చేరవేయడం మీడియా బాధ్యత. అయితే ఈ బాధ్యతను విస్మరించి, మెజరిటీ వార్తా ఛానళ్లు, పత్రికలు సీమాంధ్ర ఆధిపత్యానికి వత్తాసు పలుకుతున్నాయి. ఇందులో భాగంగానే ఢిల్లీలో విశాలాంధ్ర మహాసభ తరపున పరకాల ప్రభాకర్ ‘ప్రత్యేక తెలంగాణవాదుల 101 అబద్ధాలు’ అనే పుస్తకానికి ఆవిష్కరణ. దీనికి డిబేట్స్, డిస్కషన్స్ ద్వారా బహుళ ప్రచారం కల్పించారు. ఇందుకు కొనసాగింపుగా రాజమంవూడిలో ఉండవల్లి అరుణకుమార్ ‘నవ్విపోదురుగాక నాకేటి సిగు’్గ అన్న చందంగా కుప్ప బోసిన అసత్యాల్ని మీడియా ‘లైవ్’గా ప్రసారం చేసింది.

హైదరాబాద్ అసెంబ్లీలో 147 మంది ఎమ్మెల్యేల్లో 102 మంది సమైక్యాంధ్ర కోసం ఓటేసిండ్రని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నాడు. అలాగే పరకాల ప్రభాకర్ తన అబద్ధాల పుట్ట 14వ పుటలో 1955, నవంబర్ 25 నుంచి డిసెంబర్ మూడు వరకు హైదరాబాద్ అసెంబ్లీలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నివేదికపై చర్చలు జరిగాయి. ఈ చర్చ సందర్భంగా జరిగిన అధికారిక తీర్మానంలో మొత్తం 174 మంది ఎమ్మెల్యేల్లో 103 మంది విశాలాంవూధకు అనుకూలంగా 29 మంది ప్రత్యేక తెలంగాణకు మద్ధతుగా మరో 15 మంది ఎమ్మేల్యేలు తటస్థంగా ఉన్నారని రాసిండు.

ఇవి అద్ధాలు అని చెప్పే ముందు ఒక వివరణ ఇవ్వాలి. హైదరాబాద్ అసెంబ్లీలో మరఠ్వాడా, కర్నాటక, తెలంగాణ ప్రాంతానికి చెందిన సభ్యులుండేవారు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్న మరఠ్వాడా, కర్నాటక ప్రాంతాలు వరుసగా మహారాష్ర్ట, సంయుక్త కర్నాటకలో కలవాలని మొదటి నుంచి కోరుకున్నారు. అలాగే తెలంగాణలో అధిక సంఖ్య లో గెలిచిన కమ్యూనిస్టులు ‘విశాలాంవూధలో ప్రజారాజ్యం’ పేరిట ‘విశాలాంధ్ర’ కోసం పట్టుబట్టిండ్రు. ఆనాడు కమ్యూనిస్టులు ప్రొగ్రెస్సివ్ డెమోవూకటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) పేరిట ఏర్పడి విశాలాంధ్ర ఏర్పడినట్లయితేనే అక్కడ కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తుందనే భావనతో మాత్రమే అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నరు. ఎందుకంటే ఆంధ్రవూపాంతంలో కొంతమేరకు, తెలంగాణలో అధిక సంఖ్యలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది. ఈ రెండు ప్రాంతాలు ఏకమైనట్లయితే తాము అధికారంలోకి రావచ్చనే భావనతో పిడిఎఫ్ అందుకు సమ్మతం తెలిపింది.

నవంబర్ 25నుంచి డిసెంబర్ మూడు వరకు ఆంధ్ర అసెంబ్లీ సమావేశమయ్యింది తప్ప హైదరాబాద్ అసెంబ్లీ కాదు. ఈ వివరాల్ని పరకాల ప్రభాకర్ మీడియాకు విడుదల చేయాల్సిన అవసరముంది.1955, నవంబర్22న హైదరాబాద్ అసెంబ్లీలో ఎస్సార్సీపై కేవలం చర్చ జరిగింది. ఎలాంటి తీర్మానం జరుగలేదు. గందరగోళం మధ్య సభ వాయిదాపడిందనేది మాదగ్గరున్న సమాచారం. అందుకు భిన్నంగా ఏమైనా ఉంటే దాన్ని పరకాల ప్రభాకర్ పత్రికల వారితో పంచుకోవాలి. పరకాల తన పుస్తకంలో సాక్ష్యాలు, ఆధారాలు అన్ని జోడించి ఇంత ముఖ్యమైన విషయంలో ఏ ఆధారం ఎందుకు ఇవ్వలేదు?
హైదరాబాద్ అసెంబ్లీలో ఆంధ్రవూపాంతంతో తెలంగాణ తెలుగు ప్రాంతాన్ని కలపాలని కమ్యూనిస్టులు చేసిన ప్రతిపాదన వీగిపోయింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లయితే సీమాంధ్ర ‘మేతావులు’ చేస్తున్న వాదనల్లో డొల్లతనం తేటతెల్లమవుతుంది.
నిజానికి 1953, ఏప్రిల్ 10, 11తేదీల్లో పీడీఎఫ్‌కు చెందిన కె వి.డి. దేశ్‌పాండే తదితరులు హైదరాబాద్ అసెంబ్లీలో తెలుగు వారి సామాజిక, ఆర్థిక ప్రగతి కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల్ని ఏర్పాటు చేయాలని, అందుకోసం ఈ అసెంబ్లీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పా టు చేయాలని అని భారత రాష్ర్టపతిని కోరుతోందని అన్నారు.
అందుకోసం హైదరాబాద్ అసెంబ్లీలో ఈ క్రింది తీర్మానాలు చర్చకు పెట్టారు.
1. హైదరాబాద్ రాష్ట్రాన్ని భాషల ఆధారంగా విభజించాలి. 2. హైదరాబాద్ సరిహద్దు ప్రొవిన్స్‌ల్లోని ప్రదేశాలను భాష ఆధారంగా పునర్నిర్మించాలి. 3. హైదరాబాద్ రాష్ట్రా న్ని భాషా ప్రాతిపదికన విభజించి వాటిని ఆయా భాషల వారితో కలపాలి. 4. తెలుగు మాట్లాడే ప్రాంతాల్ని ప్రతిపాదిత ఆంధ్రరాష్ర్టంతో కలపాలి. 5. సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకోవడం కోసం వెంటనే ‘బౌండరీ కమిషన్’ని ఏర్పాటు చేయాలి.

ఈ తీర్మానాలపై ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఇప్పటి అసెంబ్లీలోనే సుధీర్ఘమైన చర్చలు జరిగాయి. మరఠ్వాడా, కర్నాటక, హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన చాలా మంది చర్చలో పాల్గొన్నారు. చివరికి ఓటింగ్ జరగ్గా తీర్మానానికి అనుకూలంగా 68 మంది, వ్యతిరేకంగా 70 మంది ఎమ్మేల్యేలు ఓటేశారు. ఒకరు న్యూట్రల్‌గా ఉన్నారు.

ఈ తీర్మానాన్ని తెలంగాణకు చెందిన పీడీఎఫ్ సభ్యులు ఆరుట్ల లక్ష్మీనరసింహాడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల కమలాదేవి, వి.డి.దేశ్‌పాండే, బద్దం ఎల్లాడ్డి, మఖ్దూమ్, జి.హనుమంతరావు, పెండెం వాసుదేవ్, రెంటాల బాలగురుమూర్తి, సి.హెచ్. వెంకటరామారావు, కె ఉప్పల మల్సూర్ తదితర కమ్యూనిస్టులు సమర్ధించారు. ఇందులో ఇప్పటికీ ఖమ్మంకు చెందిన రెంటాల బాలగురుమూర్తి జీవించే ఉన్నాడు. ఆయన్నడిగి వివరాలు తెలుసుకోవచ్చు.

అలాగే తీర్మానానికి వ్యతిరేకంగా బూర్గుల రామకృష్ణారావు, కొండా ఎం.ఎస్. రాజలింగం, సురవరం ప్రతాపడ్డి, సంగెం లక్ష్మిబాయి, జి.ఎస్.మెల్కోటే, ఎం.ఎస్. ప్రాణేశాచార్య, అరిగె రామస్వామి, జె.బి.ముత్యాలరావు తదితరులు ఓటేశారు. ఒకే ఒక్కరు రాజమణీదేవి తటస్థంగా ఉన్నారు.

పార్లమెంటులో చర్చపై కూడా ఇదే విధమైన దుష్ర్పచారాన్ని చేస్తున్నారు. నిజానికి తెలంగాణ నుంచి గెలిచిన సభ్యులు ‘విశాలాంవూధ’కు వ్యతిరేకంగా మాట్లాడారు కూడా. లోక్‌సభలో 1955, డిసెంబర్ 23 నాడు జరిగిన చర్చలో జయసూర్యనాయుడు వాదనల్ని తెలంగాణ వాదులు ఖండించారు. దాని గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరముంది. జయసూర్య నాయుడు కమ్యూనిస్టు అనే విషయం గుర్తుంచుకోవాలి.
ఇది వాస్తవం. అయినా 1953లో విశాలాంవూధను బలంగా కోరుకున్న కమ్యూనిస్టు పార్టీ ల్లో సిపిఐ ఇప్పుడు అంతకన్నా బలంగా ప్రత్యేక తెలంగాణను కోరుతున్నది. అప్పటికీ, ఇప్పటికీ చరివూతలో, సమాజంలో చాలా మార్పులు జరిగాయి. వీటిని లెక్కలోకి తీసుకోకుండా తాను చెప్పేది మాత్రమే నిజం అని నమ్మాలంటే దానికి తెలంగాణవాదులు సిద్ధం గా లేరు.

ఇక రెండో అబద్ధం-మీ ప్రాంతం వారే విశాలాంధ్ర కావాలని కోరుకున్నారు అనేది. నిజానికి 1955, నవంబర్ 25, 26 తేదీల్లో కర్నూలులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిం చి అందులో ఎస్సార్సీ నిర్ణయించిన దానితో సంబంధం లేకుండా ఇప్పటికిప్పుడే తెలంగాణఆంవూధవూపాంతాలను ఒక్కటిగా కలపాలని తీర్మానించారు. అలాగే తెలంగాణ ప్రాంతంలోని విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రక్షణ కల్పిస్తామని, మేలైన సాగునీటి వ్యవస్థను ఏర్పాటుచేస్తామని కూడా తీర్మానించారు. వాస్తవం ఇలా ఉంటే తెలంగాణ ప్రాంతం వారు మాత్రమే విశాలాంవూధను కోరుకున్నారు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. రెండు ప్రాంతాలు కలిసిపోయినట్లయితే గోదావరి, కృష్ణాజలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని అభివృద్ధి చేసుకోవచ్చని కూడా అభివూపాయపడ్డారు. తెలంగాణకు ప్రత్యేక హోదా ను కల్పించి అభివృద్ధిపరుస్తామని కూడా పేర్కొన్నారు. ఇవన్నీ నీటిమూటలయిన విషయం ఈ 56 యేండ్ల అనుభవం తెలియచెబుతూనే ఉంది. సమైక్యం పేరిట కృష్ణా, గోదావరి నదుల నీళ్ళు దోసుకెళ్ళిన తీరు నల్లగొండ ఫ్లోరైడ్ బాధలు చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఫ్లోరైడ్ సమస్య ‘మా అనంతపురం,నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఉంది.

దానికి మీరు గగ్గోలు పెడితే ఎలా’ అని పరకాల ప్రభాకర్ తన పుస్తకంలోని 50 పేజీలో అభివూపాయపడ్డారు. అయ్యా మా నల్లగొండ పక్కనుంచే కృష్ణానది పోతున్నా అది మాకు అందకుండా మీ ప్రకాశం జిల్లాలోని పంటలకు కూడా నీళ్లందించిందనేది వాస్తవం కాదా? నల్లగొండ ఫ్లోరైడ్ మరే ఇతర ప్రాంతంతో పోల్చలేనిది. ఇక్కడి ఫ్లోరైడ్ పీడిత ప్రజలు కాళ్ళు చేతులు, కొంకర్లు పోయి కనీసం లేచి నిలబడలేని పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి, ఇంత తీవ్రంగా మరెక్కడా లేదు. చిరంజీవితో కలిసి సామాజిక తెలంగాణకు జై అని నటన చేసిన మేకవన్నె పులి పరకాల ప్రభాకర్ ఇప్పుడు ముసుగు తొలిగించుకొని తన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.

వాస్తవాలు ఇలా ఉంటే విశాలాంధ్ర మహాసభ పేరిట తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, ఆర్థికాభివృద్ధిపై, రాజకీయాలపై నూటికి నూటొక్క శాతం అబద్ధాల్ని ప్రచారం చేసే ఉద్దేశ్యంతో పరకాల ప్రభాకర్ గందరగోళం సృష్టిస్తుండు. అలాగే లగడపాటి, అడుసుమిల్లిలకు తోడుగా ఇప్పుడు కొత్తగా ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా విషం కక్కడం ప్రారంభించాడు. గోబెల్స్ ప్రచారం ద్వారా న్యాయమైన, ప్రజాస్వామికమైన డిమాండ్‌ని అడ్డుకోవాలని చూస్తున్నారు. వీరు చేసే అబద్ధపు ప్రచారాలకు ప్రతి ఒక్కదానికి జవాబు చెప్పడానికి, నిజాలు రుజువు చేయడానికి తెలంగాణ ప్రజల దగ్గర కచ్చితమైన సమాచారమున్నది. తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమైన తెలంగాణ ప్రజల్ని అబద్ధాల ప్రచారంతో కుంగదీయాలని, తద్వారా ఉద్యమాన్ని దెబ్బతీసి తమ ఆధిపత్యాన్ని అప్రతిహతంగా కొనసాగించడానికి సీమాంధ్ర దోపిడీ వర్గం చేస్తున్న కుట్రలను ఛేదించాలి. తెలంగాణ గమ్యాన్ని ముద్దాడే వరకు కొట్లాట కొనసాగించడం ద్వారానే అబద్ధాలకు అడ్డుకట్ట వేయగలం. అబద్ధాలను పాతర వేద్దాం, నిజాల్ని ఊరేగిద్దాం.

-సంగిశెట్టి శ్రీనివాస్

35

SRINIVAS SANGISETTI

Published: Thu,April 7, 2016 12:02 AM

ఉర్దూ రచయితలు ముద్దాయిలా?

ఈరోజు ఉర్దూ భాషలో రాసిన వారికోసం తీసుకొచ్చిన నిబంధన రేపు దక్షిణాది భాషలైన తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు భాషలపై కూడా రుద్దొచ్చు. ఎంద

Published: Mon,November 9, 2015 11:23 PM

ఆత్మగౌరవాన్ని చాటిన్రు

భ్రమలు తొందరగా నే పటాపంచలయినై. మీ(మో)డీయా మాయ లో మోడీ(మూఢ)త్వాని కి పట్టంగట్టి పట్టుమని 16 నెలలు కూడా కాలే దు. మతోన్మాద అసహనానికి,

Published: Sat,July 25, 2015 12:03 AM

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి

Published: Wed,August 6, 2014 02:29 AM

తెలంగాణ మశాల్ జయశంకర్

ఆధునిక తెలంగాణచరిత్ర అన్ని మలుపుల్లో నూ దారి చూపిన దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్ సార్. హైదరాబాద్ రాష్ట్రానికి ఆంధ్రోళ్ళ దోపిడీ పీ

Published: Sun,June 15, 2014 01:19 AM

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు

Published: Tue,September 3, 2013 12:27 AM

ఆంధ్ర పెత్తనంపై తొలి ధిక్కారం

పోలీసు చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వా త ఈ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్రజా పోరాటం ‘ముల్కీ ఉద్య మం’.

Published: Wed,May 29, 2013 12:23 AM

తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దీన్

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా’ మోగించిన రుక్నుద్దిన్ కలం

Published: Thu,January 3, 2013 02:07 PM

బానిస రచయితలకు సాహిత్య బహిష్కరణ

కోతకొచ్చిన తెలంగాణ పంటకు తెగులు పట్టుకుంది. ‘ప్రపంచ తెలుగు’ సభల పేరిట తెలంగాణకు పట్టిన ఈతెగులును సమూలంగా నిర్మూలిం చనట్లయితే అది త

Published: Sat,October 6, 2012 03:48 PM

దళితోద్యమ వేగుచుక్క

భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు

Published: Sat,October 6, 2012 03:49 PM

తెలంగాణ సాపెన

తెలంగాణ మొత్తం ఇయ్యాళ తుక్క తుక్క ఉడుకుతుంది. ఆసరయితడనుకున్న కొడుకు అంటుపెట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ కాలిపోతుండు. పానాల్దీసుకున్న

Published: Sat,October 6, 2012 03:49 PM

ప్రతీకల్ని మార్చుకుందాం..

త్యాగానికి ప్రతీక శ్రీరాములు’ (ఈ నెల 24) పేరిట రాసిన వ్యాసానికి స్పందన ఇది. కరీంనగర్‌కు చెందిన పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్

Published: Sat,October 6, 2012 03:51 PM

తెలంగాణ భూమి పుత్రిక

తన చరివూతను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త

Published: Sat,October 6, 2012 03:50 PM

హస్తినలో కాదు హైదరాబాద్‌లోనే చర్చలు

ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరముంది. ఒక్క ఎంపీ కూడా లేని చిరంజీవితో మాట్లాడ్డానికి ఆంటోని లాంటి అధిష్ఠానం దూతలు ఆగమేఘాల

Published: Sat,October 6, 2012 03:49 PM

ఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుల్లో ముందు వరుసలో నిలిచి, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వాడు దొడ్డికొ