బానిస రచయితలకు సాహిత్య బహిష్కరణ


Thu,January 3, 2013 02:07 PM

కోతకొచ్చిన తెలంగాణ పంటకు తెగులు పట్టుకుంది. ‘ప్రపంచ తెలుగు’ సభల పేరిట తెలంగాణకు పట్టిన ఈతెగులును సమూలంగా నిర్మూలిం చనట్లయితే అది తెలంగాణ రాష్ట్ర సాకారానికి ప్రధాన అవరోధంగా మారనుంది. మనవాడెవ్వడో పరాయి వాడెవ్వడో తేల్చుకోవాల్సిన సమయమిది. తెలంగాణలోని పది జిల్లాల్లో బిడ్డలు నిత్యంరోడ్డుమీది కొచ్చి సీమాంధ్ర ఆధిపత్యా నికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నరు. నిత్యం ఈనేల నెత్తురుతో తడుస్తూనే ఉన్నది. మానని గాయాలతోటి తల్లడిల్లుతున్న తెలంగాణ తల్లికి మరిన్ని గాయాలు చేసేం దుకు కొంతమంది ‘తెలంగాణవాసులు’ సమైక్యవాదులు జరిపిన తిరుపతి ‘ఆధి పత్యసభల్లో’పాల్గొన్నరు. ఇందులో తెలంగాణపై ఎటూ తేల్చి చెప్పకుండా తప్పిం చుకు తిరుగుతున్న వాళ్లేగాకుండా, తెలంగాణవాదులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. జ్ఞానంతో ఆలోచించే ఆంధ్రులు సైతం‘కావడి కుండలు’ పేరిట తెలంగాణకు మద్ధతు పలికిండ్రు. అట్లాంటిది కొంత మంది తెలంగాణవాళ్లు భావ సమైక్యత సాధించేందుకు ప్రభుత్వం నిర్వహించిన సభల్లో పాల్గొని తమ అజ్ఞానంతో ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేసిండ్రు.

1969లో యావత్ తెలంగాణ జై తెలంగాణ అని పిడి కిలి బిగిస్తే సి.నారాయణరెడ్డి మాత్రం ‘తెలుగుజాతి మన ది నిండుగ వెలుగుజాతి మనది’ అని సమైక్యవాదులకు నినాదాలందించిండు.అదే నారాయణరెడ్డి ఇవ్వాళ ప్రపంచ తెలుగు మహాసభలకు ‘ప్రార్థనా గీతాన్ని’అందించిండు. తర్వాతి కాలంలో జ్ఞానపీఠం కూడా అందుకు న్నాడు. తెలంగాణ అంతా ఒక్కటై సీమాంధ్ర ఆధిపత్య సభల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చినా నారాయణరెడ్డి లాంటివాళ్ళు మాత్రం తెలంగాణతోటి మాకేంది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆయన ఏమి మాట్లాడినా, ఆచరించినా ఆయన్ని మార్గదర్శిగా ఎంచుకునే ‘సాహితీ సమూహం’ తెలంగాణలో ఇంకా ఉన్నది. అందు కే ఆయన మాటకు విలువున్నది. ఈ విలువల వలువల్ని వదిలించుకొని సమైక్యాం ధ్రతో ఊరేగుతామంటే అభ్యంతరమేమి లేదు.కానీ అదే విషయం స్పష్టంగా ఎరు కపరిస్తే అశేష తెలంగాణ జనావళి కూడా ఆయన పట్ల ఒక నిర్ణయం తీసుకుంటది.

తెలంగాణ వ్యతిరేకులకు గడ్డం చెసేది లేదని మంగ ళోళ్లు, వాళ్ళ బట్టలుతకబోమని రజకులు, చివరికి కాష్టం కాలువబోమని కాటి కాపరులు సైతం తెగేసి చెప్పిన సం దర్భం ఇది. అలాంటిది సమాజానికి వేగు చుక్కలై, అన్యాయం, అవినీతి, ఆధిప త్యం, దోపిడీపై తమ అక్షరాల్ని ఎక్కుపెట్టాల్సిన కవులు, రచయితలు ప్రభుత్వం విదిల్చే కాసుల కోసం, వ్యక్తిగత ప్రతిష్ట కోసం,శాలువాలు, అవార్డుల కోసం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడం శోచనీయం. ‘సీమాంధ్ర తెగులు’ సభలకు వెళ్ళిన ప్రతి తెలంగాణవాడిని సాహితీ సమాజం నుంచి బహిష్కరించాలి. నిజానికి కవి, పండి తులకు జీవితానంతరమే ఎక్కువ గౌరవం దక్కుతుంది. ఎంతటి రాజకీయ నాయ కుడైనా వారిని జయంతి,వర్ధంతి సందర్భాల్లోనే స్మరించుకుంటాం.కానీ కవి, పం డితులను వారి రచనల మూలంగా సదా జ్ఞాపకం ఉంచుకుంటాం. అట్లా భవి ష్యత్తులో కూడా గౌరవంగా నిలబడాల్సిన వాళ్లు వర్తమానంలోనే తలదించుకునే పనులు చేస్తున్నారు.

సభలకు సాహితీవేత్తలే గాకుండా తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి తామూ తెలంగాణవాదులమే అని చెప్పుకునే ప్రొఫెసర్లు, లెక్చరర్లు కూడా వెళ్లారు. అన్నా, అయ్యా,సారూ వెయ్యిమంది ఆత్మబలిదానాలు చేసిండ్రు. వారి శవాల మీదుగా తిరుపతి సభలకు వెళ్ళొద్దని పత్రికల ద్వారా, పర్సనల్‌గానూ చెప్పి చూసినం.

అయినా ‘మాకు ప్రపంచ స్థాయి సమావేశంలో గుర్తింపువస్తది. మా ప్రతిభను గుర్తించి మమ్మల్ని సమావేశాలకు పిలిచార’ని అడ్డగోలు జవాబు లిచ్చిం డ్రు. నిజానికి ఆధి పత్య సభల్ని వ్యతిరేకిస్తూ, బహిష్కరిస్తూ వీళ్లు బహిరంగ ప్రకటన చేసి నట్లయితే వారి గుర్తింపుకు ఎలాంటి భంగం ఉండేది కాదు.అంతకు మించి తెలంగాణలో ఘనమైన గౌరవం, కీర్తి దక్కేది.అట్లా గాకుండా తమ బానిస భావ జాలాన్ని మరొక్కసారి ప్రదర్శించుకున్నారు. ప్రపంచసభల సందర్భంగా ప్రభు త్వం ప్రకటించిన కరపత్రంలో చాలామంది తెలంగాణవాదుల పేర్లు కూడా ఉన్నా యి. తమ అనుమతి లేకుం డా ఈ పేర్లను జతపర్చిన ట్లయితే అందుకు బహిరం గంగా కమిటీ వారిని నిల దీయాలి. ఒకవేళ తమ అనుమతి ఉండీ తర్వాతి కాలంలో మనసు మార్చు కొని సభల్ని బహిష్కరిస్తే ఆ విషయాన్ని కూడా పత్రికా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయాలి.

జీవితకాలంలో అరుదు గా దక్కే ‘ఉత్తమ ఉపాధ్యా యుడు’ అవార్డును సైతం టీచర్లు తిరస్కరిస్తున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం ఇచ్చే ఎలాంటి అవార్డులను తీసు కోబోమని తెగేసి చెబుతుండ్రు. అలాగే తెలుగు యూనివర్సిటీ, ప్రభుత్వ సంస్థలు ఇచ్చే అవార్డులను, పురస్కారాలను కూడా తిరస్కరిస్తూ కవులు, పండితులు, రచ యితలు, విశిష్ట వ్యక్తులు బహిరంగంగా తమ నిరసనను వ్యక్తం జేస్తున్నరు. అవార్డులు తిరస్కరించిన వారిని తెలంగాణ సమాజం గొప్పగా గౌరవించుకుం టున్నది. ఒక వైపు అవార్డులను, పురస్కారాలను తృణప్రాయంగా ఎంచి తిరస్క రిస్తుంటే తిరుపతి సభలకు ఆహ్వానం అందగానే పోలోమని చాలా మంది కవులు హాజరయ్యిండ్రు. మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్ లతోపాటు మొత్తం పది జిల్లాల నుంచి కవులు హాజరయ్యిండ్రు. దొంగల్లాగా తమపేర్లు ఎక్కడా రాకుండా జాగ్రత్తపడ్డరు. ప్రభుత్వ ఆధిపత్య వైఖరిని ఏ మాత్రం నిరసన తెలియజేయడానికి వీలులేని ఈ సభల్లో పాల్గొనడమంటేనే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం. గోడ మీది పిల్లుల్లాగా అవకాశాన్ని బట్టి తమ అభిప్రాయాన్ని మార్చుకునే ఇలాంటి వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రచారం చెయ్యాలి.

అవకాశం దొరికితే చాలు తెలంగాణలో సమైక్యవాదమే ఎక్కువగా ఉంది, కానీ ప్రత్యేకవాదులకు భయపడి దాన్ని వెల్లడించడం లేదని సీమాంధ్ర ఆధిపత్యవర్గం గతం నుంచీ చేస్తున్న వాదనను మళ్ళీ తెరమీదికి తీసుకొచ్చింది. తెలంగాణవాదం బలంగా ఉంటే విశ్వ విద్యాలయాల నుంచి ఇంతమంది ఆచార్యులు, సంగీత, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తున్న వారు ఈ సమావేశాలకు హాజర య్యేవారు కారని చెబు తున్నారు.ఆధిపత్య సం స్కృతిని బాహాటంగా ప్రదర్శించే ఈసమా వేశా ల్లో తెలంగాణవాదులు ఎందుకు పాల్గొన్నారు? స్వయంగా సమై క్యాంధ్ర జేఏసీలో భాగస్వామి అయిన మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో జరిగే ఈ సభల్లో కచ్చి తంగా తెలంగాణ కళలు, సంస్కృతి, సాహిత్యాని కి సముచిత స్థానం దక్క దని ఎందుకు గుర్తించలేకపోయారు? తెలంగాణవాదం ఉధృతంగా ఉన్న సమ యంలో తెలంగాణవాదుల్ని కన్ఫ్యూజ్ చేసి వారిలో చీలిక తీసుకురావడం పాలకుల ఉద్దేశ్యమని ఎందుకు గ్రహించలేకపోయారు? దశాబ్దాల తరబడి ఊసు లేకుండా ఉన్న సభల్ని ఈ సందర్భంలోనే నిర్వహించాలని నిర్ణయించడంలోనే ప్రభుత్వ కుట్ర తెలియడం లేదా? తెలంగాణ అస్తిత్వాన్ని తెరమరుగు చేయాలని చూడడం కాదా?తిరుపతి వేదికల మీద ఎవరైనా సమైక్యవాదం గాకుండా తెలంగాణ వాణినివినిపించారా?తెలంగాణకు ఏమీగాని ‘తెలుగుతల్లి’ని పూజించడమంటే సమైక్య భావజాల వ్యాప్తి కాదా? దీనికి సభలకు హాజరైన వాళ్ళు జవాబివ్వాలి. ఈ సభలకు తెలంగాణ వారెవ్వరూ హాజరు కాకూడ దని చాలా రోజులుగా కోరుతున్నా, పెడచెవిన పెట్టిన వాళ్ళని తప్పకుండా నిలదీయాల్సిందే! వీరి ద్రోహబుద్దిని ప్రజలకు తెలియజేయాలి. లేదంటే వాళ్లు హీరోలుగా చలామణి అయ్యే ప్రమాదమున్నది.

ఈసభలకు హాజరైన ప్రొఫెసర్లను, లెక్చరర్లను ఆయా యూనివర్సిటీల విద్యార్థులు నిలదీయాలి. తాము ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణకోసం కొట్లాడుతుంటే స్వీయ ప్రయోజనాల కోసం ‘తెలంగాణ తలి’్లని తాకట్టు పెడతారా? అని అడగా ల్సిందే! కాళోజి అన్నట్టు ‘దోపిడీ చేసే ప్రాంతేతరులను/ దూరం దాకా తన్ని తరు ముతం/ ప్రాంతం వాడే దోపిడీ చేస్తే/ ప్రాణంతోనే పాతర వేస్తం’అని వీరిని హెచ్చరించా ల్సిందే! తిరుపతి సభలకు వెళ్ళిన వారిని తెలంగాణ సాహిత్య, సామా జిక సంస్థలు, వ్యక్తులు తాము నిర్వ హించే ‘సమావేశాలకు, సభలకు, సదస్సులకు ఆహ్వానించకుండా ఉండాలి. వారిపై ‘సాహిత్య బహిష్కరణ’ అమలు జెయ్యా లి. అలాగే తెలంగాణ కవితా, కథా, వ్యాస సంకలన కర్తలు వారి రచనలను ఎంపిక చేయొద్దు. అలాగే సభలకు వెళ్లిన వారు ఎంతటివారైనా వారు నిర్వహించే సద స్సులకు, ఆవిష్కరణలకు కూడా తెలం గాణవాదులు హాజరు కావొద్దు. వారి రచనలను తెలంగాణ వాద పత్రికలు అచ్చువేయొద్దు.

తిరుపతి సభల బహిష్కరణ సందర్భంగా కొంతమంది మిత్రులు శ్రీశ్రీ వార సత్వాన్ని కొనసాగిద్దామని నినాదాలిస్తున్నారు. శ్రీశ్రీ హైదరాబాద్‌లో 1975లో ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని నినదిస్తే నినదించొచ్చు కానీ ఆయన 1969లో తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసిండు. కె.వి. రమణారెడ్డి, ఆరుద్ర, శివారెడ్డి కూడా అదే రీతిలో కవిత్వమల్లిండ్రు. కరుణశ్రీ అయితే ‘ప్రత్యేక తెలంగాణము దక్షిణ పాకిస్తానము’ అని చెప్పిండు. ఇట్లాంటి వారితో మనల్ని మనం పోల్చుకోని కించపరుచుకోవద్దు.


ఆర్నెల్ల క్రితమే ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రత్యామ్నాయంగా ‘తెలంగాణ మహాసభలు’ హైదరాబాద్‌లో నిర్వహిస్తామని కొంతమంది ప్రకటించారు.అది వాస్తవరూపం దాల్చలేదు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సాహిత్య, సాంస్కృ తిక అభిమానులు, ఇక్కడి విశిష్టతను చాటే మేధావులందరూ 2013లో ‘ప్రపంచ తెలంగాణ సభలు’ తెలంగాణ కోరుకునే అందరి భాగస్వామ్యంతో జరుపుకోవాలి. వెయ్యేండ్ల కాకతీయుల విశిష్టతను, గోలకొండ నవాబుల వైభవాన్ని, సాహిత్యాన్ని, సంస్కృతిని, చరిత్రని తెలంగాణ ధృక్కోణంలో ఆవిష్కరించుకోవాలి. సీమాంధ్ర ప్రభుత్వం విస్మరించిన అన్ని అంశాలను ఇందులో జోడించుకోవాలి. ప్రపంచ సభ లకు దీటుగా నిర్వహించి తెలంగాణ ఔన్నత్యాన్ని దశదిశలా చాటి చెప్పాలి.

-సంగిశెట్టి శ్రీనివాస్

37

SRINIVAS SANGISETTI

Published: Thu,April 7, 2016 12:02 AM

ఉర్దూ రచయితలు ముద్దాయిలా?

ఈరోజు ఉర్దూ భాషలో రాసిన వారికోసం తీసుకొచ్చిన నిబంధన రేపు దక్షిణాది భాషలైన తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు భాషలపై కూడా రుద్దొచ్చు. ఎంద

Published: Mon,November 9, 2015 11:23 PM

ఆత్మగౌరవాన్ని చాటిన్రు

భ్రమలు తొందరగా నే పటాపంచలయినై. మీ(మో)డీయా మాయ లో మోడీ(మూఢ)త్వాని కి పట్టంగట్టి పట్టుమని 16 నెలలు కూడా కాలే దు. మతోన్మాద అసహనానికి,

Published: Sat,July 25, 2015 12:03 AM

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి

Published: Wed,August 6, 2014 02:29 AM

తెలంగాణ మశాల్ జయశంకర్

ఆధునిక తెలంగాణచరిత్ర అన్ని మలుపుల్లో నూ దారి చూపిన దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్ సార్. హైదరాబాద్ రాష్ట్రానికి ఆంధ్రోళ్ళ దోపిడీ పీ

Published: Sun,June 15, 2014 01:19 AM

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు

Published: Tue,September 3, 2013 12:27 AM

ఆంధ్ర పెత్తనంపై తొలి ధిక్కారం

పోలీసు చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వా త ఈ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్రజా పోరాటం ‘ముల్కీ ఉద్య మం’.

Published: Wed,May 29, 2013 12:23 AM

తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దీన్

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా’ మోగించిన రుక్నుద్దిన్ కలం

Published: Wed,January 30, 2013 11:14 PM

ఆధిపత్యవాదుల ఆయుధం అబద్ధం

ఇక ‘ప్రత్యేక తెలంగాణ’కల సాకారమైతుందనుకున్న ప్రతిసారీ ‘ఆధిపత్య’ సీమాం ధ్ర దోపిడీదార్లు, వారి తాబేదార్లు అబద్ధాల్ని అతిగా ప్రచారం

Published: Sat,October 6, 2012 03:48 PM

దళితోద్యమ వేగుచుక్క

భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు

Published: Sat,October 6, 2012 03:49 PM

తెలంగాణ సాపెన

తెలంగాణ మొత్తం ఇయ్యాళ తుక్క తుక్క ఉడుకుతుంది. ఆసరయితడనుకున్న కొడుకు అంటుపెట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ కాలిపోతుండు. పానాల్దీసుకున్న

Published: Sat,October 6, 2012 03:49 PM

ప్రతీకల్ని మార్చుకుందాం..

త్యాగానికి ప్రతీక శ్రీరాములు’ (ఈ నెల 24) పేరిట రాసిన వ్యాసానికి స్పందన ఇది. కరీంనగర్‌కు చెందిన పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్

Published: Sat,October 6, 2012 03:51 PM

తెలంగాణ భూమి పుత్రిక

తన చరివూతను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త

Published: Sat,October 6, 2012 03:50 PM

హస్తినలో కాదు హైదరాబాద్‌లోనే చర్చలు

ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరముంది. ఒక్క ఎంపీ కూడా లేని చిరంజీవితో మాట్లాడ్డానికి ఆంటోని లాంటి అధిష్ఠానం దూతలు ఆగమేఘాల

Published: Sat,October 6, 2012 03:49 PM

ఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుల్లో ముందు వరుసలో నిలిచి, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వాడు దొడ్డికొ

Featured Articles