సంపద సృష్టికే అప్పులు


Tue,October 16, 2018 03:29 PM

srinivas అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నా మనడంలో సందేహం లేదు. అందుకే ఆయనకు ఆర్థిక క్రమశిక్షణను ఎవరో నేర్పాల్సిన అవసరం కనిపించదు.

అప్పుల చర్చను విపక్షాలు ఎప్పుడూ ఓ అస్త్రంలా వాడుకోవాలనుకుంటా యి. కానీ అది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవడానికి కారణాలూ ఉంటాయి. ప్రభుత్వాలు అప్పులు దేనిపై వెచ్చిస్తున్నాయి అనేదే.. విపక్షాలకు అది అస్త్రం కాగలుగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సంపద సృష్టికి ఉపయోగపడుతున్నాయా అనేదే అప్పుల చర్చలో కీలకాంశం అవుతుంది. అందుకు పూర్తిభిన్నంగా వెచ్చించి అభాసుపాలైన గత చంద్రబాబు పాలన గురించి ముందుగా చెప్పుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల విష యం చంద్రబాబు పాలనను బాగా అన్‌పాపులర్ చేయగలిగింది. అప్పటి విపక్షాలకు అదొక బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడింది. చంద్రబాబు హైటెక్ పాలకుడిగా తనకుతానే ప్రమోట్ చేసుకున్న కాలమది. ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అనావృష్టితో, కరువుతో, కరెంటు కోతలతో అల్లాడిన కాలమది. వ్యవసాయం దండుగ అని ఆయన ప్రత్యక్షంగా చెప్పకు న్నా, పరోక్షంగా ఆయన పాలనాశైలి అదేవిధంగా సాగింది. ప్రజలు ఎప్పుడూ సూక్ష్మగ్రహీతలు. ప్రపంచబ్యాంకు సూత్రాలకు తలొగ్గి అప్పులు తెచ్చారు. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు అవి ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాయి. గ్రామీణాభివృద్ధికి అంతకన్నా ఉపయోగపడలేదు. ఉత్పాదక అభివృద్ధి శూన్యం, దాంతో ప్రభుత్వానికి కొత్త రాబడీ శూన్యమైంది. అనుత్పాదక వ్యయం బాగా పెరిగిం ది. తన పాలనా ఆర్భాటాలకు అప్పుల ఖాతా రోజురోజుకు పెరిగిం ది. చంద్రబాబును ప్రపంచబ్యాంకు జీతగాడు అనే విమర్శలు బల పడ్డాయి. అటు తెలంగాణ ఉద్యమం, ఇటు అప్పుల ఆర్భాటాలు చంద్రబాబును 2004 ఘోరంగా ఓడించాయి. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా నడుపడంలో బాబు వైఫల్యమే ఒక ఫెల్యూర్ స్టోరీగా రాజకీయ చరిత్రలో నిలిచిపోయింది.

అప్పుల చర్చతో చంద్రబాబును అన్‌పాపులర్ చేసినట్లే కేసీఆర్ నూ చేయాలనుకుంటే...ఆయన తెచ్చిన అప్పులు దేనికి వెచ్చించా రు? వెచ్చిస్తున్నారు? అవి ప్రజల జీవన ప్రమాణాలను పెంచగలుగుతాయా లేదా అనే కనీస అవగాహన అవసరం. ఆ అవగాహన లేకుండానే అప్పులను అస్త్రంగా మలుచుకోవచ్చనుకుంటే అది ప్రతిపక్షాల అమాయకత్వం.తెలంగాణ రాష్ర్టానికి వారసత్వంగా వచ్చిన అప్పు 72 వేల కోట్లు. నాలుగేండ్లలో 70 వేల కోట్ల అప్పు కొత్తగా తెచ్చామని అసెంబ్లీలో ఈ మధ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పు 1.42 కోట్లు ఉందని స్పష్టం చేశారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువవుతాడనేది పాత మాట. అప్పటి చంద్రబాబు లాంటి పాలకుడు అందుకు లోకువయ్యాడు. కానీ ఇపుడు నాలుగేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు రాష్ట్ర సంపద రూపంలో మన కళ్ల ముం దే కనిపిస్తున్నాయి. కేవలం మూడున్నరేండ్లలో అన్ని సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటివరకు సుమారు 48 వేల కోట్లు వెచ్చించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే సుమారు 30 వేల కోట్లకు పైగా వెచ్చించారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సుమారు 17 వేల చెరువుల మరమ్మతుల కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేశారు. మిషన్ భగీరథ పథకం అంచనా వ్యయం 43 వేల కోట్లు. ఇప్పటివరకు దానిపై సుమారు 25 వేల కోట్లకు పైగా వెచ్చించారు. నాలుగేండ్లలో తెచ్చిన అప్పుల కంటే మించి ఆస్తులు సృష్టించబడ్డాయని పై మూడు పథకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు పై మూడింటి సంపద విలువనే సుమారుగా 76 వేల కోట్లు అవుతున్నది. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులపై ఇప్పటివరకు వెచ్చించిన వ్యయాన్ని కలిపితే అప్పులను మించి ఆస్తుల సృష్టి జరిగిందని ఎవరికైనా అర్థమవుతుంది.

ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 14 వరకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లక్షా ఇరువై తొమ్మిది వేల కోట్లు చేస్తే అందులో తెలంగాణకు జనాభా ప్రాతిపదిక కనీసం 54 వేల కోట్లు ఖర్చుచేసి ఉండాలని, అలా జరుగలేదని సీఎం కేసీఆర్ మొన్నటి అసెంబ్లీలో చెప్పారు. కేవ లం నాలుగేండ్లలో తెలంగాణ ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లక్షా ఇరువై వేల కోట్లు చేసిందని చెప్పారు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే పెట్టుబడి వ్యయం. అది సంపదను సృష్టించేదే తప్ప దుబా రా వ్యయం కాదు. ప్రాజెక్టులే కాకుండా ఇతర అనేక అభివృద్ధి పనులను కూడా అప్పులు లేకుండానే ఈ ప్రభుత్వం సాధించిందని చెప్పాలి. తెచ్చిన అప్పుల కంటే రెండింతలు పెట్టుబడి కింద వ్యయం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించడానికి ఏముందని? నాలుగేండ్లలో తెచ్చిన అప్పులను మించి కొత్త ఆస్తులు మన కళ్ల ముం దే కనబడుతుండగా.. అప్పుల చర్చతో ఏదో వెతి కిపట్టాలని ఎవరు యత్నించినా అది వృథా ప్రయాసే.అప్పులకు సమానంగా ఆస్తులు పెరుగాలి. ప్రభుత్వాల నిబద్ధతకు, నిజాయితీకి అదే ఒక కొలమానం. ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన అప్పుల కు, ఆస్తులకు ఏనాడూ పొంతనలేదు. ఉమ్మడి రాష్ట్రం తెచ్చిన అప్పులను తెలంగాణలో ఏ మేర కు వెచ్చించారు? వాటి ద్వారా ఏర్పడ్డ ఆస్తులు ఎన్ని? ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల ద్వారా తెలంగాణలో 20 శాతానికి మించి ఆస్తులు ఏర్పడలేదని ఆర్థిక నిపుణుల అంచనా. కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు వారసత్వంగా 72 వేల కోట్ల అప్పు మాత్రం లభించింది! అంతే సమానంగా ఆస్తులు ఏర్పడి ఉంటే తెలంగాణ సాగునీటి కొరతతో, కరెంటు కోతలతో తల్లడిల్లేదేనా? భయంకరమైన రైతు ఆత్మహత్యలు అంతగా జరిగేవేనా? ఆస్తులు పెంచని, సంపద సృష్టించని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు మిగిలినది సంపద కాదు అప్పులంటేనే బాగుంటుంది.

ప్రభుత్వం కోటి ఎకరాల కొత్త ఆయకట్టే లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగేండ్లలో సుమారు 25 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టును (మిషన్ కాకతీయతో కలిపి) ఇప్పటికే సాగులోకి తెచ్చింది. ఆ మేరకు గ్రామీణ జీవన ప్రమాణాలు పెరుగడం సహజం. రాబోయే కాలంలో మొత్తం కోటి ఎకరాలకు సాగునీరు అందించగలిగితే ప్రజ ల జీవన ప్రమాణాలు పెరుగడమే కాదు, ప్రజలే సంపద సృష్టికర్తలు కాగలుగుతారు. ఉదాహరణకు ఒక ఊరిలో 500 ఎకరాలకు సాగునీరందితే రైతులు మాత్రమే కాదు, యావద్ ఊరు జీవన ప్రమాణా లే మారిపోతాయి. శాశ్వత అభివృద్ధి పనులు శాశ్వత ఉపాధి మార్గాలవుతాయి. శతాబ్దాల పాటు ఒక సమాజ జీవన ప్రమాణాలను నిలబెట్టి నడుపగలిగే శక్తి ఒక కాళేశ్వరం, ఒక పాలమూరులాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులలో చూడగలుగుతాం. కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ఒక్క వ్యవసాయమే కాదు, తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి వెలుగులను చూడగలుగుతాం. పెరిగే కొత్త ఉపాధులతో నిరుద్యోగులకు కొత్త మార్గాలను చూడగలుగుతాం. అలాం టి ప్రాజెక్టుల కోసం అప్పులు చేయడాన్ని తప్పుపట్టేవారు ఎవరైనా ఉంటే అది రాజకీయ అజ్ఞానమే తప్ప మరొకటి కాదు. ప్రజల జీవన ప్రమాణాలపైనే ప్రభుత్వాల ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ అర్థశాస్త్ర సూత్రమే అప్పులభారాన్ని మంచుముక్కలా కరిగిస్తుంది. తద్వారా ప్రభుత్వమే కాదు, సమాజమే సంపన్నమవుతుంది.సీఎం కేసీఆర్ చెపుతున్నట్లు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే. కాబట్టే శాశ్వత అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా నడిపించగలుగుతున్నారు.

చాలామేరకు సంక్షేమ పథకాల్లోనూ ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల ఉద్దేశం కాదనలేనిది. చేపల పెంపకం, గొర్రె ల పెంపకంలాంటి గ్రామీణవృత్తి ఉపాధి అవకాశాలకు వెచ్చిస్తున్న వ్యయం కూడా అభివృద్ధి పరిధిలోకే వస్తాయి. ఆయా పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను పక్కనపెడితే, ఆయా పథకాల కు వెచ్చిస్తున్న వ్యయం మాత్రం కొంతమేరకు గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయనే చెప్పాలి. రైతులకు ఇవ్వబోతున్న పెట్టుబడి పథకం కూడా రైతుకు సాంత్వన కలిగించి తెలంగాణ వ్యవసాయాన్ని నిలబెట్టేందుకే తప్ప అదేమీ దుబారా వ్యయం కాదు. అలాంటి కొన్ని పథకాలను తెలంగాణ పునరుజ్జీవ పథకాలంటే తప్పు కాదు.టూకీగా చెప్పాలంటే, రాష్ర్టానికి ఉన్న సొంత ఆదాయాన్ని (73 వేల కోట్లు, కేంద్రం నుంచి పన్నుల వాటా 19 వేల కోట్లు వగైరా) ప్రభుత్వ నిర్వహణకు, ప్రజా సంక్షేమ పథకాలకు, తెస్తున్న అప్పుల ను శాశ్వత అభివృద్ధి పనులకు మాత్రమే వెచ్చిస్తున్నారని చెప్పొచ్చు. మునుపటి పాలకుల వలె అప్పులను అనుత్పాదకతకో, దుబారాకో వెచ్చించడం లేదు. అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నామనడంలో సందేహం లేదు. అందుకే ఆయనకు ఆర్థిక క్రమశిక్షణను ఎవరో నేర్పాల్సిన అవసరం కనిపించదు.

[email protected]

723

SRINIVAS REDDY KALLURI

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే        


Featured Articles