రైతు లక్షణం ఇంకా రాదా?


Fri,July 7, 2017 01:04 AM

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధ చర్యలు కనిపిస్తుండటమే కొంత ఆశ్చర్యానికిగురిచేస్తున్నది. తెలంగాణ గ్రామాల్లో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు అధికారుల నుంచి నగదు లేదని సమాధానం వస్తున్నది.

యూపీ రైతుల రుణమాఫీ (35 వేల కోట్లు) స్వయాన ప్రధాని ప్రకటిస్తే అభ్యంతరం చెప్పని రిజర్వు బ్యాంకు..తెలంగాణలో మాత్రం 17 వేల కోట్ల రుణమాఫీ ఒకేసారి చేయడానికి ఎందుకు అభ్యంతరం చెప్పినట్లు? రైతుల విషయంలో రాష్ర్టానికో నీతిని అవలంబించడం ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్ అవుతుందా? ఒకే దేశం, ఒకే ప్రజా అవుతుందా?ప్రధాని మోదీ సమర్థ పాలకుడే కావచ్చు. అవినీతిరహిత పాలన సాగిస్తుండవచ్చు. కానీ ఈ దేశంలో జీవిస్తున్న60 శాతం రైతు లోకం విశ్వాసం పొందడం అన్నిటికన్నా ముఖ్యమని ఆయన గుర్తుంచుకోవాలి.

ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులు, రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమయినా కూడా వారి డబ్బులు వారికి బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాయంటే ఢిల్లీ పాలకులకు గ్రామీణ రైతుల పట్ల ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ఉన్నదో ఎవరికైనా అర్థమవుతుంది. అప్పులు దొరుకవు, ఉన్న డబ్బులు ఇవ్వరు అంటే వ్యవసాయం వదులుకొమ్మని చెప్పడమేనా? తెలంగాణలో నగ దు కొరతను దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంకు రూ.2600 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఈ మధ్య వార్త! కనీసం రెండు నెలల నుంచి తెలంగాణ రైతులు బ్యాంకుల చుట్టూ బిచ్చగాళ్లలా తిరుగుతుంటే, ఇప్పుడు కేంద్రానికి కొంతైనా సోయి రావడాన్ని చూసి హర్షించాలో, నిట్టూర్చాలో అర్థం కాదు. నోట్ల రద్దును ప్రజలు సైతం పరోక్షంగా సమర్థించారు. దేశంలో అవినీతి ప్రక్షాళన జరుగాలని సగటు పౌరుడు కోరుకున్నాడు. కాబట్టే ప్రజల నుంచి సానుకూలత వచ్చింది. కానీ అది రైతుకే ఒక సమస్యగా మారుతుంటే కేంద్రం కళ్లు మూసుకొని చూస్తుండటమే తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. పెద్దనోట్ల మార్పు తర్వాత బ్యాంకుల నుంచి ప్రజలు తమ డబ్బును తీసుకుంటున్నారు తప్ప జమ చేయడం లేదనే వాదన ఉంది. దాంతో బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పిడిందంటున్నారు. నిజానికి అదీ ఒక కారణమే అనుకున్నా.. రైతును సైతం వదలకుండా నగదు రహితం వైపు నెట్టడం మరొక కారణం. గ్రామాల్లో నగదు రహిత వ్యవస్థ ఏర్పాటు చేయకుండానే రైతును ఆ వైపు నెట్టడం కేంద్ర పాలకు ల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. నగదు రహితం తెచ్చారు తప్ప దాని ఆచరణలో రైతులు ఎదుర్కునే సమస్యలు కేంద్రానికి ఎందుకు పట్టలేకపోయాయి? నగదు రహితంతో కూలీలకు రైతు ఎలా చెల్లింపులు చేస్తాడనే సోయి కేంద్రానికి ఎందుకు లేకపోయింది? చిన్నాచితకా అవసరాలకు గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలకు అవకాశం ఉన్నదా? నోట్ల మార్పు చేసి వదిలేశారు తప్ప ప్రజల్లో ఉన్న అనేక అనుమానాలను నివృ త్తి చేయడంలో ఎందుకు శ్రద్ధ చూపలేకపోయారు? దాంతో ఇవాళ బ్యాంకుల్లో డబ్బు జమ చేయడానికి ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. నిర్ణ యం తీసుకున్నాం, మీ చావు మీరు చావండి అని చెప్పినట్లుంది వ్యవహారం. నగదు రహితం విషయంలో వ్యాపారికి, రైతుకు ఉండే తేడాను గమనించలేని బీజేపీ పాలకులను ఏమనాలో అర్థంకాదు. బీజేపీకి ఇప్పటికీ రైతు ప్రాధాన్యం బోధపడకపోవడమే దాని రాజకీయ దివాళాకోరుతనాన్ని తెలియజేస్తున్నది.

రిజర్వు బ్యాంకు గవర్నర్ రైతు రుణమాఫీని వ్యతిరేకించడం, మరోవైపు కేంద్రానికి రైతు రుణమాఫీ పట్ల ఒక స్పష్టత లేకపోవడం.. రైతు పట్ల బీజేపీ గందరగోళ వైఖరిని బయటపెడుతున్నది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో స్వయాన ప్రధాని మోదీనే రైతుల రుణమాఫీ ప్రకటించారు. అక్కడ గెలుపు తర్వాత పార్లమెంట్‌లో స్వయాన వ్యవసాయశాఖా మంత్రి యూపీ రైతు రుణమాఫీని కేంద్రమే భరిస్తుందన్నారు. దాంతో ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రుల నుంచి కూడా తమ రాష్ట్ర రైతుల రుణాలు కూడా మాఫీ చేయాలనే డిమాండ్ రావడంతో నాలుక కర్చుకొని మళ్లీ మాట మార్చారు. యూపీ రైతు రుణమాఫీ ఆ రాష్ట్ర ప్రభుత్వ మే భరిస్తుందని వ్యవసాయ మంత్రి పార్లమెంటులో మళ్లీ ప్రకటించాల్సివచ్చింది. యూపీ ఎన్నికల సందర్భంగా స్వయాన ప్రధాన మంత్రే రైతు రుణమాఫీ ప్రకటించడం వల్ల దేశవ్యాప్త రైతుల్లోనూ రుణ మాఫీ పట్ల ఆశ పెరిగింది. యూపీ ఎన్నికల్లో అన్నీ తానై మాట్లాడిన మోదీ ఈ దేశానికి తాను ప్రధానమంత్రిననే విషయం కూడా మర్చిపో యి ఉంటారనిపించింది. ఏక్ దేశ్‌మే దో విధాన్ నహీ చలేంగే అనేది స్వయాన బీజేపీ రాజకీయ నినాదం. కానీ రైతు విషయం వచ్చేసరికి ఆ నినాదాన్ని బీజేపీ ఎందుకు మర్చిపోతున్నట్లు? ప్రధాని మోదీ యూపీ రైతును ఒకవిధంగా, మిగతా దేశ రైతులను మరోవిధంగా భావించారా? బీజేపీకి ఇప్పటికీ రైతు లక్షణం రాలేకపోతున్నదా? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఇతర అనేక రాష్ర్టాల రైతులు రుణమాఫీ కోసం, మద్దతు ధరల కోసం ఆందోళనలకు దిగారు. దేశవ్యా ప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధాలు జరిగాయి, జరుగుతున్నాయి. అసంఘటిత రైతు లోకం గతంలో ఏనాడూ రోడ్డెక్కి ఉద్యమించింది లేదు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమాలు రోడ్లెక్కుతున్నాయి. పంటలు, కూరగాయలు, పాలు పండ్లు రోడ్లపై పారబోసి తమ నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీలో తమిళ రైతుల నగ్న ప్రదర్శనలు యావత్ దేశా న్ని చింతింపజేశాయి. అవన్నీ రైతు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తెలియజేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఏకంగా పోలీసుల కాల్పుల్లో కొందరు రైతులు చనిపోవడం అందిరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఓ వైపు పోలీసు కాల్పుల్లో రైతులు చనిపోతుంటే.. మరోవైపు రాందేవ్ బాబాతో కలిసి ఈ దేశ వ్యవసాయ మంత్రి యోగాభ్యాసం చేశారు. అది వ్యవసా య మంత్రి తప్పిదం అనేకన్నా.. ఇప్పటికీ బీజేపీకి రైతు లక్షణం రాలేద ని ఆ సంఘటన చెబుతున్నదంటే తప్పు కాదేమో?

దేశంలో ఒకో రాష్ట్రంలో ఒకో నీతిని అవలంబిస్తున్నామనే విషయా న్ని బీజేపీ మర్చిపోతున్నది. ఒకే దేశం, ఒకే ప్రజా, ఒకే న్యాయం అనే తమ స్వీయ సూత్రీకరణనే తుంగలో తొక్కేస్తున్నది. యూపీ రైతుల రుణమాఫీ (35 వేల కోట్లు) స్వయాన ప్రధాని ప్రకటిస్తే అభ్యంతరం చెప్పని రిజర్వు బ్యాంకు... తెలంగాణలో మాత్రం 17 వేల కోట్ల రుణ మాఫీ ఒకేసారి చేయడానికి ఎందుకు అభ్యంతరం చెప్పినట్లు? రైతుల విషయంలో రాష్ర్టానికో నీతిని అవలంబించడం ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భార త్ అవుతుందా? ఒకే దేశం, ఒకే ప్రజా అవుతుందా? ప్రధాని మోదీ సమర్థ పాలకుడే కావచ్చు. అవినీతిరహిత పాలన సాగిస్తుండవచ్చు. కానీ ఈ దేశంలో జీవిస్తున్న 60 శాతం రైతు లోకం విశ్వాసం పొందడం అన్ని టి కన్నా ముఖ్యమని ఆయన గుర్తుంచుకోవాలి. మూడు దశాబ్దాలు గడిచినా బీజేపీకి రాజకీయంగా రైతు లక్షణం ఇప్పటికీ రాకపోవడం, పట్టణ, వ్యాపార వర్గాల పార్టీగానే తన లక్షణాన్ని అదింకా చాటుకుంటుండటం నిజంగా దురదృష్టకరం.
reddy
పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ సాధించిన బీజేపీకి మొదటిసారి పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా మద్దతు లభించిందనే విషయం ఆ పార్టీ మర్చిపోతున్నదా? రైతు సమాజం మద్దతు లేకుండా ఆ పార్టీ సొంత మెజారిటీ సాధించేదేనా? ఇన్ని నిజాలు కళ్లముందు కనపడుతు న్నా బలమైన రైతు సమాజాన్ని ఇంత నిర్లక్ష్యంగా చూడటం బీజేపీ రాజకీయ తిరోగమనాన్ని సూచించడం లేదందామా?

దేశంలో రైతు మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా పార్లమెంటులో సొం త మెజారిటీని సాధించజాలదు. మరి బీజేపీ.. రైతు మద్దతు లేకుండానే సొంత మెజారిటీ సాధించానని భావిస్తున్నదా? ఒకవేళ రైతు మద్దతు లేకుండానే మెజారిటీ సాధించామనే భ్రమలో గనుక ఉంటే బీజేపీ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నదని చెబితే తప్పుకాదు. బీజేపీ పాత రాజకీయ వ్యవహార శైలిలో రైతు లేకపోవచ్చు. కానీ కొత్తగా అది పార్లమెంటులో సాధించిన మెజారిటీలో రైతు ఉన్నాడనే విషయం కాదనలేనిది. దాంతో ఇకనైనా బీజేపీ రాజకీయంలో రైతు ప్రాధాన్యం పెరుగుతుందని భావించాం. కానీ ఆ పార్టీ వ్యవహారశైలిలో అలాంటి మార్పు కనిపించకపోవడమే కొంత అశ్చర్యాన్ని కలిగిస్తున్నది. దేశంలో బలమైన రైతు సమాజాన్ని ఎవరు దూరం చేసుకున్నా వారు అధికారానికి దూరమవుతారని దేశ రాజకీయ చరిత్ర చెబుతున్నది. గతంలోలాగా పట్టణ, వ్యాపా ర వర్గాల పార్టీగానే వ్యవహారాలు కొనసాగిస్తే బీజేపీ భవిష్యత్తు మరోసారి అంధకారమవుతుందని ఆ పార్టీ గమనించాలి. ఎవరితో పెట్టుకు న్నా ఫరవాలేదు. కానీ రైతుతో పెట్టుకుంటే బీజేపీ మళ్లీ పార్లమెంటులో పాత సీట్లకే పరిమితమవుతదనేది ఆ పార్టీ గుర్తించాల్సిన విషయం.
చివరగా.. నగదు రహితం విషయంలో ఒక పట్టణ వ్యాపారికి, గ్రామీ ణ రైతుకు ఉండే తేడాను గుర్తించని బీజేపీకి రైతు లక్షణం ఎన్నటికి అబ్బేను అనేదే శేష ప్రశ్న.
[email protected]

646

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే