సహకారానికి ఉపకారమేది?


Tue,February 7, 2017 01:46 AM

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అనుగుణంగా ఆయన విన్నపాలను కూడా మోదీ గౌరవించాలి, అమలు చేయాలి.

టీఆర్‌ఎస్ దేశంలోని ఏపార్టీకి వ్యతిరేకమో, అనుకూలమో కాదు. అది సర్వ స్వతంత్రత కలిగిన అరుదైన రాజకీయపార్టీ. కేసీఆర్ అంతటి రాజకీయ స్వతంత్రుడు బహుశా దేశంలో ఇంకొకరు ఉండకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఒక అస్తిత్వ పార్టీ అధినేత. ప్రాంత సమస్యలు, రాష్ట్ర అభివృద్ధికి ఎదురయ్యే సమస్యలే ఆయనకు ప్రత్యర్థులు. కాబట్టి ఆయన రాజకీయ బలవంతుడు తప్ప బలహీనుడు కాదు. అందుకే రాజకీయ వైరుధ్యాలతో పనిలేకుండా వీలైనప్పుడల్లా కేసీఆర్ తన ప్రాంత ప్రయోజనాలతో పాటు, తన జాతీయ దృక్పథాన్ని కూడా చాటుతున్నారు. రెండేళ్ల కిందట ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసినపుడు, కేంద్రం జీఎస్‌టీ బిల్లు తెచ్చినప్పుడు నైతిక మద్దతిచ్చారు. దాంతోపాటు సలహాలూ ఇచ్చారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ప్రధాని మోదీ ని వెన్నుతట్టి నిలబడిన వారెందరు? నితీశ్, నవీన్ లాంటి ఒకరిద్దరు ముఖ్యమంత్రులు నోటితో మద్దతిచ్చారు తప్ప కేసీఆర్ వలే వెన్నుదన్నుగా నిలబడిన వారున్నారా? స్వయంగా ఎన్డీఏ భాగస్వామ్యపార్టీ శివసేన బహిరంగంగానే పెద్ద నోట్లరద్దును వ్యతిరేకించింది.

ఆ విధంగా నోట్ల రద్దు విషయం లో ఒంటరిగా మారిన మోదీకి నైతిక మద్దతిచ్చిన ఘనత కేసీఆర్‌దే. నగదు రహిత లావాదేవీలను తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా తన ప్రభుత్వం చేత ప్రమోట్ చేయించిన ఘనత కూడా కేసీఆర్‌దే. నీతి ఆయోగ్ కానీ, జీఎస్‌టీ కానీ, పెద్దనోట్ల రద్దు కానీ తెలంగాణకు మాత్రమే సంబంధించిన విషయాలు కావు. యావద్దేశానికి సంబంధించినవి. వాటి విషయంలో కేసీఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా జాతీయ దృక్పథంతో సమర్థించారు. ప్రధాని మోదీకి బహుశా నైతికంగా అంతటి మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు ఉండరు. ఇన్నిరకాలుగా మోదీ నిర్ణయాలకు సహకారం అందించి వెన్నుదన్నుగా నిలబడు తూ వస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ ఎంత సహకారం అందించినా అది తక్కువే. కానీ ఊహించినంత సహకారం కనిపించకపోవటమే శోచనీయం.

కేంద్ర మంత్రుల నుంచి మొదలుకుంటే, ప్రధాని వరకు రాష్ట్ర మంత్రులే కాకుండా స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విన్నపాలు, వినతుల సంఖ్యను లెక్కించి చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో ఆ విన్నపాలకు చోటెక్కడ? మొన్నటి కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ ప్రభుత్వం కొంతమేర ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అందులో ఒక్కటి కూడా బడ్జెట్‌లో కనిపించలేదు. ఎయిమ్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా కోరుతూ వస్తున్నది. ఐఐఎంనూ అడిగింది. కనీసం తెలంగాణకు ఎయిమ్స్ అయినా లభించవచ్చని స్వయాన ముఖ్యమంత్రి కేసీఆరే ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. అదొక్కటే కాదు, విభజన చట్టంలోని హామీలలో ఒక్కదానికైనా బడ్జెట్‌లో చోటుదక్కకపోవడం విస్మయం కలిగించిన విషయం. బయ్యారంలో భారీ ఉక్కుకర్మాగారానికి విభజన చట్టం హామీ ఇచ్చింది. బడ్జెట్లో దాని ఊసే లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమయిందో తెలియదు. తెలంగాణకు ఫార్మాసిటీని (నిమ్జ్) కేంద్రం మంజూరు చేసి చాలా కాలమైంది.

నిమ్జ్‌కూ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఊసేలేదు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను స్వయాన కేంద్ర పాలకులే మెచ్చుకున్న సందర్భాలు అనేకం. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ వాటిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్పారు. ఆ రెండు పథకాల అమలు కోసం కేం ద్రం కూడా నిధులు కేటాయించాలని అనేకసార్లు సీఎం కేసీఆర్ ప్రధానికి విన్నవించారు. మోదీ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. కానీ తీరా బడ్జెట్లో చూస్తే వాటి ఊసే లేకుండా పోయింది. అనేక పథకాలతో దేశానికే ఆదర్శంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించడం కేంద్రం విధి.

బడ్జెట్‌లో ఏ రాష్ర్టానికీ ఎయిమ్స్ ప్రకటించి ఉండకపోతే అది వేరే విష యం. గుజరాత్, జార్ఖండ్ రాష్ర్టాలకు బడ్జెట్లో ఎయిమ్స్ కేటాయించారు. ఎయిమ్స్ ఇవ్వడానికి గుజరాత్, జార్ఖండ్‌లు ఎంత అర్హత కలిగి ఉన్నా యో తెలంగాణ అంతకన్నా ఎక్కువ అర్హతను కలిగి ఉన్నది. ఎందుకంటే, తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం మాత్రమే కాదు, అన్ని రంగాల్లో అదొక గ్రోయింగ్ స్టేట్. ఎయిమ్స్ వంటి మెడికల్ సైన్స్ సంస్థ స్థాపనకు తెలంగాణ అన్ని యోగ్యతలనూ కలిగిఉన్నది. అందుకే సీఎం కేసీఆర్ దాన్ని పదే పదే డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రాంత వివక్షకు అతీతంగా పనిచేస్తున్న కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని మర్చిపోయి, తామే ప్రాంత వివక్షకు పాల్పడి ఉంటే మాత్రం మోదీ ప్రభుత్వ ఇమేజీకి అదొక మరకగా మారుతుంది. ఉత్తర, దక్షిణ భేదభావంతో చూస్తే ఎవరూ జాతీయవాదులు కాలేరు. ఈ విషయం ప్రధాని మోదీకి తెలియదని కాదు. కానీ తెలంగాణ కు ఎయిమ్స్ వంటి సంస్థ కేటాయించటం లో ఎందుకు అన్యాయం జరిగిందో ఆలోచించి, దాన్ని తెలంగాణకూ కేటాయించగలిగితే ప్రధాని మోదీ ప్రతిష్ఠకే మంచిది. దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అనుగుణంగా ఆయన విన్నపాలను కూడా మోదీ గౌరవించాలి, అమలు చేయాలి.
[email protected]
Kalluri

830

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే