‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి


Fri,January 6, 2017 11:54 PM

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన
దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మనం కేటీఆర్‌లో చూస్తున్నాం.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ ఇటీవల చేనేత వస్ర్తాలు తనకుతాను వాడుతూ నే, ఇతరులనూ వాడాలని పిలుపునిచ్చిన విష యం తెలిసిందే. ఇలాంటి పిలుపులు స్వాతం త్య్ర పోరాటాల కాలంలో దేశం విన్నది. స్ఫూర్తి పొందింది. చాలామేరకు ఆచరించింది. అలాగే 25 ఏండ్ల క్రితం దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తొలి నాళ్లలోనూ కొంత మేర స్వదేశీ నినాదం వినిపించింది. అలాంటి పిలుపులు గత రెండు దశాబ్దాలుగా మళ్లీ వినలేకపోయాం. మళ్లీ ఇప్పుడు కొత్త రాష్ట్రంలో ఓ యువ మంత్రి నోట వింటున్నాం. ఆయన స్వయాన వారానికోసారి చేనేత వస్ర్తాలు ధరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలంగాణ స్వాభిమానులూ కూడా ఆయన పిలుపును స్వీకరిస్తూ చేనేత వస్ర్తాలు ధరిస్తున్నారు. ఆ పిలుపును కేటీఆర్ కొన్ని పరిమితులకు లోబడి ఇచ్చి ఉండవచ్చు. కానీ సభ్యసమాజానికి అది కావల్సినంత స్ఫూర్తినిచ్చింది. అలాగే దేశీ స్ఫూర్తి పట్ల సమాజాన్ని మలిచేందుకు బుద్ధిజీవులకు కూడా కేటీఆర్ పిలుపు ఒక అవకాశాన్ని ఇచ్చిందనే చెప్పాలె.
విదేశీ.. స్వదేశీ.. దేశీ.. ఈ మూడు పదాలు స్వాతంత్య్ర ఉద్యమ కాలంనుంచి నేటి ప్రపంచీకరణ దాకా దేశానికి అనుభవంలో ఉన్నవే. విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు వాడ కం స్వాతంత్య్ర ఉద్యమానికే స్ఫూర్తిగా నిలిచాయి.

kalluri
స్వదేశీ నినాదం దేశ అస్తిత్వం తో పాటు ప్రజల ఉపాధుల పరిరక్షణకు ఒక సాధనం వంటిది. ఇక దేశీ పదం ఒక ప్రాంత ప్రజల జీవితాల పరిరక్షణకు ఉపయోగపడే నినాదం. కాబట్టి మనం కేటీఆర్ ఇచ్చిన పిలుపును దేశీ నినాదంగానే పరిగణించాలె. ఆయన పిలుపులో చేనేత కార్మికుల బతుకులను కాపాడాలనే ప్రధానోద్దేశం మాత్రమే కనిపించినా.., దాన్ని మనం ఒక దేశీ పిలుపుగానే చూడాలె. ఎందుకంటే, దేశంలో ప్రపంచీకరణ లబ్ధిదారులున్నారు, బాధితులూ ఉన్నారు. దేశంలో సుమారుగా 60 శాతం జనాభా ప్రపంచీకరణ వేగాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందుకోగలిగింది. మిగతా 40 శాతం జనాభా దాని వేగాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నారనేది తెలియందేమీ కాదు. ప్రపంచ నైపుణ్యం లేకుండానే దేశంలోకి ఆర్థిక సంస్కరణలొచ్చాయి. ప్రపంచంతో పోటీ పడలేని గ్రామీ ణ వృత్తులపై, వ్యవసాయంపై బతుకుతున్న ప్రజలే అత్యధికంగా ప్రపంచీకరణ బాధితులుగా మారారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు నాంది పలికింది చంద్రబాబు పాలనలోనే.

ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఆర్థిక సంస్కరణలకు మానవీయ కోణం ఉండాలన్నారు. బాబు పాలనకు కనీ సం అమర్త్యసేన్ చెప్పిన మానవీయ కోణం కూడా పట్టలేకపోయింది. దాంతో ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణే బాధిత ప్రాంతంగా మారింది.గ్రామీణ వృత్తులు కొన్ని అంతరించిపోయాయి. మరికొన్ని కొన ఊపిరితో ఉన్నాయి. కానీ గ్రామీణ వృత్తులలో ప్రత్యామ్నాయం లేక కొనసాగుతున్న వృత్తులు ప్రధానంగా రెండు. అవి ఒకటి వ్యవసాయం, రెండోది చేనేత. ఈ రెండు రంగాల సంక్షోభమే తెలంగాణను బాధిస్తున్న అంశం. ఈ రెండు రంగాల్లో బతుకుతున్న వారే రెండు దశాబ్దాలుగా ఆత్మహత్యలకు పాల్పడుతూ వసు్ంతడటం అందరినీ కలిచివేస్తున్న విషయం. ప్రపంచీకరణ వేగాన్ని అందుకోలేక బాధితులుగా మారిన తరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రపంచీకరణ ఫలాలను అనుభవిస్తున్న నేటి తరంపైనే ఉన్నదని అందరూ గమనించాలి. ఎందుకంటే, 25 ఏండ్ల నుంచి ప్రపంచీకరణ బాధితులుగా మారి మనకో భవిష్యత్తును అందించినవాళ్లు. తెలంగాణకు వారసులను అందిచినవాళ్లు. తమకు తాము త్యాగం చేసుకొని తమ వారసులకు ప్రపంచీకరణ ఫలాలను అందించిన, అందిస్తున్న వాళ్లు. వారి త్యాగాలను ఎవరూ వెల కట్టలేరు.

అందుకే ఒక తెలంగాణ రైతు, ఒక చేనేత కార్మికుడు, ఒక గ్రామీణ వృత్తుల వారి ఉత్పత్తులను తమ తమ శక్తిమేరకు కొనుగోలు చేసి వారి బతుకులను కాపాడాలనే స్ఫూర్తి మనలో పెరుగాలె. సంపన్నుడు తనకు కావాల్సిన ఆహారోత్పత్తులను ప్రత్యక్షంగా రైతు నుంచే అధిక ధర చెల్లించి కొనగలడు. చేనేత వస్ర్తా లు వాడుతూ ఒక చేనేత కార్మికుడిని కాపాడగలడు. గ్రామీణ వృత్తుల ఉత్పత్తులకే ప్రాధాన్యమిచ్చి వాళ్ల బతుకులను నిలుపగలడు. తెలంగాణ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనే స్ఫూర్తి మనలో కలిగితే చాలు ఎంతో కొంత వారి బతుకులను ఆదుకున్నవాళ్లమవుతాం. దేశంలో విదేశీ వస్తువుల వాడకం పెరిగిపోయిన ఈకాలంలో దేశీ వస్తువుల కొనుగోలు అనేది కాలంచెల్లిన నినాదంగా కొందరికి కనిపించవచ్చు. కానీ ప్రపంచీకరణ చెందిన జీవితాల నుంచి బయటకు వచ్చి కోనుగోలు చేయాలని చెప్పడం లేదు. ఆ ప్రపంచీకరణలో బాధితులుగా మారిన వారిని బతికించుకొని మన గ్రామీణ జీవితాలను మెరుగు పర్చుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాం. అలాంటి స్ఫూర్తి చాటుకోవడానికి మన 14 ఏండ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమమే మనకొక పాఠం. సాధ్యమైన మేరకు తెలంగాణ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో తెలంగాణ పునరుజ్జీవనాన్ని దర్శిద్దాం.

కేటీఆర్‌లో మనం ఇంతకాలం విదేశీ పెట్టుబడుల ఆరాటాన్ని మాత్ర మే చూస్తూవచ్చాం. కానీ ఆయనలో దేశీ ఆలోచనలు కూడా ఉన్నాయ ని ఇపుడు చూస్తున్నాం. పోటీ ప్రపంచంలో విదేశీ పెట్టుబడులు అనివార్యం. తెలంగాణ వచ్చే నాటికే తెలంగాణ గ్రామీణ జీవితాలు ఛిద్రమై ఉన్నాయి. ఆత్మహత్యల ఘోష కొనసాగుతున్నది. కాబట్టి ఇంతటి గ్రామీణ సంక్షోభం నుంచి తెలంగాణను బతికించుకునే స్ఫూర్తి ఒక్క ప్రభుత్వంలో మాత్రమే ఉంటే సరిపోదు. ఆ స్ఫూర్తి తెలంగాణ సమాజంలోనూ కలుగాలె. ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీ య పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మనం కేటీఆర్‌లో చూస్తున్నాం.
[email protected]

1005

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే        


Featured Articles