చెరువును చంపొద్దు


Sat,October 22, 2016 01:23 AM

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్టు చెరువులు కూడా వెలవెలబోతున్నాయి. మొత్తంమీద రియల్టర్లు అడవిని చెరబట్టి నిర్మించిన అక్రమ వెంచర్ల వల్ల నాలుగు ఊర్ల చెరువులు నిర్జీవంగా మారాయి. దశాబ్ద కాలంగా వర్షాలు చూడని మాఊర్లు ఇవాళ భారీ వర్షాలు పడినా చెరువులు నిండలేదంటే అది ఎంతటి విషాదమో ఒక్కసారి ఆలోచించండి.

srinivas
మనది పీఠభూమి. అందుకే తెలంగాణ బతుకు చెరువులతో ముడిపడి ఉన్నది. ఈ విషయం తెలంగాణ సాధించిన ఉద్యమనేతగా కేసీఆర్‌కు బాగా తెలుసు. అందుకే అధికారం చేపట్టిన వెంటనే మిషన్ కాకతీయ పథకం చేపట్టారు. 80 వ దశకం నుంచే తెలంగాణ చెరువులు బాగా నిర్లక్ష్యానికి గురైనాయి. రైతులు బోర్లపై ఆధారపడటం అప్పుడే మొదలైంది. సమైక్య ప్రభుత్వాలు చెరువుల వైపు చూడటం మానేశాయి. చెరువులను నింపే వరద కాలువల కనెక్టివిటీ గల్లంతు కావడం మొదలైంది. వర్షాలు కురిసినా చెరువులు నిండని పరిస్థితుల ను గత 35 ఏళ్లలో అనేకం చూశాం.

పూడికతీత, చెరువు కట్ట లు, వరద కాలువలు మరమ్మతులు చేసి చెరువులను పున రుజ్జీవం చేస్తే తప్ప తెలంగాణ రైతుల కష్టాలను సగానికి పైగా దూరం చేయ లేమనే సంకల్పంతోనే కేసీఆర్ మిషన్ కాకతీయకు ప్రాధాన్యమిచ్చి చేపట్టారు. దాంతో రైతులు మళ్లీ చెరువుల వైపు చూడటం మొదలుపెట్టారు. మిషన్ కాకతీయ పనులు సరిగా జరగని చోట అధికారులను రైతులే నిలదీసిన సందర్భా లూ ఉన్నాయి. కానీ అంతటా అదేవిధంగా రైతులు దృష్టిపెట్టారని చెప్పలేం. పూడికతీత, చెరువు కట్టల మరమ్మతులకే అధికారులు అధిక ప్రాధాన్యమిచ్చా రు. వరద కాల్వలు, వాగులు, వంకలే చెరువులకు ఆధారం. వాటిని కాపాడ టం పట్ల అక్కడక్కడా అధికారులు పెద్దగా దృష్టి పెడుతున్నట్లు కనిపించడం లేదనేందుకు మా ఊరి చెరువే ఓ ఉదాహరణ.
మొన్నటి దసరా పండగకు మా ఊరికి (గౌరాయపల్లి, యాదగిరిగుట్ట మండలం) వెళ్లాను. మా ఊరి చెరువులో కి చుక్క నీరు రాలేదు. ఆశ్చర్యపోయాను. ఊళ్లోని రైతు లు చెప్పిన విషయాన్ని విని మరింత ఆశ్చర్యపోయాను.

గౌరాయపల్లి, మల్లాపురం, మాసాయిపేట, మధ్యలో ఉన్న అడవి, కొండలప్రాంతం నుంచి వర్షాకాలంలో వచ్చే వరదలే మా ఊరి చెరువుకు జీవం.ఆ అటవీ ప్రాం తంలోని దాదాపు 12 కొండలను ఈ మధ్య కాలంలోనే రియల్టర్లు నేలమట్టం చేశారు. అదే ఇవాళ మా ఊరి చెరువుకు ప్రాణగండంగా మారింది. అందుకే వర్షాలు ఇంత భారీగా కురిసినా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరిచెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్టు చెరువులు కూడా వెలవెల బోతున్నాయి. మొత్తంమీద రియల్టర్లు అడవిని చెరబట్టి నిర్మించిన అక్రమ వెంచర్ల వల్ల నాలుగు ఊర్ల చెరువులు నిర్జీవంగా మారాయి. దశాబ్ద కాలంగా వర్షాలు చూడని మాఊర్లు ఇవాళ భారీ వర్షాలు పడినా చెరువులు నిండలేదంటే అది ఎంతటి విషాదమో ఒక్కసారి ఆలోచించండి.

ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధిని చేపట్టగానే రియల్టర్లు వెంచర్ల వ్యాపారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. యాదాద్రికి నలువైపుల సుమారు 20 కి.మీ. మేర రియల్‌ఎస్టేట్ వ్యాపారం చుట్టుముట్టుకుంది. భూముల ధరలు బాగా పెరిగాయి. అందుకు అక్కడి ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. ఒక గొప్ప పుణ్యక్షేత్రం మా మండలంలోనే ఉండటం, అది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో అనన్యమైన అభివృద్ధికి నోచుకుంటుండటాన్ని స్థానిక ప్రజలు మనసారా స్వాగతిస్తున్నారు.అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గ్రామాల చెరువులకు ఆటంకం కలుగనంత వరకు రియలెస్టేట్ వ్యాపారాలను కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు.

మా ఊరి చెరువుకు వర్షాల నీటిని అందించే సుమారు 450 ఎకరాల అటవీ భూమిని నరికేసీ, అందులోని 12 గుట్టలను ఏ అనుమతులు లేకుండా రియల్టర్లు ఎలా నేలమట్టం చేయగలిగారనేదే ఊరి ప్రజలకు ప్రశ్నగా మారింది. స్థానికులు చెబుతున్న ప్రకారం, డీటీసీపీ నుంచిగానీ, గనుల శాఖ నుంచి గానీ, రెవెన్యూ అధికారుల నుంచి గానీ అనుమతులు తీసుకోలేదు.నిజానికి అది మా ఒక్క ఊరు చెరువు సమస్యని అనుకోవడంలేదు. ఇలా అధికారుల నిర్లక్ష్యాలకు, రియల్టర్ల అక్రమాలకు తెలంగాణలో అక్కడక్కడా చెరువులు నిర్జీవమవుతూనే ఉన్నాయనేదే ప్రధాన సమస్య.

కొత్తగా 21 జిల్లాలు ఏర్పడ్డాయి. ఆయా జిల్లా కేంద్రాల చుట్టూ రియలెస్టేట్ వ్యాపారం జోరందుకోవడమూ సహజమే. ఇక్కడ కూడా వెంచర్ల పేర చెరువులను బతికిస్తున్న కొండలను, అడవులను నేల మట్టం చేయరనే గ్యారంటీ లేదు. కాబట్టి కొత్త జిల్లా కేంద్రాల చుట్టూ చెరువులకు అభ్యంతరం కాని వెంచర్లకు మాత్రమే అధికారులు అనుమతులిచ్చేలా పై అధికారులు నిరంతరం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. చెరువులను రక్షించేందుకు వాల్టా లాంటి చట్టాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం అలాంటి చట్టాలను సద్వినియోగం చేసుకుంటే మా ఊరి చెరువు కూడా ఇవాళ నిర్జీవమయ్యేది కాదు. మనం ఎంత అభివృద్ధి సాధించినా... తెలంగాణ వంటి పీఠభూమిపై కనీసం తాగడానికైనా నీరు లభించాలంటే చెరువుల ప్రాధాన్యమేమిటో అందరికీ అర్థం కాగలుగుతుంది. అసలే తెలంగాణలో అటవీ ప్రాంతం తక్కువ. అందులోనూ మా యాదాద్రి జిల్లాలో మరీ తక్కువ. వర్షపాతం అంతకన్నా తక్కువ. ఈ విషయం స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం సభలో చెప్పారు.

అడవులను పెంచాలనేది కేసీఆర్ సంకల్పం. అందుకే, మిషన్ కాకతీయకు అనుబంధంగా హరితహారం కార్యక్రమం చేపట్టారు. నిజానికి ఆ రెండు పథకాల ఫలితాలపైనే తెలంగాణ పునరుజ్జీవం ఆధారపడి ఉంటది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న అలాంటి విజన్‌ను ఒంటపట్టించుకోవడంలో అధికార యంత్రాంగం ఇంకా అక్కడక్కడా వెనుకబడి ఉండటమే దురదృష్టకరం. నిజంగానే స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆ మాత్రం విజన్ ఉంటే మా లాంటి ఊరి చెరువుకు వర్షపు నీటిని అందించే 12 గుట్టలు నేల మట్టమయ్యేవేనా అనేదే ఆందోళన కలిగిస్తున్న అంశం. మా ఊరి చెరువు నిర్జీవం చేసిన రియల్టర్లపై చర్యలు తీసుకొని, మరిన్ని కొండలను నేల మట్టం చేయకుండా అడ్డుకోగలి గినపుడే అధికారులపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.

పాలకుడు సమర్థుడు. దార్శనికుడు. యంత్రాంగమూ అంతే, సమర్థత, దార్శనికతతో పనిచేయగలగాలె. కేసీఆర్ ఉద్యోగులకు కావలసినంత ప్రాధాన్యమిస్తున్నారు. అలాం టి పాలకుడికి అంతే అంకిత భావంతో పనిచేసి ప్రజలకు మేలు చేయగలగాలె. ఉద్యోగులు బాగా పనిచేస్తున్నవారు లేరని కాదు. కానీ అందరూ అలా పనిచేయలేకపోతున్నారనేదే ప్రజావాక్కు. కేసీఆర్ అపరభగీరథుడని స్వయాన ఈ దేశ ప్రధానియే ప్రశంసించారు. అలాంటి కేసీఆర్ కల నెరవేరడంపైనే తెలంగాణ పునరుజ్జీవం ఆధారపడి ఉంది. కాబట్టి మిషన్ కాకతీయ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, లాలూచీ పడినా తెలంగాణ పునరుజ్జీవనానికి చరిత్రలో అంతే అన్యాయం చేసినవారుగా మిగులుతారు.

చెరువులను బతికించుకుంటేనే తెలంగాణ ఊరు బతుకుతుంది. చెరువును చంపేస్తే ? ఊరు ఏమవుతుంది? తెలంగాణలో 46 వేల చెరువులలో ఏ ఒక్క చెరువు నిర్జీవమైనా ఆ ఊరు మరోసారి నిర్జీవమవుతుంది. ఈ విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోగలిగితే, తెలంగాణలో మా ఊరు వంటి చెరువు ఒక్కటి కూడా నిర్జీవంగా మారకపోవచ్చని సగటు మనిషి ఆత్మ ఘోషిస్తున్నది.

870

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే        


Featured Articles