మోదీ వ్యూహాత్మక పయనం


Wed,October 5, 2016 03:43 AM

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై
తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే. ఒకవేళ కశ్మీరీలకు భారత్ పట్ల అంత ద్వేషమే ఉంటే అమర్‌నాథ్ యాత్రను ఏనాడూ జరగనివ్వగలిగేవారు కాదేమో? కశ్మీరీలు భారత సంస్కృతిలో భాగం. ఆ అనుబంధం ఇప్పటికీ తెగిపోయిందిలేదు. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేయడమనేది మన ప్రభుత్వాలు విజయవంతంగా పనిచేయడంపై ఆధారపడి ఉంటది. ప్రభుత్వాల వైఫల్యాలకు, పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదానికి కశ్మీరీల బతుకులు
పావులుగా మారడం శోచనీయం.

srinivas
నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా రాణించగలుగుతారా అని ఒకప్పుడు కొందరు అనుమానించేవారు. కానీ ఇరువై ఎనిమిది నెలల ఆయన పాలన చూశాక చాలామంది మోదీ పట్ల తమ అభిప్రాయాన్ని మార్చుకొని ఉంటారు. కొందరు భిన్న భావజాలాలవారు మాత్రం మార్చుకొని ఉండకపోవచ్చు. అది వేరే విషయం. కానీ సగటు ప్రజల దృష్టిలో మాత్రం ఆయన సమర్థ ప్రధానిగానే ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. దేశంలో శాంతిభద్రతలు, మెరుగైన ఆర్థికనీతి, అవినీతిని అరికట్టే గట్టి చర్యలు మోదీకి మంచి మార్కులే తెస్తున్నాయి. ముఖ్యంగా సమాఖ్యస్ఫూర్తితో పనిచేయడం మెచ్చుకోదగ్గ విషయం. ఆయన అద్భుతాలు సాధించకపోవచ్చు. కానీ తాను పరిపాలనలోకి రాగానే దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారాలకు తీవ్ర ప్రయత్నాలను మాత్రం మొదలు పెట్టారు. 25 ఏళ్ల ఆర్థిక సంస్కరణల మంచి-చెడుల పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ కొత్త ఆర్థిక పంథాను గుర్తించి అనుసరిస్తున్నారు.

అన్నిటికన్నా ముఖ్యంగా దౌత్యనీతిలో గుణాత్మక మార్పును, ప్రగతినీ సాధిస్తున్నారు. ఏ దేశం ఎదుగాలన్నా అంతర్గతంగానే కాకుండా బలమైన విదేశీ సంబంధాలను ఏర్పర్చుకోగలగాలి. మోదీ ప్రధాని అయ్యే నాటికి విదేశీ సంబంధాలు అంత బలహీనంగా లేకున్నా, మెచ్చుకోదగ్గట్టుగా మాత్రం లేవు. కానీ మోదీ ప్రధాని కాగానే ఇరవై ఎనిమిది నెలల్లో 60 దేశాల్లో పర్యటించారు. విదేశీ యాత్రలు ఎక్కువగా చేయడాన్ని చాలా మంది తప్పుపట్టారు. విపక్షాలే కాకుండా కొందరు విశ్లేషకులు, వ్యాసకర్తలు, ఆయన భావజాల విరోధులు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కానీ మోదీ అనేక దేశాలతో నెరిపిన నూతన దౌత్య నీతే దేశానికి ఇవాళ ఉపయోగపడుతున్న సందర్భాలను చూస్తున్నాం. యురీ ఘటనకు ప్రతీకారం గా సర్జికల్ దాడితో జవాబిచ్చిన భారత్ చర్యను అనేక దేశా లు సమర్థించడమూ ఇందుకు ఒక నిదర్శనమే.

కశ్మీర్‌లో 1980 దశకపు సాధారణ పరిస్థితులు తిరిగి తెచ్చేందుకు భిన్న ధ్రువమైన పీడీపీతో బీజేపీ జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది మోదీ కీలక నిర్ణయం. దీనివల్ల కశ్మీరీలలో ఒక భరోసా నింపగలమని మోదీ భావించారు. దీనితో సాధారణ పరిస్థితులు నెలకొని, అభివృద్ధి కాముక ఆలోచనలు ప్రజల్లో పెరిగితే తమ ఉనికికే ప్రమాదమని పాక్‌తో సహా తీవ్రవాద సంస్థలు భావించడం మొదలుపెట్టాయి.

పీవోకేలో భారత్ సర్జికల్ దాడి జరిగాక పాకిస్థాన్ ప్రతీకార దాడులకు పాల్పడొచ్చని అందరూ ఊహిస్తున్న నిజం. మరోసారి బారముల్లాలోని భారత సైనిక శిబిరంపై తీవ్రవాదులు దాడికి తెగబడటమే అందుకు ఉదాహరణ. 2001లో పార్లమెంటుపై జరిగిన తీవ్రవాదుల దాడి దేశంపై జరిగిన దాడితో సమానం. నిజానికి పఠాన్‌కోట్, యురీలో జరిగిన దాడుల కన్నా అదే ప్రమాదకరమైనది. ఇవాళ యూరీ సంఘటన తర్వాత జరిగిన సర్జికల్ దాడి.. పార్లమెంటుపై దాడి జరిగినపు డే జరిగి ఉంటే, కథ ఇంతదాకా వచ్చేది కాదేమో! కానీ అప్పటి ప్రధాని వాజపేయి మోదీలాగా బలమైన దౌత్యనీతితో పాకిస్థాన్‌ను ఏకాకిని చేయలేకపోయారు.

కశ్మీర్ దశాబ్దాల సమస్య. భారతదేశంలో అస్థిరత్వం సృష్టించడమే తన పనిగా పెట్టుకున్న పాకిస్థాన్ తిరిగి కశ్మీర్‌లో కల్లోలం రేపడం మొదలుపెట్టింది. ఏదో సమస్యతో భారత్‌ను నిద్ర పోనివ్వకుండా చేయడమే పాకిస్థాన్ లక్ష్యం. కానీ ఏమీ చేయలేమనే ధోరణిలోనే భారత్ దశాబ్దాల కాలం గడుపుతూ వస్తున్నది. కల్లోల కశ్మీర్‌లో సాయుధ దళాలతో కాలం గడపడమే మన రివాజుగా మారింది. తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాలంటే, భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బుద్ధి చెప్పడమే ఏకైక మార్గం. మోదీ దానికే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. పాకిస్థాన్‌తో స్నేహం కోసం ఊహించిన దానికన్నా మోదీ ఎక్కువే ప్రయత్నించారు. పాకిస్థాన్‌తో సత్సంబంధాల కోసం మోదీ చివరికంటా ప్రయత్నించారు. కానీ పాకిస్థాన్‌లో ఉండేది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేకన్నా, సైనిక, మత ఛాందసవాదుల ప్రభావంలో పనిచేసే ప్రభుత్వం మాత్ర మేనని మోదీకి మరొకసారి అనుభవానికి వచ్చింది. పఠాన్‌కోట్‌లో వైమానిక కేంద్రంపై దాడి, ఏడుగురు భారత సైనికుల మృతి, మొన్న యురీలో భారత సైనిక శిబిరంపై దాడి, 19 మంది సైనికుల మృతి. సహనానికీ ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దులు దాటాకనే పీవోకేలోని తీవ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడి తప్పలేదు.

పఠాన్‌కోట్‌లో తీవ్రవాదుల దాడి తర్వాత నుంచే మోదీ తన వ్యూహాత్మకతకు పదునుపెడుతూ వచ్చారు. పాకిస్థాన్ తన దేశంలోని బలూ చిస్థాన్ ప్రజలను అణిచివేస్తున్న విషయాన్ని మొదటిసారిగా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. పీవోకేలోనూ అక్కడి ప్రజల హక్కులను హరిస్తున్న విషయాన్నీ ప్రస్తావనకు తెచ్చారు. అప్పటిదాకా కశ్మీర్‌ను మాత్రమే సమస్యగా చూపుతూ వస్తున్న పాకిస్థాన్‌కు మోదీ సవాలు గొంతులో పచ్చి వెలక్కాయలాగ మారింది. బలూచీ, పీవోకే ప్రజలు మోదీ వ్యాఖ్యలను ప్రశంసించడం అందు కు నిదర్శనం.

ఇస్లామాబాద్‌లో జరుగాల్సిన సార్క్ సమావేశాన్ని సభ్యదేశాలైన బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, భూటాన్, శ్రీలంక బహిష్కరించాయంటే, మోదీ దౌత్య విధానం పనిచేసిందని గమనించాలి. చైనా సైతం విధిలేక సర్జికల్ దాడిని ఖండించలేకపోయింది. అందుకు కారణం లేకపోలేదు. అంతర్జాతీయంగా మోదీ దౌత్య విజయాలే చైనాను ఆ మేరకు కట్టడి చేసివుంటాయి. ఇక అమెరికా, యూరోపియన్ దేశాల సంగతేమీ తెలియంది కాదు. ఆసియాలో బలమైన భారత్ అండలేకుండా చైనా ఆధిపత్యాన్ని ఆపలేమనే బలహీనత అమెరికాకు ఎప్పుడూ ఉంటది. గత ప్రధానుల కన్నా మోదీయే అమెరికాకు మరింత సన్నిహితంగా మెదులుతున్న మాట నిజం. పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయాలు, ఆయుధాలు అందించే అమెరికాను మనం నమ్మలేమనడంలో ఎంత నిజమున్నదో, దాని అవసరాలను మనమూ సొమ్ము చేసుకోగలమనడంలోనూ అంతే నిజముంటది. అదంతా దేశ పాలకుని వ్యూహ చతురత, సమర్థ దౌత్య నీతిపై ఆధారపడి ఉంటుంది. అలాంటి విషయాల్లోనే మోదీ దౌత్య విజయాలు దాగున్నాయి.

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే. ఒకవేళ కశ్మీరీలకు భారత్ పట్ల అంత ద్వేషమే ఉంటే అమర్‌నాథ్ యాత్రను ఏనాడూ జరుగనివ్వగలిగేవారు కాదేమో? కశ్మీరీలు భారత సంస్కృతిలో భాగం. ఆ అనుబంధం ఇప్పటికీ తెగిపోయింది లేదు. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేయడమనేది మన ప్రభుత్వాలు విజయవంతంగా పనిచేయడంపై ఆధారపడి ఉంటది. ప్రభుత్వాల వైఫల్యాలకు, పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదానికి కశ్మీరీల బతుకులు పావులుగా మారడం శోచనీయం. తీవ్రవాదులు సృష్టించే దుర్ఘటనలతో కశ్మీరీలు నెల రోజుల పాటు కర్ఫ్యూ జీవితం గడుపాల్సి రావడం దురదృష్టకరం. ఇలాంటి అకారణ నిర్బంధాలకు గురైనపుడే కశ్మీరీ సాధారణ ప్రజలు సైతం అసహనానికి గురికావ డం, భద్రతాదళాలపై వ్యతిరేకత పెంచుకోవడం సహజం. తీవ్రవాద సంస్థలు కోరుకునేది అలాంటి పరిస్థితులనే. ఈ విషయంలో ఏం చేస్తే కశ్మీరీలకు భరోసా కలిగించగలమో మోదీ ప్రభుత్వం ఆలోచించాలి. మోదీ వ్యూహాత్మక పయనంలో మరిన్ని మైలురాళ్లు దాటి దేశానికి మరింత ప్రయోజనం చేయగలగాలని ఆశిద్దాం.

2326

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే        


Featured Articles