కేసీఆర్-మోదీ: తెలంగాణ


Tue,August 9, 2016 01:17 AM

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి
ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇంకా చూడాల్సివుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో విడమర్పులు లేకుండా చాలా స్పష్టంగా మాట్లాడారు. మోదీ పాలనా తీరులోని పారదర్శకతను కేసీఆర్ ప్రశంసించారు. కేసీఆర్ ఎప్పుడూ కడుపులో దాచుకోకుండా మాట్లాడతారు. అది కపటం లేని ప్రసంగం. కొత్త రాష్ర్టానికి వచ్చిన ప్రధానిని ఎలా గౌరవించాలో అంతకు మించే మోదీని కేసీఆర్ గౌరవించారు.

srinivas
ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి తెలంగాణ రాష్ర్టానికి వచ్చారు. తెలంగాణలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభింభించారు. దేశంలోనే అతిపెద్ద పథకం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తే బాగుంటుందనే సీఎం కేసీఆర్ ఉద్దేశం ప్రశంసనీయం. మొత్తంరెండుప్రారంభోత్సవాలు,నాలుగు శంకుస్థా పనలతో తెలంగాణ కు ఒక కొత్త వెలుగును అందించడంలో సీఎం కేసీఆర్ కృషి అపూర్వం, ప్రధాని మోదీ సహకారమూ అభినందనీయమే.

బోరు బావులపై బతికిన తెలంగాణ జీవనదుల నీళ్లను ఏనాడూ తాగలేకపోయింది. తెలంగాణ ఏ గ్రామానికి వెళ్లినా కలుషిత నీరో, ఫ్లోరైడ్ నీరో తప్ప స్వచ్ఛమైన నీరు దొరుకదు. పంచాయతీ బోర్డులో, స్వచ్ఛంద సంస్థలో అలాంటి నీటిని శుద్ధిచేసి కొంతమేర అందిస్తున్నాయి. కానీ వాటిలోనూ శుద్ధి శాతం ఎంత అంటే అదీ కూడా అనుమానమే. యోగ్యమైన తాగునీటి లభ్యతపైనే ఏ సమాజ ఆరోగ్యమైనా ఆధారపడి ఉంటుంది. అందులోనూ దేశంలోనే పేరెన్నికగన్న ఫ్లోరైడ్ ప్రాంతం తెలంగాణలో ప్రజల ఆరోగ్యం ఎంతటి దైన్యంగా మారిందో వేరే చెప్పనక్కరలేదు.

దేశంలో ప్రభుత్వాలు గుక్కెడు కలుషితంలేని మంచినీళ్లు అందించలేకపోతున్నాయి. ఫలితంగా తాగునీరును కూడా వ్యాపారంగా మార్చేశాయి. నదుల నీళ్లను కూడా ప్రభుత్వాలు ప్రైవేటు కంపెనీలకు లీజులకు ఇస్తున్న సంఘటనలు ఈదేశంలో బోలెడున్నాయి. దేశంలోని అనేక ఉపనదుల నీటిని అనేక రాష్ట్రప్రభుత్వాలు విదేశీ కంపెనీలకు లీజులకిచ్చాయి. దీంతో బహుళజాతి సంస్థలు దేశంలో బాటి ల్ నీళ్ల వ్యాపారం చేసి ఏటా వేల కోట్ల లాభాలు కొల్లగొట్టి తమ దేశాలకు తరలించుకుపోతున్నాయి. కిన్లీ లాంటి విదేశీ కంపెనీలు మన నీళ్లను మనకే అమ్మి వేల కోట్లు కొల్లగొట్టుకొని పోతున్నాయి.

ప్రకృతిలోని పంచభూతాలను కూడా వ్యాపార వస్తువులుగా ప్రభుత్వాలే మారుస్తున్న ఈకాలంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణలో వేలాది గ్రామాలకు, వందలాది పట్టణాలకు యోగ్యమైన తాగునీటిని అం దించే ఒక బృహత్ పథకాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒక్క ప్రధాని మోడీ ప్రశంసించడంకాదు, అలాంటి పథకం మా రాష్ట్రంలోనూ కావాలని అనేక రాష్ర్టాలూ కోరుకుంటున్నాయి కూడా.

నన్ను చంద్రశేఖర్‌రావు ఎన్ని సార్లు కలిసినా ప్రతి సారి నీళ్ల విషయంపై ఉద్వేగానికి గురయ్యేవారు. నీళ్లే ఆయన జీవితానికి ఓ మిషన్‌లా మారాయి అని ప్రధాని ప్రశంసించిన తీరే కేసీఆర్ పాలనకొక గీటురాయి. జీవనదుల నీళ్లను ప్రతి గ్రామానికి తరలించి మంచినీరు అందించడమంటే అది మామూలు పనికాదు. నిజంగా అది భగీరథ పథకమే.. గజ్వేల్‌లో మొట్టమొదట ఆ పథకం అమ లు మొదలైంది. 2018 నాటికి ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే కేసీఆర్ లక్ష్యం సం పూర్ణంగా నెరవేరితే ఆయన పాలనకు అదే బలమైన మైలురాయి అవుతుంది. ఎన్నికల లోపు మంచినీరు అందించకపోతే, ప్రజలను ఓట్లు అడుగను అనడా న్ని బట్టి కేసీఆర్ కమిట్‌మెంట్‌ను మనం అర్థం చేసుకోవచ్చు.

అనేక రాష్ర్టాల్లో మంచినీటి పథకాలను గాలికి వదిలేస్తున్నారు. ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నారు. పైన చెప్పినట్లు నదులను కిలోమీటర్ల లెక్కన స్వదేశీ, విదేశీ నీటి వ్యాపార కంపెనీలకు ప్రభుత్వాలు అమ్ముకుంటున్నాయి. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే వేలాది గ్రామాలకు మంచినీటి పథకాన్ని చేపట్టడం వల్లనే ఇవాళ దేశంలో సీఎం కేసీఆర్‌కు ఒక ప్రత్యేక గుర్తింపూ వచ్చింది. దేశంలో కొత్తగా ఏర్పడిన 29వ రాష్ట్రం ఇది. అన్యాయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన రాష్ట్రం ఈదేశంలో ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ మాత్రమే. కాబట్టి ఈ రాష్ర్టాన్ని మోదీ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో తెలియదు.

దేశంలో అనేకప్రాంతీయపార్టీలు ఉన్నాయి. వాటి మనుగడ ఏదో ఒక జాతీయపార్టీకి వ్యతిరేకంగా కొనసాగుతున్నది.ఉదాహరణకు చంద్రబాబు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, ములాయం, మాయవతి బీజేపీకి వ్యతిరేకంగా, ఇలా దేశంలోని ఆయాపార్టీలు ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా మనుగడ సాగిస్తున్నాయి. కానీ కేసీఆర్ ఫలానా జాతీయపార్టీ పట్ల వ్యతిరేకతను ఆధారం చేసుకొని బతుకడంలేదని గమనించాలి. కాబట్టి కేసీఆర్ రాజకీయంగా పూర్తి స్వతంత్రుడనే చెప్పాలి. ప్రాంత ప్రయోజనమే ప్రధానంగా భావించే కేసీఆర్ కమిట్‌మెంట్‌ను అర్థం చేసుకున్నపుడే మోదీ తెలంగాణకు న్యాయం చేయగలుగుతారు. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెడితే.. ప్రధాని మోదీ కేసీఆర్‌ను ఒక విజనరీ పాలకుడిగా అప్పటికే భావించి ఉండాలి.

ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ను స్థాపించాలనుకున్నపుడు మోదీకి అనేక సూచనలు, సలహాలు ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆరే. రాష్ర్టాల పన్నుల వాటా పెంచాలనే కేసీఆర్ సలహాను మోదీ ఆహ్వానించారు. అమలులోకి తెచ్చారు కూడా. కాకపోతే, అనేక కేంద్ర పథకాలను రద్దు చేసి అంతే మోతాదులో రాష్ర్టాల పన్ను వాటాను 32శాతం నుంచి 42కి పెంచారు. అయినా కూడా ఆచరణాత్మకం కాని అనేక పథకాలను రద్దుచేసి రాష్ర్టాల పన్నుల వాటాను పెంచడం కూడా ఒక విధంగా మంచి పరిణామమే. కరువును ఎదుర్కొనేందుకు ఒక టాస్క్‌ఫోర్స్ ఉండాలని మోదీకి సలహా ఇచ్చింది కూడా కేసీఆరే. దళితులకు సంబంధించి తన దంటూ ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టండని మోడీకి గతంలోనే కేసీఆర్ సలహా ఇచ్చిన సందర్భమూ ఉంది.

నిన్నటి రెండు సభల్లోనూ మోదీ అధికభాగం దళితులపై దాడుల గురించి, నకి లీ గో రక్షాదళాలల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. యూపీ, గుజరాత్‌లలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన అలా ఖండించి ఉంటారని కొందరు భావించివచ్చు. కానీ దళితులను కాదు-కావాలంటే నన్ను చంపండి-అని మోదీ చేసిన వ్యాఖ్యల్లో నిజాయితీ ఉంది. ఒక ఆవేదన వుంది. తమ కొమ్మను తామే నరుకుతున్నామనే ఆక్రోషం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేని వారు చేస్తున్న కుట్ర ఇది అన్నారు. మోదలో వాజపేయి, అద్వానీల కంటే సైద్ధాంతిక పట్టుదల ఎక్కవ. ఇవాళ ప్రపంచ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. జాతీయవాదం మరింత బలపడాలె తప్ప అది బలహీనం కాకూడదనే భావన మోదీలో ఉందని ఆయ న వ్యాఖ్యలే చెపుతాయి.

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇంకా చూడాల్సివుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో విడమర్పులు లేకుండా చాలా స్పష్టంగా మాట్లాడారు. మోదీ పాలనా తీరులోని పారదర్శకతను కేసీఆర్ ప్రశంసించారు. కేసీఆర్ ఎప్పుడూ కడుపులో దాచుకోకుండా మాట్లాడతారు. అది కపటం లేని ప్రసంగం. కొత్త రాష్ర్టానికి వచ్చిన ప్రధానిని ఎలా గౌరవించాలో అంతకు మించే మోదీ ని కేసీఆర్ గౌరవించారు. తన ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తున్న తీరును ప్రశంసించారు. తెలంగాణకు ఒక జాతీయ సాగునీటి ప్రాజెక్టు, ఒక ఐఐఎం, ఐటీఐఆర్, ఎయిమ్స్ కావాలని మోదీకి కేసీఆర్ విన్నవించారు.

నిజానికి కేసీఆర్ గొంతెమ్మ కోర్కెలు కోరలేదు. కేంద్రం ఇవ్వగలిగేవి మాత్రమే అడిగారని చెప్పాలి. అదే సమయంలో కేసీఆర్‌లో ఉన్న సంయమనం గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయిపోయింది. విభజన చట్టంలోఅనేక హామీలు నెరవేరలేదు. ఉమ్మడి హైకో ర్టు విభజన లాంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఒక బహిరంగ సభలో అథితిని ప్రశ్నించడం సరికాదు. ఆ విషయం కేసీఆర్‌కు తెలుసు. ప్రధాని భేటీ ల సందర్భంగావాటిని అడగవచ్చు. కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టం గురించి మోదీ బాగానే చెప్పారు. రాజకీయాలు వేరు. దేశ అభివృద్ధి వేరు అనే కాన్సెప్ట్‌తో మోదీ పనిచేయగల్గుతారనుకుంటున్నాం. నిజానికి అలాంటి పంథానే ఈ దేశానికి అవసరం కూడా. సుమారు సగం భారతదేశం ప్రాంతీయపార్టీల ప్రభావంలో ఉన్నపుడు, దేశ ప్రధాని రాజకీయాల కతీతం గా దేశంలో సమాంతర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పనిచేయాల్సిఉంటుంది. ఆ కాన్సెప్ట్ తనలో ఉం దని మోదీ అంటున్నారు. తెలంగాణ వంటి కొత్త రాష్ర్టానికి అన్ని రకాల న్యాయం చేయగలిగినపుడే మోదీ కోఆపరేటివ్ సమాఖ్య వ్యవస్థలోని నిజాయతీని ఎవరైనా నమ్మగలుగుతారు.

1073

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే        


Featured Articles