పత్రికల్లో తెలంగాణ భాష


Fri,December 22, 2017 01:20 AM

ఔట్ సోర్సింగ్‌ను పొరుగు సేవలంటున్నాం. నిజానికి పొరుగు సేవలు అంటే పక్కింటోళ్ల సేవలా అన్నఅనుమానం, చరవాణి చెరబట్టిన భాషకు సంకేతమా? గుండ్రటి బల్ల సమావేశాలు, అంతర్జాలం అదేందో మాయాజాలం, కంప్యూటర్‌కు సంగనకం అని పేరుపెట్టి పరేషాన్‌కు గురిచేసిన పత్రికలున్నాయి.

భాష సమాచార వినిమయ సాధనం. రచనా వ్యాసాంగానికి పాత్రికేయ భాషకు తేడా ఉన్న ది. సమాచార, ప్రసార సాధనాలు సమాచార వినిమయానికి భాషను వాడుకుంటున్నాయి. పత్రికలు కూడా ఈ దిశలో తాము అందించే సమాచారాన్ని పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆధునిక ఆవిష్కరణలు ప్రజలకు చేరడానికి తెలుగు దినపత్రికల మీద ఎప్పటికప్పుడు కొత్త బాధ్యతలు పడుతున్నాయి. ప్రపంచీకరణ ప్రభావ నేపథ్యంలో ఆధునిక సమాచార సాంకేతిక రంగం ప్రాంతీయ భాషలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి తెలు గు పత్రికలు ఓ యుద్ధమే చేస్తున్నాయి. ప్రతి వ్యక్తికీ తనదైన వ్యక్తీకరణ విధానం లేదా భాషా శైలి ఉంటుంది. కొంతమంది వ్యక్తుల సమూహం పత్రికలో పనిచేస్తుంది. ఆ సమూహం పత్రికలో ఏకరూపత కలిగిన భాష ను, వ్యక్తీకరణ విధానాన్ని దాదాపు పాటిస్తున్నాయి. ఆ పాటించేందుకు ఆయా పత్రికలు రూపొందించుకున్నవే ైస్టెల్ షీట్స్. ఇవ్వాళ దాదాపు అన్ని ప్రముఖ తెలుగు దినపత్రికలకు వేటికవే ప్రత్యేక వ్యవహారిక పద సంపద ను రూపొందించుకున్నాయి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అదీ పాతపద్ధతి లో, అప్పుడెప్పుడో రాసుకున్న లేదా స్థిరీకరించుకున్న ైస్టెల్ షీట్‌నే వాడటమా? కొత్తగా తిరిగి పునర్విచించుకోవడమా? అన్నది ఈ సందర్భంలో ముఖ్యమైన అంశంగా తెరమీదికి వస్తున్నది.

ఇక నడుస్తున్న చరిత్ర ప్రత్యేకించి తెలంగాణలో ప్రపంచమే విస్తుపోయేలా అట్టహాసంగా ఐదు రోజులపాటు అద్వితీయంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. భాషా వికాసం, సంస్కృతి పరివ్యాప్తి కోసం, స్థిరీకరణ కోసం ఈ సందర్భంగా ప్రత్యేక చర్చ కూడా జరిగింది. తెలంగాణ భాషలో ఉన్న రిథమ్ అప్పుడప్పుడూ అవసరమైనప్పుడు పత్రికలో అది రిఫ్లెక్ట్ అవుతూ వస్తున్నది. తెలుగు పత్రికల్లో ఇప్పటివరకు దాదాపు అత్యుత్తమ శీర్షికలుగా ఉన్న వాటిల్లో సూపర్‌హిట్ అయినవన్నీ తెలంగాణ పద సవ్వడితో సుసంపన్నం చేసినవే. మాజీ సీఎం టి.అంజయ్య చనిపోయినప్పుడు గరీబోళ్ల బిడ్డ..నిను మరవదీగడ్డ అనే శీర్షిక హైలెట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం అందరినోళ్లల్లో నానిన అనేక శీర్షికల్లో వాడిన పదాలన్నీ తెలంగాణ మట్టిలోంచి పుట్టినవే.

ప్రజాకవి కాళోజీ చెప్పినట్టు కళ్లునావే చూపు నాది కాదు. చేతులు నావే చేతలు నావి కాదు. కాళ్లు నావే నడక నాది కాదు. చెవులు నావే వినికిడి నాది కాదు చివరికి మెదడు నాడే ఆలోచన నాది కాదు అని ఆవేదన పడ్డటే పరిస్థితి తయారైంది. ఆయనే ఆగ్రహించినట్టుగా రెండున్నర జిల్లా ల, రెండున్నర సంపన్నవర్గాల భాషే దండిభాషగా, చలామణి, అదే ప్రామాణికమై కూర్చొని తక్కిన ప్రాంతాల యాస, భాషలపై చిన్న చూపు చూసిన స్థితి కాలంనుంచి ఇప్పుడిప్పుడే మనల్ని మనం మనలోకి తొంగి చూసుకొనే కాలం వచ్చినందుకు తెలంగాణ సమాజం సంబురపడుతున్న ది. తెలంగాణలో ఆ మాటకొస్తే తెలుగులో అనువైన, సులభమైన పదాలు న్నప్పటికీ వాటిని కాదని అన్యభాషా పదాలను అరువు తెచ్చుకొని వాడుకునే దురవస్థ ఎక్కువగా కనిపిస్తున్నదనే ఆవేదన వ్యక్తమవుతున్నది.

తెలంగాణ ఆకాంక్షలను, ఆత్మగౌరవాన్ని అద్దంపట్టేలా మునుపెన్నడూలేని విధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలంగా ప్రయత్నాలు జరిగాయి. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఉపన్యాసాలను విని జనం సంబురపడటానికి కారణమైన వాడిన భాష. చేసిన పదప్రయోగాలే అనడంలో సందేహం లేదు. భాషలో వేలకొలది బాంబుల బలం ఉన్నదని నిరూపించిన సందర్భాలు అనేకం. తంతెలేవనోడు గోకుతే లేత్తడా అన్న ఒకేఒక్క మాట నిజామాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాన్ని తెలంగాణ వైపు తిప్పింది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ భాషకు, మాండలికాలకు ప్రత్యేక ఆదరణ, గుర్తింపు, ప్రచారం ఎక్కువైందనే చెప్పాలి. ప్రజల భాషను పత్రికలు పట్టుకొని రాయడం కొంత కష్టమైన పనే. అయితే ఈ క్రమంలో కొత్త పదాల అన్వేషణ కోసం, మారుతున్న సాంకేతిక విప్లవానికి అనువైన పదాల సృష్టి విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు అర్థం కాని వ్యర్థ పదాలను వారి మెదళ్లలోకి ఎక్కిస్తున్నామనే భావన భాషాభిమానుల్లో నెలకొన్నది. కొత్తపదాల సృష్టి ఆహ్వానించదగ్గపరిణామమే. అయితే వాటికి ప్రజాదరణ ఏ స్థాయిలో ఉన్నదో కూడా బేరీజు వేసుకొనే వ్యవస్థ ఒకటి ఉండాలి. ఉదాహరణకు రొడ్డాం అంటం నిజానికి అది రోడ్‌డౌన్. పక్కసైడుకు పోరాదు పక్క, సైడూ రెం డూ ఒక్కటే. వెనుకను కూడా ముఖంతో సమానంగా గౌరవించిన భాషా సంస్కృతి తెలంగాణది. తెలంగాణలో వెనకమొకాన అంటం. అదేవిధం గా తెలంగాణలో ఉర్దూపదాలు తెలుగులో కలిసిపోయి అవినిజమైన తెలు గు పదాలు గా చలామణి అవుతున్నాయి. జైలు నుంచి ఖైదీ పరార్ అన్న మూడు పదాలు ఉర్దూవే. అట్లనే రేడియో, టీవీ, రోడ్డు, పార్టీ, బస్సు వంటి పదాలను తెలుగు పదాలు కావంటే నమ్మలేని స్థితి నెలకొన్నది.
SRINIVAS
పత్రికా భాషకు సంబంధిం చి సాంకేతిక విప్లవం తెచ్చిన పుణ్యమాని తెలుగు కాక, ఇం గ్లీష్ కాకపోతున్నదా అన్న భావనలోకి కొన్ని పత్రికలు అనేక కొత్త పదాల సృష్టిస్తున్నామని సంబరం (సంబురం అని రాయరు) పడుతున్నాం కానీ వాటికి ప్రజల ఆదరణ ఎంత? అర్థం చేసుకునే సౌలతు ఎంత? అనేది చూసుకోకపోవడం వల్లే కొత్త పదాల సృష్టానంతర పరిణామాలు. ప్రజలు ఇష్టపడి, ఆదరించే పదాలను కాదని (అవి ఏ భాషా పదాలైనా) కొత్త పదాల సృష్టిలో అసలు అర్థమే మారిపో యి నవ్వుల పాలయ్యే పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురవుతున్నాయి. ప్రజల నానుడిలో స్థిరపడిపోయిన పదాలను అట్లనే వాడాలా? పోటీ ప్రపంచంలో కొత్త పదాలను సృష్టించామన్న సంబురంతో పాఠకులను అయోమయంలోకి నెట్టివేస్తున్నామా? అని ఆలోచించుకోవాలి. ఔట్ సోర్సింగ్‌ను పొరుగు సేవలం టున్నాం. నిజానికి పొరుగు సేవలు అంటే పక్కింటోళ్ల సేవలా అన్న అనుమానం, చరవాణి చెరబట్టిన భాషకు సంకేతమా? గుండ్రటి బల్ల సమావేశా లు, అంతర్జాలం అదేందో మాయాజాలం, కంప్యూటర్‌కు సంగనకం అని పేరుపెట్టి పరేషాన్‌కు గురిచేసిన పత్రికలున్నాయి.

ఈ క్రమంలో పలుకుబడు ల భాషకు గౌరవం ఇచ్చేలా దీర్ఘకాలిక కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరమున్నది. జర్నలిజంలో ఒకప్పుడు బడులు వాడేవాడు బడుద్ధాయి అనేవారు. చెప్పబడెను, చేయబడెను అనే కాదు చివరికి బడిని కూడా వాడకుండా చేసి పాఠశాలను చేశారు. తెలంగాణలో ఇవ్వాళ పామరులే కాదు పండితులెవ్వరూ కూడా బడికిపోలేదా అంటరు గానీ పాఠశాలకు పోలేదా? అనరు. పాఠశాల అనరు బడే అంటరు. ఆ బడిని బతికించుకోవాలి. బయట బాడ్కావ్ అంటే కొడ్తరు కానీ అదే సినిమాలో అంటే ఫిదా అయినం. తెలంగాణ ఫిదా కోసం మన భాషను ఉన్నతీకరించుకునే విధంగా తెలంగాణ జీవ న, ప్రమాణ కోణంలో ఆయా పత్రికలు తమతమ పూర్వ ైస్టెల్ షీట్స్‌ను మార్చుకునేలా పరిస్థితుల సృష్టి జరుగాలి. బడి పలుకుల భాషకు గౌరవం ఇస్తూనే పలుకుబడుల భాషకు పత్రికల్లో మరింత చోటుదక్కేలా అన్నిస్థాయిల్లో చర్చ జరుగాలి.

754

SRINIVAS NOORA

Published: Thu,November 9, 2017 10:55 PM

ఒగ్గు కథకు వేగుచుక్క

ఒగ్గు కథకు ఆయన వేగుచుక్క. ప్రపంచ రంగస్థలం మీద పసిడి కాంతులు పండించిన ఒగ్గు కథకుడు చుక్క సత్తయ్య. అసలు పేరు చౌదరిపల్లి సత్తయ్య. నెత

Published: Sun,December 25, 2016 02:47 AM

భరించువాడే భారతీయుడు..!

బాధిత భారతం. నోటు ముందర ఓడిపోతున్న మనిషి. మోదీ మానియా. అవును ఇప్పుడు జగమంతా మోదీ మానియా. మూడున్నా లేకున్నా మోదీ అనకపోతే మొద్దుబారు

Published: Wed,July 15, 2015 12:23 AM

ప్రకృతి నిజం..మనిషి అభూతం..!

మనిషి ప్రకృతితో సంభాషించే అరుదైన ఆవిష్కరణ పుష్కరాలు. తనువును మరిచి, తలంపులు వదిలి తన్మయత్వంతో జలచేతన ప్రదర్శించే దృశ్యాలు ఒక్కొక్క

Published: Sat,October 6, 2012 03:57 PM

ఏడేళ్ల కిందటి ‘యాది’

ఆదిలాబాద్‌లో ఎవరు కాలుపెట్టినా సామల సదాశివ మాస్టా రు ఇంటికి వెళ్లాల్సిందే. వరంగల్‌లో కాలుమోపిన వాళ్లు కాళోజీ ఇంటికి వెళ్లినట్టు, క

Published: Sat,October 6, 2012 03:57 PM

జాతీయ పార్టీలు-తెలంగాణ..!

తెలంగాణకు సానుకూలంగా ఉండే పార్టీలనే తమ భాగస్వామ్యంలో చేర్చుకుంటామని బీజేపీ అధికారప్రతినిధి ప్రకాశ్ జవదేవకర్ చెప్పినా, తెలంగాణ 2014

Published: Sat,October 6, 2012 03:58 PM

ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!

ము లుగు దారులన్నీ మేడారం వైపు సాగుతున్నాయి. చీమలు పుట్టల్లోంచి ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!పోటెత్తినట్లు.., ఉసిళ్లు దండెత్తి

Published: Sat,October 6, 2012 03:59 PM

కుత్తుకలపై కత్తులు..చేతుల్లో అక్షరాళ్ళు?

-వరంగల్ జర్నలిస్టుల ఉద్యమానుభవాలు ‘శిబిరాల పేరు వినబడితే మనకు శరణార్థులు గుర్తుకు వస్తారు. తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తంగ