కుత్తుకలపై కత్తులు..చేతుల్లో అక్షరాళ్ళు?


Sat,October 6, 2012 03:59 PM

-వరంగల్ జర్నలిస్టుల ఉద్యమానుభవాలు
ttgg-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
‘శిబిరాల పేరు వినబడితే మనకు శరణార్థులు గుర్తుకు వస్తారు. తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తంగా వలస వెళ్లకపోయినా వలస పాలన మూలంగా సొంతగడ్డపైనే శరణార్థుల్లాగా బతుకులు ఈడుస్త్తూన్న వైనం ఆ పాలన స్వభావాన్ని బహిర్గతం చేస్తుంది. ఉత్థానపతనాలు ఉద్యమాలకు మామూలే అయినప్పటికీ ఒక ఉద్యమం ఇంత స్థిరంగా ఉధృతంగా జరగడాన్ని ఎవరు మాములుగా తీసుకుంటారు’ అంటాడు గుండెబోయిన శ్రీనివాస్. నిజమే ఎవరూ మామూలుగా తీసుకోరని తెలంగాణ జర్నలిస్టు ఫోరం వరంగల్ పాత్రికేయులు సమయం వచ్చినప్పుడల్లా అసాధారణంగా స్పందిస్త్తున్నారు. అట్లా స్పందించేందుకు బలమైన నేపథ్యం ఉంది.

తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన సంఘటనపూన్నో ఇక్కడ రికార్డయ్యాయి. ఇక్కడే పాత్రికేయుడు మిర్యాల్‌కార్ సునీల్‌కుమార్ తెలంగాణ కోసం ఆత్మహత్యచేసుకున్నాడు. సీమాంధ్ర మీడియా కుట్రలకు బలైపోయాడు. ఇక్కడే మానుకోట కాల్పులున్నయి, రాయినిగూడెం రౌద్రమున్నది.దాదాపు 25 లక్షల మంది ఒక్క గొంతుగా మహాగర్జన చేసిన అపురూపఘట్టం ఉన్నది. నిప్పును ఆలింగనం చేసుకున్న ముసుకు కరుణాకర్, మైనారిటీ సవేరా విద్యార్థులున్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ చెప్పినట్టు ‘నిప్పుల్లో నడిచి, నిజాలను చాటిన అనుభవం తెలంగాణ గ్రామీణ పాత్రికేయులకు ఉన్నది. తూటాలను వారు ఎదుర్కొన్నారు. తెలంగాణ సమాజం పయనించిన కత్తుల వంతెనమీద కూడా క్షతగావూతులై నడిచివచ్చారు’. ఈ ఉద్యమంలో పనిచేసిన ఎంతోమంది జర్నలిస్టుల అభివూపాయాలను, అనుభవాలను, అనుభూతుల్ని ఒక సమాహారంగా అందించాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం వరంగల్ విభాగం నిర్ణయించుకున్నది. ‘తెలంగాణ అక్షరాళ్లు’ అన్న పుస్తకాన్ని తెచ్చింది.

‘‘మన అనుభవాలు పరిపుష్టం అయిన తెలంగాణ సమాజానికి కీర్తి పతాకలు కావాలి. మనం రాతగాళ్లం. మనం తెలంగాణ తల్లి రెక్కల కింద బతికినవాళ్లం. తెలంగాణ తల్లి ఒడిలో అక్షరాలను దిద్దినవాళ్లం. ఆ తల్లి తల్లడిల్లిన క్షణాలను కలం ద్వారా జాలువారించిన వాళ్లం. మనలను ఇంతజేసిన ఆ తల్లిరుణం తీర్చుకుందాం. ముందుగా మనం తెలంగాణ తల్లిబిడ్డలం. పౌరులం. తరువాతే జర్నలిస్టులం’’ అని ఉద్బోధిస్తారు ఇందులో తెలంగాణ జర్నలిస్టు ఫోరం కన్వీనర్, నమస్తే తెలంగాణ సంపాదకుడు అల్లం నారాయణ. తెలంగాణ ఆణిముత్యాల్లాంటి నలుగురు సంపాదకులు అల్లం నారాయణ, కె. శ్రీనివాస్, టంకశాల అశోక్, ఎన్. వేణుగోపాల్ అభివూపాయాలు, అనుభవాలున్నాయి. వరంగల్ గడ్డమీద పుట్టి ప్రస్తుతం నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న మాడభూషి శ్రీధర్ శ్రీకృష్ణకమిటీపై చేసిన వ్యాఖ్యానమూ ఉంది. వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలూ ఇందులో ఉన్నాయి. సంపాదకుడుగా శంకర్‌రావు శంకేసి, సహ సంపాదకులుగా మండువ రవీందరరావు, మహేందర్‌కూన, పీవీ కొండల్‌రావులున్నారు. కొత్తపల్లి జయశంకర్‌కు అంకితిమిచ్చిన ఈ ‘తెలంగాణ అక్షరాళ్లు’ ఈనెల 28న ఉదయం 11 గంటలకు వరంగల్ జిల్లా ప్రజాపరిషత్‌హాల్‌లో ఆవిష్కరణ కాబోతున్నది.

tggg-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
తమ పరిమితులు, పనిచేస్తోన్న మీడియా సంస్థల్లో పరిస్థితుల వంటి కారణాల వల్ల ఈ పుస్తకంలో తమ అభివూపాయాలు చెప్పనివాళ్లున్నారు. అంతమాత్రాన ఉద్యమానికి దూరంగా ఉన్నట్టుకాదనేది వారి అభివూపాయం. అయితే ఇందులో కొంతమంది పాత్రికేయులు తమ సొంత ఎజెండానూ నమోదు చేశారనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ బహుశా ఇది ప్రత్యేక ఉద్యమాలపై ప్రపంచంలో వచ్చిన మొదటి జర్నలిస్టుల అనుభవ పుస్తకం అవుతోందనేది మేధావుల మాట. ‘మీడియా ప్రయోజనాలు, ఫిలాసఫీ లోగడకన్నా గణనీయంగా మారినప్పటికీ ప్రజల భావనలు, ఉద్యమాల పట్ల ఆసక్తి నశించిపోయిందనికాదు. ఎంతోకొంత ఆసక్తి, సానుభూతిగల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు ఇప్పటికీ ఉన్నారు. ఇంగ్లీష్ పత్రికలలో వేర్వేరు భారతీయ భాషాపవూతికల ఢిల్లీబ్యూరోలలో ఉన్నారు. వాటికి తెలంగాణ గురించిన వాస్తవాలను, విశ్లేషణలను అందజేస్తున్నవారు లేరు’అని సంపాదకుడు టంకశాల అశోక్ అభివూపాయపడతారు. తెలంగాణ గురించిన వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆయా స్థాయిల్లో, ప్రాంతాల్లో పనిచేసే వారికి వరంగల్ పాత్రికేయులు అందిస్తోన్న ‘తెలంగాణ అక్షరాళ్లు’ ఉపయుక్తంగా ఉంటాయని ఆశిద్దాం.

-నూర శ్రీనివాస్
ప్రచురణ: తెలంగాణ జర్నలిస్టు ఫోరం-వరంగల్
వెల: రూ.10035

SRINIVAS NOORA

Published: Fri,December 22, 2017 01:20 AM

పత్రికల్లో తెలంగాణ భాష

ఔట్ సోర్సింగ్‌ను పొరుగు సేవలంటున్నాం. నిజానికి పొరుగు సేవలు అంటే పక్కింటోళ్ల సేవలా అన్నఅనుమానం, చరవాణి చెరబట్టిన భాషకు సంకేతమా? గు

Published: Thu,November 9, 2017 10:55 PM

ఒగ్గు కథకు వేగుచుక్క

ఒగ్గు కథకు ఆయన వేగుచుక్క. ప్రపంచ రంగస్థలం మీద పసిడి కాంతులు పండించిన ఒగ్గు కథకుడు చుక్క సత్తయ్య. అసలు పేరు చౌదరిపల్లి సత్తయ్య. నెత

Published: Sun,December 25, 2016 02:47 AM

భరించువాడే భారతీయుడు..!

బాధిత భారతం. నోటు ముందర ఓడిపోతున్న మనిషి. మోదీ మానియా. అవును ఇప్పుడు జగమంతా మోదీ మానియా. మూడున్నా లేకున్నా మోదీ అనకపోతే మొద్దుబారు

Published: Wed,July 15, 2015 12:23 AM

ప్రకృతి నిజం..మనిషి అభూతం..!

మనిషి ప్రకృతితో సంభాషించే అరుదైన ఆవిష్కరణ పుష్కరాలు. తనువును మరిచి, తలంపులు వదిలి తన్మయత్వంతో జలచేతన ప్రదర్శించే దృశ్యాలు ఒక్కొక్క

Published: Sat,October 6, 2012 03:57 PM

ఏడేళ్ల కిందటి ‘యాది’

ఆదిలాబాద్‌లో ఎవరు కాలుపెట్టినా సామల సదాశివ మాస్టా రు ఇంటికి వెళ్లాల్సిందే. వరంగల్‌లో కాలుమోపిన వాళ్లు కాళోజీ ఇంటికి వెళ్లినట్టు, క

Published: Sat,October 6, 2012 03:57 PM

జాతీయ పార్టీలు-తెలంగాణ..!

తెలంగాణకు సానుకూలంగా ఉండే పార్టీలనే తమ భాగస్వామ్యంలో చేర్చుకుంటామని బీజేపీ అధికారప్రతినిధి ప్రకాశ్ జవదేవకర్ చెప్పినా, తెలంగాణ 2014

Published: Sat,October 6, 2012 03:58 PM

ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!

ము లుగు దారులన్నీ మేడారం వైపు సాగుతున్నాయి. చీమలు పుట్టల్లోంచి ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!పోటెత్తినట్లు.., ఉసిళ్లు దండెత్తి