ఏడేళ్ల కిందటి ‘యాది’


Sat,October 6, 2012 03:57 PM

ఆదిలాబాద్‌లో ఎవరు కాలుపెట్టినా సామల సదాశివ మాస్టా రు ఇంటికి వెళ్లాల్సిందే. వరంగల్‌లో కాలుమోపిన వాళ్లు కాళోజీ ఇంటికి వెళ్లినట్టు, కొత్తపల్లి జయశంకర్ సార్‌ను పలకరించి వెళ్లినట్టు సదా శివను పలకరించనిది ఆదిలాబాద్‌నుంచి రారు. సాహిత్యంలో ఆయనకు ప్రవేశంలేని అంశం లేదంటే అతిశయోక్తికాదు. ఆదిలాబాద్ గిరిజన వీరుడు కొమురం భీంను పాఠ్యాంగంగా పెట్టిం చి, దాన్ని రాసిన ఉపాధ్యాయుడు సామల సదాశివ మాస్టారు. ఓసారి ఆయనను కలుద్దామని వాళ్లింకి వెళ్లాను.మీతో కాసేపు మాట్లాడి ఆదిలాబాద్ గురించి తెలుసుకునేందుకు వచ్చానని ఆయనతో పరిచయం చేసుకున్నాను. కొద్దిసేపు మాట్లాడిన తరువాత ‘ఎక్కడ బాబు మీది’ అని అడిగారు. మాది వరంగల్ సార్ అని చెప్పగానే అంతపెద్దాయన లేచి ‘మా వరంగల్లా నీది’ అంటూ ఆలింగనం చేసుకొని వరంగల్ వాళ్లు చాలా చక్కటి తెలుగు మాట్లాడతారు బాబు అన్నాడు. మా కాకాజీ (ఆయన కాళోజీ నారాయణరావును అలానే పిలిచేవారు) దగ్గరి నుంచి వచ్చావన్నమాట అంటూ చెప్పుకుంటూ పోయారు. ఉదయం పది గంటల నుంచి మధ్నాహ్నం రెండున్నర దాకా అంతపెద్దాయన ఓపిగ్గా చెబుతూనే ఉన్నారు. నీకు సాహిత్యంలో ప్రవేశం ఉందా అని అడిగారు? లేదు సార్ అని చెపుతూ ఏవో నాకు తెలిసిన, నేను చదివిన కొన్నిపుస్తకాల పేర్లు చెప్పాను. అయినా ఫర్వాలేదు బాబు ఈతరం వాళ్లు ఎవరు చదువుతున్నారు? జర్నలిస్టులు అనేవాళ్లు సమాజంలో తామే పెద్దవాళ్లమనుకుంటారు, కానీ నన్ను మార్చింది మాత్రం గొలకొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపడ్డి అని చెప్పుకుంటూ పోయారు. ‘మీరు పద్య రచన మానుకోండి. అది రాసేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఉర్దూభాషా, సాహిత్యం గురించి రాసేవాళ్లులేర’ని చెప్పారు. అప్పటి నుంచి నా సాహితీ శైలి మారిపోయిం ది అన్నారు. ఆయన తెలుగు ఎంత బాగా రాయలగరో అంతే సులువుగా సంస్కృతం రాయగలరు. చెప్పగల రు. ఫారసీ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ అనేక భాషలను మాతృభాషలో చెప్పినట్టుగా చెప్పగల బహుభాషా కోవిదుడు ఆయన. 1949లో ప్రారంభమైన ఆయన సాహితీ సృజన తుదిశ్వాస దాకా సాగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆయనకు వచ్చినపుడు ఆయన పెద్దగా స్పందించలేదు. ‘మిమ్మల్ని లేటుగా గుర్తించారా సార్’ అంటే ‘మన గురించి మోసేవాడుండాలి. మనకు మోసే ఓపికగానీ, నైజం కానీ లేవు. వాళ్ల మీద వస్తోన్న విమర్శలను తట్టుకోవడానికి నాలాంటి నోరులేనివాళ్లు కనిపిస్తారు. ఎవరిని ఎందుకు అనాలి బాబు’ అని సున్నితంగానే సమాధానం చెప్పారాయన. ‘అయినా నేను రాసిన నాలుగు అక్షరాలు జనం మెచ్చారు. సాహితీలోకం గౌరవించింది అది చాలు. దాని ముందు ఎన్ని పురస్కారాలు అయినా దిగదుడుపే కదా అంటారయన.


సదాశివ నిరంతర అధ్యయనశీలి. 1947లోనే ‘ఆంక్ కీ కిరికిరి’ అనే పుస్తకాన్ని హిందీలో చదివి ఆ భాష పట్ల మమకారం పెంచుకున్నాని చెప్పారు. ఈ దేశంలో ఇంగ్లీష్‌వాళ్లు వచ్చిన తరువాతే స్థానిక భాషలు మాయం కావడం మొదలైందని చెబుతూ, ఆంగ్లసాహిత్యా న్ని ఔపోసన పట్టారు. మాగ్జిమ్‌గోర్కి మొదలుకొని లీయోటాల్‌స్టాయ్ వార్ అండ్ పీస్, మోపాస, జాన్‌మిల్టన్, షేక్స్‌పియర్ ట్రాజెడీ అండ్ కామెడీ, నాటకాలను, సోమర్‌సెట్‌మామ్‌ను, ఇలియట్‌ను వడపోశారు. సున్నితత్వం, మనిషితత్వం బాగా ఎరిగిన సాహితీవిలుకాడు సామల సదాశివ. తన అత్తగారు చంద్రాపూర్ కావడం వల్ల తన సతీమణిలాగే,మరాఠీ కూడా పరిచయం అయిందని చెబుతారు. హైదరాబాద్‌లో సుల్తాన్‌బజార్‌లోని పురోహిత్ సాంగ్ అండ్ బుక్ హౌజ్ ఒకటైతే, మరొకటి హన్మకొండ కుమార్‌పల్లిలోని బ్రాడ్‌వే లాడ్జ్. ఇవి రెండూ తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలని ఆయన చెప్పుకునేవారు. సుల్తాన్‌బజార్‌లో హిందూస్థానీ సంగీత పాటలు వినేందుకు వెళితే, బ్రాడ్‌వే లాడ్జ్‌లో సాహిత్యసాగు కోసం వచ్చేదని చెప్పేవారు. ఉపాధ్యాయులు లోతైన అధ్యయనంతో ఉండాలనేది ఆయన సూచ న. సమాజంలో ఎవరు చదివినా చదవకపోయినా నష్టం జరగదు, కానీ ఒక ఉపాధ్యాయుడు అప్‌డేట్ కాకపోతే ఆ జనరేషనే నష్టపోతుం ది అనేది ఆయన భావన. దాశరథి జీవనయానం కొన్నిసెక్షన్స్ వరకే పరిమిత ప్రయాణం అయితే సామలసదాశివ మాస్టారు ‘యాది’ సబ్బండ వర్గాల గుండెలకు దగ్గర చేసింది. తన చిన్నప్పటి నుంచి తనకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరి గురించి ఆయా వ్యక్తులతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాల గురించి ఆయన రాసిన ధారవాహిక వ్యాసాలే ‘యాది’పుస్తకం. తెలిదేవర భానుమూర్తి నా ఇంటిపేరునే మార్చిండయ్యా.. (యాది సదాశివను చేసిండు)అంటూ ఆయనను అభినందించారు. చిన్నప్పటి నుంచి సంగీతం, మడీ ఆచారం పొంగిపొర్లిన ఇంట్లో పుట్టకపోయినా సప్తలయల మర్మాన్ని హిందూస్థానీ గాత్రాన్ని పామరులకు అందించిన మహానుభావుడు సదాశివుడు అక్షర సేనాని. అచ్చమైన తెలంగాణ భాషకు నుడికారం సదాశివ మాస్టారు. అటువంటి మహానుభావుడు అక్షరకృషీవలుడు ఆకాశంలో నక్షవూతమై తెలంగాణ అక్షర మాగాణాన్ని సుసంపన్నం చేయాలని ఆకాంక్షిస్తూ ఆ మహోపాధ్యాయుడికి అక్షర నివాళి...!

-నూర శ్రీనివాస్

35

SRINIVAS NOORA

Published: Fri,December 22, 2017 01:20 AM

పత్రికల్లో తెలంగాణ భాష

ఔట్ సోర్సింగ్‌ను పొరుగు సేవలంటున్నాం. నిజానికి పొరుగు సేవలు అంటే పక్కింటోళ్ల సేవలా అన్నఅనుమానం, చరవాణి చెరబట్టిన భాషకు సంకేతమా? గు

Published: Thu,November 9, 2017 10:55 PM

ఒగ్గు కథకు వేగుచుక్క

ఒగ్గు కథకు ఆయన వేగుచుక్క. ప్రపంచ రంగస్థలం మీద పసిడి కాంతులు పండించిన ఒగ్గు కథకుడు చుక్క సత్తయ్య. అసలు పేరు చౌదరిపల్లి సత్తయ్య. నెత

Published: Sun,December 25, 2016 02:47 AM

భరించువాడే భారతీయుడు..!

బాధిత భారతం. నోటు ముందర ఓడిపోతున్న మనిషి. మోదీ మానియా. అవును ఇప్పుడు జగమంతా మోదీ మానియా. మూడున్నా లేకున్నా మోదీ అనకపోతే మొద్దుబారు

Published: Wed,July 15, 2015 12:23 AM

ప్రకృతి నిజం..మనిషి అభూతం..!

మనిషి ప్రకృతితో సంభాషించే అరుదైన ఆవిష్కరణ పుష్కరాలు. తనువును మరిచి, తలంపులు వదిలి తన్మయత్వంతో జలచేతన ప్రదర్శించే దృశ్యాలు ఒక్కొక్క

Published: Sat,October 6, 2012 03:57 PM

జాతీయ పార్టీలు-తెలంగాణ..!

తెలంగాణకు సానుకూలంగా ఉండే పార్టీలనే తమ భాగస్వామ్యంలో చేర్చుకుంటామని బీజేపీ అధికారప్రతినిధి ప్రకాశ్ జవదేవకర్ చెప్పినా, తెలంగాణ 2014

Published: Sat,October 6, 2012 03:58 PM

ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!

ము లుగు దారులన్నీ మేడారం వైపు సాగుతున్నాయి. చీమలు పుట్టల్లోంచి ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!పోటెత్తినట్లు.., ఉసిళ్లు దండెత్తి

Published: Sat,October 6, 2012 03:59 PM

కుత్తుకలపై కత్తులు..చేతుల్లో అక్షరాళ్ళు?

-వరంగల్ జర్నలిస్టుల ఉద్యమానుభవాలు ‘శిబిరాల పేరు వినబడితే మనకు శరణార్థులు గుర్తుకు వస్తారు. తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తంగ