జాతీయ పార్టీలు-తెలంగాణ..!


Sat,October 6, 2012 03:57 PM

Site02 talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణకు సానుకూలంగా ఉండే పార్టీలనే తమ భాగస్వామ్యంలో చేర్చుకుంటామని బీజేపీ అధికారప్రతినిధి ప్రకాశ్ జవదేవకర్ చెప్పినా, తెలంగాణ 2014లో మేమే ఇస్తామని ఆ పార్టీ లోక్‌సభ నాయకురాలు సుష్మా స్వరాజ్ చెప్పినా పరకాల ఓటర్లు ఎందుకు వినలే? రెండు ఎంపీ సీట్లున్న టీఆర్‌ఎస్‌ను రెండు ఫీట్ల తాడుతో పోలుస్తూ 270 అడుగుల లోతులో ఉన్న బావిలోని నీళ్లు ఎలా తోడుతారు? తమ వద్ద 270 మంది ఎంపీలున్నారు. తెలంగాణ ఇచ్చే శక్తి భారతీయ జనతాపార్టీకే ఉందని పరకాలలో తిష్టవేసి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి మాటను పరకాల ప్రజలు పట్టించుకోకపోవడానికి కారణం?

‘తెలంగాణ తెచ్చేది మేమే. ఇచ్చేది మేమే’ అని కాంగ్రెస్ నాయకులు చెప్పినా పరకాల ప్రజలు ఆ పార్టీని ఛీకొట్టారు. అంతేకాదు ముఖ్యమంవూతి కిరణ్‌కుమార్‌డ్డి ‘మేం ఎంతగా అభివృద్ధి చేస్తోన్నా తెలంగాణ వాదం ఉండటం మా దురదృష్టకరం’అని చాలా అసహనంతో వ్యాఖ్యానించారు. తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని చెబుతూనే, మరోవైపు సీఎం అలా మాట్లాడ టం అంటే అర్ధం ఏమిటో పరకాల ప్రజలు గ్రహించారు. తెలంగాణలో జాతీయ పార్టీలకు కాలం చెల్లిందా? అంటే, పరకాల ఫలితం అవుననే సమాధానం చెబుతోంది. తెలంగాణ విషయంలో రెండు జాతీయ పార్టీలు ఈ ప్రాంత ప్రజల మనోభాలను, ఆత్మగౌరవాన్ని అవహేళన చేశాయని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారనడానికి పరకాల ఫలితమే సాక్ష్యం. జాతీయ పార్టీలకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం కానీ, ప్రాంతీయ ప్రయోజనాలు ప్రజల మనోభీష్టంతో వాటికి అక్కరలేదని అనేక సందర్భాల్లో స్పష్టం అవుతూనే ఉన్నది.

పరకాల ఉప ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీలకు దిమ్మతిరిగేలా చేశాయి. ఎవన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ అంశం విషయంలో ఉద్యమపార్టీనే ప్రజలు నమ్ముతున్నారని పరకాల రుజువు చేసింది. బరిలో ఉన్న పార్టీలన్నీ తెలంగాణ అన్నాయి. చివరికి తాను పాల్గొన్నది పరకాల నియోజకవర్గమో, గీసుగొండ నియోజకవర్గమో అనే కన్ఫ్యూజన్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, జగన్‌బాబు రాయలసీమలోనే తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారనీ చెప్పింది. అంటే బరిలో నిలిచిన పార్టీలన్నీ తెలంగాణ పదాన్ని జపించకుండా ప్రచారంలో కాలుకదపలేదు. తెలంగాణను తలెత్తుకొని నిలబడేలా చేశారు పరకాల ప్రజలు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం తరువాత ఇక్కడ చంద్రబాబు నాయుడు వద్దంటే, ఆయన మద్దతు అవసరమై అప్పుడు తెలంగాణను ఇవ్వలేకపోయామని బీజేపీ పదేపదే చెప్పినా ఫలితం లేకపోయింది.

‘నిన్న చంద్రబాబు వద్దన్నాడు. రేపు మరో బాబు వద్దంటారు? ఇలా ఎవరో ఒకరు వద్దంటే బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని ప్రజలు అనుకున్నారు. అందుకే సుష్మాస్వరాజ్ లాంటి నాయకురాలు చెప్పినా నమ్మలేదు. పాలమూరు ఫలితం ఊపుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి వంద గ్రామాలు ‘రోడ్’షో’ చేస్తే బీజేపీకి 9160 ఓట్లు వచ్చాయి. 2009లో కమలనాథులకు ఈ నియోజకర్గంలో 3497 ఓట్లు వచ్చాయి. తీరా ఎన్నికల ఫలితం వచ్చాక ‘మేం గతంలో కంటే చాలా మెరుగు’ అని ఓ సీనియర్ బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించాడు. ‘మేం గెలువకున్నా ఫర్వాలేదు. కానీ కేసీఆర్‌కు మా పవరేంటో చూపిస్తాం. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఏకఛవూతాధిపత్యానికి కళ్లెం వేస్తాం. తెలంగాణలో కచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం’అని బీజేపీ రంగంలోకి దిగింది. ఆ అతివిశ్వాసం వల్లే జనామోదం పొందలేకపోయింది.

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ అధ్వాన్నం. కాంగ్రెస్‌కు కేవలం 5099 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీకి నాలుగు పోలింగ్ బూతుల్లో ఒక్కొక్క ఓటే పోలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి పరకాల అంతా ఇల్లిల్లూ గాలించినా, కాచి వడబోసినా ఆ పార్టీ పరిస్థితి బీజేపీ కంటే అధ్వాన్నం. ఇంత దయనీయంగా మారడానికి ఆ పార్టీ నాయకులు అనుసరించిన పద్ధతే కారణం. ‘మేం ఎంతగా అభివృద్ధి చేసినా తెలంగాణ వాదం ఉండటం మా దురదృష్టకరమని ముఖ్యమంత్రి అవహేళన చేస్తున్నా జిల్లాకు చెందిన వారేకాదు, తెలంగాణ కోసం పోటీలు పడి మైకుల ముందు పూనకం వచ్చిన వాళ్లలా మాట్లాడే నాయకుల నోటి వెంట పల్లెత్తు మాట లేదు ‘సరికదా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కోరిక’ అని సర్దిపుచ్చుకున్నారు. పరకాలకు వచ్చి తెలంగాణను అవహేళన చేస్తున్నా పట్టించుకోని వైనాన్ని ఆత్మగౌరవం ఉన్న బిడ్డలు ఎట్లా అయితే స్పందిస్తారో..అలాగే పరకాల ప్రజలు స్పందించారు.

2009లో ‘హైదరాబాద్‌కు రావాలంటే వీసా, పాస్‌పోర్టుతో పోవాల్సి ఉంటుంది’ అని తొలి దశ పోలింగ్ ముగిసిన వెంటనే గడియారం చూసుకొని మరీ ఆనాడు వైఎస్ రాజశేఖరడ్డి మాట్లాడిన దానికి, పరకాలలో ఈ సీఎం కిరణ్‌కుమార్‌డ్డి మాట్లాడినదానికి పెద్ద తేడా ఏమీలేదని పరకాల ప్రజలు గుర్తించారు. అందుకే కాంగ్రెస్‌ను ఎక్కడుంచాలో అక్కడే ఉంచారు.

పరకాల బరిలో నిలిచిన ఐదు ప్రధాన పార్టీలు తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకొన్నాయి. అందరూ తెలంగాణ తాము తెస్తామంటే తామే తెస్తామని ప్రజల్ని గందరగోళపెట్టాలని చూసినా టీఆర్‌ఎస్ వైపే ఓటర్లు మొగ్గుచూపారు.తెలంగాణ వాదంతో ఆటలాడాలని డబ్బుతో తెలంగాణ వాదాన్ని కాటగలపాలని చూసిన పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పా రు. ఎన్నికల సమయంలో ముఖ్యంగా పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ప్రజలను కొనాలని తద్వారా తెలంగాణ వాదం అమ్ముడుపోతుందని నిరూపించాలని చూసిన పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. పైసలే పరకాలను నడిపిస్తాయని నమ్ముకోవడం ఎంత భ్రమో, ప్రజలతోలేని పార్టీలకు, అభ్యర్థులకు తగిన శాస్తి జరుగుతుందని ఆయా పార్టీలకు ప్రజలు నిరూపించారు.

అయితే ఇందులో టీఆర్‌ఎస్ మెజారీటీ ఎంత? ఆ పార్టీ శ్రేణులు మనస్ఫూర్తిగా పనిచేశాయా? లేదా? ఎంత మంది ప్రలోభాలకు గురయ్యారు? ఎవవరు ఆఖరి నిమిషంలో అజ్ఞాతంలోకి వెళ్లారు? ఎన్నికల ఇన్‌చార్జిగా వచ్చిన హరీష్‌రావు జిల్లా కేంద్రం నుంచి వెళ్లగానే ముసుగులు వేసుకున్న వాళ్లెవరు? ఆ పార్టీ నాయకుల వ్యవహార సరళి ఏమిటీ? ఎవవరు ఏం చేశారు? ఏం చేయలేకపోయారు? వారలా ప్రవర్తించి ఉండకుంటే మెజారిటీ విషయంలో ఈ ఉపఎన్నికల్లో మిగతా చోట్ల గెలిచిన అభ్యర్థులకు సమాంతరంగా వచ్చేదే కదా! అనే సగటు తెలంగాణ వాది భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరు. గెలుపు విషయంలో సాంకేతికతలు, సహేతుకతలు ఉండవు. గెలు పు గెలుపే. పాలమూరులో దాదాపు ఇదే మెజారిటీతో బీజేపీ గెలిస్తే గెలిచిందన్నప్పుడు పరకాలలో టీఆర్‌ఎస్‌ను మాత్రం ప్రశ్నిస్తున్నారెందుకు? పరకాల ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు మూడు ప్రధాన అంశాలు అవసరమని స్పష్టం చేసింది. సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం, నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకత్వం ఉండటం, ఆ బలమైన నాయకత్వం ఉద్యమాలతో మమేకం కావాలనే హితవును పరకాల ఫలితం ద్వారా సుష్టం చేసింది.

ఎన్నికల సమయంలో ‘మా అధినేత కేసీఆర్ ఒక్కసారి వచ్చిపోతే మేం గెలిచినట్టే’ లేదా ‘హరీష్‌రావు లాంటి నాయకుడు నా నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వస్తే ఎటువంటి పరిస్థితుల్నైనా అధిగమించవచ్చ’ని భారం అంతా వారిపైన వేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే రేపు ప్రతీచోటా నరాలు తెంచుకోక తప్పదని నిరూపితమైంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌నే ప్రజలు తమ ఇంటి పార్టీగా నమ్ముతున్నారు. అట్లాగని ఎప్పటికీ ఇదే వాతావరణం ఉంటుందని అనుకోవాలా? తెలంగాణ భవన్ చుట్టూ, అధినేత కేసీఆర్ చుట్టూ తిరిగితే చాలు అని వినాయకుడి సూత్రాన్ని పాటిస్తే సరిపోదు. ఈ కాలపు ఓటర్లకు కావలసింది కుమారస్వామి లాంటివాళ్లు.

తెలంగాణకు ఇప్పుడు సరైన సమయం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో తెలంగాణ తేల్చాల్సిందే. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని హామీ ఇస్తున్న బీజేపీ ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తమ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టకపోతే, తెలంగాణ ఏర్పాటుకు ఒప్పుకుంటే యుపీఏ సూచించిన అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పగలదా? తెలంగాణ కోసం ఏదైనా చేస్తామని గొప్పలు చెబుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ‘మాకు తెలంగాణే ముఖ్యం తెలంగాణకు అనుకూలంగా యుపీఏ నిర్ణయం తీసుకుం మేం మద్దతు ఇస్తాం’ అని ఒత్తిడి చేయగలరా? టీ-టీడీపీ నేతలు ఇంతకాలం తెలంగాణ అని చెప్పుకొని తిరగడం కాదు. చిత్తశుద్ధితో పనిచేయాలనే ఒత్తిడిని తేగలరా? నిజమే. ‘క బ్యారం’ చేస్తారా? అనుకోకుండా కట్టేయకుండానే తెలంగాణను కోతకు గురిచేస్తున్నవాళ్లను ఎందుకు ఉపేక్షించాలని అన్ని పార్టీలు అనుకుంటే తెలంగాణపై కేంద్రం ఎందుకు తేల్చదు?

-నూర శ్రీనివాస్

35

SRINIVAS NOORA

Published: Fri,December 22, 2017 01:20 AM

పత్రికల్లో తెలంగాణ భాష

ఔట్ సోర్సింగ్‌ను పొరుగు సేవలంటున్నాం. నిజానికి పొరుగు సేవలు అంటే పక్కింటోళ్ల సేవలా అన్నఅనుమానం, చరవాణి చెరబట్టిన భాషకు సంకేతమా? గు

Published: Thu,November 9, 2017 10:55 PM

ఒగ్గు కథకు వేగుచుక్క

ఒగ్గు కథకు ఆయన వేగుచుక్క. ప్రపంచ రంగస్థలం మీద పసిడి కాంతులు పండించిన ఒగ్గు కథకుడు చుక్క సత్తయ్య. అసలు పేరు చౌదరిపల్లి సత్తయ్య. నెత

Published: Sun,December 25, 2016 02:47 AM

భరించువాడే భారతీయుడు..!

బాధిత భారతం. నోటు ముందర ఓడిపోతున్న మనిషి. మోదీ మానియా. అవును ఇప్పుడు జగమంతా మోదీ మానియా. మూడున్నా లేకున్నా మోదీ అనకపోతే మొద్దుబారు

Published: Wed,July 15, 2015 12:23 AM

ప్రకృతి నిజం..మనిషి అభూతం..!

మనిషి ప్రకృతితో సంభాషించే అరుదైన ఆవిష్కరణ పుష్కరాలు. తనువును మరిచి, తలంపులు వదిలి తన్మయత్వంతో జలచేతన ప్రదర్శించే దృశ్యాలు ఒక్కొక్క

Published: Sat,October 6, 2012 03:57 PM

ఏడేళ్ల కిందటి ‘యాది’

ఆదిలాబాద్‌లో ఎవరు కాలుపెట్టినా సామల సదాశివ మాస్టా రు ఇంటికి వెళ్లాల్సిందే. వరంగల్‌లో కాలుమోపిన వాళ్లు కాళోజీ ఇంటికి వెళ్లినట్టు, క

Published: Sat,October 6, 2012 03:58 PM

ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!

ము లుగు దారులన్నీ మేడారం వైపు సాగుతున్నాయి. చీమలు పుట్టల్లోంచి ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!పోటెత్తినట్లు.., ఉసిళ్లు దండెత్తి

Published: Sat,October 6, 2012 03:59 PM

కుత్తుకలపై కత్తులు..చేతుల్లో అక్షరాళ్ళు?

-వరంగల్ జర్నలిస్టుల ఉద్యమానుభవాలు ‘శిబిరాల పేరు వినబడితే మనకు శరణార్థులు గుర్తుకు వస్తారు. తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తంగ

Featured Articles