కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?


Fri,November 24, 2017 03:26 AM

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్యం అన్న అంశంపై ఒక సదస్సు నిర్వహించారు. కృష్ణా జలాల పునఃపంపిణీ అంశం ఉద్యమకాలంలో విస్తృతంగాచర్చనీయాంశంగా ఉండేది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి గంపగుత్తగా కేటాయించిన జలాలు 811 టీఎంసీలు (63శాతం). ఈ నీటిని ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులకు 512 టీఎంసీలు కేటాయిస్తే,తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించినవి 299 టీఎంసీలు (37 శాతం) మాత్రమే.

పాలమూరు రంగారెడ్డి పథకం సాగునీటి పనులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసువేసి స్టే తెచ్చిఆటంకాలు సృష్టిస్తున్న వారిపై జిల్లా మేధావులు ఎందుకుమాట్లాడరు? ఆ కేసు కారణంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కాలువల పనులు, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే లక్ష్మీదేవిపల్లి జలాశయం పనులు ప్రభుత్వం ప్రారంభించలేకపోతున్నది. కృష్ణా జలాల పునఃపంపిణీ సదస్సు లక్ష్యం మంచిదే. కానీ ఎవరిని, ఎక్కడ, ఎప్పుడు ప్రశ్నించాలనే దానిపై సదస్సు నిర్వాహకులకు స్పష్టత లోపించిందని
చెప్పడానికి సంకోచించే అవసరం లేదు.

కేటాయించిన ఈ నీటిని అంతర్గతంగా ఎట్లయినా వాడుకోవడానికి బచావత్ ట్రిబ్యునల్ రాష్ర్టాలకు స్వేచ్ఛనిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానదీ జలాల వాటాలో తెలంగాణకుఅన్యాయం జరిగిందని మనం చర్చించుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కృష్ణానది పరీవాహక ప్రాంతంలో 68 శాతం తెలంగాణలో ఉన్నది. 32 శాతం మాత్రమే ఆంధ్రలో ఉన్నది. ఏ ప్రమాణాలతో చూసినా తెలంగాణకు జరిపిన నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిం ది. ఈ సంగతి తెలిసిందే. కృష్ణాజలాల్లో ముందు నుంచి నీటిని వినియోగించుకుంటున్నవారి హక్కులను కాపాడే ప్రాతిపదికన ట్రిబ్యునల్ నుం చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో పోల్చినప్పుడు ఎక్కువ నీటి వాటాను రాబట్టుకోగలిగింది. దరిమిలా బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా బేసిన్లోనే ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయలేని పరిస్థి తి ఏర్పడింది. అందువల్లనే నాడు మహబూబ్‌నగర్ జిల్లా రాష్ర్టాల పునర్విభజన వల్ల చాలా నష్టపోయిందనే బాధను వ్యక్తం చేస్తూ కూడా బచావత్ ట్రిబ్యునల్ 17.84 టీఎంసీల కంటే ఎక్కువ కేటాయించలేకపో యింది. అయితే బచావత్,75 శాతం విశ్వసనీయత ఆధారంగా కృష్ణా నది జలాలను గంపగుత్తగా కేటాయింపులు చేస్తున్నానని చెపుతూ పునఃపంపిణీకి అవకాశం కల్పించినా ఉమ్మడి ప్రభుత్వం తెలంగాణకు పునఃకేటాయింపులు చేయలేదు. 1956లో రాష్ర్టాల పునర్‌వ్యవస్థీకరణ వల్ల మహబూబ్‌నగర్ జిల్లా 174.3 టీఎంసీలను కోల్పోతే, ఆంధ్ర పాలకు లు కంటితుడుపుగా 20 టీఎంసీలు భీమా ఎత్తిపోతల పథకానికి పునఃకేటాయించారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ వద్ద గట్టిగా డిమాండ్ చేసి బేసిన్ ఆవల గల తెలుగు గంగకు 25 టీఎంసీలు కేటాయింపులు చేయించుకున్న ఉమ్మడి పాలకులు బేసిన్‌లోని తెలంగాణకు చెందిన మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పట్టించుకోలేదు.

ఇకపోతే చాలామందికి తెలియని విషయమేమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులకు కేటాయించిన 512 టీఎంసీల్లో కృష్ణాజలాల్లో 350 టీఎంసీలకు పైబడి, అంటే 68 శాతం నీరు కృష్ణాబేసిన్ బయట ఉన్న ప్రాంతాలకు వెళుతున్నది. కృషా డెల్టా ఆయకట్టులో ఎక్కువభాగం బేసి న్ బయటి ప్రాంతమే. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలివెళు తున్న నీరు పెన్నా బేసిన్ ప్రాంతంలో నిర్మాణమైన జలాశయాలను నిం పడానికి. 68 శాతం పరీవాహక ప్రాంతం, వెనుకబాటుతనం, వలసలు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, తక్కువ వర్షపాతం.. ఇట్లా ఏ ప్రమాణాల రీత్యా చూసిన కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 450 టీఎంసీలు దక్కవలసి ఉండే. అయితే ఉమ్మడి పాలకుల వివక్షాపూరిత విధానాల కారణంగా 299 టీఎంసీలు మాత్రమే దక్కాయి.
ఇక అసలు విషయంలోకి వస్తే పాలమూరు అధ్యయన వేదిక వారి ప్రకారం 1.తెలంగాణలో ఇదివరకే కేటాయించిన కృష్ణా జలాల పునః పంపిణీ వెంటనే జరుగాలి.2.బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ద్వారా సాధించే అదనపు జలాలను రాష్ట్రం లోపల పంపిణీ చేసుకోవడం అవసరం. తెలంగాణ రాష్ట్రంలో పునఃపంపిణీ వెంటనే చేపట్టాలన్న వారి డిమాండ్ తెలంగాణ విభజన నేపథ్యంలో యాంత్రికమైనదని చెప్పకతప్పదు.

ఉమ్మడి రాష్ట్రం కేటాయించిన 299 టీఎంసీల నికర జలాలు ఎక్కడ పారుతున్నాయి? పారకపోతే ఎటు పోతున్నాయి? అన్నది వారి ప్రశ్న. 299 టీఎంసీల నికరజలాల్లో ప్రాజెక్టుల వారీ కేటాయింపులు ఇట్లా ఉన్నాయి. కోటిపల్లి వాగు-2 టీఎంసీలు, కోయిల్‌సాగర్-3.90, ఊకచెత్తివాగు-1.90, డిండి-3.50, జూరాల-17.84, నాగార్జునసాగర్-105.70, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం-20, రాజోలిబండ-15. 90, మూసీ-9.40, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు -5.70, పాలేరు-4,12, పాఖాల-2.60, వైరా-3.70, లంకాసాగర్-1, మైనర్ ఇరిగేషన్ -89.15, చెన్నై నగరానికి తాగునీరు-1.67, శ్రీశైలం జలాశయం నుంచి ఆవిరి నష్టాలు-11 టీఎంసీలు.. మొత్తం 299 టీఎంసీ లు జిల్లాల వారీ కేటాయింపులు చూసినప్పుడు నల్లగొండ జిల్లా ప్రాజెక్టులకు 78.60 టీఎంసీలు (నాగార్జునసాగర్ కలుపుకొని), మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులకు 59.54 టీఎంసీలు. ఇక వివాదాస్పదమైన అం శం మైనర్ ఇరిగేషన్‌కు కేటాయించిన 89.17 టీఎంసీలు (కృష్ణా బేసిన్‌లో ఉండే అన్ని జిల్లాలకు). అదనపు జలాల కేటాయింపులను జిల్లాల వారీగా చూసినప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాకు 152 టీఎంసీలు, నల్లగొండ జిల్లాకు 70 టీఎంసీలు.

నికర జలాల పునఃపంపిణీ ప్రాజెక్టుల వారీగా, జిల్లాల వారీగా చూసినప్పుడు బొటాబొటిగా ఉన్నాయి తప్ప వాటి కేటాయింపులు తగ్గించి మరొక ప్రాజెక్టుకు లేదా జిల్లాకు కేటాయించే స్థితి ఉన్నదా? మైనర్ ఇరి గేషన్‌కు కేటాయించిన 89 టీఎంసీల్లో అసలు వాడకంలో ఉన్నవి మహా ఉంటే 25 టీఎంసీలకు మించవని కేఆర్‌ఎంబీలో తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూనే ఉన్నది. ప్రతి సారీ ఆంధ్ర ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్‌లో మీరు మొత్తం నీటిని వాడుకుంటున్నారు కనుక కృష్ణా మెయిన్ ట్రంక్ లో నుంచి 89 టీఎంసీలను మినహాయించి పంపిణీ నిష్పత్తిని లెక్క గట్టాలని వాదిస్తున్నది. అప్పుడు తాత్కాలిక పంపిణీ నిష్పత్తి 512:210 కి పడిపోతుంది. అంటే ఆంధ్ర, తెలంగాణ పంపిణీ నిష్పత్తి 70:30 అవుతుందన్న మాట. రాష్ట్ర ప్రభుత్వం కేఅర్‌ఎంబీ సమావేశంలో చేసిన పోరాటం ఫలితంగా కృష్ణా మెయిన్ ట్రంక్ అంటే జూరాల నుంచి పులిచింతల దాకా లభించే నీటిని 66:34 నిష్పత్తిలో ఈ ఏడాది పంచుకోవ డానికి అంగీకారం కుదిరింది. కృష్ణా మెయిన్ ట్రంక్‌లోనికి నీరు రావడమే గగనమైపోయిన పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులు నిండితే తప్ప కిందకు నీరు వచ్చే అవకాశాలు లేవు. ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ర్టానికి ఉన్న 299 టీఎంసీల నికర జలాల ను సాధ్యమైనంత బేసిన్‌లో ఉండే నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్ నగరానికి న్యాయబద్ధంగా, సమతూకంతో పంచే ప్రయత్నం చేస్తున్నది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా సాధ్యమైనంత నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి నీరందిస్తున్నది. జూరాల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతున్నది. గతేడాది ఈ ప్రాజెక్టుల ద్వారా 38.80 టీఎంసీలు ఎత్తిపోసి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. 350 చెరువులను నింపింది. జూరాల ద్వారా లక్షఎకరాలకు సాగునీరు అందించింది. ఈ ఏడాది ఇప్పటికే 37.25 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టుల ద్వారా ఎత్తినాము. ఇవన్నీ గంపగుత్త కేటాయింపుల కారణంగా, తమకు జరిపిన కేటాయింపులను రాష్ట్రంలో ఎక్కడైనా వినియోగించుకునే వెసులుబాటు ఉన్నందువల్ల సాధ్యమైంది. గతంలో నిర్ణయాధికారం ఆంధ్రా పాలకుల చేతుల్లో ఉన్నందున నీరు పల్లానికి ప్రవహించింది. ఇప్పుడు మనకు నిర్ణయాధికారమున్నది కాబట్టి చుక్క నీటిని వదులుకునే ప్రసక్తి లేదు.
sridhar
తెలంగాణకు నికర జలాల కేటాయింపులే తక్కువగా ఉన్నప్పుడు పునఃపంపిణీ కోసం డిమాండ్ చెయ్యడం యాంత్రికమైన డిమాండ్ అవు తుంది. నిజానికి ఈ సదస్సును ఏర్పాటు చేయవలసింది తెలంగాణలో, హైదరాబాద్‌లో కాదు. ఇది అమరావతిలో ఏర్పాటుకావాలి. ఎందుకం టే హక్కకు మించి నీటి కేటాయింపులు పొంది అనుభవిస్తున్న ప్రాం తం కనుక త్యాగం చెయ్యవలసింది వారు మాత్రమే. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మేధావులను, విశ్వవిద్యాలయాల అధ్యాపకులను, ప్రగతిశీల రచయితలను, సీనియర్ పాత్రికేయులను, ప్రజాస్వామికవాదులను కూడగ ట్టి కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి మద్దతు కూడగట్టే ప్రయ త్నం జరుగాలి. ఆది బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో, సుప్రీంకోర్టులో తెలంగాణ సాగిస్తున్న ప్రయత్నాలకు దోహదం చేస్తుంది. థిజోరీని ఉంచుకున్న వారి దగ్గర త్యాగం చెయ్యమని అడుగడానికి బదులు చిల్లర పైసలున్న వారిని పంచండి అంటే న్యాయమా? కృష్ణా జలాల్లో రాష్ర్టానికి సహజ న్యాయ సూత్రాల ప్రకారం 450 నుంచి 500 టీఎంసీల నీటిని పొందడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. అది సాకారమైతే పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించుకోవడం సాధ్యపడుతుంది. అప్పుడే రాష్ట్రంలో అంతర్గతంగా కృష్ణాజలాల పునఃపంపిణీ అంశానికి ప్రాసంగికత ఏర్పడుతుంది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ మేధావులు ప్రభుత్వ కృషికి మద్దతు ఇవ్వా లి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామికవాదుల మద్దతును కూడగట్టాలి. కేసు లు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నవారి కుట్రలను తిప్పికొట్టాలి. పాలమూరు రంగారెడ్డి పథకం సాగునీటి పనులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసువేసి స్టే తెచ్చి ఆటంకాలు సృష్టిస్తున్న వారిపై జిల్లా మేధావులు ఎందుకుమాట్లాడరు? ఆ కేసు కారణంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కాలువల పనులు, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే లక్ష్మీదేవిపల్లి జలాశయం పనులు ప్రభుత్వం ప్రారంభించలేకపోతున్నది. కృష్ణా జలా ల పునఃపంపిణీ సదస్సు లక్ష్యం మంచిదే. కానీ ఎవరిని, ఎక్కడ, ఎప్పు డు ప్రశ్నించాలనే దానిపై సదస్సు నిర్వాహకులకు స్పష్టత లోపించిందని చెప్పడానికి సంకోచించే అవసరం లేదు.
(వ్యాసకర్త: సాగునీటి శాఖా మంత్రి ఓఎస్డీ)

672

SRIDHAR RAO DESH PANDE

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Featured Articles