అపోహలు-వాస్తవాలు


Sun,October 29, 2017 01:08 AM

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను నిర్మించడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ప్రాజెక్టును నిర్మించే సమయంలో ఎదురయ్యే ఆచరణాత్మక సమస్యల కారణంగా డిజై న్‌లో, కాలువల అలైన్మెంట్‌లో మార్పులు అనివార్యం, సహజం. ప్రజల డిమాండ్ల మేరకు కొత్త ప్రతిపాదనలు ప్రాజెక్టులో చేరవచ్చు. ఈ విధంగా ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పులు చేర్పు ల వల్ల అంచనా విలువలు మారుతాయి. అంచనాలు మారినప్పుడల్లా ఇవి కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోతాయి, కమీషన్ల రూపంలో దండుకోవదానికే అని ఆరోపణలు ప్రతిపక్షాలు చేయటం దారుణం. గత ప్రభుత్వాల కాలంలో ప్రధాన ప్రాజెక్టుల అంచనా విలువలు ఏ విధంగా పెరిగాయో ఈ పట్టికలో గమనించవచ్చు.

పైన పేర్కొన్నట్లు ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా అంచ నా విలువలను ప్రభుత్వాలు సవరిస్తాయి. అట్లా సవరించిన నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోతాయని వాదించడం వితండవాదం. మరి గతంలో నిర్మాణ మైన ప్రాజెక్టుల పెరిగిన నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయాయని వాదించగలమా?
table
ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు సవరించిన తొలి అంచ నా విలువ 38,500 కోట్లు. అది రీ ఇంజినీరింగ్ తర్వా త 80,500 కోట్లకు పెరిగింది. 38,500 కోట్ల అంచ నా విలువ ఎప్పటిది? 2008 నాటిది. భూసేకరణ చెయ్యక, అటవీ అనుమతులు తేలేక, తుమ్మిడిహట్టి బ్యారేజీ సాంకేతిక అంశాలను పరిష్కరించక, మహారాష్ట్రతో అంతరాష్ట్ర వివాదాలను పరిష్కరించక ప్రాజెక్టును ఎనిమిదేండ్లు దేకించిన తర్వాత ప్రాజెక్టు అంచ నా వ్యయం 38,500 కోట్లే ఉంటుందా? ఇవ్వాళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును యథాతథంగా అమలు చేసినా ప్రాజెక్టు వ్యయం 50 నుంచి 60 వేల కోట్లకు ఎగబాకుతుంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును రీ ఇంజినీరింగ్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులేర్పడ్డాయి. తర్వాత ప్రాజెక్టు అంచనా విలువ ఎందుకు పెరుగుతున్నది?

ఇవీ కారణాలు
1.సీడబ్ల్యూసీ సూచనల మేరకు జలాశయాల సామర్థ్యాన్ని16 నుంచి 134 టీఎంసీకి పెంచడమైంది. మరికొన్ని కొత్త జలాశయాలను ప్రతిపాదించడం జరిగింది. జలాశయాల ఎత్తు పెంచడం కోసం, కొత్త జలాశయాల నిర్మాణం కోసం అదనపు ఖర్చు తప్పదు. 2. రీ ఇంజినీరింగ్ తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడు బ్యారేజీల ద్వారా నదీమార్గంలో గోదావరి నీటిని రోజు కు 2 టీఎంసీలు ఎత్తిపోయడానికి ప్రతిపాదనలు సిద్ధ మయ్యాయి. సివిల్ పనులు మాత్రం రోజుకు 3 టీఎం సీలు ఎత్తిపోసుకోవడానికి వీలుగా నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతానికి పంపులు, మోటార్లు మాత్రం రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయడానికి అమర్చడం జరుగుతుంది. 3.ఆన్‌లైన్ జలాశయాల సామర్థ్యాన్ని పెంచినందున భూ సేకరణ, పునరావాసం కోసం అదనంగా ఖర్చు పెరుగుతుంది. 4.2007 నుంచి 2016 దాకా ధరల పెరుగుదలను అనుమతించవలసిన నిబంధనలు గత ప్రభుత్వం కుదుర్చుకున్న టెండరు ఒప్పందాల్లోనే ఉన్నాయి. 5.మహారాష్ట్ర, కర్ణాటకలు సుమారు 450 బ్యారేజీలు నిర్మించి ఎగువ గోదావరిని చెరబట్టినందున శ్రీరామసాగర్, నిజాంసాగర్, సింగూరు జలాశయాల్లోకి నీరు రాక వాటి కింద ప్రతిపాదిత ఆయకట్టుకు నీరందించలేకపోతున్నాయి. కేవలం ప్రాణహిత ప్రతిపాదిత ఆయకట్టుకే కాదు ఈ మూడు జలాశయాల కింద ఆయకట్టును స్థిరీకరించడం రీ ఇంజినీరింగ్‌లో ఒక అంశం. అంటే 18.25 లక్షల ఎకరాలకే కాక 25 శాతం ఆయకట్టును (18.83లక్షల ఎకరాల్లో 25 శాతం) స్థిరీకరించడం రీ ఇంజినీరింగ్ లక్ష్యం.కాబట్టి రీ ఇంజినీరింగ్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు అం చనా వ్యయం అనివార్యంగా పెరుగుతుంది.
sridar
భూ సేకరణకు అప్పటి అంచనాలో పెట్టిన మొత్తం కేవలం 67.50 కోట్లు మాత్రమే. ఇప్పుడు సవరించిన అంచనా విలువ 366.44 కోట్లు. అంటే ఒక్క భూ సేకరణపై పెరిగిన అంచనా విలువ 298.94 కోట్లు. అప్పుడు వారు ఎకరాకు కేవలం రూ.30,000 మాత్ర మే కేటాయించారు. ఇప్పుడు భూసేకరణ కోసం ప్రభు త్వం ఎకరానికి రూ.5 లక్షలు చెల్లించింది. ప్రాజెక్టులో మరో 25000 ఎకరాలను చేర్చడం వల్ల కాలువల నిర్మాణానికి 91.26 కోట్లు అదనంగా ఖర్చవుతున్నది. సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు, వీటి పర్యవేక్షణకు గత ప్రభుత్వం ఒక్క పైసా అంచనా విలువలో పెట్టలేదు. ఇది ఎత్తిపోతల పథకానికి కీలకాంశం. వీటి కోసం ప్రభుత్వం 414.20 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు పనుల్లో బ్యాలెన్సింగ్ జలాశయాలు, కాలువ ల లైనింగ్, రోడ్లు, భవనాలు, సిమెంట్, స్టీల్, ఇంధ నం, లేబర్, పంపులు , మోటార్ల కొనుగోళ్లు, ఇన్సూరెన్స్‌లపై ధరల పెరుగుదల కోసం, ప్రత్యామ్నాయ అటవీ భూముల కోసం ప్రభుత్వం 1102.34 కోట్లు కేటాయించింది. మొత్తమ్మీద గత ప్రభుత్వం వదిలేసిన సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టు పనులను పురోగతి లో పెట్టడానికి ప్రభుత్వానికి ప్రాజెక్టుపై 1906.24 కోట్ల అదనపు భారం పడింది. ఇది 2005 అంచనా విలువపై 63.75 శాతం ఎక్కువ. ప్రాజెక్టు పనులు పురోగతిలో పడినందువల్ల గతేడాది 1.60 లక్షల ఎకరాలకు సాగునీరందింది. ఈ సంవత్సరం 2.60 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది.

ప్రాజెక్టుల సాంకేతిక ప్రతిపాదనలు, అంచనా వ్యయాలు పెరుగడం సహజమే. తొలి అంచనా విలువతో, డీపీఆర్‌లో పేర్కొన్న ప్రతిపాదనలతో పూర్తయిన ప్రాజెక్టు రాష్ట్రంలో గాని, దేశంలోగానీ , ప్రపంచంలో గాని ఎక్కడైనా ఉంటే చూపించమని కాళేశ్వరం ప్రాజె క్టు విమర్శకులను కోరుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభు త్వం ఈపీసీ పద్ధతిని రద్దుచేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం బందుపెట్టిది. కాంట్రాక్టరు ఎం త పనిచేస్తే అంత పనికే బిల్లులు చెల్లిస్తారు. కాబట్టి పెంచిన అంచనాలతో కాంట్రాక్టర్ల జేబులు నిండుతాయ న్నది నిరాధారమైన ఆరోపణ.
(వ్యాసకర్త: సాగునీటి శాఖామంత్రి ఓఎస్డీ)

715

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర