ప్రాజెక్టుల దశ తిరిగింది


Sat,August 26, 2017 11:59 PM

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కల్వకుర్తి ప్రాజెక్టు 95 శాతం అయ్యిందనడం పూర్తిగా అబద్ధం. 95 శాతం పూర్తయితే నీరెందుకు సరఫరా చేయలేకపోయారు? వాస్తవంగా పూర్తయ్యింది యాభై శాతం పనులే. ఎత్తిపోతల పథకాల్లో కీలకమైన పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తికాలేదు. పంపులు, మోటార్లను బిగించడం పూర్తికాలేదు. విద్యుత్ సరఫరాకు సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్లైన్ల నిర్మాణం, ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తికాలేదు. పునరావాస పనులు పూర్తికాలేదు. ఇవన్ని కొత్త ప్రభుత్వం ముందు సవాళ్ళుగా ముందుకువచ్చాయి. వీటిని పరిష్కరించి రెండేండ్లలో ప్రాజెక్టులను పూర్తిచేయగలిగింది. 123 జీవో కింద భూసేకరణ చేయగలిగింది. మిగిలిపోయిన కాలువలను తవ్వించింది. వందలాది స్ట్రక్చర్ల, పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తిచేసింది.

పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషాద గాథ. పాలమూరు ఎత్తిపోతల పథకాలవి అంతకంటే విషాద చరిత్ర. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో ఎక్కువగా నష్టపోయింది పాలమూరు జిల్లానే. హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగి ఉండి ఉంటే అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల ఈ అవకాశం పూర్తిగా పోగొట్టుకున్నది. జిల్లా మొత్తం విస్తీర్ణం 43.73 లక్షల ఎకరాలు. సాగు కు యోగ్యమైనది 35 లక్షల ఎకరాలు. ఇందు లో ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు, 87 వేల ఎకరాలకు బదులు 30 వేల ఎకరాలే పారే ఆర్డీఎస్, 2.5 లక్షల ఎకరాలకు బదులు 0.75 లక్షల ఎకరాలు పారే మైనర్ ఇరిగేషన్ చెరువుల వల్ల నికరంగా 2 లక్షల ఎకరాలకే సాగు నీరు అందే పరిస్థితి ఉన్నది. సీమాంధ్ర పాలనలో సాగునీరు అందించే ఆలోచనే లేని కారణంగా పాలమూరు ప్రజలకు బతుకుదెరువు కోసం వలసలే గతి అయ్యాయి. ప్రతిపాదిత భీమా, కల్వకుర్తి , నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు నిరంతరం ఫైళ్లలో మగ్గుతూ వచ్చాయి.

తెలంగాణ ఉద్యమం వల్ల పాలమూరు ప్రజల్లో చైతన్యం వచ్చిన కారణంగా 2003 లో కల్వకుర్తి, 2004 సంవత్సరంలో భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకు మోక్షం వచ్చింది. కానీ 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా పదేండ్లయినా పూర్తికాని స్థితిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. కృష్ణానది ఈ జిల్లా గుండా 300 కి.మీ.లు పారుతుంది. తుంగభద్ర నది కూడా ఈ జిల్లా సరిహద్దుగా పారుతుంది. అయినా సాగుకు నోచుకోని పరిస్థితి ఉన్నది.

2016 సెప్టెంబరు 8న సాగునీటి మంత్రి హరీశ్‌రావుగారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 2, 3 పంప్ హౌజ్‌ల వద్ద పంపులను ప్రారంభించిన సంగతి ఎరుకే. అంతకు కొద్ది రోజుల ముందు భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల పంపులను ప్రారంభించి ఈ వానకాలం పంటల కోసం మొదటిసారి పాక్షికంగా సాగునీరు అందించాలని సంకల్పించారు. 2016-17 సంవత్సరంలో ఈ నాలుగు ఎత్తిపోతల పథకాల కింద 4.5 లక్షల ఎకరాలకు , 2017ఖరీఫ్ నాటికి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగానే ప్రభుత్వ కార్యాచరణ సాగుతున్నది.

కల్వకుర్తి ఎత్తిపొతల పథకం ప్రారంభమైన కాడినుంచి అడుగడుగునా ఉమ్మడి ప్రభు త్వం వివక్షాపూరితంగా వ్యవహరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కల్వకుర్తి ప్రాజెక్టును చేపట్టి ముప్ఫై ఏండ్లు గడిచాయి. ముఖ్యమంత్రి దత్తత జిల్లా సాగునీటికి మాత్రం నోచుకోలేదు. సీమాంధ్రలోని ప్రాజెక్టులు మాత్రం వేగంగా సాగాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తూములను పెంచుకునే పనులు ఉరుకులు పరుగులతో పూర్తి చేసుకున్నారు. రాయలసీమలో సుమారు 250 నిలువ సామర్థ్యం కలిగిన కృత్రిమ రిజర్వాయర్లు కట్టుకున్నారు. పులిచింతల కట్టుకున్నారు. పోలవరం ఆలస్యమవుతున్నదన్న కారణంతో ప్రత్యామ్నాయంగా ప్రారంభమైన తాడిపూడి, పుష్కర ఎత్తిపోతలు పూర్త య్యాయి. తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం అనేక సమస్యల్లో కూరుకుపోయి మూలన పడ్డాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2005లో జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో 19 భారీ ప్రాజెక్టులను, 12 మధ్యతరహా ప్రాజెక్టులను, 2 ప్రాజెక్టు ల ఆధునీకీకరణ (నిజాంసాగర్, నాగార్జునసాగర్), వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి కరకట్టల నిర్మా ణం ప్రతిపాదించి ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి వీటిల్లో రెండు ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. అవి నిజామాబాద్ జిల్లా లో చేపట్టిన అలీసాగర్ ఎత్తిపోతల పథకం, అర్గుల రాజారాం గుత్పా ఎత్తిపోతల పథకం. ఇక మిగతా ప్రాజెక్టులు పదేండ్లు గడిచినా అనేక సమస్యల్లో కూరుకుపోయి నత్తనడక నడిచాయి. సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రాజెక్టులను ప్రారంభించారే తప్ప వాటిని చిత్తశుద్ధి తో పూర్తిచేసి ప్రజలకు నీరందించలేదు. ప్రాజెక్టులకు భూ సేకరణ జరుపలేదు. అటవీ అనుమతులు పొం దలేదు. రైల్వే, రోడ్ క్రాసింగులను సమన్వయం చేయలేదు. అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించ లేదు. కాంట్రాక్టు చేపట్టిన ఏజెన్సీల ఒప్పంద సమస్యలున్నాయి. బిల్లుల చెల్లింపుల సమస్యలున్నాయి. కేంద్ర జల సంఘం లేవనెత్తిన సాంకేతిక అంశాలపై నివేదికలు సమర్పించలేదు. ప్రాజెక్టుల డిజైన్లను సకాలంలో పూర్తి చేయలేదు. సీమాంధ్ర పాలకులు ఈ విధమైన నిర్లక్ష్యం చూపడంతో ప్రాజెక్టులు ముం దుకు సాగలేదు. జలయజ్ఞం ప్రతిపాదిత లక్ష్యాలను అందుకోలేకపోయింది. వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రాజెక్టులు ఆయకట్టుకు నీరిచ్చే దశకు చేరుకోలేకపోయాయి. ఇట్లా పూర్తికాని ప్రాజెక్టుల్లో కల్వకుర్తి కూడా ఒకటి.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం: కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామంలో రేగుమానుగెడ్డ వద్ద శ్రీశైలం జలాశయం నుంచి 3 స్టేజిల్లో 258 మీటర్ల ఎత్తుకు 4000 క్యూసెక్కుల నీరు పంపు చేస్తారు. ఈ నీరు శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ చానల్ ద్వారా మొదటి స్టేజీ పంప్‌హౌజ్ సర్జిపూల్ లోనికి పంపుల ద్వారా 95 మీటర్ల ఎత్తులో సిస్టర్న్‌కు చేరి అక్కడి నుంచి ఎల్లూరు బ్యాలెన్సింగ్ జలాశయానికి చేరుతుంది. నీరు ఇక్కడినుంచి వాలు కాలువ ద్వారా సింగోటం జలాశయానికి చేరుతుంది. అక్కడి నుంచి వాలు కాలువ , టన్నెల్ ద్వారా రెండో స్టేజీ పంప్‌హౌజ్ సర్జిపూల్‌కు చేరుతుంది. స్టేజి 2 పంపు హౌజ్ నుంచి పంపులు 86 మీటర్ల ఎత్తుకు నీటిని చేరవేస్తాయి. ఆ తర్వాత జొన్నలబొగుడ జలాశయానికి నీరు చేరుతుంది. ఇక్కడినుంచి వాలు కాలువ, టన్నెల్ ద్వారా స్టేజీ 3 లిఫ్ట్ సర్జిపూల్‌కు నీరు చేరు తుంది. ఈ మధ్యలో రిడ్జ్ కాలువ ద్వారా 13 వేల ఎకరాలకు , ఎడమవైపున పసుపుల బ్రాంచి కాలువ ద్వారా 44 వేల ఎకరాలకు, బుద్ధారం ఎడమ కాలు వ ద్వారా 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తా రు. చివరగా 117 మీటర్ల ఎత్తున ఉన్న గుడిపల్లిగట్టు జలాశయానికి నీరు చేరుతుంది. ఇక్కడి నుంచి ఎడమవైపున 160 కిలో మీటర్ల పొడవైన కల్వకుర్తి ప్రధాన కాలువ ద్వారా 1 లక్షా 80 వేల ఎకరాల ఆయకట్టుకు, కుడివైపున 80 కిలో మీటర్ల అచ్చంపే ట ప్రధాన కాలువ ద్వారా 90 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తారు. ఇది కల్వకుర్తి ఎత్తిపోతల పథ కం సంక్షిప్త రూపం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమం త్రి చంద్రశేఖర్ రావు గారు, సాగునీటి శాఖా మంత్రి హరీశ్‌రావు గారు ప్రాజెక్టుల స్థితిగతులను ఇంజినీరింగ్ నిపుణులతో కూలంకషంగా సమీక్షించారు. పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకున్నది. నిరంతరం ప్రాజెక్టు పనులను ఇంజినీర్లతో, కాంట్రాక్టర్లతో సమీక్షిస్తున్నది. ప్రధాన అడ్డంకిగా ఉన్న భూ సేకరణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వెనువెంటనే ప్రాధాన్య క్రమంలో విడుదల చేస్తున్నది. అవసరమైన అనుమతులను సత్వర మే జారీ చేస్తున్నది. రైల్వే, రోడ్డు క్రాసింగ్‌ల సమస్య ను ఉన్నతస్థాయి సమావేశాలను నిర్వహించి పరిష్కరించడం, కీలకమైన పంపులు, మోటార్లను బిగించ డం, వాటికి విద్యుత్ సరఫరా కోసం సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం చేపట్టడం, తరచుగా ప్రాజెక్టులను సందర్శించడం, ప్రాజెక్టుల వద్ద నిద్ర మొదలైన విధాలుగా రెండేండ్లు శ్రమించి ప్రాజెక్టు పనులను 50 శాతం నుంచి 95 శాతానికి పూర్తి చేయగలిగింది.

sridher
గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కల్వకుర్తి ప్రాజెక్టు 95 శాతం అయ్యిందనడం పూర్తిగా అబద్ధం. 95 శాతం పూర్తయితే నీరెందుకు సరఫరా చేయలేకపోయారు? వాస్తవంగా పూర్తయ్యింది యాభై శాతం పనులే. ఎత్తిపోతల పథకాల్లో కీలకమైన పంప్‌హౌ జ్‌ల నిర్మాణం పూర్తికాలేదు. పంపులు, మోటార్లను బిగించడం పూర్తికాలేదు. విద్యుత్ సరఫరాకు సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం, ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తికాలేదు. పునరావాస పనులు పూర్తికాలేదు. ఇవన్ని కొత్త ప్రభుత్వం ముం దు సవాళ్ళుగా ముందుకువచ్చాయి. వీటిని పరిష్కరించి రెండేండ్లలో ప్రాజెక్టులను పూర్తిచేయగలిగింది. 123 జీవో కింద భూసేకరణ చేయగలిగింది. మిగిలిపోయిన కాలువలను తవ్వించింది. వందలాది స్ట్రక్చర్ల, పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తిచేసింది. పం పులు, మోటార్లను బిగించి 2016-17 సంవత్సరంలో మహబూబ్‌నగర్‌లో 4 ఎత్తిపోతల పథకాల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు నీరు మొదటిసారి అం దించింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1.6 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షలు, భీమా ద్వారా 1.4 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ ద్వారా 8 వేల ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీరందించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల దశ తిరిగిందనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: సాగునీటి మంత్రి ఓఎస్డీ)

909

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర