ఇంకా వీడని వలసాధిపత్యం


Sat,July 29, 2017 11:39 PM

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవాదానికి ఊడిగం చేసే దళారీ వర్గాన్ని తెలంగాణలో బలహీనపర్చడం, రాష్ట్ర అభివృద్ధి క్రమాన్ని అడ్డుకుంటున్న అంతర్గత శక్తులను సమర్థవంతంగా తిప్పికొట్టడం జరుగాలె. ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు ఉన్న సవాల్ ఇదే.

తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్ 2న ఏర్పడితే, ఆంధ్ర ప్రభుత్వం జూన్ 8న ఏర్ప డిం ది. తెలంగాణ ఏర్పడక ముందే చంద్రబాబు మోదీ ప్రభుత్వంచే ఖమ్మం జిల్లా లో ఏడు మండలాలను ఆంధ్రకు బదిలీ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయించిండు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ పేరుకు ఎన్‌టీఆర్ పేరు పెడుతమని కేంద్రమంత్రి చేత ప్రకటింపజేసిం డు. 2019 కన్నా ముందే తెలంగాణలో అధికారం చేపడుతమని ప్రగల్భాలు పలికిండు. చంద్రబాబు విభజన చట్టానికి విరుద్ధంగా విద్యుత్ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయా లని నిర్ణయించిండు. తాగునీటి కోసమని చెప్పి సాగుకోసం 10 టీఎంసీల కృష్ణా నీటిని నాగార్జునసాగర్ డ్యాం నుంచి వదలమని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టిండు. తాగునీటి కోసం 1 లేదా 2 టీఎంసీ వదలడానికి సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం సానుకూల త వ్యక్తంచేసినా 10 టీఎంసీలు వదలాలని మొండికి పోయిండు. చివరికి అప్పటి కేంద్ర జల సంఘం ఛైర్మన్ ఏబీ పాండ్యా కల్పించుకొని తాగునీటికి 10 టీఎంసీలు అవసరంలేదని, 3.4 టీఎంసీలు చాలునని ప్రకటించి సమస్యను పరిష్కరించవలసి వచ్చింది. వారం రోజులపాటు నీటిని వదిలిన తర్వాత ప్రకాశం బ్యారేజీకి నీరు రాలేదని కృష్ణా బోర్డు ఛైర్మన్ చేత ఏకపక్షంగా మరో విడత నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయించిం డు. ఏడు మండలాలు ఆంధ్రలో కలిసినయి కనుక పోలవరం నిర్మాణంతో తెలంగాణకు సంబంధం లేదంటూ, పోలవరం గవర్నింగ్ బాడి నుంచి, ప్రాజెక్ట్ అథారిటీ నుంచి తెలంగాణ అధికారులను తొలిగించాలని కేంద్రాన్ని కోరిండు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను, కాళేశ్వరం ప్రాజెక్టును ఆపివేయించమని కేంద్రానికి, కృష్ణా బోర్డుకు, గోదావరి బోర్డుకు లేఖలు రాస్తూనే ఉన్నారు. తాజాగా జూలై 1న కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి , కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాస్తూ పాలమూరు రంగారెడ్డి , డిండి ఎత్తిపోతల పథకాల పనులు జరుగకుండా చూడాలని కోరిండు. అదేవిధంగా ఖమ్మం జిల్లా కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ , నేలకొండపల్లి, ముదిగొండ కరువు మండలాలలో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే భక్తరామదాసు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే నిర్మించిందని ఆరోపించిండు. రాజోలిబండ డైవర్షన్ స్కీం చివరి భూములకు గత ముప్ఫై ఏండ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నీరందలేదు. నిర్దేశిత 87,500 ఎకరాల ఆయకట్టు లో ఏనాడు ముప్ఫై వేల ఎకరాలకు మించి నీరందలేదు. ప్రాజెక్టుకు కేటాయించిన 15.90 టీఎంసీలలో సగటున 6 టీఎంసీలకు మించి నీటి సరఫరా జరుగలేదు. రాజోలిబండ పథకం చివరి భూములకు నీరందించడానికి , తుంగభద్ర జలాల్లో మన వాటా 15.90 టీఎంసీ నీటిని పూర్తిగా వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయాలనుకున్నది. ఈ ప్రాజెక్టు వల్ల కేసీ కెనాల్ ప్రయోజనా లు దెబ్బతింటాయంటూ దీన్ని ఆపివేయించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పనిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలమునకలవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందరికాళ్ళ బంధం వేసే పనిలో ఉన్నది. ఇట్లా ఏపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పుట్టుక ముందునుంచి పుండుమీద కారం చల్లినట్లు ఘర్షణ వైఖరిని, ఆధిపత్య స్వభావాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని ఆరోపిస్తున్న ఏపీ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచుమర్రి,మున్నేరు, శివభాశ్యం, గుండ్రేవుల, గాజులదిన్నె తదితర ఎత్తిపోతల పథకాలను ప్రారంభించలేదా? వీటిలో పట్టిసీమ, ముచుమర్రి ఎత్తిపోతల పథకాలు పూర్తయ్యాయి కూడా. గత సంవత్స రం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 53 టీఎం సీల గోదావరి నీటిని ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజీకి తరలించినట్టు ఏపీ ప్రభుత్వమే లెక్కలు చెప్పింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఇన్ని ప్రాజెక్టుల ను నిర్మిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను మాత్రం ఆపమని కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా, గోదావరి బోర్డులకు శికాయతులు చేస్తున్నది ఆంధ్ర ప్రభు త్వం. ఇది వలసాధిపత్యానికి సూచిక.

నిజానికి గోదావరి కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులనే అమలుచేస్తున్నది. ఈ సంగతిని 2016 సెప్టెంబర్ 21న ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి మంత్రి హరీశ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి ఎస్‌కే జోషి సాక్ష్యాధారాలతో వివరించారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం ఆమోదించినవే. అయితే ఉమ్మడి ప్రభుత్వం వాటిని అమలుచెయ్యకుండా అటకెక్కించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆ ప్రాజెక్టులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజినీరింగ్ చేసుకొని నిర్మాణాన్ని చేపట్టింది. వీటిని ఇప్ప టి ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఆరోపిస్తున్నది. విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం అంటున్నది. తను మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో లేని కొత్త ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే నిర్మిస్తున్నది.

గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కొత్తది కాదు. ఉమ్మడి ప్రభుత్వం చేపట్టిన ప్రాణహి త చేవెళ్ళ ప్రాజెక్టునే తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజినీరింగ్ చేసుకొని పనులను కొనసాగిస్తున్నది. ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుకు కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలట. ఒకవైపు ఏటా మూడు వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలవుతున్నది. తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలు తమ కేటాయింపులను సంపూర్ణంగా వాడుకున్న తర్వాత కూడా ఇంకా రెండు వేల టీఎంసీల నీరు సముద్రం లో కలిసిపోతుంది. గోదావరిపై కేటాయింపుల వివాదాలు లేవు, ఉమ్మడి ప్రాజెక్టులు లేవు. ఎవరి వాటా ను వారు వాడుకునే వెసులుబాటు ఉన్నది. అయినా ఏపీ తెలంగాణ ప్రాజెక్టులపై శికాయతులు చేస్తూనే ఉన్నది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గోదావరి జలాల్లో 954 టీఏంసీల నీటిని కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రాజెక్టుల ద్వారా 400 నుంచి 450 టీఎంసీల దాకా వాడుకుంటున్నది. మిగతా నీటిని వాడుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు సాగు నీరు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, దారిపొడుగునా వందలాది గ్రామాలకు, హైదరాబా ద్ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించే బృహత్తర పథకం కాళేశ్వరం ప్రాజె క్టు. ఇది తెలంగాణకు జీవధార కాబోతున్నది. ఇదే విధంగా కరువుకు, వలసలకు మారు పేరు అయిన మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు, ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి సాగునీటి సౌకర్యం పొందని రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో ముప్ఫై వేల ఎకరాలకు సాగునీ రు, దారి పొడుగునా వందలాది గ్రామాలకు తాగునీరు అందించే పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. నల్లగొండ జిల్లాలో అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, దారిపోడుగూతా గ్రామాలకు తాగునీరు అందించే పథ కం డిండి ఎత్తిపోతల పథకం. ఈ రెండు ప్రాజెక్టులుకృష్ణా బేసిన్‌లో ఉన్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు జీవధారగా మారబోతున్నాయి. ఇటువంటి జీవధారలను తెగ్గొట్టడానికి ఆంధ్ర ప్రభు త్వం ప్రయత్నిస్తున్నది.

కొందరు తెలంగాణ బిడ్డలు కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసి ఈ ప్రాజెక్టులను ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మేధావులు అనబడే పెద్దలు కూడా ఆంధ్ర ప్రభుత్వ కుట్రలను పల్లెత్తు మాట అనడం లేదు. పైగా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అనేక దుష్ప్రచారాలను చేస్తున్నారు. బెనిఫిట్-కాస్ట్ రేషియో లేదంటారు, ఎకరా ఖర్చు ఎక్కువంటారు, కరెంటు ఖర్చు ఎక్కువంటారు, పెద్ద జలాశయాలతో భూకంపాలు వస్తాయని ప్రచారం చేస్తారు. ఇంత పెద్ద జలాశయాలు ఎందుకంటారు, భూ సేకరణ చట్టం ప్రకా రం చెయ్యమంటారు, చట్టం ప్రకారం చేస్తే అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పను లు ఎట్లా మొదలు పెడుతారని వాదిస్తారు. ఏదేమై నా సాగునీ టి రంగంలో ఈ అభివృద్ధి క్రమాన్ని ఆపివెయ్యాలనేది వారి కుట్ర. ఆంధ్ర ప్రభుత్వం వలసాధిపత్య కుట్రలు, రెండోవైపు అంతర్గత శత్రువుల కుట్రలు. వీటి పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండక తప్పదు. తెలంగాణలో వలసవాదం అంతం కాలేదు. తెలంగాణలో అంతం కావడానికి తొలుత చెయ్యవలసింది ఏమిటన్నది కీలక ప్రశ్న. విభజన చట్టం ద్వారా ఏర్పాటైన ఉమ్మ డి వ్యవస్థలు అన్నీ మొదట రద్దుకావాలి. ఉమ్మడి గవర్నర్, రాజధాని, ఉమ్మడి హైకోర్టు, విద్యాసం స్థల్లో ఉమ్మడి అడ్మిషన్లు, ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉమ్మడి పరిపాలనా వ్యవస్థలు రద్దు కానంతవరకు వలసవాదం తెలంగాణను పట్టి పీడిస్తూనే ఉంటది.
sridhar
కొన్ని రద్దయినా ఇంకా కీలక ఉమ్మడి వ్యవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి సంస్థల ఆస్తి పంపకాలు జరుగనే లేదు. ఆంధ్ర ప్రభుత్వం తన సిబ్బంది మొత్తా న్ని అమరావతికి తరలించింది కానీ హైదరాబాద్ లో భవనాలను మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తలేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వానికి అండగా తెలంగాణ సమా జం ఈ ఉమ్మడి వ్యవస్థల రద్దు కోసం కృషి చెయ్యవలసి ఉన్నది. ఇక సాంస్కృతిక రంగంలో జరుగవలసిన కృషి వేరే. ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. అందుకే వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అం తం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవాదానికి ఊడి గం చేసే దళారీ వర్గాన్ని తెలంగాణలో బలహీనపర్చ డం, రాష్ట్ర అభి వృద్ధి క్రమాన్ని అడ్డుకుంటున్న అంతర్గత శక్తులను సమర్థవంతంగా తిప్పికొట్టడం జరుగా లె. ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు ఉన్న సవాల్ ఇదే .

809

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Featured Articles