సార్ సేవలు చిరస్మరణీయం


Wed,May 3, 2017 11:49 PM

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2
మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్షా సమావేశాలకు, క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు సలహాదారుగా విద్యాసాగర్‌రావును తప్పనిసరిగా ఆహ్వానించేవారు. ఢిల్లీలో అంతర్రాష్ట్ర సంబంధిత అంశాలను పరిష్కరిం చే బాధ్యతను మంత్రిగారు ఆయనకే అప్పగించేవారు. ఢిల్లీలో కేంద్ర జల సంఘం, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖాధికారులతో ఉన్న పరిచయాల వల్ల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే సీఎం కేసీఆర్ విద్యాసాగర్ రావు గారిని సాగునీటి సలహాదారు గా నియమించారు. నేను సాగునీటి శాఖా మం త్రి హరీశ్‌రావు గారి వద్ద ఓఎస్డీగా విద్యాసాగర్ రావు గారితో పనిచేయడానికి అవకాశం చిక్కిం ది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయాలు- కుట్ర పూరిత ప్రాజెక్టు అయిన దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు ను రద్దు చెయ్యడం, ప్రాణహిత -చేవెళ్ళ, దేవాదుల ప్రాజెక్టులను కూలంకషంగా మథించి ఉత్తర తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ- ఇంజినీరింగ్ ప్రక్రియను చేపట్టడాన్ని చెప్పుకోవచ్చు. అలాగే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చి అటకెక్కించిన పాలమూరు-రంగారెడ్డి , డిండి ఎత్తిపోతల పథకాలను సమీక్షించి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకొని చేపట్టడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణకు మిషన్ కాకతీయను ప్రారంభించడం, కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటా దక్కించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ వివిధ వేదికలపై పోరాటాన్ని కొనసాగించడం లాంటివి ఉన్నాయి. ఈ అన్ని అంశాల్లో సీఎం కేసీఆర్‌తో కలిసి రోజుల తరబడి జరిగిన మేధోమథనంలో విద్యాసాగర్ రావుగారు భాగస్వాములయ్యారు.

ముఖ్యంగా కృష్ణా నీటిలో వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో కొనసాగుతున్న పోరాటంలో విద్యాసాగర్‌రావు సూచనలు, సలహాల మేరకే అఫిడవిట్లు తయారయ్యాయి. విభజన చట్టం ద్వారా ఏర్పాటైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లో విద్యాసాగర్‌రావు సమర్థవంతంగా వాదనలు వినిపించేవారు. ఆయన వాదనలకు తట్టుకోలేక, జవాబులు చెప్పలేక బోర్డు లో ఆయన పాల్గొనడాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ప్రశ్నించేవారు. ఒక సమావేశంలో ఈ విధంగా ప్రశ్నించినప్పుడు వారితో.. ఈ సమావేశానికి నేను తమాషా చెయ్యడానికి రాలేదు. తెలంగాణ ప్రయోజనాలను రక్షించడానికి వచ్చానని ఆగ్రహం ప్రకటించారు. విద్యాసాగర్ రావు కృష్ణా బోర్డు సమావేశాల్లో పాల్గొంటే తమ పప్పులుడకవని భావించి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజకీయ పదవి నిర్వహిస్తున్న విద్యాసాగర్‌రావు కృష్ణా బోర్డు సమావేశాల్లో పాల్గొనడానికి అర్హుడు కాదని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయించిన్రు. తన వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని భావించి తనే స్వచ్ఛందంగా తప్పుకున్నారు ఆయన. అయితే బోర్డు సమావేశాలు జరిగే ముందు సమీక్ష జరిపి రాష్ట్ర ప్రతినిధులకు మన వాదనలు ఎట్లా ఉండాలో నిర్దేశించేవారు. ఆయన కృష్ణా బోర్డు సమావేశాల్లో పాల్గ్గొన్నంత కాలం బోర్డు నిర్ణయాలు సమతూకంతో ఉండేవి. ఆయన తప్పుకున్న తర్వాత బోర్డు నిర్ణయాల్లో సమతూకం తప్పింది.

ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఏర్పాటైన బజాజ్ కమిటీ రెండు రాష్ర్టాల పర్యటనకు వచ్చింది. మొదటిరోజు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రతినిధులతో సమావేశం జరిగింది. రెండోరోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మూడోరోజు రెండు రాష్ర్టాల సంయుక్త సమావేశం జరిగింది. తెలంగాణ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది విద్యాసాగర్‌రావు గారే. సంయుక్త సమావేశం లో ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న నీటిలో తెలంగాణ వాటా ఏంటో తేల్చవలసిన అంశం తమ పరిధి లో లేదని బజాజ్ ప్రకటించారు. ఇది మొదటిరోజు బజాజ్ కమిటీ వెల్లడించిన వైఖరికి పూర్తిగా భిన్నంగా ఉండటంతో విద్యాసాగర్‌రావు ఆగ్రహంతో ఈ అంశం మీ పరిధిలో లేకపోతే ఈ సమావేశాల కోసం పర్యట న ఎందుకు జరుపుతున్నట్లు? మీ వైఖరి శోచనీయం మిస్టర్ బజాజ్ అని నిష్కర్షగా అన్నారు. ఇట్లా అవసరమైనప్పుడు తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడానికి మర్యాదలను పక్కనబెట్టి మాట్లాడేవారు.
మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్షా సమావేశాలకు, క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు సలహాదారుగా విద్యాసాగర్‌రావును తప్పనిసరిగా ఆహ్వానించేవారు. ఢిల్లీలో అంతర్రాష్ట్ర సంబంధిత అంశాలను పరిష్కరిం చే బాధ్యతను మంత్రిగారు ఆయనకే అప్పగించేవారు. ఢిల్లీలో కేంద్ర జల సంఘం, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖాధికారులతో ఉన్న పరిచయాల వల్ల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేశారు.

మొన్న అంబర్‌పేట స్మశాన వాటికలో విద్యాసాగర్‌రావు గారికి నివాళి అర్పించేందుకు వచ్చిన వర వరరావు ఆయన రాసిన తొలి కవిత ప్లస్ మైనస్‌ను తానే సృజనలో అచ్చువేశానని గుర్తు చేసుకున్నారు. విద్యాసాగర్ రావు ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్ళిన తర్వాత కవిత్వాన్ని వదిలి నాటకాలను రాస్తూ, ప్రదర్శిస్తూ, నాటకాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ, రేడియో కార్యక్రమాలకు స్క్రిప్టులు రాస్తూ తన సాహిత్య, కళాదాహాన్ని తీర్చుకున్నారు. ఆయన రాసిన నాటకాలను ప్రచురించి, ఒక మూడురో జుల పాటు ప్రదర్శిస్తే చూసి ఆనందించాలని ఆయన కోరుకున్నారు. తెలంగాణ థియేటర్ రీసెర్చ్ ప్రతినిధి విజయ్‌కుమార్ ఆ పనిలో నిమగ్నమైనారు. అట్లనే ఆచా ర్య జయశంకర్ గారిని ఇంటర్వ్యూ చేసి వొడువని ముచ్చట వెలువరించిన కొంపల్లి వెంకట్ గౌడ్ విద్యాసాగర్ రావును కూడా ఇంటర్వ్యూ చేసి ఉన్నారు. ఆ పుస్తకాన్ని కూడా త్వరగా తీసుకురావాలి.

విద్యాసాగర్‌రావు తాను పుట్టిన ఊరు జాజిరెడ్డిగూడెంను మరువలే దు. తమ పూర్వీకుల ఇంటిని కూల్చి కళ్యాణ మండపం కోసం మంత్రి హారీ శ్ గారి చేత శంఖుస్థాపన చేయించా రు. జాజిరెడ్డి గూడెంలో ఒక మార్కెట్ యార్డును కూడా మంజూరు చేయిం చారు. అర్వపల్లిలో ఉన్న ప్రాచీన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిచే కోటి రూపాయలు మంజూరు చేయించారు. జీవో వచ్చేనాటికి ఆయన స్పృహ లో లేరు. వారి కుటుంబసభ్యుల కోరిక మేరకు నేనే జీవో కాపీని ఆయన చేతిలో పెట్టి సార్ అర్వపల్లి జీవో కాపీ తెచ్చాను, నాటకాల పుస్తకం అచ్చయ్యింది, కళ్యాణ మంటపం పనులు ప్రారంభమైనాయని చెవిలో గట్టిగా చెప్పిన. ఆయన విన్నారో లేదో!
ఒక సాగునీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు గారి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం ఆయన నిస్వార్థ సేవలకు తెలంగాణ సమాజం తీర్చుకున్న రుణంగా భావించాలి.
(వ్యాసకర్త: సాగునీటి శాఖా మంత్రి ఓఎస్డీ)
Sridar

454

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Featured Articles