దోపిడీకి బీజంవేసిన దినం


Sat,September 17, 2016 01:16 AM

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17
1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమోచన దినం ఎట్లవుతుంది? తెలంగాణలో రాచరిక పాలనను అంతం చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి దోహదం చేసినందుకు తెలంగాణ చరిత్రలో 1948 సెప్టెంబరు 17 ఒక మైలురాయి మాత్రమే. అన్ని రోజుల్లాగే అదొక సాధారణ దినంగా గడచిపోవాలే తప్ప ఉత్సవాలు దేనికి?

sridar
దాశరథి, కాళోజీ, దేవులపల్లి రామానుజరా వు వంటి ప్రజాకవులు, రచయితలు విశాలాంధ్ర భావనతో ప్రభావితమయ్యారు. (1969 నాటికి ఇద్దరు తెలంగాణవాదులుగా మారారు) 1949లో విశాలాం ధ్ర మహాసభ ఏర్పాటై అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో ప్రచారాన్ని ఉధృతం చేసింది. 1950లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తమ తాత్కాలిక రాజధాని మద్రాస్ అని, శాశ్వత రాజధాని హైదరాబాద్ అని తీర్మానించింది. దాని తర్వాత 1953 లో కొన్ని మార్పులతో తమ తాత్కాలిక రాజధాని కర్నూలు, శాశ్వత రాజధాని హైదరాబాద్ అని తీర్మానించారు. దీన్నిబట్టి మొదటి నుంచి వారి చూపు హైదరాబాద్ నగరం మీద , తెలంగాణ వనరుల మీద ఉన్నదని స్పష్టమవుతున్నది.

విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాలకు తెలంగాణలో ప్రచారానికి దేవులపల్లి రామానుజరావు అండగా నిలిచాడు. శోభ పత్రిక ద్వారా పుస్తకాలు, కరపత్రాలు వేసి, విశాలాంధ్ర భావ ప్రచారం చేశాడు. ఆంధ్ర నుంచి అయ్యదేవర కాళేశ్వరరావు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాడు.1950లో వరంగల్ పట్టణంలో విశాలాంధ్ర మహాసభ జరిగింది. ఈ సభకు ఆంధ్ర నుం చి ప్రకాశం పంతులు, కడప కోటిరెడ్డి, సాంబమూర్తి, తిమ్మారెడ్డి హాజరయ్యా రు. విశాలాంధ్ర కోసం ఉద్యమించాలని తీర్మానించారు.1953 ఆగస్టులో విశాలాంధ్ర సమావేశాలు హైదరాబాద్‌లో జరిగాయి. అయితే గమనించవలసిన అంశం ఏమంటే విశాలాంధ్ర భావనకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యమా లు జరిగాయి. 1952లో గైర్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం ప్రధానమైంది. వరంగల్‌లో మొదలై న ఈ ఉద్యమం అన్నిజిల్లాలకు పాకింది. 1952 లో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లభించిన స్వేచ్ఛతో గైర్ ముల్కీ ఉద్యమం ఊపందుకున్నది. వెల్లోడి పరిపాలనా కాలంలో విపరీతంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి చొరబడిన గైర్ ముల్కీలను వెనక్కి పం పాలని, ఆ ఉద్యోగాల్లో స్థానికులను భర్తీ చెయ్యాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

గైర్ ముల్కీలను వెనక్కిపంపే బదులు విద్యార్థులపై దమనకాండకు పాల్పడింది బూర్గుల ప్రభుత్వం. బూర్గుల వ్యక్తిగతంగా విశాలాంధ్ర భావనకు వ్యతిరేకమే అయినా ప్రభుత్వం వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి జైళ్ళ పాలు చేసింది. ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించినట్లుగా చరిత్ర చెబుతున్నది. గైర్ ముల్కీ ఉద్యమానికి కొండా వెంకటరంగారెడ్డి అండగా నిలిచాడు.

1953లో నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాష్ర్టాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం (ఫజల్ అలీ కమిషన్) ముందు తెలంగాణవాదులు విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ వందలాది వినతిపత్రాలు సమర్పించారు. విశాలాంధ్ర ఏర్పాటు అయితే తాము అన్నిరంగాల్లో నష్టపోతామని , దోపిడీకి, అన్యాయానికి లోనవుతామని విన్నవించారు. విశాలాంధ్ర ఏర్పాటు వల్ల తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్రా ప్రాంత అభివృద్ధికి ఖర్చుపెడుతారని, తెలంగాణ మిగులు నిధులతో ఆంధ్ర ప్రాంత లోటును భర్తీ చేస్తారని, కృష్ణా, గోదావరి నీటి వినియోగంపై హక్కులు కోల్పోతామని, విద్య, ఉద్యోగ రంగాల్లో తమకంటే మేలైన పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రులు తమను ముంచుతారని కమిషన్‌కు వివరించారు.(తెలంగాణ ప్రజల ఈ భయాందోళనలు అన్నీ నిజమేనని అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర చరిత్ర రుజువు చేసింది) తెలంగాణ ప్రజల అనుమానాలను, భయాందోళనలను ఫజల్ అలీ కమిషన్ పరిగణనలోనికి తీసుకున్నది. ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలు ప్రత్యేక రాష్ర్టాలుగా కొనసాగాలని సిఫారసు చేసింది.

కమిషన్ సిఫారసుతో బెంబేలెత్తిన ఆంధ్ర నాయకత్వం ఢిల్లీకి పరుగులు తీసింది. ఢిల్లీలో నెహ్రూ, పటేల్, గోవింద్ వల్లభ్ పంత్ తదితర జాతీయ నాయకులతో తమకున్న పరిచయాల ఆధారంగా వారిని విశాలాంధ్రకు అనుకూలంగా మార్చుకోగలిగారు. విశాలాంధ్ర భావన వెనుక దోపిడీ, దురుద్దేశపూరిత సామ్రాజ్యవాద తత్వం ఉందన్న నెహ్రూ ఆంధ్రా నాయకుల ఒత్తిడికి తలొగ్గి కూడా ఫజల్ అలీ సిఫా ర్సును తుంగలో తొక్కి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర విలీనాన్ని ప్రకటించాడు. ఈ విలీన ప్రకటనకు ముందు తెలంగాణవాదిగా ఉన్న బూర్గుల రామకృష్ణారావును విశాలాంధ్ర వాదిగా మార్చడంలో ఆంధ్ర నాయకత్వం సఫలమైంది. సమైక్య రాష్ర్టానికి ముఖ్యమంత్రి పదవి ఆశ చూపి ఉంటారని చరిత్ర విశ్లేషకులు భావించారు. బూర్గుల వైఖరిలో చోటుచేసుకున్న మార్పుతో విశాలాంధ్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పెద్ద మనుషుల ఒప్పందం పేరుమీద తెలంగాణ కు రక్షణల హామీ పత్రం రాసిచ్చారు. 1956 నవంబర్1న విద్రోహ రాజకీయులదే పైచేయి అయి విశాలాం ధ్ర ఏర్పాటైంది. కానీ విశాలాంధ్రలో ప్రజారా జ్యం మాత్రం సుదూర స్వప్నంగా మిగిలిపోయింది.

రాసిచ్చిన హామీ పత్రాలు నీటి మీద రాతలయ్యాయి.అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో వివిధ సందర్భాల్లో ఏర్పడిన చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ ఉత్తర్వులు, కమిషన్లు, శాసనసభా కమిటీలు ఏవీకూడా తెలంగాణకు ప్రయోజనాలు చేకూర్చలేకపోయాయి. ఆరు దశాబ్దాల సమైక్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య భావ సమైక్యత ఏర్పడలేదు. తెలంగాణ వలస దోపిడీకి కేంద్రంగా మారింది. సాం స్కృతిక అణిచివేతకు గురైంది. ఇదంతా జరుగడానికి 1948 సెప్టెం బర్ 17న పునాదిరాయి పడింది. ఆ రోజుకు ముందు తెలంగాణ ప్రజలు పెనం మీద ఉంటే ఆ తర్వాత పొయ్యిలో పడినట్లయ్యింది. 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబరు 17 విమోచన దినం ఎట్లవుతుంది? తెలంగాణలో రాచరిక పాలనను అంతం చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి దోహదం చేసినందుకు తెలంగాణ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17 ఒక మైలురాయి మాత్రమే. అన్ని రోజుల్లాగే అదొక సాధారణ దినంగా గడిచిపోవాలే తప్ప ఉత్సవాలు దేనికి?

1139

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Featured Articles