వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17


Fri,September 16, 2016 02:19 AM

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఒక భూమిక ఏర్పడింది. ఆ తర్వాతనే
తెలంగాణలో విశాలాంధ్ర భావనకు ప్రజా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు మొదలైనాయి. తెలంగాణ మేధావివర్గానికి విశాలాంధ్ర భావన ఎక్కించబడింది.

sridar
తెలంగాణ చరిత్రలో 1948సెప్టెంబర్ 17కు ప్రాధాన్యం ఉన్నదన్న విషయంలో ఎవరికీ భిన్నభిప్రాయం లేదు. ఉండనక్కరలేదు కూడా. అయితే ఇటీవల కాలంలో సెప్టెంబర్17న తెలంగాణ విమోచనా దినంగా పాటించాలని, ప్రభుత్వం అధికారికం గా విమోచనా దినాన్ని నిర్వహించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ వారైతే తెలంగాణ అం తటా తిరంగా యాత్ర కూడా నిర్వహిస్తున్నారు. విమోచన దినోత్సవానికి ప్రజా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరాఠ్వాడాలో, హైదరాబా ద్ కర్ణాటక జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణలో కూడా అటువంటి ఉత్సవాలు ఎందు కు జరుగకూడదు అన్న వాదనను ముందుకు తెస్తున్నారు. మరాఠ్వాడాలో, హైదరాబాద్ కర్ణాటక జిల్లా ల్లో ప్రజల అనుభవాలకు, ఇక్కడ తెలంగాణలో ప్రజ ల అనుభవాలకు తేడా ఉన్నది. సెప్టెంబర్17 అనంతరం తెలంగాణలో చోటు చేసుకున్న విద్రోహ రాజకీయ పరిణామాలను విశ్లేషణ చెయ్యకుండా ఇతరేతర ప్రయోజనాల కోసం చేస్తున్న డిమాండ్‌గానే చూడవలసి ఉంటుంది.

నిజానికి సెప్టెంబర్17ను ఎట్లా చూడాలి అన్న అంశంపై తెలంగాణ సమాజం లో భిన్నాభిప్రాయాలు ఉద్యమకాలం నుంచే ఉన్నా యి. తెలంగాణ హిస్టరీ సొసైటీ ఈ భిన్నదృక్కోణాల ను క్రోడీకరిస్తూ 2009లో ఒక పుస్తకాన్ని కూడా వెలువరించింది.సెప్టెంబర్17 ను విలీనం,విమోచన, ఆక్రమణ, విముక్తి వంటి పదాలతో వర్ణిస్తున్నారు. ఏది ఎట్లున్నా ఆ రోజున అప్పటి వరకు స్వతంత్ర సంస్థానంగా ఉన్న హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో విలీనం అయిందనేది ఎవరూ కాదనలేని సత్యం.(రాజ్యాంగపరంగా 26జనవరి 1956 నే విలీనం జరిగిందనేది కొందరి చరిత్రకారుల అభిప్రాయం). విమోచన, విముక్తి అనేటువంటి వ్యక్తీకరణలు సెప్టెంబర్17కు ఆపాదించడం సరైంది కాదనేది తెలంగాణలోని చాలామంది చరిత్రకారులు, మేధావుల అభిప్రాయం. ఇటీవల బీజేపీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మెజారిటీ సభ్యు లు సెప్టెంబర్17ను విలీన దినంగానే పరిగణించాల ని పేర్కొనడం గమనార్హం.

నిజానికి సమకాలీన చరిత్రకారులు , వ్యాఖ్యాత లు, భారత ప్రభుత్వం, సైన్యం ఎవరూ కూడా ఆ సంఘటనను విమోచనగా, విముక్తిగా పేర్కొనలేదు. 1961 వరకు పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాను భారత యూనియన్‌లో విలీనం చేసే చర్యను భారత ప్రభుత్వం గోవా విముక్తిగానే పేర్కొన్నది. 1972లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ చెర నుంచి విడిపించడానికి చేసిన సైనిక చర్యను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ విముక్తిగానే పేర్కొన్నది. కానీ 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేషన్ పోలో (మిలిటరీ రహస్య పత్రాల్లో దీన్ని ఆపరేషన్ కాటర్ పిల్ల ర్ గా పేర్కొన్నారని మాజీ సైనికుడు పాండురంగారెడ్డి గారు తెలిపినారు) పేరిట సాగిన సైనిక చర్యను భారత ప్రభుత్వం పోలీస్ చర్యగా పేర్కొన్నది తప్ప ఎక్క డా విమోచన, విముక్తి అన్న పదాలను వాడలేదు. పోలీస్ యాక్షన్‌గా పిలువబడిన సైనిక చర్య లక్ష్యం హైదరాబాద్ రాజ్యంలో బలపడుతున్న కమ్యూనిస్టులను అణిచివెయ్యడమే అయ్యింది తప్ప ఆనాడు హైదరాబాద్ రాజ్య ప్రజలు అనుభవిస్తున్నభూస్వా మ్య దోపిడీ నుంచి విముక్తి మాత్రం లభించలేదు. సారాంశంలో 1948 సెప్టెంబర్17 అనంతరం జరిగినదేమిటి అనేది ఈసందర్భంగా విశ్లేషించుకోవాలి.

1.అప్పటి వరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కేం ద్రీకృత ఆధిపత్యానికి లోబడి స్వతంత్రంగా కొనసాగుతున్న హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనమయ్యింది. 2.వెంటనే కాకున్నప్పటికీ రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైంది. 3.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వల్ల మూడు వేల గ్రామాల్లో భూస్వాముల ఆధీనంలోని 10 లక్షల ఎకరాల భూమి విముక్తం అయి రైతుకూలీల పరమయ్యింది. సైనిక చర్య అనంతరం ఈ భూమి తిరిగి భూస్వాముల పరమైనాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాధించిన విముక్తి ఫలాలను సైనిక చర్య తిరగదోడింది. 4.సైనిక చర్యలో రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులను, పోరాటంలో పాల్గొన్న వేలాది మంది రైతుకూలీలు సైన్యం ఊచకోతకు గురైనారు. 5.హైదరాబాద్ రాజ్యంలో, ముఖ్యంగా మరాఠ్వాడాలో వేలాది మంది ముస్లిం ప్రజానీకం రజాకార్ల పేరుమీద సైన్యం ఊచకోతకు బలైనారు.

ఇందుకు పండిత్ సుందర్ లాల్ కమిటీ నిజనిర్ధారణ నివేదిక సాక్ష్యం గా ఉన్నది. 6.సైనిక చర్య అనంతరం 1948 నుంచి 1952 దాకా హైదరాబాద్ స్టేట్‌లో సైనిక పాలన కొనసాగింది. భారత ప్రభుత్వం వెల్లోడి అనే సివిల్ అధికారిని ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్ కు పంపింది. 1952లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. బూర్గుల నరసింగరావు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. 1956 లో రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ జరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో తెలంగాణ తిరిగి పరాధీనమయ్యింది. విలీనం తెలంగాణలో ఆంధ్ర వలసపాలనకు పునాదిరాయి వేసింది. తెలంగాణ ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు. ఈ వలసపాలన నుంచి తెలంగాణ విముక్తం కావడానికి 60ఎండ్లు పట్టింది.

విశాలాంద్ర నినాదం-ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు- విద్రోహ రాజకీయాలు :
1927లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇం డియన్ స్టాట్యుటరీ కమిషన్ (ఇదే సైమన్ కమిషన్) ముందు భాషా ప్రాతిపదికన రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ జరుగాలని భారత జాతీయ కాంగ్రెస్ కోరిం ది. ఇందులో భాగంగా ముందుగా ఆంధ్ర, ఉత్కళ్, సింధూ, కర్ణాటక రాష్ర్టాలు ఏర్పాటు చేయాలని కమిషన్‌కు సూచించింది. ఆంధ్ర రాష్ట్రం కోసం అప్పటి నుంచి ఉద్యమం ఊపందుకున్నది. స్వాతంత్య్రానంతరం ఏర్పాటు చేసిన ధర్ కమిషన్, జేవీపీ కమిటీలు కూడా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సిఫారసు చేశాయి. అయితే మద్రాసు నగరం ఎవరికీ చెందాలన్న అం శంపై వివాదం చెలరేగడంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదాపడింది. 1952లో పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి 54 రోజులకు అమరుడైన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున హింసకాండ చెలరేగింది. దీంతో ప్రధాని నెహ్రూ పొట్టి శ్రీరాములు మరణించిన నాలుగు రోజులకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును అధికారికంగా ప్రకటించాడు. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్1 న ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనివార్యమని 1940 దశకంలోనే రూఢీ అయ్యింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి తే రాజధాని సమస్య ముందుకు వస్తుంది. మద్రాసును తమిళ ప్రజలు వదులుకోరు. ఆంధ్ర ప్రాం తంలో రాజధానికి యోగ్యమైన నగరం విశాఖపట్నం తప్ప మరో నగరం లేదు. విశాఖను రాజధానిగా రాయలసీమవాసులు ఒప్పుకోరు. రాజధాని సమస్యకు తోడు వనరుల సమస్య, నిధుల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉన్నదన్న సంగతి ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి తెలుసు. తెలంగాణను కలుపుకొని విశాలాంధ్ర ఏర్పడితే ఈ సమస్యలన్నీ తీరుతాయి. తెలంగాణలో సకల సౌకర్యాలతో నిర్మితమైన హైదరాబాద్ నగరం ఉన్నది. రాజధాని సమ స్య తీరిపోతది. తెలంగాణ నేల మీద నుంచి పారుతున్న కృష్ణా, గోదావరీ నదులను మలుపుకపోవ చ్చు. హైదరాబాద్ రాష్ర్టానికి వారసత్వంగా సంక్రమించిన లక్షల ఎకరాల నిజాం సర్ఫేఖాస్ భూము లు హైదరాబాద్ నగరం చుట్టూనే ఉన్నాయి. విద్యు త్తు ఉత్పత్తికి, పారిశ్రామికాభివృద్ధికి అవసరమయ్యే బొగ్గు గనులు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణ సహా విశాలాంధ్ర ఏర్పడితే అన్ని సమస్యలు పరిష్కా రం అవుతాయన్న స్పృహ వారికున్నది. అందుకే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముందే విశాలాంధ్ర భావ న పురుడు పోసుకున్నది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో సమాంతరంగా విశాలాంధ్ర ఉద్యమం కూడా ఊపందుకున్నది. ఈ విశాలాంధ్ర భావనకు తాత్విక , సైద్ధాంతిక భూమిక కల్పించినవాడు పుచ్చల పల్లి సుందరయ్య. ఆయనకు ముందు 1930 దశకం చివరలో విశాలాంధ్ర కోసం భావ ప్రచారం చేసినవాడు మామిడిపూడి వెంకటరంగయ్య. 1946 లో సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం పేరుతో ఒక పుస్తకాన్ని రాసి విశాలాంధ్ర భావనను స్థిరపర్చాడు. 1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటుచేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీ నం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948 సెప్టెంబర్ 17 తర్వా త ఒక భూమిక ఏర్పడింది. ఆ తర్వాతనే తెలంగాణ లో విశాలాంధ్ర భావనకు ప్రజా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు మొదలైనాయి. తెలంగాణ మేధావి వర్గానికి విశాలాంధ్ర భావన ఎక్కించబడింది.

2188

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Featured Articles