మల్లన్నసాగర్ మన మంచికే


Sat,July 30, 2016 01:33 AM

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2
మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే. దానికి భౌగోళికంగా ఆ ప్రదేశానికి ప్రాధాన్యం ఉన్నది. మల్లన్నసాగర్ 1.నైసర్గికంగా ఎత్తయిన ప్రదేశంలో ఉండటం (ridge). 2. గోదావరి, కృష్ణానది బేసిన్ల పరీవాహక ప్రాంతాల మధ్యగల ప్రదేశం (watershed). ఇక్కడ +557మీ FRL వద్ద నీటిని నిల్వ చేస్తే అక్కడి నుంచి సొంత ఆయకట్టు 1.25 లక్షల ఎకరాలతో పాటుగా, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఎగువకు నీటి సరఫరా చేయడంతో పాటుగా, చుట్టూ అన్నీ వైపులనున్న స్కీంలకు నీటిని అందించి ఆదుకోవచ్చు. నల్లగొండ జిల్లా బస్వాపూర్ (11.39 టీఎంసీ), గంధమల్ల (9.87 టీఎంసీ) రిజర్వాయర్ల కింది ఆయకట్టు, మెదక్ జిల్లా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ (7 టీఎంసీ) కింద ఆయకట్టు , నిజామాబాద్ జిల్లా అమర్లాబాద్ (5 టీఎంసీ), కచ్చాపూర్ (2.5 టీఎంసీ) , తిమ్మక్కపల్లి (3.0 టీఎంసీ), ఇసాయిపేట్ (2.5 టీఎంసీ), మోతెవాగు (2.9 టీఎంసీ), భూంపల్లి (0.09 టీఎంసీ), గుజ్జాల్ (1.5 టీఎంసీ), కాతేవాడి (5 టీఎంసీ) రిజర్వాయర్ల కింద ఆయకట్టు, శామీర్ పేట్ తాగునీటి రిజర్వాయర్‌కు, హల్దివాగు ద్వారా నిజాంసాగర్, ఎస్సారెస్పీ రిజర్వాయర్లకు, ప్రత్యేక లింక్ ద్వారా సింగూర్ రిజర్వాయర్ కు నీళ్లిస్తారు.

ఇవన్నీ ఒకసారి మల్లన్నసాగర్‌కు లిఫ్ట్ చేశాక గ్రావిటీ ద్వారానే ఇవ్వవచ్చు. మల్లన్నసాగర్ వద్ద నిల్వ చేసుకుంటే వీటన్నింటికి అవసరాన్ని బట్టి ఇయ్యడానికి వెసులుబాటు ఉంటుంది. అందుకు 50 టీఎంసీల నీటి సామర్థ్యం అత్యంత అవసరం. ఇక సింగూరు, నిజాంసాగర్‌లోకి ఈ ఏడాది ఇప్పటివరకు చుక్క నీరు రాలేదు. వాటిని కాపాడుకోవడానికి మల్లన్నసాగర్ అవసరం ఉన్నది. అవసరమైన పక్షంలో నిజాంసాగర్ నుంచి ఎస్సారెస్పీలోకి కూడా నదీ మార్గం ద్వారా పంపించే అవకాశం ఉన్నది.

line
అయితే ప్రాజెక్టు విమర్శకులు ఎల్లంపల్లి నుంచి నేరుగా నదీ మార్గం ద్వారా గోదావరిపై వరుస బ్యారేజీలు నిర్మించి ఎస్సారెస్పీకి నీటిని తక్కువ లిఫ్ట్‌తో మళ్లించే అవకాశం ఉన్నా ప్రభుత్వం మల్లన్నసాగర్ ద్వారానే ఎస్సారెస్పీకి నీటిని మళ్ళించడానికి ప్రయత్నం చేస్తున్నదని అంటున్నారు. ఎల్లంపల్లి నుంచి నదీ మార్గం ద్వారా తక్కువ లిఫ్ట్‌తో ఎస్సారెస్పీకి పంపు చెయ్యవచ్చుననే వాదన పట్ల ప్రభుత్వానికి భినాభిప్రాయం లేదు. అయితే ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ దాకా దాదాపు 5 లేదా 6 వరుస బ్యారేజీలు, పంపు హౌజ్‌లను నిర్మించవలసి ఉంటుం ది. దాదాపు 20-22 వేల కోట్ల సొమ్మును వీటి నిర్మాణం కోసం వెచ్చించాల్సి ఉంటుంది.

కాబట్టి మల్లన్నసాగర్ దాకా నీటిని తీసుకురావడం అనివార్యం గనుక ప్రస్తుతానికి హల్దీవాగు, మంజీరా నదుల ద్వారా ఎటువంటి కట్టడాల అవసరం లేకుండానే నీటిని ఎస్సారెస్పీకి తరలించే ఆలోచన ప్రభుత్వం చేసింది. ఇది సాంకేతికంగా హేతుబద్ధమైన నిర్ణయమే అని నిపుణులు భావిస్తున్నారు. కృష్ణా గోదావరి నదుల వాటర్‌షెడ్ వద్ద మల్లన్నసాగర్ ఉన్నందున కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాంతాలకు కూడా గ్రావిటీ ద్వారా నీటి ని అందిస్తున్నాం. సుప్రీంకోర్టులో, కృష్ణా అంతర్రాష్ట్ర ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వం కొన్ని విషయాలను బహిరంగంగా వెల్లడి చేయలేకపోవచ్చు. అది వ్యూహాత్మక నిర్ణయమే తప్పా ప్రభుత్వం ప్రజల నుంచి ఏదో దాచాలన్న ఉద్దేశంతో చేసింది కాదు. ఈ కీలకమైన అంశాన్ని మేధావులు గమనించాల్సిన అవసరం ఉన్నది.

ఇకపోతే 50 టీఎంసీల మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గురించి కూడా చాలా చర్చ జరుగుతున్నది. ముంపు లేకుం డా ప్రాజెక్టులను ఈ భూమ్మీద నిర్మించడం ఎట్లానో వారు తెలియజేస్తే మంచి ది. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టుల ముంపును మల్లన్నసాగర్ ముంపును పోల్చి చూసినప్పుడు మల్లన్న సాగర్ ఎంత జాగ్రత్తగా డిజైన్ చేసిందో మనకు అర్థమవుతుంది. నిల్వసామర్థ్యంలో మల్లన్నసాగర్ కంటే చాలా చిన్నవే అయినా ముంపులో మల్లన్నసాగర్ కంటే చాలా ఎక్కువే.

పట్టికను పరిశీలించినప్పుడు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గురించి చేస్తున్న ఆందోళనకు విశ్వసనీయత లేదని స్పష్టమవుతున్నది. పట్టికలోని చివరి మూడు ప్రాజెక్టులు తెలంగాణ ఏర్పడిన తర్వాత రీ డిజైన్ చేసినవి. ఆ పైన ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో చేసినవి. ప్రాజెక్టుల ముంపుపై ఎంత జాగరూకతతో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందో తెలిసిపోతున్నది.

వీటన్నింటికి తోడుగా ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా (క్యాపిటల్, రీకరింగ్) వెనుకాడక తన రైతులకు అందరికీ ఒక పంటకైనా నీళ్లివ్వాలని, వీలైతే రెండో పంటకు కూడా ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకోవడం సరికాదు. రెండో పంటకు ఇవ్వడం దేశంలో ఎక్కడాలేదనడం హాస్యాస్పదం. పులిచింతల ఎందుకు?, పోలవరం ఎం దుకు? కేసీ కెనాల్ లిఫ్ట్ స్కీం ఎందుకు? వాటి ప్రాజెక్టు రిపోర్టుల్లో రెండో పంటకు అని ఉండదు కానీ రెండో మూడో పంటకే అన్నది అందరికీ ఎరుకే. తెలంగాణ రైతులకు రెండో పంటకు నీటిని అనుభవించే హక్కు లేదా? సముద్రంలో కలిసే నీటిని నిల్వ చేసి, తెలంగాణకు హక్కు అయిన 954 టీఎంసీలు మొత్తంగా వాడుకొని, వీలైతే రైతులకు రెండు పంటలకు నీటిని అందజేసి దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రం నిలిస్తే తప్పేమిటి? సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని అడ్డంకులు కల్పించినా దేశంలోనే మొదటగా అత్యంత ఎత్తయిన లిఫ్ట్ స్కీం ఏఎంఆర్‌పీ ప్రాజెక్టు ను సాధ్యంచేసి చూపించి మన తెలంగాణ ఇంజినీర్లు దేశానికి మార్గదర్శకులు కాలేదా? లిఫ్ట్ స్కీంలలో మార్గదర్శిగా నిలిచినట్లు అట్లాగే రెండో పంటకు నీళ్లిచ్చి మార్గదర్శిగా నిలుస్తుంది తెలంగాణ. నిలిచి గెలుస్తుంది తెలంగాణ.

693

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర