ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు


Fri,July 29, 2016 01:25 AM

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల
ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడుతుంటే మాట్లాడనివారు మన ప్రాజెక్టులను తప్పు పడుతున్నారు.

సాగునీటి ప్రాజెక్టుల రీ ఇంజినీరింగు పై కొంతమంది ఇంజినీర్లు, ఇంజినీర్లు కానివారు ప్రజలను గందరగోళపరిచే ప్రచారాలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి: 1.కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లలో నీటి నిల్వ అవసరం లేదు. 2.మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 50 టీఎంసీలు అవసరంలేదు. 3.కాలువ మీద రిజర్వాయర్లు ప్రపంచంలో ఎక్కడాలేవు. 4.రెండో పంటకు నీరిచ్చే ప్రాజెక్టులను దేశంలో ఎక్కడా డిజైన్ చెయ్యలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ ఇంజినీరింగ్ ద్వారా ప్రతిపాదించినది 144 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. అంతకుముందు అది 11.43 టీఎంసీలు మాత్రమే. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న వారు హర్యానా లోని జవహర్‌లాల్ నెహ్రూ లిఫ్ట్ కెనాల్ ప్రాజెక్టును ఉదహరిస్తున్నారు. ఆ ఇరిగేషన్ స్కీం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏ విధంగానూ పోల్చదగినది కాదు.

యమునోత్రి వద్ద గల హిమ నదం(గ్లేసియర్) నుంచి బయల్దేరే యమునా నదిపై ఉన్న హత్నికుండ్ బ్యారేజీ నుంచి 16,000 క్యూసెక్కులతో బయల్దేరే పడమటి యమునా కాలువ (WYC లేదా WJC) దాదాపుగా 200 కిలోమీటర్లు గ్రావిటీతో ప్రవహించిన తర్వాత 2,850 క్యూసెక్కులతో జవహర్‌లాల్ నెహ్రూ కెనాల్ (ఫీడర్) మొదలవుతుంది. అంటే స్కీం నీటి సోర్స్ హత్నికుండ్ బ్యారేజీ నుంచి నేరు గా గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకోబడుతున్నది. WYC కింద హర్యానాలో గల ఆయకట్టును కెనా ళ్ళ పరంగా ఐదు సమూహాలుగా విభజించి, రొటేష న్ పద్ధతిలో ఒక సమూహం తర్వాత ఒక సమూహానికి 8 రోజుల వార బందీ పద్ధతిలో ఖరీఫ్ పంటకు నీటిని విడుదల చేస్తారు. మే నెల మొదటి నుంచి మొదలై అక్టోబర్ చివరివారం వరకు ప్రతి 8 రోజులకు ఒక సమూహానికి సాగునీటిని ఇస్తారు. అంటే మే, అక్టోబర్ నెలల్లో కనీసం 6,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం నదిలో ఉంటుంది. అందువల్ల WYC కెనాల్లో కూడా ఉంటుంది.

దీనికితోడు అక్క డ ఉండే భూమి మైదాన ప్రాంతం కావడం వల్ల భూగర్భ జలాలు పుష్కలంగా ఉండి కెనాల్ నీటికి తోడుగా వాడుకోవచ్చు. హర్యానాలో స్టోరేజీ నిర్మాణానికి అనుకూల ప్రదేశం లేనందువల్ల హత్నికుండ్ బ్యారేజీకి ఎగువన ఉత్తరాఖండ్‌లో ఒక్కోటి 25 టీఎంసీల చొప్పున లఖ్వార్, వాసి వద్ద రెండు రిజర్వాయర్ల నిర్మాణం మొదలు కాబోతున్నది. WYCపై 68 MW విద్యుత్తు ఉత్పత్తి చేసే 4 విద్యుత్ కేంద్రాలున్నాయి. అసలు, విద్యుత్తును ఉత్పత్తి కూడా చేసే కెనాల్‌పై ఉన్న జవహర్ ప్రాజెక్టుతో, ఆద్యంతం వేల మెగావాట్ల విద్యుత్తును వినియోగించి వందల మీటర్ల ఎత్తు లిఫ్టులతో ఉన్న కాళేశ్వ రం ప్రాజెక్టును ఎట్లా పోలుస్తాం? కాళేశ్వరం ప్రాజె క్టు గోదావరి నుంచి ఆరంభంలోనే రోజుకు 2 టీఎంసీలు అనగా 22 వేల క్యూసెక్కుల లిఫ్ట్‌తో మేడిగడ్డ వద్ద ఆరంభమయ్యే స్కీం.

లిఫ్ట్ ఎత్తు జవహర్ లాల్ నెహ్రూ కెనాల్ లిఫ్ట్ స్కీం ఫీడర్ ఒక స్టేజీలో గరిష్ఠంగా 6 మీ. ఉంటే కాళేశ్వరంలో 130 మీ ఉం ది. మొత్తం అన్నీ స్టేజీలు కలిపి JLN ప్రాజెక్టు లిఫ్ట్ ఎత్తు 12 మీ అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అన్ని స్టేజీలు కలిపి ఎత్తు 400 మీ. జేఎల్‌ఎన్ లిఫ్ట్ స్కీం ఆయకట్టు 3,84,000 ఎకరాలు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు 38,00,000 ఎకరాలు (కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలిపి). జేఎల్‌ఎన్ స్కీం ఒక్కో పంపు డిశ్చా ర్జ్ కెపాసిటీ (గరిష్ఠం) 150 క్యూసెక్కులయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంపు 3,150 క్యూసెక్కు లు ఉంది. జేఎల్‌ఎన్ స్కీం మోటార్ కెపాసిటీ 20 నుంచి 750 HP (0.02 నుంచి 0.75 MW) ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కో మోటారు కెపాసిటీ 15 MW నుంచి 116 MW వరకు ఉంది. ఇట్లా ఒక చిన్న లిఫ్ట్ స్కీం అయిన JLNను కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చడం అశాస్త్రీయం, అసమంజసం.

కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటి సోర్స్ ద్వీపకల్ప నదియైన గోదావరిపై కడుతున్న మేడిగడ్డ బ్యారేజీ. ఈ నదిలో జనవరి నెల నుంచే మూడువే ల క్యూసెక్కుల కంటే తక్కువ నీటి ప్రవాహం ఉండి, మే మాసాంతానికి 600 క్యూసెక్కులు మాత్రమే ఉంటుంది. అంటే ద్వీపకల్ప నదులపై రుతుపవనా ల సమయం తర్వాత నీటికోసం ఆధారపడలేం. మనం రబీలో ఆరుతడి పంటలకు నీళ్లియ్యాలంటే తప్పనిసరిగా నైరుతి రుతుపవనాల వల్ల వచ్చే ప్రవాహాలను నిల్వ చేసుకోవాలి.

ఇక నిల్వ సామర్థ్యం ఎక్కువగా పెట్టారు అన్నది వారి మరో అభియోగం. కేంద్ర జల సంఘం ప్రాజెక్టులో తలపెట్టిన జలాశయాల సామర్థ్యం కేవలం 11.43 టీఎంసీలు ఉన్నది కాబట్టి ప్రతిపాదిత జలాశయాల సామర్థ్యం పెంచడం, మరికొన్ని జలాశయాలను కల్పించడం చేయవలసి ఉంటుందని సూచించింది. 2008లో ప్రాజెక్టు రిపోర్టుపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ కూడా 160 టీఎంసీలను వాడుకోవాలంటే నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్పింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి నిల్వ, వినియోగం నిష్పత్తి 1:1.40 నుంచి 1:1.50 వరకు ఉండాలని అభిప్రాయపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో 144 టీఎంసీల నిల్వ సామర్థ్యం, నీటి వినియో గం దాదాపుగా 380 టీఎంసీలు (38 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, స్థిరీకరణలకు ఒక టీఎంసీకి పది వేల ఎకరాల చొప్పున). కాబట్టి 1:2.60గా ఉంది. అంటే మనకు కావాల్సిన స్టోరేజీ 1:1.40 చొప్పున మొత్తం 271 టీఎంసీలు. కానీ ఉన్నది 144 టీఎంసీలు మాత్రమే. అయితే మనం స్థిరీకరణకు వినియోగించే నీటి కోసం సింగూరు (29 టీఎంసీలు), నిజాంసాగర్ (17.8 టీఎంసీలు), శ్రీరాంసాగర్ (90.31 టీఎంసీలు) ప్రాజెక్టుల స్టోరేజీలను కూడా వినియోగించుకుంటాం కాబట్టి స్టోరేజీకి సంబంధించిన సమస్యను అధిగమించవచ్చు.

మొత్తమ్మీద దాదాపుగా 284 టీఎంసీల స్టోరేజీ ఉం టుంది. మనకు కావాల్సిన 271 టీఎంసీలకు కాస్తం త ఎక్కువగా ఉన్నది.గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు మొదలయ్యే మేడిగడ్డ వద్ద మనకు లభించే నీళ్లు సరాసరి 1651 టీఎంసీలు, 75 శాతం విశ్వసనీయతతో 994 టీఎంసీలు. జూలైలో సగటు కనీసం 299.9 టీఎంసీలు, అక్టోబర్ నెలలో సగటు కనీసం 176.2 టీఎంసీలు నీటి లభ్యత ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇంకా ఎక్కువే ఉంటుంది. నేడున్న వ్యవస్థ ప్రకారం రెండు టీఎంసీల చొప్పున జూలై నుంచి అక్టోబర్ వరకు 120 రోజులు లిఫ్ట్ చేస్తే 240 టీఎంసీలు లిఫ్ట్ చేయవచ్చు. మిగిలిన 1,267 టీఎంసీలు (జూన్ నుంచి అక్టోబర్ వరకు 299.9+607.1+423.8+176. 2= 1507 టీఎంసీలు- 240 టీఎంసీలు = 1,267 టీఎంసీలు) సముద్రంలో కలువాల్సిందే.

అయితే ఖరీఫ్ పంటకు నేరుగా నీళ్ళు ఇస్తే 160 టీఎంసీలు వినియోగమవుతే మిగిలిన 80 టీఎంసీలు మనకున్న స్టోరేజీలలో నింపుకోవచ్చు. ఇంకా జూన్ నెలలోనూ, నవంబర్ నెలలోనూ మేడిగడ్డ వద్ద రోజుకు ఒక టీఎంసీ చొప్పున లిఫ్ట్ చేసుకునేందుకు నీటి లభ్యత ఉంటుంది. రోజుకు మూడు టీఎంసీ లిఫ్ట్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే ఇంకా 120 టీఎంసీలు అదనంగా వినియోగంలోకి తెచ్చుకోవచ్చు. రబీకి నీళ్లివ్వడంతో పాటుగా తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చు. దానికి తోడుగా నవంబర్ నుంచి జూన్ వరకుండే ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా సరాసరి 144 టీఎంసీలు కూడా లిఫ్ట్ చేసి నిల్వ చేసుకోవచ్చు.

గత రెండేండ్లు వర్షాభావ పరిస్థితిని చూశాం. కాళేశ్వరం వద్ద 1986-88 రెండేండ్లు 43.75 టీఎంసీలు, 39.44 టీఎంసీలు మాత్రమే నీటి లభ్య త. అట్లాంటి సందర్భాల్లో వర్షాలు ఎక్కువగా వచ్చిన సంవత్సరాల్లో నీటి నిల్వ ఉంటే వాటిని క్యారీ ఓవర్ స్టోరేజీగా వాడుకోవచ్చు. సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడుతుంటే మాట్లాడని వారు మన ప్రాజెక్టులను తప్పు పడుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కింది ఆయకట్టులో 80 శాతం మల్లన్నసాగర్ రిజర్వాయర్, ఇంకా దానికి ఎగువనే ఉంది. జూన్‌లో రైతులకు సాగునీరు అందించాలం టే జూలైలో కాళేశ్వరం వద్ద లభించే నీటిని వినియోగించలేం. రుతుపవనాలు సకాలంలో రాని సంవత్సరాలు, మూడు నాలుగు వారాల పొడి సమయం ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి మల్లన్నసాగర్‌లో నిల్వనీటిని ఆ పై ఏడాది వినియోగించుకొని జూన్‌లోనే సాగునీరందించవచ్చు. ఇక్కడ నీటి రవాణాకు పట్టే కాలం- మేడిగడ్డ వద్ద జూన్/జులై నెలలో లిఫ్ట్ చేయడం మొదలైన రోజునుంచి మల్లన్నసాగర్ అవతలనున్న ఆయకట్టుకు నీరు అం దించాలంటే, బ్యారేజీల్లో, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల లో కనీసస్థాయిల్లో నీరు చేరాకే లిఫ్ట్ చేయడమై నా, కెనాళ్ళల్లో ప్రవహించడమైనా సాధ్యమవుతుం ది.

ఇక కెనాళ్లలో నీటి ప్రవాహం పూర్తిస్థాయిలో ఉం డటానికి మొదట అవి పూర్తిగా నిండాలి. ప్రాజెక్టులో మొత్తం దాదాపుగా 16 చోట్ల లిఫ్ట్ చేయాలి. అక్కడ పంపులు ఒక క్రమపద్ధతిలో ఆన్ చేయాల్సి ఉంటుం ది కాబట్టి దానికీ కొంత సమయం పడుతుంది. ఇట్లా మొత్తం నీటి ప్రవాహం మేడిగడ్డ నుంచి ప్రతిపాదిత ఆయకట్టుకు అందించడానికి కనీసం ఒకటి నుంచి మూడు వారాల సమయం పడుతుంది. మనం ఖరీఫ్ సీజన్ మొదటి రోజునే నీళ్ళందించాలంటే నీటి సోర్సుకు దాదాపుగా 200 కిమీ దూరం లో ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్లో కావల్సినంత స్టోరేజీ ఉంటేనే సాధ్యమవుతుంది.

875

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర