అస్తిత్వం చాటాల్సిన సమయం..


Sat,January 23, 2016 01:50 AM

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద్ధమేనని మరొక్కసారి నిరూపించాలి.
ఉద్యమ కాలంలో మన నినాదం హైదరాబాద్ కోసం మనం-మన కోసం హైదరాబాద్. ధ్వంసమైన హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా నిర్మించుకుందాం.

rao


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ భవిష్య త్తు మరొక్కసారి చర్చనీయాంశం అవుతున్నది. హైదరాబాద్ నగరా న్ని తామే అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టామని టీడీపీ ప్రచార సభలో చెప్పడం అందుకు తాజా నిదర్శనం. రెండు కళ్ల సిద్ధాంతా న్ని భుజాన మోసుకొని హైదరాబాద్ నగరంపై తిరిగి అడ్డా భిఠాయించాలని, అందుకు గ్రేటర్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని వారు తాపత్రయ పడుతున్నారు. వలసవాదులకు సద్దులు మోసే దళారీలను డబ్బు సంచులతో సమాయత్తం చేస్తున్నారు. విభజన సమయంలో హైదరాబాద్ నగరాన్ని మనకు దక్కకుండా చేయడానికి వారు చేసిన కుట్రలు, లేవనెత్తిన కిరికిరిలు మనకు తెలియనివి కావు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని హైదరాబా ద్‌ను దక్కించుకున్నాం. అయితే అరవై ఎళ్లుగా వలసవాదులకు ఆర్థిక, రాజకీయ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరం ఇంకా సంపూర్ణంగా విముక్తం కాలేదు అన్న సంగతిని మరువజాలం.

హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల విలీనంతో పుట్టిన రాజధాని కాదు. అది కుతుబ్‌షాహీలు ఏలిన గోల్కొండ రాజ్యానికి, ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యా న్ని ఏలిన ఆసఫ్‌జాహీలకూ రాజధానిగా ఉన్నది. 1948లో భారత దేశంలో విలినమైన తర్వాత 1956 అక్టోబర్ 31 దాకా హైదరాబాద్ రాష్ర్టానికి రాజధాని గా ఉన్నది. తెలంగాణ రాజధానియే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యిందే తప్ప విలీనం అనంతరం మాత్రమే హైదరాబాద్ నగరం రాజధానిగా మారలేదు. ఇప్పుడు విభజన అనంతరం కూడా తెలంగాణకు రాజధానిగా ఉన్నది. హైదరాబాద్ నగరంపై పాలనాధికారం తెలంగాణ ప్రజలదే.

హైదరాబాద్ నగరాన్ని తామే అభివృద్ధి చేశామనే వలసవాదుల వాదనను మనం గతంలోనే సమర్థవంతంగా తిప్పికొట్టినం. మళ్ళీ మననం చేసుకుందాం. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల విలీనం జరిగే నాటికే హైదరాబాద్ సకల సౌకర్యాల తో సర్వాంగ సుందర నగరంగా పెరిగి ఉన్నది. వారు వచ్చే నాటికే ఎన్నెన్నో జాతు ల, రాష్ర్టాల ప్రజలు హైదరాబాద్ నగరానికి వచ్చి బతుకుదెరువు వెతుక్కున్నారు. ఆ నాటికే హైదరాబాద్ నగరం ఒక కాస్మోపాలిటన్ నగరంగా మినీ ఇండియాగా పేరుగాంచింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పైసలు ఉన్నవాళ్లు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపించారు.

హైదరాబాద్ నగరం వారు రాక ముందే హోల్ సేల్, రీటైల్ వ్యాపారానికి దక్షిణ భారత దేశంలోనే పేరెన్నికగన్న కేంద్రంగా అభివృద్ధి చెంది ఉన్నది. హైదరాబాద్ రాజ్యానికి పన్నుల రూపేణా అధికాదాయాన్ని ఆర్జించి పెట్టే నగరంగా ఉన్నది. హైదరాబాద్ నగరంలో నిజాం ప్రభుత్వం స్థాపించిన విద్యా సంస్థలు, జనరల్, స్పెషాలిటీ ఆస్పత్రులు, పరిశ్రమ లు, గ్రంథాలయాలు, మంచినీటి జలాశయాలు, సిమెంట్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, భవనాలు అన్నీ ఉన్నాయి. వారు రాకముందే హైదరాబాద్ రాష్ర్టానికి నిజాం రాజ్యం నుంచి సంక్రమించిన లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు న్నాయి. అప్పటికే హైదరాబాద్ దేశంలోనే ఐదవ పెద్ద నగరంగా ఉన్నది. తనకు తాను మరింత పెరిగే అంతర్గత శక్తిని కలిగి ఉన్నది. అభివృద్ధి చెందిన నగరానికి వచ్చి పెట్టుబడులు పెట్టి లాభాలు గడించి సీమాంధ్రులు కోట్లకు పడగలెత్తినారు. వారి అభివృద్ధినే హైదరాబాద్ అభివృద్ధిగా చేప్పుకోవడం విడ్డూరం.

పెట్టుబడిదారుల, వ్యాపారస్థుల స్వభావానికి సంబంధించి ఒక ప్రాథమిక విషయం ఎమిటంటే పెట్టుబడిదారుడు ఎక్కడ లాభాలు వస్తయో అక్కడనే పెట్టుబడి పెడతాడు తప్ప ఒక నగరాన్నో , ఒక ప్రాంతన్నో అభివృద్ధి చేసే లక్ష్యంతో పెట్టుబడులు పెట్టడు. ఏ ప్రాంత పెట్టుబడిదారుడు అయినా అంతే. ఆంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్ నగరంలో ఎందుకు పెట్టుబడులు పెట్టినారు? విజయవాడ లో,రాజమండ్రి, కడప, విశాఖలో, తిరుపతిలో ఇంకా ఇతర పట్టణాలలో పెట్టుబడులు పెడితే ఆ ప్రాంతం పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరిగేది కదా!

అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగేవి కదా! ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులకు అక్కడి పట్టణాల మీద కాక హైదరాబాద్ మీదనే ఇంత ప్రేమ ఎందుకో! ఎందుకంటే వారు లాభాలను కోరుకునే పెట్టుబడిదారులు కనుకనే లాభాలను సంపాదించి పెట్టే హైదరాబాద్‌లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో పెడతారు కానీ లాభాలను ఆర్జించి పెట్టని సీమాంధ్ర పట్టణాలలో కాదు. కాబట్టి చంద్రబాబు గాని ఇతరులు ఎవరైనా మేం వచ్చినాకనే హైదరాబాద్ అభివృద్ధి అయ్యింది, మేమే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో చేర్చామని, మేము వచ్చాకే మీరు చదవడం, రాయడం, తిండి తినడం, వ్యవసాయం చెయ్యడం, కవిత్వం రాయడం నేర్చుకున్నారని అంటూ విభజన అనంతరం కూడా వారి అహంకారాన్ని బయట పెట్టుకోవడం మనం ఎట్లా భరించగలం ?

హైదరాబాద్ రాష్ర్టానికి నిజాం నుంచి సంక్రమించిన లక్షల ఎకరాల సర్ఫేఖాస్ భూములు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయి? వారు రాక ముందు హైదరాబాద్ లో, నగరం చుట్టుపక్కల ఉన్న 2500 చెరువులు ఎవరి ధన దాహానికి హాంఫట్ అయ్యాయి ? హైదరాబాద్ సమశీతోష్ణ వాతావరణానికి కారణమైన వనాలు (భాగ్‌లు) ఏమయ్యాయి ? ఒకప్పుడు పేద ప్రజలకు అందుబాటులో ఉన్న జనర ల్, స్పెషాలిటీ ఆస్పత్రులు ఎవరి లాభాపేక్షకు బలయ్యాయి. సీమాంధ్ర పెట్టుబడి బలం ముందు నిలబడలేక స్థానిక విద్యా, వ్యాపార సంస్థలు చతికిలపడిపోయిన సంగతి అబద్ధమా? హైదరాబాద్‌లో ఇప్పుడు వ్యాపార, విద్యా, వైద్య, వినో దం, మీడియా రంగాల్లో ఎవరి అధిప త్యం నడుస్తున్నది? ఈ ఆధిపత్యం అం తా రాజ్యాధికారం నుంచి వచ్చింది. తెలంగాణ విడిపోతే హైదరాబాద్‌పై అధికా రం తెలంగాణకు దక్కితే నగరంలో జమాయించి పెట్టుకున్న ఈ అధిపత్యానికి తె ర పడుతుంది. కనుకనే సమైక్య రాష్ట్రం కొనసాగాలి.

లేని పక్షంలో హైదరాబాద్ పై న తెలంగాణకు అధికారం ఉండవద్దు. తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటం ఫలితంగా హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అయితే గ్రేటర్ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంపై తమ అధికారాన్ని స్థిరపర్చుకునేందుకు వలసవాదులు మన మీదకు మోపవుతున్నారు. ఈ గతాన్ని గుర్తుంచుకొని మన వర్తమానాన్ని నిర్మించుకోవాలి. తెలంగాణలో వలసవాద వ్యతిరేక పోరాటం ఇంకా మిగియలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను వలసవాద వ్యతిరేక పోరాటంలో భాగంగానే చూడాలి. అరవై ఏండ్లుగా వలసవాద కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని విముక్తం చెయ్యాలి. హైదరాబాద్ నగరాన్ని తిరిగి వలసవాదుల పరం చెయ్యడానికి సిద్ధమవుతున్న దళారుల నడ్డి విరగ్గొట్టాల్సి ఉన్నది.

హైదరాబాద్ అంటే వారికి ఒక వనరు. హైదరాబాద్ అంటే వారికి కోట్లకు పడగలెత్తించే భూమి, ఉద్యోగాలు కల్పించే ఒక ఆఫీసు, వ్యాపారం చేసుకోవడానికి పనికివచ్చే ఒక అంగడి. తెలంగాణ వారికి హైదరాబాద్ అంటే అత్మ గౌరవం, గుండె చప్పుడు, శ్వాస, వారసత్వ సంపద, ఐదు వందల ఏండ్ల పేగు బంధం, సాంసృతిక, మేధో వికాస కేంద్రం. హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద్ధమేనని మరొక్కసారి నిరూపించాలి. ఉద్య మ కాలంలో మన నినాదం హైదరాబాద్ కోసం మనం-మన కోసం హైదరాబాద్. ధ్వంసమైన హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా నిర్మించుకుందాం.

1552

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర