పాలనను ప్రతిఫలించిన ఫలితం


Sat,November 28, 2015 01:37 AM

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ
ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వలసాధిపత్యాన్ని తెలంగాణలో అంతం చేయడం
ఏకకాలంలో జరగాల్సిన పనులు. ఆ సోయి తెలంగాణ ప్రజలకు, ఉద్యమ శ్రేణులకు ఉన్నదని ఉప ఎన్నిక నిరూపించింది.. ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్పా తమ అభివృద్ధి సాధ్యం కాదన్న జనరల్ అవగాహన కూడా
వలసవాద వ్యతిరేక అవగాహనగానే పరిగణించినప్పుడు, తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని తన పని తాను
చేసుకోకుండా అడ్డుకుంటున్న ప్రయత్నాలను వమ్ము చేయడం కూడా వలసవాద వ్యతిరేక
అవగాహనగానే పరిగణించాల్సి ఉంటుంది.

pande


వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు రాకముందు పాలక పార్టీకి ఓటమి తప్పదని, గెలిచినా మెజార్టీ వేలల్లోనే ఉంటుందన్నారు. 18 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్రంగా వ్యతిరేకత వచ్చిందని విశ్లే షించినవారు ఫలితాల అనంతరం ఈ ఫలితం ముం దు ఊహించిందే అంటున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకపోవడంలో విఫలమయ్యాయని మరికొందరి విశ్లేషణ. ఏదేమైనా ప్రభు త్వంపై ప్రజలకు వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని, అది ఉప ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని ఆశించినవారు భంగపడక తప్పలేదు. తమ ఆశలకు అనుగుణంగా ప్రభు త్వ వ్యతిరేక పత్రికలు సృష్టించిన వ్యతిరేక వాతావర ణం వారిని ఆ రకమైన భ్రాంతిలో కూరుకుపోయేలా చేసి ఉండవచ్చు. అయితే ఉద్యమ సందర్భంలో 2006లో జరిగిన కరీంనగర్ ఉపఎన్నికను, ఉద్యమానంతరం 2014లో వరంగల్ ఉప ఎన్నికను తులనాత్మకంగా విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను సొమ్ముచేసుకొని అధికారం చేపట్టిన వైఎ స్సార్ తన నిజస్వరూపాన్ని చాటుకుంటున్న సమయమది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆకర్షించి ఉద్యమ పార్టీని బలహీనపరచి తద్వారా ఉద్యమాన్ని అణగదొక్కాలని కుట్రలు జరిపిన కాలం. యూపీఏ ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని చేర్చింది. కేసీఆర్, నరేంద్రలు కేంద్ర మంత్రివర్గంలో చేరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. అయితే వైఎస్సార్ ఒత్తిడి కారణంగా కేంద్రం తన ఎజెండా అంశమైన తెలంగాణ ఏర్పాటును తాత్సారం చేయడానికి ప్రణబ్ కమిటీని వేసింది. జయశంకర్ సార్ కేసీఆర్‌తో కలిసి 36 పార్లమెంటరీ రాజకీయ పార్టీల నుంచి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు సంపాదించి ముఖర్జీకి సమర్పించారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటిస్తారే తప్పా నిర్ణయం మాత్రం తీసుకోలేదు.

2006 మార్చ్‌లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్లీనరీ జరిగింది. ఆ ప్లీనరీలో ఉన్నపలంగా ఇవ్వడానికి తెలంగాణ ఇన్‌స్టంట్ కాఫీ కాదు. తెలంగాణపై ఏకాభిప్రా యం కుదరలేదని ప్రణబ్ ప్రకటించి ఇప్పట్లో తెలంగాణ ఇవ్వలేమని కాంగ్రెస్ ఉద్దేశ్యాన్ని పరోక్షంగా ప్రకటించారు. రాష్ట్రంలో వైఎస్ అభివృద్ధి మంత్రాన్ని జపించడం ఉధృతం చేశాడు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాబోతున్నామని అధిష్ఠానాన్ని నమ్మిస్తున్నాడు. తెలంగాణలో ఎంత సెంటిమెంటు ఉన్నాకోస్తా, రాయలసీమలో మెజారిటీ సీట్లు, తెలంగాణలో జిల్లాకు కనీసం రెండు సీట్లు గెలుచుకొని ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని నమ్మబలుకుతున్నాడు. ఇప్పుడు గనుక తెలంగాణ ఇస్తే కాం గ్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా అవుతుందని అధిష్ఠానాన్ని హెచ్చరించాడు. ఆ రోజుల్లో వైఎస్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ టర్మ్‌లో తెలంగాణ సాధ్యం కాదన్నాడు. సోనియా నిర్ణయమే శిరోధార్యం అని చెప్పుకొచ్చిన వైఎస్ సోనియా ఏమైనా సామ్రాగ్నియా? ఆమెకూ పరిమితులుంటాయని సెలవిచ్చా డు. అంటే అప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చే అవకా శం లేదని స్పష్టంగా తేలిపోయింది.

ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగిపోయి ఉద్యమం ద్వారా కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచాలనే నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ మంత్రి పదవికి రాజీనా మా చేశాడు. మంత్రి పదవికి రాజీనామా చేస్తే సరిపో దు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి తిరిగి గెలువాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. కేసీఆర్‌ను ఓడించి మొత్తం ఉద్యమాన్ని అణగదొక్కాలనేది కాంగ్రెస్ వ్యూహం. సవాల్‌ను స్వీక రించిన కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజాతీర్పును కోరేందుకు సిద్ధమయ్యాడు.

ఈ నేపథ్యంలో కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నిక వచ్చింది. తెలంగాణ సమాజం కేసీఆర్ గెలుపు కోసం తమ శక్తిని ధారపోసింది. కరీంనగర్ ఉప ఎన్నిక ఫలి తం తెలంగాణ ఉద్యమానికి గొప్ప విశ్వాసాన్ని కలుగజేసింది. అత్యంత రాజకీయ విజ్ఞతను ప్రదర్శించి ప్రజలు తెలంగాణ రాష్ట్ర అకాంక్షను వెల్లడించారు. తెలంగాణ ఉద్యమాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేద్దామనే వలసవాదుల కుట్రను పసిగట్టిన కరీంనగర్ ప్రజలు కేసీఆర్‌ను రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిపించారు.

అందుకే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా గ్రామాలు తిరిగి ప్రజలతో మాట్లాడి ఒక ఉమ్మడి తీర్పు రావటానికి దోహదం చేశారు. ఉప ఎన్నికకు ముందు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల పట్టణాల్లో గద్దర్ సహా తెలంగాణ కళాకారులు నిర్వహించిన ధూంధాంలకు ప్రజాదరణ లభించింది. ఆ తర్వా త ఎన్నికల ప్రచారంలో ప్రజలను సమీకరించడంలో, ప్రజలను ఉత్తేజపర్చడంలో కళాప్రదర్శనలు నిర్వహించిన పాత్ర ప్రభావశీలమైనది. తెలంగాణ సమస్యను అభివృద్ధి సమస్యగా కుదించి రాష్ట్ర ఆకాంక్షను చిదిమే సే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారు. ఇది ఉద్యమ సమయంలో జరిగిన ఉపఎన్నిక.

ఇక వరంగల్ ఉపఎన్నిక విషయాన్ని పరిశీలిద్దాం. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత వచ్చిన ఉప ఎన్నిక ఇది. అంతకు ముందు కేసీఆర్ మెదక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసినప్పుడు జరిగిన ఉపఎన్నిక లాంఛనంగానే జరిగింది. అప్పుడు టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయంపై ఎవరికీ అనుమానాల్లే వు. ఊహించిందే జరిగింది. వరంగల్ ఉప ఎన్నిక అటు పాలకపక్షంలో ఇటు ప్రతిపక్షంలో తీవ్ర ఉత్కంఠను రేపింది. ప్రభుత్వం 18 నెలల కాలంలో అనేక అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేసిం ది. వాటి మంచిచెడ్డలు విశ్లేషించుకునే వెసులుబాటు ప్రతిపక్షాలకు ఉన్నది. ప్రభుత్వం తీసుకునే ప్రతీ పథకాన్ని విమర్శించడం ప్రతిపక్షాలకు మామూలే.

అయి తే ఆ విమర్శలు ఎంత నిర్మాణాత్మకంగా ఉంటున్నాయని ప్రజలు గమనిస్తారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న ఉద్యమపార్టీ ఓడిపోయి తమకు సద్దులు మోసే పార్టీ లు గెలువాలని వలసవాదులు ఆశించారు. తెలంగాణలో వలసవాదం బలహీన పడకుండా తమ పట్టును బిగించాలనుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక, వలసవాద ప్రయోజనాలకు వంతపాడే పత్రికలు ఎటువంటి కృత్రిమ వాతావరణాన్ని సృష్టించాయంటే టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలే తమ పార్టీ మెజారిటీ వేలల్లో నే ఉంటుందని నమ్మే స్థితిలోకి నెట్టబడ్డాయి. ప్రచారానికి వెళ్లిన మంత్రులను రోజూ నిలదీస్తున్న సంఘటనలు జరుగుతున్నాయంటూ పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురించాయి. పత్తి రైతుల్లో, ఆసరా పింఛన్‌దారు ల్లో, ఉద్యోగుల్లో, విద్యార్థి యువతలో తెలంగాణ తొలి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ప్రబలిందని ప్రచారం చేశాయి. తెలంగాణలోని కొంతమంది ఉద్యమ శ్రేణు ల్లో నెలకొన్న అసంతృప్తి ప్రజలకు ఆపాదించడం వల్ల పాలక పార్టీ ఓడిపోయేంత లేదా గెలిచినా మెజారిటీ వేలల్లోనే ఉంటుందన్న తప్పుడు అంచనాలకు వచ్చా రని భావించవలసి ఉంటుంది.

అయితే వరంగల్ ప్రజలు, ఉద్యమ శ్రేణులు వీరి ఆకాంక్షలకు భిన్నంగా తీర్పును ప్రకటించారు. సరిగ్గా కరీంనగర్ ప్రజలిచ్చిన తీర్పు వంటిదే మరింత బలం గా వ్యక్తం చేశారు. నాడు తెలంగాణ సమాజమంతా ఎన్నికల్లో పాల్గొన్నది. నేడు అటువంటి పరిస్థితి లేదు. ఉద్యమ శ్రేణులది పరోక్ష మద్దతే. మొత్తం భారమం తా పార్టీ నాయకులు, కార్యకర్తలే మోశారు. నాడు వలసవాదుల కుట్రలను కరీంనగర్ ప్రజలు భగ్నం చేసిన తీరుగానే ఇప్పుడు వలసవాదులు, వారికి సద్దు లు మోసే దళారీల కుట్రలను వరంగల్ ప్రజలు చిత్తు చేశారు. తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వలసాధిపత్యాన్ని తెలంగాణలో అంతం చేయడం ఏకకాలంలో జరగాల్సిన పనులు. ఆ సోయి తెలంగాణ ప్రజలకు, ఉద్యమ శ్రేణులకు ఉన్నదని ఉప ఎన్నిక నిరూపించింది. ఇంత విస్తృతార్థంలో ఉప ఎన్నికను విశ్లేశించవచ్చునా? అన్న ప్రశ్నవేసే వాళ్లుం టారు.

వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఈ ప్రజలే. ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్పా తమ అభివృద్ధి సాధ్యం కాదన్న జనరల్ అవగాహన కూడా వలసవా ద వ్యతిరేక అవగాహనగానే పరిగణించినప్పుడు, తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని తన పని తాను చేసుకోకుండా అడ్డుకుంటున్న ప్రయత్నాలను వమ్ము చేయడం కూడా వలసవాద వ్యతిరేక అవగాహనగానే పరిగణించాల్సి ఉంటుంది. ప్రజల్లో అసంతృప్తి లేనేలేదా? అంటే ఉండవచ్చు. ఉంటది కూడా. అది ఓడించేంత బలమైనదా? అన్నది ప్రశ్న. వరంగల్ ప్రజలు ఇప్పు డు నడుస్తున్న అభివృద్ధి క్రమం ఎటువంటి అడ్డంకు లు లేకుండా నడువాలని కోరుకున్నారు. మరి ఇంత భారీ మెజారిటీ దేనికి సంకేతం? రికార్డు మెజారిటీతో వలసవాదులకు, వారికి సద్దులు మోసే దళారీలకు ఖబడ్దార్ అని హెచ్చరికలు పంపినట్లయింది.

1165

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Featured Articles