కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు


Thu,July 9, 2015 01:50 AM

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మంత్రి హరీ ష్‌రావుగారు మహారాష్ట్ర సాగునీటి మంత్రితో జూలై, 2014లో సమావేశమై లెండి, పెన్ గంగా, ప్రాణహిత వివాదాలపై చర్చ జరిపారు. వారు అప్పుడు కూడా ముంపును తగ్గించడానికి
తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును తగ్గించమని కోరారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి స్వయంగా ఫిబ్రవరి, 2015లో ముంబయి వెళ్లి మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఆయన 160 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోవచ్చుననీ, అందుకు తమకు అభ్యంతరం లేదని అయితే తమ భూభాగంలో ముంపును ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన తీరని అన్యాయంపై చాలా చర్చ జరిగింది. అప్పటి అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారు సాధికారికంగా పలుమార్లు ప్రసంగించారు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్.విద్యాసాగరరావు తదితరులు కూడా ఈ విషయాలపై ప్రసంగాలు చేశారు. పత్రికల్లో వ్యాసాలు రాశారు. పుస్తకాలు ప్రచురించారు. ఉద్య మం సృష్టించిన ఒత్తిడి ఫలితంగా నాటి వైఎస్ ప్రభు త్వం ప్రాణహిత నది నుంచి 160 టీఎంసీల నీటిని తరలించే ప్రాణహిత -చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. నిప్పుల మీద నీళ్లు చల్లినట్లు ఉద్య మం ఒత్తిడి నుంచి తప్పించుకునే ఉద్దేశమే తప్ప నిజం గా తెలంగాణ బీడు భూములకు నీరందించే చిత్తశుద్ధి నాటి ప్రభుత్వానికి లేదు.ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల గురించి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం గురించి కూడా ఉద్యమంలో చాలా చర్చ జరిగింది. బ్యారేజీ ప్రతిపాదన లేకుండా కాలువలు తవ్వడం, కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్సులుగా చెల్లించడం అది వేరేకథ.

pande


అది అందరికీ తెలిసిందే. ప్రజాపోరాటం ఫలించి తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సాగునీటి శాఖామంత్రి హరీశ్‌రావు గారు, ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్.విద్యాసాగరరావు, సాగునీటి శాఖలో పని చేస్తున్న ఇంజినీర్లు, ఇతర సాగునీటి రంగ నిపుణుల భాగస్వామ్యంతో తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి కల్పనకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఈ క్రమంలోనే తీవ్రమైన మేధోమథనం తర్వాత పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం రూపొందించి వాటికి ఇటీవలే శంఖుస్థాపన చేసి పను లు ప్రారంభించారు. కొత్త పథకాలను రూపొందించడంతోపాటు పాత పథకాలను తెలంగాణ కోణంలో నుంచి సమీక్షించి వాటిలోని లోటుపాట్లను సవరించి మరింత మెరుగైన ప్రతిపాదనలను సిద్ధంచేసే పనిలో నిమగ్నమైంది.

అందులోభాగంగానే ప్రాణహిత చేవెళ్ళ పథకాన్ని సమీక్షించి, అంతరాష్ట్ర వివాదాలు లేకుం డా, ముంపు అసలు లేని, రెట్టింపు నిల్వ సామర్థ్యం, నీటి లభ్యత ఎక్కువ రోజులు ఉండే విధంగా మార్పు లు చేయడం జరిగింది. అందులో భాగమే తుమ్మిడిహట్టి బ్యారేజీకి అదనంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజీ ప్రతిపాదన చేయ డం జరిగింది. అయితే కొంతమంది అవగాహన లేమి కారణంగా, లేక ఉద్దేశపూరితంగా పదే పదే కొన్ని అపోహలను ప్రచారంలో పెడుతున్నారు.

ఈ గందరగోళ వాతావరణంలో ఆదిలాబాద్ నుంచి రైతు సంఘాలు, ప్రజాసంఘాలు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి సాగునీటి సలహాదారు ఆర్.విద్యాసాగరరా వును సంప్రదించారు. ఆయన ప్రాణహిత ప్రాజెక్టు మార్పులపై సమగ్ర సమాచారాన్ని వారికి తెలియజేశారు. వారి వివరణతో ప్రాణహిత ప్రాజెక్టులో చేసిన మార్పుల హేతుబద్ధతను అర్థం చేసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే విస్తృత ప్రజా బాహుళ్యానికి ఈ అపోహలను దూరం చేసి స్పష్టతను అందించాల ని మీకు ఈ వివరాలను అందిస్తున్నాం.

అపోహ-1: తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరానికి మార్చినందువల్ల అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణహిత నీరు ఒక్క చుక్క కూడా దక్కదు. జిల్లాలోని రైతులు ఇతర వర్గాలతో పాటు జిల్లా మొత్తానికి తీరని నష్టం జరుగుతుంది.

వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. అవగాహనా రాహిత్యం. ప్రస్తుతం తుమ్మిడిహట్టి బ్యారేజీ స్కీంలో ఆదిలాబాద్ తూర్పు జిల్లాకు 56,500 ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రణాళిక రూపొందించా రు. తుమ్మిడిహట్టి నుంచి బ్యారేజీని తరలించే ఆలోచ న ప్రభుత్వానికి లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి వారి అంగీకారం లేకుండా ముంపు లేనటువం టి బ్యారేజీని తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించి ఆదిలాబా ద్ తూర్పు జిల్లాలో గతంలో నిర్దేశించిన 56,500 ఎకరాలతో పాటు మరో లక్ష ఎకరాలకు కూడా సాగు నీరిచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఆదిలాబాద్ పశ్చిమ జిల్లాలో ఉన్న లక్ష ఎకరాలకు ఎస్సారెస్పీ నుంచి గతంలో ప్రతిపాదించినట్లుగానే నీరు సరఫరా అవుతుంది. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాకు 2,50,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాకు ఎటువంటి నష్టం జరుగకపోగా అదనంగా లక్ష ఎకరాలకు నీరందించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

అపోహ-2: తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కడితే మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది. కాబట్టి కాళేశ్వరానికి మార్చుతున్నామని ప్రభుత్వం చెబుతున్నది. ఇది పూర్తిగా అసంబద్ధ వాదన.
వాస్తవం: నిజానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలో ఉన్నపుడే అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ అనుమతి లేకుండా కనీసం తమతో సంప్రదించకుండా ఏకపక్షంగా 152 మీ FRL వద్ద తుమ్మిడిహట్టి బ్యారేజీని ప్రతిపాదించి ఆ ప్రకారం కాల్వల తవ్వకం చేపట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్టోబర్, 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రాజెక్టుపై పెట్టే ఖర్చంతా వృథా అవుతుందని పేర్కొన్నారు. కానీ అప్పటి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభు త్వం ఆయన హెచ్చరికలను బేఖాతరు చేసి ప్రాజెక్టు పనులను కొనసాగించింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నా లు మొదలుపెట్టింది. తొలుత సాగునీటి మంత్రి హరీ ష్‌రావుగారు మహారాష్ట్ర సాగునీటి మంత్రితో జూలై, 2014లో సమావేశమై లెండి, పెన్ గంగా, ప్రాణహిత వివాదాలపై చర్చ జరిపారు. వారు అప్పుడు కూడా ముంపును తగ్గించడానికి తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును తగ్గించమని కోరారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి స్వయంగా ఫిబ్రవరి, 2015లో ముంబయి వెళ్లి మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఆయన 160 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోవచ్చుననీ, అందుకు తమకు అభ్యంతరం లేదని అయితే తమ భూభాగంలో ముంపును ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

దీనికితోడు CWC హైడ్రోలోజీ డైరెక్టొరేట్ వారు తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వం ప్రతిపాదించిన 160 టీఎంసీల తరలింపు సాధ్యం కాదని చెప్పింది. 120 టీఎంసీల తరలింపు మాత్రమే సాధ్యమవుతుందని లెక్కించారు. 160 టీఎంసీల తరలింపుకు ప్రాజెక్టును డిజైన్ చేసి పనులను ప్రారంభించినందువల్ల160 టీఎంసీలు తరలింపు సాధ్యమయ్యే ప్రాంతంలో కొత్త బ్యారేజీ ప్రతిపాదించడం ప్రభుత్వానికి అనివార్యమైం ది. అది గోదావరి నదిపై కాళేశ్వరానికి 20 కిమీ దిగువన మేడిగడ్డ వద్ద సాధ్యమవుతుందని WAPCOS ప్రాథమిక అధ్యయనంలో తేలింది.

అపోహ-3: తుమ్మిడిహట్టి వద్ద తక్కువ ఖర్చుతో బ్యారేజీ నిర్మాణం పూర్తి అయ్యేది. కాళేశ్వరం వద్ద ఖర్చు ఎక్కువ. విద్యుత్ వినియోగం ఎక్కువ. పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి ప్రమాదం.వాస్తవం: సాంకేతిక అంశాలు తెలువకుండా మిడిమిడి జ్ఞానంతో చేస్తున్న విమర్శ ఇది. తుమ్మిడిహట్టి దగ్గర కాంక్రీట్ బ్యారేజీ పొడవు ఎక్కువ. బ్యారేజీ నిలువ సామర్థ్యం 5 టీఎంసీలు మాత్రమే. ముంపు ఎక్కువ. నీటి తరలింపు సాధ్యమయ్యే దినాలు 77 మాత్రమే. 2008 రేట్ల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ విలువ సుమారు 1100 కోట్లు. ఇప్పటి రేట్లతో దాని విలువ అంచనా కడితే దాదాపుగా 1900 కోట్లు.

మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఇప్పటి రేట్లతో అంచనా విలువ దాదాపు 1800 కోట్లు. ముంపు అసలు లేదు. నిలువ సామర్థ్యం 10 టీఎంసీలు. నీటి తరలింపు సాధ్యమయ్యే దినాలు 120 కంటే ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి నిర్దేశిత డిశ్చార్జీని ఎక్కువ రోజులు పంప్ చేసుకోగలుగుతాం. కాబట్టి విద్యుత్ వినియో గం తగ్గుతుంది. దీన్నిబట్టి మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మా ణం వల్ల ముంపు రీత్యా, పర్యావరణ అనుమతుల రీత్యా, ఖర్చు రీత్యా, విద్యుత్ వినియోగం రీత్యా అనువైన ప్రదేశం. పుణ్యక్షేత్రానికి 20 కిమీ దిగువన ఉన్నందువల్ల కాళేశ్వరానికి ముప్పులేదు.

అపోహ-4: ఆదిలాబాద్ జిల్లాలో ఐదు వేల కోట్ల తో నిర్మించిన కాలువలు, భూమి, ప్రజాధనం బూడిదపాలు అవుతుంది.
వాస్తవం: ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఐదు ప్యాకేజీలలో కాలువల నిర్మాణం కోసం వెచ్చించిన ధనం 1500 కోట్లు మాత్రమే. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనని ప్రభుత్వం రద్దు చేయలేదు. కనుక నిర్మించిన కాలువలను యథావిధిగా వినియోగంలోకి తీసుకువస్తాం. ఎల్లంపల్లి తర్వాత తదుపరి ప్యాకేజీలల్లో ఎటువంటి మార్పులు లేనందువల్ల ఖర్చు వృథా అన్న సమస్య ఉత్పన్నం కాదు.

అపోహ-5: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో సొరంగా మార్గాలెక్కువ, పొడవైన సొరంగాలు ప్రతిపాదించారు. సొరంగాలవల్ల అనార్థాలెక్కువ. సొరంగాలు తవ్వే టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్న బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసమే ప్రతిపాదించారు.
వాస్తవం: పాత ప్రతిపాదనలో తుమ్మిడిహట్టి నుం చి ఎల్లంపల్లి దాకా సొరంగ మార్గాల పొడవు 18కిమీ. వాప్కోస్ ప్రాథమిక నివేదిక ప్రకారం కొత్త ప్రతిపాదనలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు సొరంగమార్గాల పొడవు

కేవలం 7 కిమీ. మరి విమర్శకులు ఎవరిచ్చిన ఆధారాలతో విమర్శలు చేస్తున్నారో వారికే తెలియాలి. సొరంగాల తవ్వకం దేశంలో అన్ని ప్రాంతా ల్లో జరుగుతున్నదే. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి సొరంగాల తవ్వకాలలో అభివృద్ధి అయిన టెక్నాలజీని వాడుకోవడం అనివార్యం. అదే టన్నెల్ బోరింగ్ మషిన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ప్రస్తుతం రాష్ట్రంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు లో మాత్రమే వినియోగిస్తున్నాం. ప్రాణహిత ప్రాజెక్టు లో సొరంగాల తవ్వకాలున్నప్పటికీ అక్కడ TBM టెక్నాలజీ వినియోగించడం లేదు. మానవ శ్రమ ద్వారా బూమర్లను ఉపయోగించి సొరంగాల తవ్వకాలు జరుగుతున్నాయి. కాబట్టి TBMలను వాడే అవకాశమే లేనప్పుడు వారు ఆరోపిస్తున్నట్టు బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు ఏం కనబడ్డాయో వారే చెప్పాలి.

అపోహ-6: సొరంగ నిర్మాణ సమయంలో మిథే న్, హైడ్రోజెన్ సల్ఫైడ్, కార్బన్ డై ఆక్సైడ్, రాడాన్ లాం టి విష, అణుధార్మిక వాయువులు వెలువడుతాయి. సొరంగ నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బందికి పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. సొరంగ తవ్వకంలో వెలువడుతున్న ధూళి వల్ల సిలికోసిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.

వాస్తవం:మన రాష్ట్రంలో సొరంగ తవ్వకాలు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో టన్నెల్ బోరింగు మిషన్ ద్వారా సొరంగ తవ్వకం గత పదేళ్లుగా సాగుతున్నది. ఇప్పటికీ దాదాపు 25 కిమీ పొడవైన సొరంగం తవ్వా రు. వారు పేర్కొన్నట్లు ఈ వాయువులు వెలువడిన దాఖలాలు లేవు, ఎటువంటి ప్రాణనష్టం కానీ, పరిసర ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం కానీ నమోదు కాలేదు. సొరంగ తవ్వకం పనుల్లో పాల్గొంటున్న వారిలో సిలికోసిస్ వ్యాధి లక్షణాలు ఎవరిలో బయటపడలేదు. ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉద్దేశించిన విమర్శ తప్ప మరొకటి కాదు.

అపోహ-7: తుమ్మిడిహట్టి వద్ద వివాదం మహారా ష్ట్ర, తెలంగాణ రాష్ర్టాలకే పరిమితం. కాళేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివాదంలో భాగమవుతుంది. ప్రాజెక్టు గోదావరి రివర్ మేనేజ్ మెంటు బోర్డు పరిధిలోకి వెళుతుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలతో ప్రాజె క్టు పనులు ముందుకు సాగవు.

వాస్తవం: విభజన చట్టం పట్ల అవగాహన లేకుండా చేస్తున్న విమర్శ అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభ్యంతరాలు కొత్త ప్రాజెక్టులపై మాత్రమే వ్యక్తం చేయగలుగుతుంది తప్ప ఉమ్మడి రాష్ట్రం ప్రతిపాదించిన పాత ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కులేదు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రం ప్రతిపాదించిందే తప్ప కొత్తది కాదు. ఈ ప్రాజెక్టు నుంచి గోదావరి బేసిన్‌లో లభ్యమయ్యే నీటి నుంచి 160 టీఎంసీలు తరలించుకుంటాం. కాకపోతే ఒకేఒక మార్పు మేడిగడ్డ వద్ద బ్యారేజీ ప్రతిపాదన. మిగతా ప్రాజెక్టు డిజైన్‌లో ఎటువంటి మార్పులు లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యంతరాలకు అవకాశమే లేదు. విమర్శకులు లేని వివాదాలను సృష్టించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అపోహ-8: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మెదక్ జిల్లాకు నీటిని తరలించుకపోవడానికే ప్రతిపాదిస్తున్నారు.
ఇదొక అర్ధరహిత ఆరోపణ. వాస్తవానికి మెదక్ జిల్లాలోప్రతిపాదించిన ఆయకట్టు గత ప్రభుత్వం నిర్దేశించిదే. పాములపర్తి, తడకపల్లి జలాశయాలు ప్రతిపాదించడం సీడబ్ల్యూసీ సూచనల మేరకే జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం రూపొందించిన పథకం లో నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు లేవు.

160 టీఎంసీని తరలించి ఎక్కడ నిల్వచేస్తారు అని సీడ బ్ల్యూసీ ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానంగానే రెం డు జలాశయాలు ప్రతిపాదించడం జరిగింది. మొత్తం పథకంలో 7 జిల్లాలు 16.5 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఇందులో కరువు జిల్లా మెదక్‌ను కావాలని వేరు చేసి మాట్లాడటం కొంతమంది సంకుచిత త్వం తప్ప మరేమి కాదు. కనుక ఈ పథకంలో ఎటువంటి అపోహలకు తావే లేదని విజ్ఞులైన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గుర్తించాలని సవినయంగా కోరుతున్నాను.

1778

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర