‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు


Wed,November 12, 2014 03:22 AM

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూరు మన చెరువు కార్యక్రమం జయప్రదం కావడానికి దోహదం చేసినవారౌతారు.

నవంబరు5న స్వరాష్ట్రంలో తన తొలి బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. చిన్ననీటి వనరుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో 2000 కోట్లు కేటాయించింది. ఇది సాగునీటి రంగ చరిత్రలో ఎన్నడూ జరగనిది. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాగునీటి రంగానికి అత్యధికంగా 15000 కోట్లు కేటాయించిన సందర్భంలోనూ మైనర్ ఇరిగేషన్‌కు ఇంత కేటాయింపులు జరుగలేదు.

అనాది ఆధారాలైన చెరువుల పునరుద్ధరణ ఒక తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష. సమైక్య పాలనలో చెరువు తెలంగాణ ప్రజలకు ఒక పురా జ్ఞాపకంగా మారిపోయింది. ఈ పురా జ్ఞాపకం ఒక వాస్తవం కావాలని ప్రజలు ఉద్యమం సందర్భంగా కలగన్నారు. ఉద్య మ ఆకాంక్షలు తెలిసిన ముఖ్యమంత్రి ఆ కలను సాకారం చేయడానికి బలమైన సంకల్పం చేశారు. చెరువుల నిర్మాణంలో అత్యున్నత నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించి దక్కన్ పీఠభూమిలో నెలకొన్న అననుకూల భౌగోళిక పరిస్థితులను అనుకూలతగా మార్చుకొని సముద్రాలని తలపించే చెరువులను కాకతీయులు నిర్మించారు. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం అనితర సాధ్యంగా కొనసాగింది. తెలంగాణలో వ్యవసాయ విస్తరణకు బాటలు వేసిం ది.

ఎగువ భాగాన గ్రామాల పొందిక, లోతట్టులో వాగుపై వూరికి ఒక చెరువు, చెరువు కింద వ్యవసాయ విస్తరణ, వ్యవసాయం చుట్టూ స్వయం పోష క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామం స్వయం పోషకం కావడానికి ఒక సామాజిక వ్యవస్థ, చెరువు కేంద్రం గా సాంస్కతిక వికాసం ... ఇదంతా ఒక దానితో ఒకటి పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ముం దుకు సాగాయి. కాకతీయుల ఈ విజన్‌ను అనంతర కాలంలో దక్కన్‌ను పాలించిన రాజ వంశాలు కొనసాగించాయి. దేశంలో ఏరాష్ట్రంలో లేనన్ని చెరువులు తెలంగాణలో నిర్మాణం కావడానికి, కరువు కాటకాలు దరిజేరని పరిస్థితులు , జలవనరులతో అలరారిన తెలంగాణకు వేర్లు కాకతీయుల విజన్‌లో ఉన్నాయి. ఇవ్వాళ్ళ విధ్వంసం పాలైన చెరువుల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించుకోవడానికి తెలంగాణ సమాజం సమాయత్తం కావాలి. అదే విజన్ కాకతీయ. ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల పునరుద్ధరణకు పెట్టిన పేరు.

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా, వెంటనే ప్రయోజనం పొందే వర్గాలు రైతులు , వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొం మన వూరు మన చెరువు కార్యక్రమం జయప్ర దం కావడానికి దోహదం చేసినవారౌతారు. రైతులు ఏమి చెయ్యాలి అనేది కీలకమైన ప్రశ్న. చెరువుల్లో నుంచి తొలగించిన పూడిక మట్టిని తరలించుకపో యి తమ పొలాల్లో చల్లుకోవడం చెరువుల పునరుద్ధరణలో అత్యంత ప్రధానమైనది. చెరువుల పూడి క మట్టి విలువ రైతులకు తెలియనిది కాదు. గతంలో రైతులు ఏటా ఎడ్ల బండ్లలో తమకు కావల్సిన పూడిక మట్టిని తమ పొలాల్లోకి కొట్టుక పోయేవారు. వ్యవసాయ విప్లవం పేరుమీద రసాయనిక ఎరువుల రంగ ప్రవేశంతో సేంద్రీయ ఎరువుల వాడకం, పూడిక మట్టి వాడకం తగ్గిపోయింది. దాదాపు లేదనే చెప్పా లి. ఇప్పుడు వూళ్ళల్లో ఎడ్ల బండ్లు ఉన్న రైతు లు తక్కువ. ఏడ్ల బండ్లను ట్రాక్టర్లు ఆక్రమించినాయి.

నదులు, వాగులు మోసుక వచ్చే ఒండ్రు మట్టిలో అనేక పోషక విలువలు , తేమను ఎక్కువ కాలం నిలువరించే గుణం ఉన్నది. మానవుడు వ్యవసాయాన్ని కనిపెట్టిన తర్వాత ప్రాచీన నాగరికతలు నదీ తీర ప్రాంతాలలోనే విలసిల్లాయి. నైలు నది మోసు కు వచ్చిన ఒండ్రు మట్టి వల్ల నైలునదీ నాగరికత అభివద్ధిచెందింది. వేల ఏళ్లుగా నైలు నది ఈజిప్టు వ్యవసాయానికి ఆధారంగా ఉన్నది.

అట్లనే భారత్‌లో సింధు నదీలోయలో సింధు నాగరికత, ఇరాక్‌లో మొసపటోమియా నాగరికత, చైనాలో హోయాం గ్ హో నాగరికత. ఇట్లా ప్రపంచ వ్యాప్తంగా నదులు మోసుక వచ్చిన ఒండ్రుమట్టి వ్యవసాయాభివద్దికి, తద్వారా గొప్ప నాగరికతలు విలసిల్లడానికి దోహ దం చేసింది. మనదేశంలో గోదావరి, కష్ణ , కావేరి డెల్టా ప్రాంతాల్లో వ్యవసాయాభివద్ధికి నదులు మోసుక వచ్చిన ఈ ఒండ్రు మట్టియే కారణం.

చెరువులు రెండు విలువైన ప్రకతి వనరులని కాపాడే పని చేస్తున్నాయి. ఒకటి ఎక్కడ పడిన వాన నీటిని అక్కడనే ఒడిసి పట్టి అక్కడ ప్రకతి సమతుల్యతను కాపాడుతాయి. రెండోది పోషక విలువలు కలిగిన ఒండ్రు మట్టిని తిరిగి వినియోగించుకునేందుకు వీలుగా చెరువుల్లో నిలువ చేస్తున్నాయి. చెరువులే లేకపోయి ఉంటే నీరు, ఈ విలువైన ఒండ్రు మట్టి నదుల్లోకి , నదుల నుంచి సముద్రాలకి తరలిపోయేవి. అందుకే చెరువులు మన మెట్ట ప్రాంతాల మనుగడకు అధరువులుగా ఉన్నాయి. చెరువుల్లో పూడిక మట్టిని ఏండ్ల తరబడి తొలగించకపోవడం చేత చెరువుల నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.

తెలంగాణ రాష్ర్టానికి చెరువుల కింద గోదావరి , కష్ణ బేసిన్లలో మొత్తం 265 టీఎంసీల కేటాయింపులు ఉన్నా యి. ప్రస్తుతం మనం 90 టీఎంసీలకు మించి చెరువుల కింద నీటిని వాడుకోలేకపోతున్నాము. కారణం పూడిక. ముఖ్యమంత్రిగారు అనేకసార్లు ఉటంకించిన మాట గంగాళంలా ఉండే చెరువులు తాంబాళంలా మారినాయి. పూడికలు తీసి వాటిని తిరిగి గంగాళం లా మార్చాలి. గత నెలలో ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన చెరువుల సర్వేలో తెలంగాణ 10 జిల్లా ల్లో మొత్తం 46531 చెరువులు లెక్క తేలాయి. అందులో సుమారు 4000 గొలుసు కట్టు చెరువు లు ఉన్నట్టు తెలుస్తున్నది. వీటి కింద సుమారు 25 లక్షల ఎకరాల భూమి సాగులో ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ఏటా సుమారు 9300 చెరువుల ను పునరుద్ధరించాలని భావిస్తున్నది.

ఒండ్రుమట్టి మొక్కల పెరుగుదలకు అనుకూలమని రైతులకు వేల సంవత్సరాల అనుభవం ద్వారా తెలుసు. ఆ అనుభవంతోనే చెరువుల నుంచి మట్టిగొట్టుక పోయే సాంప్రదాయం తెలంగాణలో రైతులు అమలు పరిచేవారు.అందుకు ప్రభుత్వాలు ప్రోత్సహించి సహకరించేవి. అయితే ఆధునిక వ్యవసాయ పరిశోధనలు పూడిక మట్టిలోని పోషక విలువలు, పూడిక మట్టివల్ల ఒనగూరే ప్రయోజనాలను శాస్త్రీ యంగా పరిశోధించి నిర్ధారించాయి. హైదరాబాద్ లోని సెంట్రల్ రీసర్చ్ ఇన్సిటిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ ఎరియాస్ (CRIDA) సైంటిస్టులు పూడిక మట్టి పై పరిశోధనలు జరిపి అనేక ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించారు. చెరువు పూడిక మట్టి రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని సాధికారికంగా నిరూపించారు.

తగినంత పాళ్ళలో నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ , బోరాన్, సేంద్రీయ కార్బన్ పదార్థాలు, మొక్కల పెరుగుదలకు దోహ దం చేసే తదితర పోషకాలు పూడిక మట్టిలో ఉన్నాయని (చెరువు నుంచి చెరువుకు కొంత తేడాలు ఉన్నప్పటికీ ) వారు తమ పరిశోధన ల్లో తేల్చారు. రసాయనిక ఎరువుల్లో ఒకటో రెండో పోషకాలు మాత్ర మే ఉంటాయి. మిగతా వాటి కోసం మరో రసాయనిక ఎరువును కొనాలి. అయితే పూడిక మట్టిలో అన్ని పోషకాలు తగినంతపాళ్ళలో ఉంటాయి. పూడిక మట్టిలో ఉండే పోషకా లు ఈవిధంగా ఉన్న ట్టు CRIDA సంస్థ పరిశోధనలు తెలుపుతున్నాయి.

నేలలో తేమను నిలుపుకునే సామర్థ్యం 47 రోజులకు పెరిగింది. అంటే పంటకు నీటి తడి ఇవ్వాల్సిన కాలం పెరిగింది. ఒక చదరపు మీటరుకు మొక్కల సంఖ్య పెరిగింది, మొక్కల ఎత్తు పెరిగింది. హెక్టారు కు 2500- 3750 రూపాయల వరకు రసాయనిక ఎరువుల వాడకం తగ్గినందు వల్ల ఆదా అయ్యింది.

మక్క జొన్న పంట దిగుబడి హెక్టారుకు 700 కిలో లు పెరిగింది. పత్తి పంట దిగుబడి హెక్టారుకు 1000 కిలోలు పెరిగింది. పూడికమట్టిని తిరిగి పొలాల్లోకి రీసైకిల్ చేయడం వల్ల ఖర్చులు లాభాల నిష్పత్తి 1:1.44 ఉన్నట్లువారి పరిశోధనలు తెలుపుతున్నా యి. మట్టిలో పోషక విలువలు పెరిగి దాని ఉత్పత్తి , తేమ ను నిలుపుకునే సామర్థ్యం పెరిగినట్టు రైతులు అంగీకరించినట్టు వారు వెల్లడించటం విశేషం. తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల్లో జరిగిన పరిశోధనల్లో ఇవే ఫలితాలు వెలువడ్డాయి. పూడిక మట్టి ని ట్రాక్టర్ల ద్వారా తరలించడానికి UPNRM (Umbrella Program on Natural Resources Manage ment) లో భాగంగా 2010, 2011 లో నాబార్డ్ వారు తమిళనాడు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో 275 మంది రైతులకు 40 లక్షల రూపాయలను 12 శాతం వడ్డీకి 36 నెలల్లో తీర్చే విధంగా రుణాలు పంపిణీ చేసినట్లు తెలుస్తున్నది. ట్రాక్టర్లను ఉపయోగించి పూడిక మట్టి ని తరలించడానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువేమీ కాదు. ఆ ఖర్చు సుమారుగా 20,000 లకు మించదు.

రైతులు సిద్ధపడితే నాబార్డ్ , తెలంగాణ గ్రామీణ బ్యాంకులు , కోపరేటివ్ బ్యాంకులు, వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు సాఫ్ట్ రుణ సౌకర్యం కలిపించే అవకాశం ఉంటే పరిశీలించాలి. వ్యవసాయ శాఖ, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పూడిక మట్టి సారాన్ని పరీక్షించి రైతులకు వాటి వాడకం వల్ల ఒనగూరే ప్రయోజనాలను రైతులకు వివరించి పూడిక మట్టిని తీసుకపోవడానికి ప్రొత్సహించాలి. వారూ తమ వ్యవసాయ భూములకు ఈ పూడిక మట్టిని వాడి ప్రయోగాత్మకంగా వివిధ పంటలపై ఫలితాలను ప్రజలకు వెల్లడించాలి.
పూడిక మట్టిని తరలించుపోయే వాహనాలపై రవాణశాఖ , రెవెన్యూ అధికారుల నుంచి వేధింపు లు ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న కార్యక్రమం కనుక అన్ని శాఖలు తమ సహకారాన్ని అందించాలి. పూడికను తరలించే వాహనాలపై ఆంక్షలు ఉండకుండా చూడాలి. పూడిక మట్టి పేరు మీద ఇసుకను తరలించే వాహానాలపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. మిషన్ కాకతీయ మన వూరు మన చెరువు కార్యక్రమం విజయవంతం కావడానికి తెలంగాణ రైతాంగం సహకరించాలి. వారే మిషన్ తెలంగాణకు నాయకత్వం వహించాలి.

2681

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Featured Articles