ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం


Thu,May 29, 2014 12:08 AM


తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంరం భం, మరొకవైపు ఆదివాసీ విషాద సంగీతం. నిజానికి ఇది తెలంగాణ, సీమాంధ్ర రాష్ర్టాల సమస్య మాత్రమే కాదు. ఇది సమాజపు అట్టడుగున జీవిస్తున్న ఆదివాసీల బతుకు సమస్య. ఈజీవన విధ్వంసాన్ని ఆపేదెట్లా? ముంపు, పునరావాస, పర్యావరణ సమస్యలను అధిగమించే ప్రత్యామ్నాయాలే లేవా? పోలవరం ఎవరి కోసం? ఇవి ఇవాళ ఆదివాసీ సమాజం ముందున్న ప్రశ్న లు. అంతకు మించి అభివద్ధి పేరు మీద ఆదివాసులను బలి పశువులను చేస్తున్న నాగరిక సమాజం ముందున్న ప్రశ్నలు.
పోలవరం ప్రాజెక్టు రంగం మీదకి ఎందుకు వచ్చింది? 2004లో రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే కష్ణా జలాలను రాయలసీమ అక్రమ ప్రాజెక్టులకు తరలించే కుట్రను అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు.

శ్రీశైలం జలాశ యం నుంచి 250 టీఎంసీల నీటిని తరలించుకపోవడానికి ఎత్తుగడలు సిద్ధం చేశాడు.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తరలించే సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 40వేల క్యూసెక్కులకు పెంచుతూ జీవో జారీ చేశాడు. అట్లనే శ్రీశైలం జలాశ యం MDDL( minimum draw down level )ను 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచుతూ జీవో జారీ చేశాడు. ఇవన్నీ ఎవరితో సంప్రతించకుండా, మంత్రివర్గంలో చర్చించకుండా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే. తెలంగాణ ఇంజనీర్లు, మేధావి వర్గాలు ఎంత మొత్తుకున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గమ్మునుండిపోయారే తప్ప ఆ నిర్ణయాలను తప్పుపట్టలేదు. ఒక్క పీజేఆర్ తప్ప ఎవరూ పోతిరెడ్డిపాడు అక్రమాలపై పల్లెత్తు మాట అన్నవారు లేరు.

శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు అక్రమంగా తరలించుకుపోయినందువల్ల నాగార్జున సాగర్ ఆయకట్టుకు, కష్ణా డెల్టా ఆయకట్టుకు ఏర్పడబోయే నీటి కొరతను తీర్చడానికి రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన ప్రాజెక్టులు రెండు- ఒకటి పోలవరం ప్రాజెక్టు, రెండోది దుమ్ముగూడెం- నాగార్జునసాగర్ ప్రాజెక్టు. 1975లో జారీ అయిన Godavari water dispute Tribunal Awardలో 80టీఎంసీల నీటిని పోలవరం ప్రాజె క్టు కుడికాలువ ద్వారా కష్ణా బ్యారేజికి తరలించడానికి ఉన్న అవకాశాన్ని ఆయన వినియోగించుకోదలచాడు. దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ టెల్‌పాండ్ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల గోదావరి నీటిని నాగార్జునసాగర్ ఆయకట్టుకు తరలించడానికి ఎత్తుగడ వేశాడు. అంటే మొత్తం 245టీఎంసీల గోదావరి నీటిని కష్ణా బేసిన్‌కు తరలించడానికి ఆయన పథకం వేశాడు. పోలవరంపై అప్పటికే అంతర్‌రాష్ట్ర వివాదాలు, ముంపు, పునరావాస సమస్యలు ముప్పిరిగొని ఉన్నాయి.

ఆ సమస్యల కారణంగానే చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా రెండు ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించి అమలు చేసింది. అవే గోదావరికి కుడివైపున తాడిపూడి ఎత్తిపోతల పథకం, ఎడమవైపున పుష్కర ఎత్తిపోతల పథకం. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల పోలవ రం ఆయకట్టులో చాలావరకు సాగులోకి వచ్చింది. 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్ఛంపల్లి ప్రాజెక్టుకు బదులు దేవాదుల ఎత్తిపోతల పథకానికి శంకు స్థాపన చేసిన సంగతి మనందరి ఎరుకే. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్‌రాష్ట్ర వివాదాలను పరిష్కరించుకోకుండానే, కేంద్ర జలసంఘం, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండానే రాజశేఖరరెడ్డి మొండిగా పోలవరం కాలువల తవ్వకానికి అనుమతులు మంజూరు చేశాడు.ఇపీసీ పద్ధతిలో టెండర్లు ఖరారుచేసి పనులు ప్రారంభించాడు.అయితే పొరుగు రాష్ర్టాలు, తెలంగాణ ఉద్యమకారులు సుప్రీం కోర్టులో కేసులు వేసినందున డ్యామ్ నిర్మాణం సాధ్యం కాలేదు.

పోలవరం ఆయకట్టు రైతుల కోసమా? కష్ణా డెల్టా రైతుల కోసమా? కోస్తా కారిడార్‌లో పెట్టుబడులు పెడుతున్న పెట్టుబడిదారుల కోసమా? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో 13వ షెడ్యూల్‌లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. బిల్లులోని 13వ షెడ్యూల్ పేర్కొన్నవన్ని సీమాంధ్ర సంపన్న వర్గాల ప్రాజెక్టులు. అందులో దుగ్గిరాజపట్నం దగ్గర ఒక భారీ ఫోర్ట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ , హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించే పెట్రో కెమికల్ కాంప్లెక్స్, పుణె - ముంబాయి తరహాలో నిర్మించబోయే వైజాగ్ - చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్, సీమాంధ్రకు ఒక ప్రత్యేక రైల్వే జోన్ .. లాంటి ప్రాజెక్టులు. ఇవిగాక ప్రైవేటు రంగంలో విద్యుత్ ప్రాజెక్టులు వస్తున్నాయి.

ఈ ప్రాజెక్టులన్నిటికి భారీగా నీటి సరఫరా అవసరంమవుతుంది. దానికి పోలవరం నిర్మాణం అత్యవసరం. పోలవరం ప్రాజెక్టు రిపోర్ట్‌లో పేర్కొ న్న లక్ష్యాల కోసమైతే పోలవరం నిర్మాణం అవసరమే లేదు. ఇక్కడ కాలువల నిర్మాణంలో ఇమిడి ఉన్న రహస్యాన్ని ప్రత్యేకం గా పేర్కొనాలి. కేంద్ర జలసంఘానికి సమర్పించిన నివేదికలో చెప్పిన కాలువ స్పెసిఫికేషన్లు, నిర్మాణం అవుతున్న కాలువల స్పెసిఫికేషన్లు చూసినప్పుడు దాల్ మే కూచ్ కాలా హై అని అనిపించక మానదు. పోలవరం ద్వారా నీరు రైతుల పొలాలకు కాకుండా కోస్తా కారిడార్‌లో వెలిసే పరిశ్రమలకేనని స్పష్టమవుతున్నది. అందులో కోస్తా రైతుల కంటే అత్యధిక ప్రయోజనం పొందేది కోస్తా కారిడార్‌లో పెట్టుబడులు పెట్టే బహుళజాతి కంపనీలు, వారికి దళారీలుగా ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గం.

పోలవరం పూర్తి జలాశయ మట్టం 150 అడుగుల వద్ద మొత్తం 299 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. అందులో 276 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే 13 గ్రామాలు ఛత్తీస్‌గఢ్‌లో, 10 గ్రామాలు ఒడిషాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ముంపు గ్రామాల్లో 205 గ్రామా లు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. 276 గ్రామాల్లోని 27వేల కుటుంబాలు, లక్షా 17వేల జనాభా నిర్వాసితులవుతున్నారు. ఇది 1996 నాటి లెక్కలు. ఇప్పటి లెక్కల ప్రకారం గ్రామాల సంఖ్య 300, నిర్వాసితుల సంఖ్య 2 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నది. దీనికి తోడు 8 వేల ఎకరాల రిజర్వు అటవీ భూములు, 86వేల ఎకరాల సాగు భూమి, అనేక చెరువులు, విలువైన జీవ వైవిధ్యం కలిగిన పాపి కొండలు , చారిత్రిక కట్టడా లు మునిగిపోతాయి. ఇంతటి విధ్వంసాన్ని సష్టిస్తున్న పోలవరం ప్రాజెక్టును, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే సాహసం చేసిందంటే కేంద్రంపై సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రభావం ఎంతుందో తెలుస్తున్నది.

పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పరిశీలించకుం డా బుల్డోజ్ చేస్తున్న ప్రభుత్వ మొండి వైఖరి గర్హనీయం. పోలవరం వల్ల సంభవించబోయే ప్రమాదాల ను పరిగణనలోనికి తీసుకోకుం డా ఇదే డిజైన్‌తో ముందుకు వెళుతుంటే చూస్తూ సీమాంధ్ర పౌర సమాజం ఎట్లా మౌనం పాటిస్తున్నది? సీమాంధ్రకే చెందిన ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ శివాజీరావు పోలవరం ప్రాజెక్టు వల్ల సంభవించబోయే ప్రమాదాలను , పర్యావరణ వినాశనాన్ని చాలాకాలంగా చెప్పి చెప్పి అలసిపోయి మౌనం దాల్చారు.

సీమాంధ్ర పౌర సమాజం నుంచి ఆయనకు మద్దతు కొరవడింది. సీమాంధ్రకు చెందిన ప్రముఖ ఇంజనీర్ టి.హనుమంత రావు పోలవరం డ్యాంకు ముంపు, పునరావాస, పర్యావరణ సమస్యలు లేని, పోలవరం నిర్దేశిత లక్ష్యాలకు భంగకరం కానటువంటి ప్రత్యామ్నాయ డిజైన్ రూపొందించి చర్చకు పెట్టినా రాజశేఖరరెడ్డి,ఆయన తర్వాతి ముఖ్యమంత్రులు బేఖాతరు చేసి అత్యంత ప్రమాదకారిగా మారనున్న రాక్ఫిల్ డ్యాం నిర్మాణానికే మొగ్గు చూపారు. తెలంగాణ పౌర సమాజం ముంపు ప్రజల జీవించే హక్కుల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదివాసుల ఆశ.

కేసీఆర్ నాయకత్వంలోని ఇప్పుడు అధికారంలోకి రాబోయే తెలంగాణ ప్రభుత్వం మీద, ప్రతిపక్షంలో కూసునే రాజకీయ పక్షాల మీద, ఉద్యమ సంస్థల మీద ఉన్న బాధ్యత పోలవరం ముంపు గ్రామాలను తిరిగి సాధించుకోవడం. ఇప్పుడున్న డిజైన్‌తో పోలవరం డ్యాం నిర్మాణాన్ని అడ్డుకోవడం. ఈ పోరాటం రెండంచెల్లో సాగాలి. న్యాయపరమై న పోరాటం, ప్రజా క్షేత్రంలో పోరాటం. ఆదివాసీల బతికే హక్కును హరించి వేసే అధికారం ఎవరికీ లేదు. ఆదివాసీలను పోలవరంలో ముంచి చంపే మోడీపైన, ఆ కుట్రకు సూత్రధారులైన వెంకయ్య ,చంద్రబాబుల దోపిడీ ఆధిపత్య విధానాలను ఎదిరించాలి. ఓడించాలి.

-శ్రీధర్ దేశ్ పాండే
తెలంగాణ విద్యావంతుల వేదిక గ్రేటర్ హైదారాబాద్ కమిటీ అధ్యక్షుడు

447

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Featured Articles