పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు


Tue,April 1, 2014 03:21 AM

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్యత ప్రజలది, ప్రజా సంఘాలది,తెలంగాణ పౌర సమాజానిది. అందుకే తెలంగాణ పునర్నిర్మాణం అంటే మరొక దీర్ఘకాలిక ఉద్యమమే. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరుగుతున్నది.ఈలోప ఎన్నికలు జరిగి రెండు రాష్ర్టాల లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. తెలంగాణ ఉద్యమం లో పాలొ ్గన్న ప్రజలకు తెలంగాణ లో తమకు దక్కబోయే ఫలాల గురించి అనేక ఆశలున్నాయి. అదే సమయంలో తమ ఆకాంక్షలను నెరవేర్చే చిత్తశుద్ది ఈపార్టీల నాయకులకు ఉన్నదా? ఈపార్టీలకు తెలంగాణప్రజల ఆకాంక్షలు ఏ మేరకు తెలుసు? ఇవి ప్రజల మనస్సుల్లో మెదులుతున్న ప్రశ్నలు. తెలంగాణ పునర్నిర్మా ణం, తెలంగాణ నవ నిర్మాణం, నూతన తెలంగాణ నిర్మాణం.. ఇట్లా అనేక పదాలతో ప్రజలకు బంగారు భవిష్యత్తును అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు.

ప్రజలు అన్ని స్థాయిల్లో తెలంగాణ పునర్నిర్మాణంపై విస్తతంగా చర్చిస్తున్నా రు. ఎన్నికల వేళ తమ ఆకాంక్షలను పార్టీల మ్యానిఫెస్టోల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఎన్నికల్లో కానరాని శ్రద్ధను ఇప్పుడు మ్యానిఫెస్టోల తయారీలో పార్టీలు కనబరుస్తున్నాయి. అన్ని పార్టీలు మ్యానిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేసుకొని కసరత్తులు చేస్తున్నాయి. మేధావులతో, వివిధ వర్గాలతో చర్చిస్తున్నాయి. ఇది శుభ పరిణామం. ప్రజల ఆకాక్షలను ఇంత సీరియస్‌గా పట్టించుకున్న సందర్భం గతంలో లేదు. ఎన్నిక ల్లో ప్రజలను ఆకట్టుకోవడం కోసమే అయినా ఇది ఉద్యమం సాధించిన విజయంపజల ఆ కాంక్షలను పట్టించుకోకుండా ఉండలేని అనివార్య స్థితిని ఉద్యమం పార్టీలకు కల్పించింది.

తెలంగాణ పునర్నిర్మాణం పై విస్తతంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ విద్యావంతుల వేదిక 2013జూలైలో నాగార్జున సాగర్‌లో రెండు రోజులు మేధోమధనం జరిపింది.విద్య, వైద్యం, వ్యవసాయం,సాంఘిక సంక్షేమం, సాగునీరు, పారిశ్రామిక విధానం, ఉపాధి కల్పన, రోడ్లు, మౌలిక వసతులు, తాగు నీరు.. ఇట్లా అనేక అం శాల మీద గ్రూపులవారీగా విడిపోయి చర్చించి ముసాయిదా పత్రాలను రూపొందించారు. వాటి ని మరింత సూక్ష్మస్థాయిలో చర్చించి ప్రజా ఎజెండాను రూపొందించే పనిలో వేదిక కషి చేస్తున్న ది. ఎన్నికల తేదీలు ప్రకటించగానే ప్రజల్లో పునర్నిర్మాణ చర్చ మరింత ఊపందుకున్నది. అందు లో భాగంగానే తెరవే గ్రేటర్ హైదారాబాద్ కమిటీ తరపున పునర్నిర్మాణంపై రెండు చర్చా కార్యక్రమాలను నిర్వహించింది. ఆచర్చల్లో పాల్గొన్న వివిధ సంఘాల, పార్టీల, మేధావుల అభిప్రాయాలు ఆసక్తిదాయంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజలు ఆశిస్తున్న ఫలాలు ఏమిటో ఎన్నికల రణరంగంలో ఉన్న రాజకీయ పక్షాలకు తెలియవలసిన అవసరం ఉన్నది. 1 తెలంగాణ రాష్ట్రంలో సామాజి కన్యాయమనే అంశం ప్రధా నంగా ముందుకు వచ్చింది. తెలంగాణ ఉద్య మం జరుగుతున్న క్రమంలోనే సామాజిక తెలంగాణ అన్న పదం ముఖ్య నినాదంగా మారింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ, మహిళలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించేందుకు రాజకీయ పక్షాలు కషి చేయాలి.
2.తెలంగాణ రాష్ట్రం ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యా, వైద్యం, వ్యవసాయానికి 12గంటల ఉచిత కరెం టు అందించాలి.
3.విద్యా వ్యవస్థను సమూలం గా సంస్కరించి, సీమాంధ్ర వలసవాద ప్రభా వాల నుంచి, కార్పోరేట్ కబంధహస్తాల నుంచి విముక్తం చేసి నూతన విద్యా విధానాన్ని రూపొందించాలి. తెలంగాణ చరిత్ర, సంస్కతి, భాష పునరుద్ధరణ జరిగేటట్టుగా పాఠ్య ప్రణాళికలు తయారు చేయాలి.
4. తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ జరగాలి. వీలైనచోట్ల కొత్త చెరువుల నిర్మాణం జరగాలి. నిర్మాణం కొనసాగుతున్న భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రతి ఊరికి కనీసం ఒక రక్షిత తాగునీటి పథకాన్ని, ఒక సాగునీటి పథకాన్ని అందించాలి.
5. రైతుల స్థితిగతు లు మార్చడానికి,లాభదాయక వ్యవసాయ విధానాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిటీ సిఫారసులను, భూపేందర్‌సింగ్‌హుడా సిఫారసులను అమలు చేయాలి. ఖరీఫ్‌కు ముందే అన్నీ రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు ప్రతి మండల కేంద్రంలో కోల్డ్‌స్టోరేజీలను ప్రభుత్వమే నిర్మించాలి. వ్యవసాయ రం గానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టి వ్యవసాయరంగాన్ని లాభసాటి వత్తిగా మార్చి రైతాంగాన్ని ప్రోత్సహించాలిపకతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగానికి చెల్లిస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీని హెక్టారుకు 6-10 వేలకు పెం చాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగ పనులతో అనుసంధానం చేసి వ్యవసాయ పెట్టుబడిని తగ్గించి రైతాంగానికి చేయూత నివ్వాలి. 6. సీమాంధ్ర వలస ప్రభుత్వాలు మూసివేసిన ప్రభుత్వరంగ పరిశ్రమలను పునరుద్ధరించాలి. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చా లి. ఈ పరిశ్రమల్లో స్థానికులకే 80శాతం ఉద్యోగాలు కల్పించాలి.
7.తెలంగాణలో అభివద్ధి వికేంద్రీకరణ జరగాలి. ప్రతీ జిల్లా కేం ద్రం అభివద్ధి కేంద్రంగా మారితే జిల్లాల నుంచి హైదారాబాద్ కు వలసలుతగ్గుతాయి.
8. తెలంగాణలో ప్రతి మండల కేంద్రంలో యువతలో కంప్యూటర్ తదితర సాంకేతిక వత్తుల్లో నైపు ణ్యం పెంచే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లను స్థాపించాలి. గ్రామీణ యువతలో వత్తి నైపుణ్యాలను పెంచి వారికి ఉపాధిఅవకాశాలను మెరుగుపర్చాలి.
9. సీమాం ధ్ర వలస ప్రభుత్వాలు కట్టబెట్టిన భూ కేటాయింపులను రద్దు చేసి వాటిని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలి.
10. తెలంగాణ రాష్ట్రం లౌకికపజాస్వామిక విలువలకు కట్టుబడి ఉండా లి. అన్ని రకాల మతతత్వ శక్తులను కట్టడి చేయా లి.
11.తెలంగాణలో ఎన్‌కౌంటర్లు లేని రాజ్యాంగబద్ధ పాలనకు హామీ ఇవ్వాలి. భావ ప్రకటనా స్వేచ్చ, పౌర,మానవ హక్కుల పరిరక్షణకు హామీ ఇవ్వాలి.
12. ప్రజానీకంలో వేళ్ళూనుకొని ఉన్న మూఢ నమ్మకాలను తొలగించి ప్రజల్లో శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించాలి.
13.తెలంగాణ సంస్క తి పరిరక్షణలో భాగంగా తెలంగాణలో ఉన్న అనేక కళారూపాలను పునరుద్ధరించే సాం స్కతిక విధానం తయారు చెయ్యాలి. వత్తి కళాకారుల స్కాలర్‌షిప్ మంజూరు చేయాలి.
14. తెలంగాణ ద్రోహులను, పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలి. తెలంగాణపై విషం చిమ్ముతున్న పత్రికలను, చానళ్లను బహిష్కరించాలి.
15పొఫెసర్ జయశంకర్ ఆలోచనల ప్రాతిపదిక న అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతం పునాదిగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి.

వీటిలో కొన్నింటినైనా పార్టీల మ్యానిఫెస్టోల్లో చేర్చగలిగితే ఒక ఊరట. అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్యత ప్రజల ది, ప్రజా సంఘాలది,తెలంగాణ పౌర సమాజానిది. అందుకే తెలంగాణ పునర్నిర్మాణం అంటే మరొక దీర్ఘకాలిక ఉద్యమమే. ఈ ఉద్యమానికి ముగింపు లేదు.
-శ్రీధర్‌రావు దేశ్‌పాండే
తెలంగాణ విద్యావంతుల వేదిక

603

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర