స్థానికత ప్రామాణికం కావాలె!


Sat,March 22, 2014 12:16 AM

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధారంగానే జరగాలి. స్థానిక త (నేటివిటి)అన్న అంశం నేడు సరిగా నిర్వచించి అమలు జరపకపోతే విభజన జరిగిన వెంటనే మరో ప్రతిఘటన తెలంగాణ ఉద్యోగుల్లోంచి, ప్రజల్లోంచి తీవ్రరూపంలో వస్తుంది.
వెల్లోడి సివిల్ ప్రభుత్వం మద్రాసు రాష్ట్రం (అప్పుడు సీమాంధ్రులు మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగం) నుంచి ముల్కీ రూల్స్‌కు విరుద్ధంగా ఇక్కడకు తీసుక వచ్చిన సీమాంధ్రులు మెల్ల మెల్లగా ఇక్కడి ఉద్యోగాలన్నింటిలో చేరిపోవడం వల్ల తమ ఉద్యోగాలకై ఇక్కడి విద్యార్థులు 1952లో నాన్-ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం చేస్తే పోలీసు కాల్పుల్లో 12మంది విద్యార్థులు చనిపోయారు. ఇంత జరిగినా స్థానికేతర ఉద్యోగులను బూర్గుల ప్రభుత్వం హైదారాబాద్ రాష్ట్రం నుంచి వారిని పంపించడంలో విఫలమైంది.
1956లో సీమాంధ్ర నాయకులు పెద్దమనుషుల ఒప్పందం ద్వారా విశాలాంధ్రలో కూడా ముల్కీ రూల్స్‌ను కొనసాగిస్తూ,స్థానికత ఆధారంగానే ఇక్కడి విద్య, ఉద్యోగాలను ఇక్కడివారికే ఇస్తామని తెలంగాణ ప్రజలకు లిఖితపూర్వక హామీ ఇచ్చి తెలంగాణను ఆంధ్రలో విలీనం చేశారు. కానీ ఆ హామీని ఉల్లంఘించారు.1969 ఉద్యమాన్ని తుపాకీ తూటాలతో వందలాది మందిని హతమార్చి అణచివేశారు. తెలంగాణలో ముల్కీ రూల్స్ అమలు సక్రమమే అని తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుకు వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్య మం నడిపిన సీమాంధ్రులు ఢిల్లీలో లాబీయింగు చేశారు. సీమాంధ్రులకు అనుకూలంగా ఉండే ఆరు సూత్రాల పథకం, దాని ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వులు 1975లో వెలువరించుకున్నారు. 1973 జై ఆంధ్ర ఉద్యమం సాధించింది ఏమిటంటే ముల్కీ రూల్స్ రద్దు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దు, అధికార కేంద్రాలైన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయా ల్లో ఉద్యోగాలను కబ్జా చెయ్యడం.
ఆరుసూత్రాల పథకంలో భాగంగా ఆర్టికల్ 371డి ద్వారా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి తెలంగాణ ఉద్యోగాల్లోకి సీమాంధ్రులు చేరిపోయారు.ఒక్కసారిగా కొన్ని లక్షల మంది సీమాంధ్రులు తెలంగాణ స్థానికులుగా మారిపోయారు. అప్పటివరకే ముల్కీ రూల్స్‌కు వ్యతిరేకంగా అక్రమంగా తెలంగాణ ఉద్యోగాల్లో చేరిన వేలాదిమంది సక్రమమైపోయారు. తెలంగాణ ఉద్యోగాల్లో తమకు వాటాను అధికారికంగా చేర్చుకున్నారు.
జిల్లా స్థాయి ఉద్యోగాల్లో 20శాతం, జోనల్ స్థాయి నాన్-గెజిటెడ్ ఉద్యోగాల్లో 30 శాతం, జోనల్ స్థాయి గెజిటెడ్ ఉద్యోగాల్లో 40 శాతం జనరల్ కోటాగా చేర్చారు. రాష్ట్ర స్థాయి ఉన్నతోద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్లు లేకుండా చేశారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో, ప్రత్యేక ఎస్టాబ్లిష్మెంట్లలో, భారీ అభివద్ది ప్రాజెక్టుల్లో, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్నీ ఉద్యోగాలను, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను రాష్ట్రపతి ఉత్తర్వులనుంచి మినహాయించి వాటిల్లో తెలంగాణ ప్రాతినిధ్యాన్ని నామమాత్రం చేసినారు. సీమాంధ్రులు దాదాపుగా అన్ని జనరల్ కోటా ఉద్యోగాలు సాధించుకున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో నాన్ లోకల్ కోటా అన్న భావనే లేదు. స్థానిక రిజర్వేషన్ కోటా పోను మిగతాది మెరిట్ కోటా. ఓపెన్ కోటాను నాన్ లోకల్ కోటాగా మార్చడం వల్ల వాటిలో దాదాపుగా అంతా సీమాంధ్రులే చేరిపోయారు.
ఇప్పుడు అన్ని డిపార్టుమెంటుల్లో ఉల్లంఘనలను గిర్‌గ్లానీ నివేదిక ప్రాతిపదికన సరిచేసి అక్రమ ఉద్యోగులను మొదట పంపాలి. క్యాడర్ పోస్టులన్నింటిని లెక్కించి అక్రమ నియామకాలు,డిప్యూటేషన్లు, ప్రమోషన్లు పొందిన వారందరిని విభజన సందర్భంగానైనా స్థానికత ఆధారంగా వెనక్కి పంపాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఉన్నత విద్యాశాఖలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామకాలు ఓపెన్ క్యాటగిరీలో రాష్ట్ర స్థాయి లో ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులను వారి ఆప్షన్ల ప్రకారం జోన్లు కేటాయిస్తారు. ఇక వాటిని జోనల్ పోస్టులుగా పరిగణిస్తారు. హాస్యాస్పదమేమిటంటే ఇదంతా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జరుగుతున్నదంటు న్నారు. జోనల్ క్యాడర్‌గా రిక్రూట్‌మెంట్ జరిగితే తెలంగాణ జోన్లలో తెలంగాణ వారికే అవకాశం లభించేది కదా. స్థానికత ఆధారంగా విభజన జరిగితేనే ఈప్రాంత నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది.
ఇక నేడు ఇరిగేషన్ తదితర ఇంజనీరింగు డిపార్టుమెంట్లలో నాన్-లోకల్ కోటాలో తెలంగాణ జోన్లలో ఇంజనీర్లుగా నియామకాలు పొందిన వారు, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ లోకల్ అభ్యర్థులుగా మారిన సీమాంధ్రులు అంతా కలిపి 50 శాతం పైనే ఉంటారు.
ఇక సీమాంధ్రలో తెలంగాణవారు ఒకటి రెండు శాతం కంటే ఎక్కువ లేరు. తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా సీమాంధ్ర ఇంజనీర్లు ఉండడం ఇబ్బందులు కల్పిస్తుందన్న భయం తెలంగాణవాదులను వెంటాడుతున్నది. రేపు ఏర్పడబోయే నదీ జలాల బోర్డుల్లో సీమాంధ్ర ఇంజనీర్లు తెలంగాణ తరఫున నియమించబడితే, ఆంధ్రప్రదేశ్ తరఫున నియమించబడే వారు కూడా సీమాంధ్ర ఇంజనీర్లు ఉంటారు కాబట్టి ఇంజనీర్లు ఎంత నిజాయితీగా వ్యవహరించినా వారిపైన అనుమానానికి ఆస్కారం ఉంది.
ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తంగా అడుగుతున్నది:
1. అన్ని డిపార్టుమెంటులలో ఉల్లంఘనలను గిర్ గ్లానీ నివేదిక ప్రాతిపదికన సరిచేసి అక్రమ ఉద్యోగులను , క్యాడర్ పోస్టులన్నింటిని లెక్కించి వెనక్కు పంపాలి. 2.స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలి. స్థానికతకు ఉద్యోగి సర్వీసు పుస్తకంలో పేర్కొన్న స్వంత జిల్లాను ఆధారంగా చేసుకోవాలి. అందులో అనుమానాలు ఉంటే మరిన్ని ఆధారాలతో స్వంత జిల్లాను నిర్ధారించాలి. 3. 40, 30, 20 శాతం మెరిట్ కోటాలో నియమించబడిన స్థానికేతరులను ఎక్కడివారు అక్కడనే అన్న నిబంధన ఆధారంగా తెలంగాణలోనే దిగబెట్టే కుట్ర జరుగుతున్నది. ఓపెన్ మెరిట్ కోటాలో నియమించబడిన స్థానికేతరులను వెనక్కి పంపించాలి.ఎందుకంటే గిర్ గ్లానీ నివేదిక ప్రకారం ఈ కోటాలో నియామకాలే రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జరిగినాయి.
4. రాష్ట్ర స్థాయి పోస్టులను మాత్రమే జిల్లాల సంఖ్య నిష్పత్తిలో (13 :10) పంపిణి జరిపి అధికారులను స్థానికత ఆధారంగా రాష్ట్రాలకు కేటాయించాలి. ఇదే పద్దతిని సచివాలయానికి, శాఖాధిపతుల, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు అనుసరించాలి. 5. పోస్టుల కేటాయింపులు జరిపిన తర్వాత తెలంగాణ స్థానిక ఉద్యోగులు తక్కువగా ఉన్నప్పుడు ఆ ఖాళీలను సీమాంధ్ర ఉద్యోగులచే నింపే కుట్ర జరుగుతున్నది. ఆ ఖాళీలను ప్రమోషన్లు, కొత్త నియామకాల ద్వారా పూరించుకునే స్వేచ్ఛ తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలి. తెలంగాణ ఉద్య మ చరిత్రను గమనంలోకి తీసుకోకుండా విభజనకు విధివిధానాలు రూపొందిస్తే వచ్చే అనర్థాలకు గవర్నరు, ఆయన ప్రతినిధి చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించవలసి ఉంటుంది.
-శ్రీధర్‌రావ్ దేశ్‌పాండే,(కో-ఛైర్మన్, తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ)
-సల్లా విజయకుమార్,(సెక్రటరీ, తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ)

170

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Featured Articles